high speed train service
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్‌లో కలకలం
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కలకలం. పారిస్ వేదికగా ఓ వైపు సమ్మర్ ఒలింపిక్స్ 2024 (జులై 26) ప్రారంభం కావడం.. మరోవైపు పారిస్ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్‌ను గుర్తు తెలియని అగంతకులు పెద్ద మొత్తంలో విధ్వంసం చేయడం ఆందోళన నెలకొంది. ఫలితంగా ఫ్రాన్స్ ఇంటర్సిటీ హై స్పీడ్ రైల్ సర్వీస్ నెట్వర్క్ స్తంభించినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే కంపెనీ సొసైటీ నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ ఫ్రాంకైస్ (ఎస్ఎన్సీఎఫ్) తెలిపింది.నిందితులు ఏకకాలంలో దాడులు చేయడంతో అట్లాంటిక్, తూర్పు-ఉత్తర రైల్వే లైన్లలో కార్యకలాపాలు ఆగిపోయాయిని ఎస్ఎన్సీఎఫ్ అధికారులు వెల్లడించారు.France's high-speed rail network has been hit by "malicious acts" including arson attacks that have disrupted the transport system, train operator SNCF said, hours before the opening ceremony of the Paris Olympics. “This is a massive attack to paralyse the Railway” https://t.co/RaAzI1URZC pic.twitter.com/JPHZXmO1k8— #𝕎𝕒𝕣 ℍ𝕠𝕣𝕚𝕫𝕠𝕟 (@WarHorizon) July 26, 2024 ‘రైల్వే కార్యకలాపాల్ని దెబ్బతీసేందుకు రైల్వే లైన్లను విధ్వంసం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభావిత మార్గాలలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తులు నిర్వహించి, పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరమ్మత్తులు చేసిన రైల్వే ట్రాక్‌లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే వారం రోజుల సమయం పడుతుంది’ అని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లను వేర్వేరు ట్రాక్‌లకు మళ్లిస్తున్నాం. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు తమ రైల్వే ప్రయాణాల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోమని ఎస్ఎన్సీఎఫ్ విజ్ఞప్తి చేస్తోంది. -
హైదరాబాద్ టు వైజాగ్
చౌటుప్పల్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది. మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్ల తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించనున్నారు. హైవేపై తగ్గనున్న రద్దీ సాధారణంగానే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నడుమ విపరీతమైన రద్దీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ట్రాఫిక్ మరింతగా పెరిగింది. సాధారణ ప్రజానీకంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరంతా వివిధ ప్రాంతాల నుంచి ఉన్న రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్తుంటారు. హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు అనుసంధానం కావడమే కాకుండా ప్రయాణానికి, సరుకుల ఎగుమతులు, దిగుమతులకు మార్గం సుగమం కానుంది. రెండు దశాబ్దాల కల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానంగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఉమ్మడి నల్ల గొండకుచెందిన అప్పటి ఎంపీలు కేంద్రం దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల అవసరాలను గ్రహించిన కేంద్రం.. రైలు కారిడార్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల కల సాకారం కానుంది. నాలుగున్నర గంటల్లోనే ప్రయాణం హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణికులకు సమయం చాలా ఆదా కానుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్టణం వరకు 900 కిలో మీటర్లకు పైగా దూరాన్ని కేవలం నాలుగున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. హైస్పీడ్ రైలు గంటకు 220 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రయాణికులు వెళ్లిన రోజు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. -
గుడ్‌న్యూస్:హైదరాబాద్-బెంగళూరు మధ్య హైస్పీడ్ ట్రైన్.. జర్నీ 2.5 గంటలే!
బెంగళూరు: దేశంలో ఐటీ హాబ్‌లుగా మారాయి బెంగళూరు, హైదరాబాద్ మహానగరాలు. ఈ పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే, రోడ్డు, రైలు మార్గంలో చేరుకోవాలంటే సుమారు 10 గంటలపైనే సమయం పడుతుంది. అయితే, కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకుంటే ఎంతో సమయం ఆదా అవుతుంది కదా? ఆ కల త్వరలోనే నిజం కాబోతోంది. దక్షిణాది ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సెమీ హైస్పీడ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది భారతీయ రైల్వే. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి రానుంది. ఇండియా ఇన్‌ఫ్రాహబ్ నివేదిక ప్రకారం.. సెమీ హైస్పీడ్ ట్రాక్‌ను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు దూసుకెళ్లేలా నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండున్నర గంటలకు తగ్గనుంది. కొత్త ట్రాక్‌ను బెంగళూరులోని యెలహంకా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు సుమారు 503 కిలోమీటర్లు నిర్మించనున్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన రూట్‌ను ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ట్రాక్‌కు ఇరువైపులా 1.5 మీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ట్రైన్ హైస్పీడ్‌తో దూసుకెళ్లనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రైలులో ప్రయాణించేందుకు సుమారు 10 నుంచి 11 గంటల సమయం పడుతోంది. మరోవైపు.. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై రాజ్యసభలో ఇటీవలే ప్రకటించారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఇదీ చదవండి: గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 50మందికి గాయాలు! -
రూ.10 లక్షల కోట్ల మెగా గిఫ్ట్
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే త్వరలోనే రూ.10 లక్షల కోట్ల మెగా గిఫ్ట్‌ను ప్రకటించబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ నగరాలను కలుపుతూ.. 10వేల కిలోమీటర్లలో రూ.10 లక్షల కోట్ల హై-స్పీడ్ ట్రైన్ కారిడార్స్‌ను రైల్వే నిర్మించబోతుంది. దీంతో పాటు భారతమాలా హైవేస్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ కూడా ప్రభుత్వం చేపట్టబోతుంది. దేశీయ రైల్వే ఈ ప్లాన్‌ను ఏప్రిల్‌లో ప్రకటించబోతుందని రైల్వే మంత్రిత్వ శాఖ టాప్ అధికారి ఒకరు చెప్పారు. ఫండింగ్ మెకానిజంతో కనెక్ట్ అయ్యే రూట్లను ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించబోతున్న రైల్వే లైన్లలో ట్రైన్లు గంటకు 200 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్టు తెలిపారు. పెద్ద పెద్ద టెండర్లతోనే రైల్వే ముందుకు రాబోతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దిగ్గజాలను ఆహ్వానించనుందని తెలుస్తోంది. నిర్మాణ ఖర్చును కిలోమీటరుకు రూ.200 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించేందుకు సింగిల్ పిల్లర్స్‌పై డబుల్ లైన్స్‌ను నిర్మించేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా ప్రత్యేకంగా తక్కువ బరువున్న అల్యూమినియం కోచ్‌లను కూడా డిజైన్ చేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్యలో 534 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను నిర్మిస్తోంది. దీని ఖర్చు లక్ష కోట్లకు పైననే. ఈ ప్రాజెక్ట్ 2022 వరకు ముగియనుంది. ఢిల్లీ-ఛండీగర్, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్కత్తా, బెంగళూరు-చెన్నై కారిడార్లను ఇప్పటికే పూర్తి చేసేసింది. -
హైదరాబాద్-అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు!
చౌటుప్పల్: తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఇంకా నిర్మించని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసు నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి. సోమవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో విలేకరులతో మాట్లాడిన భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జురుగుతున్నాయని, దానితోపాటే 65వ నంబర్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా అభివృద్ధి చేసేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారని ఎంపీ తెలిపారు. వచ్చే వారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ 65వ నెంబర్ జాతీయ రహదారిని పరిశీలించేందుకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జంటనగరాల నుంచి విజయవాడకు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లే తప్ప హైస్పీడ్ రైళ్లేవీ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. కొత్త నెట్ వర్క్ ఏర్పాటుతో ఆ లోటు పూడే అవకాశం ఉంది.