వికీలీక్స్ వ్యవస్థపకుడు జూలియన్ అసాంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జర్నలిజం నేరం అని ఒప్పుకున్నందుకే విడుదల అయినట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తొలిసారి మంగళవారం అసాంజ్.. స్ట్రాస్‌బర్గ్ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ ఆఫ్ యూరప్ హక్కుల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
‘‘నేను స్వేచ్ఛగా లేను. ఎందుకంటే వ్యవస్థ అలా సాగుతోంది. అయితే కొన్ని ఏళ్ల నిర్భందం తర్వాత నేను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను. దానికి గల కారణం జర్నలిజం నేరాన్ని ఒప్పుకున్నాను. అందుకే నిర్భందం నుంచి బయటపడ్డాను. చివరికి అవాస్తవమైన న్యాయం కంటే స్వేచ్ఛను ఎంచుకున్నా. నాకు న్యాయం ఇప్పుడు అసాధ్యంగా మారింది. నేను ప్రస్తుతం 175 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నా. అయితే జర్నలిజం నేరం కాదు. పౌర సమాజానికి, స్వేచ్ఛకు ఒక మూల స్తంభం.
ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏం లేదు. కానీ, జర్నలిస్టులుగా తమ విధులు నిర్వహిస్తున్నవారిని విచారించవద్దు’ అని అన్నారు. అదేవిధంగా తాను ఖైదీగా ఉన్న సమయంలో తనకు సంబంధించిన భూమిని కోల్పోయానని తెలిపారు. నిజం చెప్పినందుకు శిక్ష, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చినట్లు అయిందని అసాంజే పేర్కొన్నారు.
"I want to be totally clear. I am not free today because the system worked. I am free today because after years of incarceration I pleaded guilty to journalism. I pleaded guilty to seeking information from a source" - Julian Assange, Council of Europe pic.twitter.com/N0Ix58CeSu
— WikiLeaks (@wikileaks) October 1, 2024
గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను ఇటీవల అసాంజ్ అంగీకరించారు. దీంతో ఆయన్ను అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్‌లోని ఫెడరల్ కోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా బ్రిటన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్న అసాంజే.. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో విడుదలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే.
ఇదీ నేపథ్యం
ఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి జూలియన్ అసాంజే సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజే స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.
అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజే అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.
చదవండి: WikiLeaks: అసాంజ్‌కు విముక్తి
Comments
Please login to add a commentAdd a comment