ఒలింపిక్స్‌ వేళ.. ఫ్రాన్స్‌లో కలకలం | France High Speed Train System Hit By Malicious Acts | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ వేళ.. ఫ్రాన్స్‌లో కలకలం

Published Fri, Jul 26 2024 1:46 PM | Last Updated on Fri, Jul 26 2024 2:08 PM

France High Speed Train System Hit By Malicious Acts

పారిస్‌ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో కలకలం. పారిస్‌ వేదికగా ఓ వైపు సమ్మర్‌ ఒలింపిక్స్‌ 2024 (జులై 26) ప్రారంభం కావడం.. మరోవైపు పారిస్‌ హైస్పీడ్‌ రైల్వే నెట్‌ వర్క్‌ను గుర్తు తెలియని అగంతకులు పెద్ద మొత్తంలో విధ్వంసం చేయడం ఆందోళన నెలకొంది. 

ఫలితంగా ఫ్రాన్స్‌ ఇంటర్‌సిటీ హై స్పీడ్‌ రైల్ సర్వీస్‌ నెట్‌వర్క్‌ స్తంభించినట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే కంపెనీ సొసైటీ నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ ఫ్రాంకైస్ (ఎస్‌ఎన్‌సీఎఫ్‌) తెలిపింది.

నిందితులు ఏకకాలంలో దాడులు చేయడంతో అట్లాంటిక్‌, తూర్పు-ఉత్తర రైల్వే లైన్లలో కార్యకలాపాలు ఆగిపోయాయిని ఎస్‌ఎన్‌సీఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

 ‘రైల్వే కార్యకలాపాల్ని దెబ్బతీసేందుకు రైల్వే లైన్లను విధ్వంసం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభావిత మార్గాలలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తులు నిర్వహించి, పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరమ్మత్తులు చేసిన రైల్వే ట్రాక్‌లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే వారం రోజుల సమయం పడుతుంది’ అని రైల్వే అధికారులు తెలిపారు.  

రైళ్లను వేర్వేరు ట్రాక్‌లకు మళ్లిస్తున్నాం. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు తమ రైల్వే ప్రయాణాల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోమని  ఎస్‌ఎన్‌సీఎఫ్‌ విజ్ఞప్తి చేస్తోంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement