Eiffel Tower
-
ఈఫిల్ టవర్‌పైకి విమానం!
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్‌కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది! కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్‌ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్‌లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు. పార్లమెంటులోనూ ప్రస్తావన! యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. ‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి. తొలిసారేమీ కాదు అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్‌కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్‌కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈఫిల్ టవర్‌పైకి ఆగంతకుడు
పారిస్: ఒలింపిక్ క్రీడల ముగింపు ముంగిట్లో ఆదివారం ఓ వ్యక్తి పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కడం కలకలం రేపింది. 330 మీటర్ల ఎత్తున్న టవర్‌పై అతను రెండో సెక్షన్ వద్ద ఉండగా సిబ్బంది గమనించారు. దాంతో పర్యాటకులను ఖాళీ చేయించారు. అతన్ని కిందికి దించి అరెస్ట్ చేశారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు మరో వేదికను నిర్ణయించడం తెలిసిందే. వీటికోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
Paris Olympics: విశ్వ క్రీడల వేదికలివే.. ఆ ఐదు ప్రత్యేకం
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఫ్రాన్స్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.జూలై 26 నుంచి ఆగష్టు 11 వరకు విశ్వ క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు 33 భిన్న వేదికలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరి ఆ వేదికలు, అక్కడ జరిగే ఈవెంట్స్ ఏమిటో తెలుసుకుందాం!ఐకానిక్ సైట్స్.. ఈ ఐదూ స్పెషల్ఈఫిల్ టవర్ఈ ప్రఖ్యాత కట్టడం సమీపంలోనే బీచ్ వాలీబాల్(ఐరన్ లేడీ పాదాల చెంత), జూడో, రెజ్లింగ్(చాప్స్ డీ మార్స్ పార్క్) నిర్వహించనున్నారు.కాగా ఈఫిల్ టవర్‌ను 1889లో ప్రారంభించగా.. ప్యారిస్ ఐకానిక్ సింబల్‌గా మారింది. పర్యాటకుల సందడితో కలకలలాడుతూ ఉంటుంది.గ్రాండ్ పలైస్వరల్డ్ ఫెయిర్ 1900లో భాగంగా రూపొందించిన గ్లాస్ అండ్ స్టీల్ మాస్టర్‌పీస్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని మిలిటరీ తాత్కాలిక ఆస్పత్రిగా మార్చారు.ఇక 21వ శతాబ్దంలో తిరిగి ఆర్ట్ గ్యాలరీగా మారిపోయిన గ్రాండ్ పలైస్‌లో.. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఆరిస్టుల పెయింటింగ్‌లతో నిండిపోయింది. ఇప్పుడు ఫెన్సింగ్, తైక్వాండో క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.ప్లేస్ డి లా కాన్కోర్డేప్యారిస్లోని మేజర్ పబ్లిక్ స్క్వేర్స్‌లో ఒకటి. చాంప్స్- ఎలిసీస్కు తూర్పు భాగంలో ఉంటుంది. ఫ్రెంచి విప్లవ సమయంలో ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.దీంతో తాత్కాలికంగా రివల్యూషన్ స్క్వేర్గానూ ఈ ప్లేస్ పేరును మార్చారు. తర్వాత మళ్లీ ప్లేస్ డి లా కాన్కోర్డేగానే పిలుచుకుంటున్నారు.ఇక్కడ BMX(బైస్కిల్, మోటోక్రాస్ స్టంట్) ఫ్రీస్టైల్ స్కేట్ బోర్డింగ్, 3X3 బాస్కెట్‌బాల్ క్రీడలు నిర్వహించనున్నారు.ప్యాలస్ ఆఫ్ వెర్సైల్స్డ్రెస్సేజ్, షోజంపింగ్, ఈక్వెస్ట్రియన్లకు వేదిక. ప్యారిస్ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మారథాన్, పెంటథ్లాన్ ఈవెంట్లకు కూడా వేదిక కానుంది.17వ శతాబ్దంలో ‘ది సన్ కింగ్’ లూయీస్ XIV వెర్సైల్స్‌ను ఫ్రెంచి రాజ నివాసంగా మార్చాడు. దాదాపు పది వేల మంది సిబ్బందితో ఇక్కడ నివసించాడు.ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన వెర్సైల్స్ ప్యాలస్ 1979 నుంచి పర్యాటకుల ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయింది.మర్సెలీఅధునాతన ఫ్రాన్స్‌లోని పట్టణాల్లో పేరెన్నికగన్నది సిటీ ఆఫ్ మర్సెలీ. ఇక్కడ సెయిలింగ్ పోటీలు నిర్వహించనున్నారు. మూడు వందలకు పైగా సెయిలర్లు మర్సెలీలోని నదీ జలాల్లో పతకాల కోసం పోటీపడనున్నారు. ఈ పట్టణం పది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా గతంలో ఆతిథ్యం ఇచ్చింది.మిగిలిన వేదికలు, అక్కడి ఈవెంట్లు ఇవే👉ఆక్వాటిక్స్ సెంటర్- ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో👉బెర్సీ ఎరీనా- ఆర్టిస్టిక్ జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ట్రంపోలిన్👉బోరీయాక్స్ స్టేడియం- ఫుట్‌బాల్👉చెటారౌక్స్ షూటింగ్ సెంటర్- షూటింగ్👉ఎలాన్కోర్ట్ హిల్- సైక్లింగ్ మౌంటేన్ బైక్👉జెఫ్రాయ్- గీచర్డ్ స్టేడియం- ఫుట్‌బాల్👉హోటల్ డి విల్లే- అథ్లెటిక్స్👉ఇన్వాలిడ్స్- ఆర్చరీ, అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్👉లా బ్యూజౌరీ స్టేడియం- ఫుట్‌బాల్👉లీ బౌర్గెట్ స్పోర్ట్ క్లైంబింగ్ వెన్యూ- స్పోర్ట్ క్లైంబింగ్👉గోల్ఫ్ నేషనల్-గోల్ఫ్👉లియాన్ స్టేడియం- ఫుట్‌బాల్👉నైస్ స్టేడియం- ఫుట్‌బాల్👉నార్త్ ప్యారిస్ ఎరీనా- బాక్సింగ్, మోడర్న్ పెంటాథ్లాన్👉పార్క్ డెస్ ప్రిన్సెస్- ఫుట్‌బాల్👉ప్యారిస్ లా డిఫెన్స్ ఎరీనా- స్విమ్మింగ్, వాటర్ పోలో👉పియరీ మౌరాయ్ స్టేడియం- బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్👉పోన్ట్ అలెగ్జాండ్రీ III- సైక్లింగ్ రోడ్, మారథాన్ స్విమ్మింగ్, ట్రిథ్లాన్👉పోర్టే డీ లా చాపెల్లె ఎరీనా- బ్యాడ్మింటన్, రిథమిక్ జిమ్నాస్టిక్స్👉స్టాడే రొలాండ్- గ్యారోస్- బాక్సింగ్, టెన్నిస్👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ బీఎంఎక్స్ స్టేడియం- సైక్లింగ్ బీఎంఎక్స్ రేసింగ్👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ వెలొడ్రోమ్స్- సైక్లింగ్ ట్రాక్👉సౌత్ ప్యారిస్ ఎరీనా- హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్👉స్టాడే డి ఫ్రాన్స్- అథ్లెటిక్స్, రగ్బీ సెవెన్స్👉టీహుపో టాహిటి- సర్ఫింగ్👉ట్రొకాడెరో- అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్👉వైర్స సర్ మార్నే నాటికల్ స్టేడియం- కానో స్లాలమ్, కాన్స్ స్ప్రింట్, రోయింగ్👉వెస్-డూ- మానియర్ స్టేడియం- హాకీ.చదవండి: Paris Olympics 2024: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే.. -
‘పారిస్’ పతకాల్లో ఈఫిల్ టవర్!
పారిస్: ఈ ఒలింపిక్స్ పతకాలు మిగతా పతకాలకంటే అతి భిన్నమైనవి... అమూల్యమైనవి! ఎందుకంటే ఈ పతకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు అంతకుమించి అపురూపమైంది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్‌కే తలమానికమైన ‘ఈఫిల్ టవర్’ ప్రతి పతకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే... ఈ వివరాల్లోకి వెళ్దాం! ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక విజేతలకు బహూకరించే పతకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పతకం బరువు 18 గ్రాములైతే... ప్రతి పతకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్‌ను కళ్లారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్‌కు పోటెత్తుతారు. ఇనుముతో తయారైన ఈ టవర్‌ను నవీకరణ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అప్పుడు టవర్‌లో అక్కడక్కడ తీసివేసిన తుక్కు ఇనుప ముక్కల్ని ఓ రహస్య గదిలో జాగ్రత్త పరిచారు. ఈసారి ఒలింపిక్స్ పారిస్‌లో జరుగనున్నాయి. కాబట్టి తమ పతకాలతో మరో విశిష్టత కల్పించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ, ఫ్రాన్స్ ప్రభుత్వం భావించాయి. అందుకే పతకాల తయారీలో అసలైన ఈఫిల్ టవర్ అవశేషాల్ని (భద్రపరిచిన ఇనుప ముక్కలు) వినియోగించారు. ఈసారి విజేతలంతా అదృష్టవంతులే! ఎందుకంటే వాళ్లంతా పతకాల్నే కాదు... ‘సింబల్ ఆఫ్ పారిస్’ గుర్తుల్ని తమతమ దేశాలకు మోసుకెళ్తారు. దీనిపై పారిస్ ఒలింపిక్స్ క్రియేటివ్ డైరెక్టర్ థీయెరి రిబోల్ మాట్లాడుతూ ‘కచ్చితంగా అథ్లెట్లకు ఇది సువర్ణావకాశం. పారిస్ జగది్వఖ్యాత చిహ్నం అవశేషాల్ని ఒలింపిక్స్ విజేతలు తమతో తీసుకెళ్లొచ్చు’ అని అన్నారు. విశ్వక్రీడల చరిత్రలోనే చెరగని ముద్ర వేసేందుకు విశేషమైన వినూత్నమైన ఆలోచనతో ఈ పతకాల్ని డిజైన్ చేశామని చెప్పారు. విజేతలకు అందించేందుకు మొత్తం 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలు తయారు చేశారు. -
ఈఫిల్ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు
ముంబై: ఇకపై ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్‌లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన ఈ–కామర్స్ దిగ్గజం లైరాతో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, ఆన్లైన్లో ఈఫిల్ టవర్ సందర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎన్ఐపీఎల్ తెలిపింది. -
అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు అభిమానులను మెప్పించింది. బాస్ పార్టీ అంటూ సాగే సాంగ్‌తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ భామ అరుదైన అవకాశాన్ని అందుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు! ) ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ ముందు ఫోటోలకు పోజులిచ్చింది. పంచుకుంది. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా..' అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. రిషభ్ పంత్‌తో డేటింగ్ రూమర్స్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. కాగా.. గతంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో ఊర్వశి రౌతేలా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఈ ఫోటో చూసిన రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) -
Eiffel Tower: బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ ఖాళీ
ప్యారిస్: సుందర కట్టడంగా పేరొందిన ఈఫిల్ టవర్ వద్ద ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ప్యారిస్లో ఉన్న ఈ టవర్‌కు శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలో దుండగులు ఫోన్ చేసి ఈఫిల్ టవర్‌ను కూల్చేందుకు బాంబు అమర్చామంటూ బెదిరించారు. దీంతో హుటాహుటినా టవర్లలోని ఫ్లోర్లన్నింటిని ఖాళీ చేయించారు అధికారులు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ప్యారిస్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి.. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టి.. 1889 మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించగా.. కిందటి ఏడాది 62 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. FRANCE 🇫🇷 The Eiffel Tower has been evacuated due to a bomb threat. This is developing. They don’t seem to be in much of a hurry evacuating. Hmmmm pic.twitter.com/Iabb9SqdXY — Forever Trumper (@FanaTeresafana) August 12, 2023 -
ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నేరం.. కారణం ఇదే!
పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరొందింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు ఫ్రాన్స్‌కు తరలివస్తుంటారు. 1889లో ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్ ఎగ్జిబిషన్‌కు ఎంట్రీ గేటుగా ఈ టవర్ నిర్మాణం ప్రారంభమయ్యింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ రూపంలో నిర్మించారు. తరువాత దీనిని కూల్చివేసే ఆలోచన చేశారు. అయితే దీని అందం, ప్రజాదరణలను దృష్టిలో ఉంచుకుని దీనిని కూల్చివేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఈఫిల్ టవర్ నిర్మించేందుకు 2 ఏళ్ల 2 నెలల 5 రోజులు పట్టింది. దీని నిర్మాణం 1887 నుంచి 1889 వరకూ సాగింది. ఈఫిల్ టవర్ నిర్మాణంలో సుమారు 300 మంది కూలీలు పాల్గొన్నారు. ఈ అద్భుత కళాకృతి కారణంగా నేడు పారిస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంటుంది. ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నిషిద్ధం. చట్టరీత్యా ఈ టవర్‌కు రాత్రివేళ పొటోలుతీయడం నేరమని ప్రభుత్వం ప్రకటించింది. ఈఫిల్ టవర్ లైట్లు పారిస్ కాపీరైట్స్ కిందకు వస్తాయి. అందుకే ఎవరైనా రాత్రివేళ ఈఫిల్ టవర్‌కు ఫొటోలు తీయాలనుకుంటే, ముందుగా కాపీరైట్ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పారిస్‌ను లవ్ సిటీ అని అంటారు. జంటలకు ఈఫిల్ టవర్ లవ్ స్పాట్ అని చెబుతారు. పారిస్‌కు ఇంతటి జనాదరణ ఉన్న కారణంగానే భారత ప్రధాని నరేంద్రమోదీ తన ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశంలో యూపీఐ పేమెంట్లను ప్రారంభించారు. దీని తొలి పేమెంట్‌ను ఈఫిల్ టవర్ వద్ద నిర్వహించారు. త్వరలో పర్యాటకులు ఈఫిల్ టవర్ ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు యూపీఐ పేమెంట్‌ను ఉపయోగించవచ్చు. ఈఫిల్ టవర్లోని కొంతభాగం శీతాకాలంలో ముడుచుకుపోతుంటుంది. ఇప్పటిరకూ 6 ఇంచుల భాగం ముడుచుకుపోయిందని చెబుతుంటారు. ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన మెటల్ చలికి ముడుచుకుపోతుంటుంది. వేసవిలో తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాలలో ఈఫిల్ టవర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే 1930లో నిర్మించిన న్యూయార్క్‌లోని క్రిస్మస్ బిల్డంగ్ ఎత్తు విషయంలో ఈఫిల్ టవర్‌ను అధిగమించింది. నిజానికి ఈఫిల్ టవర్‌ను 20 ఏళ్లపాటు నిలిచివుండేలా నిర్మించారు. అయితే ఈ నిర్మాణం జరిగి 20 ఏళ్లు దాటినా అది చెక్కుచెదరకుండా ఉంది. దీని నిర్మాణం జరిగిన 20 ఏళ్ల అనంతరం దీనికి కొన్ని సాంకేతిక పరీక్షలు చేశారు. ఈ నేపధ్యంలో టవర్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉందని తేలింది. అందుకే ఈరోజుకూ ఈఫిల్ టవర్ మనమంతా తలెత్తుకునేలా నిలిచింది. ఇది కూడా చదవండి: నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ.. -
ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మేటి ఆవిష్కరణ అయిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది. భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ‘‘భారతీయులు యూపీఐ సాధనం వినియోగించే విధంగా ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. ఇది ఈఫిల్ టవర్ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచే యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవచ్చు’’అని ప్రధాని తెలిపారు. యూపీఐ విషయంలో భారత్ సాధించిన మరో ఘనతగా దీన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్–సింగపూర్ మధ్య యూపీఐ ద్వారా సీమాంతర చెల్లింపులకు ఒప్పందం కుదరడం గమనార్హం. అంతేకాదు యూఏఈ, భూటాన్, నేపాల్ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థాను అనుమతించాయి. యూఎస్, ఐరోపా దేశాలు, పశి్చమాసియా దేశాలతోనూ యూపీఐ సాధనం విషయమై భారత్ చర్చలు నిర్వహిస్తోంది. యూపీఐ వినియోగం ఇప్పటి వరకు భారత్‌లోనే ఉండగా, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు ఎన్పీసీఐ సీఈవో రితేష్ శుక్లా తెలిపారు. యూపీఐని అభివృద్ధి చేసింది ఎన్పీసీఐ అని తెలిసిందే. ఎలా పనిచేస్తుంది? ఫ్రాన్స్‌కు చెందిన చెల్లింపుల పరిష్కారాలను అందించే లైరా నెట్వర్క్స్తో ఎన్పీసీఐ 2022లోనే ఒప్పందం చేసుకుంది. దీంతో ఫ్రాన్స్‌ను సందర్శించే భారత విద్యార్థులు, పర్యాటకులతోపాటు ఎన్ఆర్ఐలు ఇక నుంచి లైరా నెట్వర్క్ ఆధారిత అన్ని చెల్లింపుల టెరి్మనళ్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేసుకోవడం సాధ్యపడుతుంది. అంతర్జాతీయ టెలిఫోన్ నంబర్లను ఇందుకు వినియోగించుకోవచ్చు. భారత్‌లో బ్యాంక్ ఖాతా, దానితో అనుసంధానించిన యూపీఐ ఐడీ ఉండాలి. అలాగే ఫోన్లో భీమ్ లేదా యూపీఐ ఆధారితే ఏదో ఒక అప్లికేషన్ ఉంటే దాని ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. దీంతో కరెన్సీ మారక ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. రెండు దేశాల మధ్య రెమిటెన్స్ ఖర్చులు సైతం తగ్గుతాయి. రోజుకు 100 కోట్ల లావాదేవీలు యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరిస్తుండడంతో రానున్న రోజుల్లో చెల్లింపుల లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అంతేకాదు సీమాంతర చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా చేసుకోవడం సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 9.33 కోట్లుగా ఉంది. 2025 నాటికి రోజువారీ బిలియన్ లావాదేవీలకు (100 కోట్లు) చేరుకుంటామని శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు యూకే, నేపాల్, భూటాన్, సింగపూర్, ఆ్రస్టేలియా, ఒమన్, ఫ్రాన్స్‌లో యూపీఐ లావాదేవీలకు అవకాశం ఏర్పడినట్టు చెప్పారు. భారత్ 13 దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకుందని, అవన్నీ తమ దేశంలో డిజిటల్ చెల్లింపులకు యూపీఐని వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రకటించడం గమనార్హం. -
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈఫిల్‌ను రాత్రిపూట ఫొటో తీయాలంటే పర్మిషన్ కావాలి..
పారిస్ వెళ్లినవాళ్లెవ్వరైనా ఈఫిల్ టవర్ దగ్గరకు వెళ్లకుండా ఉండరు. అందులోనూ రాత్రిపూట పారిస్ వెలుగుల్లో ఈఫిల్ టవర్ అందాన్ని ఆస్వాదించడం అద్భుతమైన అనుభవం. అయితే పగలైనా రాత్రైనా సాధారణ వ్యక్తులు ఫొటోలు తీసుకుంటే ఓకే. కానీ.. రాత్రిపూట ఈఫిల్ అందాలను పట్టి బంధించడానికి వీల్లేదు. పొద్దంతా తీసిందొక లెక్క... రాత్రిపూట తీసిందో లెక్క అంటున్నారు నిర్వాహకులు. సాధారణ సందర్శకులు ఫోన్స్‌లోనూ, కెమెరాల్లోనూ ఫొటోలు తీసుకుంటే ఓకే. కానీ.. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ రాత్రిపూట ఫొటోస్ తీయడానికి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట వెలిగే లైట్స్పై కాపీ రైట్ ఉందన్నమాట. పబ్లిష్ చేయడానికైనా, సర్క్యులేట్ చేయడానికైనా ప్రొఫెషనల్స్ ఈఫిల్ టవర్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి అనుమతి తీసుకోవాలని toureiffel. paris పేర్కొంది. ఈఫిల్ టవర్‌పై రోజూ 20వేల బల్బులు కాంతులీనుతాయి. టవర్‌పైన ఉన్న దీపస్థంభం అయితే మరింత ప్రత్యేకమైనది. చదవండి: (Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు) -
పారిస్ నగరంలో అందాల ఐశ్వర్య రాజేష్..
నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం డ్రైవర్ జమున చిత్రంలో కాల్‌టాక్సీ డ్రైవర్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బికిన్స్ లిన్ దర్శకత్వం వహించగా, జీబ్రాన్ సంగీతం సమకూర్చారు. 18 రీల్స్ బ్యానర్‌పై చౌదరి నిర్మిస్తున్నారు. కన్నన్ దర్శకత్వం వహించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ రీమేక్‌లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఈఫిల్‌టవర్ దగ్గర దిగిన ఫొటోలను తన ఇన్‌స్ర్ట్రాగామ్ పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
వద్దన్నా వినలేదు.. 57 మీటర్ల ఎత్తు నుంచి దూకి చచ్చిపోయాడు!
ఫ్రాంజ్ రీచెల్ట్.. ఇతడు ఓ ఫ్రెంచ్ టైలర్. 1878 అక్టోబర్ 16న జన్మించిన రీచెల్డ్.. సొంతంగా పారాషూట్స్ తయారు చేసేవాడు. ఆ పారాషూట్స్ సాయంతో ఎత్తయిన బిల్డింగ్స్ మీద నుంచి ఎన్నో సాహసాలు కూడా చేశాడు. అయితే ఒకసారి అతడికి ఒక ఆలోచన వచ్చింది. అత్యంత ఎత్తయిన చోట నుంచి దూకి తను తయారు చేసిన పారాషూట్స్ పనితనాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. దానికి తగ్గ పారాషూట్‌ను కూడా సిద్ధం చేసుకున్నాడు. అందుకు.. 330 మీటర్స్ (1,083 ఫీట్స్) ఈఫిల్ టవర్‌ని ఎంచుకున్నాడు. అయితే మొదట అతడికి అనుమతి లభించలేదు. ఎన్నో ప్రయత్నాలు చేయగా చేయగా 1912లో ఈఫిల్ టవర్ మొదటి ప్లాట్‌ఫామ్ నుంచి దూకేందుకు (57 మీటర్ల ఎత్తు నుంచి) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో 1912 ఫిబ్రవరి 4న పోలీస్‌ల ఆధ్వర్యంలో వేలాది మంది సమక్షంలో.. విలేకర్ల కెమెరా ఫ్రేముల నడుమ.. అతడు అనుకున్నదే చేశాడు. వ్యక్తిగత పారాషూట్ వద్దు అని ఎంతమంది వారించినా వినకుండా తను తయారు చేసిన పారాషూట్నే ఉపయోగించి అక్కడ నుంచి దూకాడు. తీరా గాల్లో ఉన్నప్పుడు అతడి పారాషూట్ మొరాయించడంతో అతడి కథ ముగిసింది. ఫ్రాంజ్ రీచెల్ట్ తీవ్ర గాయలతో చనిపోయాడు. ఆ మరునాడు వార్త పత్రికలన్నీ అతడి గురించి రాసే వార్తకు ఒకే హెడ్డింగ్ పెట్టాయి... రెక్లెస్ ఇన్వెంటర్(నిర్లక్ష్య ఆవిష్కర్త) అని! చదవండి: భయారణ్యం.. ఇదో ఆత్మహత్యల అడవి -
కొడుకుని ప్రేమతో ముద్దాడిన ఎన్టీఆర్.. వైరలవుతోన్న ఫోటో
షూటింగ్‌లతో బిజీగా ఉండే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వీలు చిక్కినప్పుడల్లా కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భర్గవ్ రామ్‌తో కలిసి ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. ఈఫిల్ టవర్ ముందు కొడుకు బుగ్గలపై ఎన్టీఆర్ప్రేమతో ముద్ధాడుతుండగా.. అభయ్ నవ్వులు చిందిస్తున్నాడు. చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై అర్హ బర్త్‌డే వేడుకలు ఈ ఫోటో సోషల్ ప్రస్తుతం మీడియాలో వైరలవుతోంది. తండ్రి ప్రేమను చూపిస్తున్నాడని అభిమానులను కామెంట్స్ చేస్తున్నారు. సుమారు వారం, పది రోజులు ఎన్టీఆర్యూరప్లోనే ఉండనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్, అలియా భట్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 7, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. చదవండి: బుల్లితెరపై మహేశ్ బాబు-ఎన్టీఆర్ సందడి.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిపోయిన ఐశ్యర్యా రాయ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి ర్యాంప్‌పై దేవతలా మెరిసిపోయింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కాస్మెటిక్ బ్రాండ్ లోరియల్ అక్టోబర్ 3న నిర్వహించిన ఈవెంట్లో వైట్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసి అక్కడున్నవారినందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సెలబ్రిటీ మహిళలతో ఈఫిల్ టవర్ దగ్గర నిర్వహించిన ఈవెంట్లో ఐశ్యర్య రాయ్ సందడి ట్రెండింగ్‌లో నిలిచింది. ‘లే డిఫైల్ లోరియల్ పారిస్ 2021 విమెన్స్ వేర్ సమ్మర్ 2022 షో’ పారిస్‌లో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత, వేధింపులకు వ్యతిరేకంగా ప్రచారం థీమ్‌తో ఈ ఏడాది ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు ఎల్ ఓరియల్ పారిస్ గ్లోబల్ బ్రాండ్ ప్రెసిడెంట్ డెల్ఫిన్ విగుయర్-హోవాస్సే ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను లోరియల్ పారిస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈఫిల్ టవర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రముఖ యాక్టర్స్ హెలెన్ మిరెన్, కేథరీన్ లాంగ్‌ఫోర్డ్, గాయని కెమిలా కాబెల్లో, అంబర్ హర్డ్ తదితర ప్రపంచవ్యాప్త సూపర్ సూపర్ మోడల్స్ తో ఈ వేడుక జరుపుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ , కుమార్తె ఆరాధ్యతో కలిసి గత వారమే పారిస్ వెళ్లింది. ఈ క్రమంలో అభిషేక్ ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. కాగా 2018, 2019 లో ఫ్యాషన్ వీక్‌లో కూడా ఐశ్వర్య మెరిసిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) When she walk around the corner looks like a diamond in the water 💧 I know this girl make me crazy this love is a natural love ❤️ #AishwaryaInParis #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/xZwz7IuU4P — Aishwarya Rai (@my_aishwarya) October 3, 2021 View this post on Instagram A post shared by L'Oréal Paris Official (@lorealparis) -
రాత్రివేళ ఈఫిల్ టవర్‌ను ఫొటో ఎందుకు తీయకూడదు?
ప్రపంచ అద్భుతమైన కట్టడాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ఈ నిర్మాణాన్ని చూసేందుకు ప్రతిరోజూ ప్రపంచం నలు దిక్కుల నుంచి పర్యాటకులు వస్తారు. ఎక్కువ మంది పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను చూసేందుకు సాయంత్రం వేళ వెళ్తారు. ఎందుకంటే.. సాయంత్రం నుంచి టవర్ లైట్లతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. బంగారు వర్ణంలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్యారిస్ను సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తారు. రాత్రి వేల ఈఫిల్ టవర్ వీక్షించే సమయంలో ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కదా అని రాత్రి వేల ఫోటో తీశారో ఇక మీ పని అంతే. ఇక్కడే ఓ విషయం పర్యాటకులకు తెలియదు. అది ఏమిటంటే రాత్రివేళ ఈఫిల్ టవర్‌ను ఫొటోలు తియ్యకూడదు. ఎందుకంటే ఆ యూరోపియన్ కాపీరైట్ లా ప్రకార౦.. ఆ లైట్లకు కాపీరైట్స్ ఉన్నాయి. మన దేశంతో పోలిస్తే యూరోపియన్ కాపీరైట్ చట్టాలు కొంచెం కఠినంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫొటోతీసి సోషల్ మీడియాలో గనుక షేర్ చేస్తే కాపీరైట్ సమస్య వస్తుంది. లైటింగ్‌తో ఉన్న ఈఫిల్ టవర్ ఫొటోలు, వీడియోల హక్కులన్నీ దాన్ని నిర్మించిన వారికే ఉన్నాయి. అక్కడి చట్టాల ప్రకారం.. ఈఫిల్ టవర్ వంటి స్మారక చిహ్నాలపై కాపీరైట్ అనేది 70 ఏళ్లకు పైగా ఉంటుంది. (చదవండి: ఓటీటీ ప్రియులకు ఇక పండగే!) టవర్ సృష్టికర్త గుస్తావ్ ఈఫిల్ 1923లో మరణించాడు. కాబట్టి 1993లో ఈఫిల్ టవర్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అందుకే పగటి పుట తీసుకునే ఫోటోలపై ఎటువంటి కాపీరైట్ చర్యలు తీసుకోరు. కానీ, ఈఫిల్ టవర్ నైట్ లైటింగ్స్‌ని 1985లో ఏర్పాటు చేశారు. అందువల్ల వాటికి ఫ్రాన్స్‌లోని కాపీ రైట్ చట్టం ప్రకారం దానిమీద ఆర్టిస్టిక్ వర్క్ హక్కులున్నాయి. వాటిని ఏర్పాటుచేసిన వారికే అవి లభిస్తాయి. అయితే, ఈ నిబందనలు ఉల్లంఘించి చాలా మంది ఫోటోలు తీసుకున్నారు. అయితే, వార మీద చర్యలు తీసుకోక పోవడానికి కారణం ఉంది. అక్కడి నియమాలు ఉల్లాఘించి ఫోటోలు తీసుకున్న వారి సంఖ్య ప్రపంచం మొత్తం మీద కోట్లలో ఉంటుంది. అందుకే, వారి మీద ఫ్రాన్స్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ, మీరు రాత్రివేళ ఫోటోలు దిగలంటే డబ్బులు చెల్లించి దిగడం మంచిది. -
ఏడు వింతలే అని ఎవరు చెప్పారు? ఇది ఎనిమిదో వింత!
Kolkata Eco Park: ఈఫిల్ టవర్ చూడాలంటే... యూరప్ ట్రిప్ అక్కర్లేదిప్పుడు. వెస్ట్‌బెంగాల్ టూర్ చాలు. కోల్‌కతా నగరం... పారిస్ ఈఫిల్ టవర్‌కు ఏ మాత్రం తీసిపోని ప్రతిరూపాన్ని నిర్మించింది. విస్తారమైన పార్కింగ్ లాట్‌తో చాలా ముందుచూపుతో నిర్మించిన టూరిస్ట్ ప్రదేశం ఇది. ఎంట్రీ టికెట్ కేవలం ముప్పై రూపాయలు. పచ్చటి లాన్లలో చేతులు పట్టుకుని విహరించే పర్యాటక ప్రేమికులు, సరస్సులో బోట్ షికారు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లలు, పిల్లగాలికి మెల్లగా కదిలే తేలికపాటి అలలను ఆస్వాదించడానికి ఒడ్డున బెంచీల మీద సీనియర్ సిటిజెన్, సైకిల్ తీసుకుని ఆవరణ అంతా తిరిగి చూస్తున్న యూత్, మూడు ఎంట్రీ గేట్లు... ఈ దృశ్యమే ఈ పార్క్ మనం అనుకున్నంతకంటే ఇంకా చాలా పెద్దది కావచ్చేమోననే సందేహాన్ని కలిగిస్తుంది. ఈ టవర్ వ్యూ పాయింట్ నుంచి దాదాపుగా కోల్‌కతా నగరమంతటినీ చూడవచ్చు. రోమన్ కలోజియం నమూనా ఏడు వింతల ప్రతిరూపం ఈ ఎకో పార్క్ ఈఫిల్ టవర్ ప్రతిరూపంతో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతోపాటు ప్రపంచంలోని ఏడు వింతల కట్టడాలకూ ప్రతిరూపాలున్నాయి. లండన్ బిగ్‌బెన్ టవర్, జపాన్ గార్డెన్, బెంగాలీ గ్రామం, హెర్బల్ గార్డెన్లతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశం ఆనందమయమైన విహారానికి అధునాతనమైన వేదిక. మరో సంగతి! కోల్‌కతా ఈఫిల్ టవర్ గురించి తెలిసిన వెంటనే మనకు ఇండియాలో ఈఫిల్ టవర్ అనే ట్యాగ్‌లైన్ గుర్తుకువస్తుంది. కానీ ఇంతకంటే ముందు మనదేశంలో ఈఫిల్ టవర్‌కు మరో రెండు ప్రతిరూపాలున్నాయి. చండీగఢ్‌లో పన్నెండు మీటర్ల ఎత్తులో ఒకటి ఉంది. రాజస్థాన్ రాష్ట్రం కోట నగరంలో ఒకటి ఉంది. అయితే వీటన్నింటిలోకి కోల్‌కతాలోని ఈఫిల్ టవర్ ప్రతిరూపం మాత్రమే పారిస్‌లోని అసలు ఈఫిల్ టవర్‌ను అచ్చంగా మూసపోసినట్లు ఉంటుంది. ఎకోపార్కులోని ఈజిప్టు గిజా పిరమిడ్ నమూనా ఈఫిల్ టవర్ ప్రతిరూపం తోపాటు ఈ వింతలన్నీ కోల్‌కతాలోని ఎకో పార్కులో ఉన్నాయి. ఇక్కడి ఈఫిల్ టవర్ పద్దెనిమిది అంతస్థుల నిర్మాణం, ఎత్తు 55 మీటర్లు (పారిస్ టవర్ ఎత్తు 324 మీటర్లు). 2015లో మొదలు పెట్టి నాలుగేళ్లలో పూర్తి చేశారు. ఈ పార్కు 2020లో పర్యాటక ద్వారాలు తెరుచుకుంది . ∙ఎకోపార్కులోని తాజ్‌మహల్ నమూనా (పై ఫొటో) క్రైస్ట్ రిడీమర్ విగ్రహం దగ్గర టూరిస్ట్ -
తెరుచుకున్న ఈఫిల్ టవర్.. కానీ
కరోనా ప్రభావంతో మూతపడ్డ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ గురువారం రోజున తిరిగి ప్రారంభమైంది. దాదాపు మూడు నెలల తర్వాత ఈఫిల్ టవర్‌కు సందర్శకుల తాకిడి మొదలైంది. కానీ సందర్శకులు టవర్ యొక్క రెండవ అంతస్తు కంటే పైకి వెళ్ళడానికి అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే తొలుత మెట్ల మార్గం ద్వారానే ఈఫిల్ టవర్‌ను సందర్శించే అవకాశం కల్పించారు. మరోవైపు సందర్శకుల సంఖ్యను కూడా పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈఫిల్ టవర్ పరిసరాల్లో పరిశుభ్రతతోపాటు అన్ని రకాల భద్రత చర్యలు చేపట్టారు. భద్రత కారణాల దృష్ట్యా ఎలివేటర్లను కొంతకాలం పాటు మూసి ఉంచనున్నట్టు తెలిపారు. పదకొండేళ్లు దాటిన వారు ఫేస మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతకాలం పాటు ఈఫిల్ టవర్‌ను మూసివేయడం ఇదే తొలిసారి. ప్రపంచం నలుమూలల నుంచి ఈఫిల్ టవర్‌ను చూసేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు పారిస్‌కు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే. -
ఈఫిల్ టవర్ మూసివేత!
పారిస్ : ఫ్రాన్స్‌లో చెలరేగుతున్న అల్లర్ల కారణంగా ఈఫిల్ టవర్‌ను కొన్నిరోజుల వరకు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంతకాలంగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందన, జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా అక్కడ ఆందోళనలు జరగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర స్థితిని విధించే ఆలోచనలో ఉంది. అయితే అక్కడ పరిస్థితులు ఇంకా తీవ్రతరం కానున్న నేపథ్యంలో పారిస్‌లో ఉండే షాపింగ్‌మాల్స్, మ్యూజియమ్స్, థియేటర్స్‌లను కూడా మూసివేశారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత వీటిని తెరవనున్నట్లు సమాచారం. తాజాగా ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్‌లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం. చదవండి : ఫ్రాన్స్‌లో ఆందోళనలు హింసాత్మకం -
ఈఫిల్ టవర్ సందర్శన నిలిపివేత
పారిస్ : పారిస్‌లోని ఈఫిల్ టవర్ సందర్శనను అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిలిపివేశారు. సైట్ యాజమాన్యం తీసుకొచ్చిన నూతన విధానంతో ఈఫిల్ టవర్ సందర్శనకులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారిని నిలువరించడం సిబ్బందిగా కష్టంగా మారింది. దీంతో బుధవారం మధ్యాహ్నం సమ్మెకు దిగిన ఉద్యోగులు టవర్ మూసివేశారు. అప్పటికే లోనికి వెళ్లిన పర్యాటకులకు మాత్రం మినహాయింపునిచ్చారు. గురువారం కూడా ఇదే రకంగా నిరసన తెలుపనున్నట్టు ఉద్యోగులు ముందుగానే ప్రకటించారు. గతేడాది ప్రఖ్యాత కట్టడాన్ని దాదాపు 60 లక్షల మంది సందర్శించారు. గత నెలలో ఈఫిల్ టవర్ సందర్శన టిక్కెట్లను సగం వరకు ఆన్లైన్లో ఉంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి టైమ్‌స్లాట్‌లను ఎంచుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా సందర్శకులు తీసుకునే టికెట్‌ను బట్టి వారికి ఒక్కోరకం ఎలివేటర్లను కేటాయించారు. దీంతో అసలు సమస్య తలెత్తింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి కేటాయించే ఎలివేటర్లు మధ్యాహ్నం వరకు సగం మేర ఖాళీగా దర్శనమిస్తాయి. ఆ తర్వాత ఎలివేటర్లలో రద్దీ పెరుగుతోంది. దీంతో పర్యాటకులు భారీ క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చాలా మంది పర్యాటకులు కూడా క్యూ లైన్లలో వేచి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సందర్శకులను నియంత్రించడంలో తాము సహనం కొల్పోతున్నామని పేర్కొన్నారు. ఏ రకం టికెట్ తీసుకున్నా వారైనా అన్ని ఎలివేటర్లను ఉపయోగించుకునేలా నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు. కాగా ఈఫిల్ టవర్‌ను నిర్వహిస్తున్న ఎస్ఈటీఈ కంపెనీ మాత్రం తాము రోజుకు 10,000 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో విక్రయిస్తున్నామని చెప్పారు. వేచి చూడాల్సిన సమయం కూడా చాలా తక్కువని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఏదో ఒక అంశంపై ఇక్కడి సిబ్బంది నిరసనలకు దిగడం తరచు జరుగుతూనే ఉంది. -
ఈఫిల్ టవర్ మూసివేత
ఫ్రాన్స్ : పారిస్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఈఫిల్ టవర్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను సందర్శించటానికి దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున్న పర్యాటకులు తరలివస్తుంటారు. కానీ పారిస్ సందర్శకులకు ఓ చేదువార్త. శుక్రవారం, శనివారం రెండు రోజులు ఈఫిల్ టవర్ సందర్శనకు పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. గత నెలలో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే.. గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు పారిస్ నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. శుక్రవారం మరింతగా మంచు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు సందర్శనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. పొగ మంచు దట్టంగా కమ్ముకుపోవడంతో అక్కడ రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. వందల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే జాగరం చేయాల్సి వచ్చింది. రైల్వే వ్యవస్థకు కూడా అంతరాయం కలగడంతో, 700 మందికి పైగా ప్రయాణికులు స్టేషన్లలోనే నిద్రించాల్సి వచ్చింది. ఓర్లీలో కొన్ని విమానాలు రద్దయ్యాయని తెలిసింది. మరింత పొగమంచు సంకేతాలు వస్తుండటంతో, దేశంలో ఈ క్వార్టర్లో అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని ముందస్తుగా ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. -
చైనా మాయ.. ఈఫిల్ టవర్ డూప్లికేట్
ఇక్కడ రెండు ఈఫిల్ టవర్లు ఉన్నాయి.. ఒకటి ప్యారిస్‌లో.. రెండోది చైనాలోని తయాండు చెంగ్లో ఉంది.. ఇంతకీ ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్?? తెలియడం లేదా.. లేటెస్ట్ ఐఫోన్‌కు కూడా వెంటనే డూప్లికేట్ తయారుచేసేసే చైనాలో.. ఈఫిల్ టవర్‌కు డూప్లికేట్ సృష్టించడం ఓ లెక్కా.. అందుకే తయాండుచెంగ్లో కట్టేశారు. చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా దాదాపు అరే రీతిలో నిర్మించారు. ఈఫిల్ విషయానికొస్తే.. అసలైనదాని పొడవుతో పోలిస్తే.. అందులో మూడోవంతు ఎత్తులో డూప్లికేట్ ను కట్టారు. ఇంతకీ ఒరిజినల్ ఏదో చెప్పలేదు కదూ. కుడివైపున ఉన్నది అసలైన ఈఫిల్ టవర్. -
చీకట్లో ఈఫిల్ టవర్
-
చీకట్లో ఈఫిల్ టవర్
పారిస్ : లాస్‌వేగాస్ కాల్పుల దుర్ఘటనలో మృతిచెందిన వారికి నివాళిగా పారిస్‌లోని ఈఫిల్ టవర్‌లో సోమవారం రాత్రి విద్యుత్ దీపాలను వెలిగించలేదు. ఉగ్రవాద వికృత క్రీడలో 59 మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అమెరికా చరిత్రలోనే అది అత్యంత దారుణమైన దుర్ఘటన. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఫ్రాన్స్‌లోని మార్షిల్లే రైల్వే స్టేషనల్లో ఇద్దరి వ్యక్తులను ఇస్లామిక్ తీవ్రవాదులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటలనలను తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. మార్షిల్లే, లాస్‌వేగాస్ మృతులకు నివాళిగా.. ఈఫిల్ టవర్లోని విద్యుత్ దీపాలను వెలిగించడం లేదని ప్రభుత్వం తెలిపింది. -
కొండంత పెరిగిపోయిన ప్లాస్టిక్...
ప్లాస్టిక్.. మనిషికి ప్రియమైన శత్రువు అని దీనికి పేరు. పర్యావరణ కష్టాలున్నాయని తెలిసినా వాడకుండా ఉండలేకపోవడం దీనికి కారణం. 1950లలో తొలిసారి పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి మొదలైనప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా పెరుగుతూనే ఉంది. 1950లలో కేవలం 20 లక్షల టన్నుల ప్లాస్టిక్ మాత్రమే ఉండగా.. 2017 వచ్చేసరికి ఇది 40 కోట్ల టన్నులకు చేరింది. 2017 వరకూ మనిషి తయారు చేసిన మొత్తం ప్లాస్టిక్ బరువు 830 కోట్ల టన్నులు. ఇది వంద కోట్ల ఏనుగుల (ఒక్కొక్కటీ 7.6 టన్నుల బరువు అనుకుంటే) ఉమ్మడి బరువుతో సమానం. ఈఫిల్ టవర్‌లో వాడిన ఇనుము బరువుకు 8,22,000 రెట్లు ఎక్కువ. జార్జియా యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి, వాడకం, రీసైక్లింగ్లపై సమగ్ర అంచనాను ఇచ్చింది. ఆ వివరాలు.. వాడకం ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ ... 3400 కోట్ల టన్నులు 2017 వరకూ.. మొత్తం ఉత్పత్తి 830 కోట్ల టన్నులు చెత్తగా మిగిలింది 630 కోట్ల టన్నులు రీసైకిల్ చేసింది 9 శాతం మాత్రమే తగులబెట్టింది 12 శాతం చెత్తకుప్పల్లోకి చేరి కాలుష్యం కలిగిస్తున్నది 79 శాతం! 2010 నాటి లెక్కల ప్రకారం.. సముద్రాల్లోకి చేరి జలచరాల ప్రాణాలు తీసేస్తున్న ప్లాస్టిక్ చెత్త ఎంతో తెలుసా...? 80 లక్షల టన్నులు! -
ఈఫిల్ టవర్‌కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్
న్యూఢిల్లీ: భారత రైల్వే వ్యవస్థ మరో సంచనానికి సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఓభారీ వంతెన నిర్మాణానికి ప్రణాలికలు వేస్తోంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇది. సుమారు 1.3కిలోమీటర్ల పొడవుతో జమ్మూలోని కాట్ర, శ్రీనగర్‌లోని కౌరీ ప్రాంతాలను కలుపుతూ భారత రైల్వే ఈ వంతెన నిర్మించనుంది. భారీ వంపు తిరిగిన ఆకారంలో సుమారు రూ.1110 కోట్లతో నిర్మించనున్నారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్ల ప్రాంతాలను కలపడంలో ఈబ్రిడ్జ్ కీలకపాత్ర పోషించనుంది. తద్వారా ఆయాప్రాంతాల్లో రవాణా వ్యవస్థ వృద్ధి చెందనుందని రైల్వే అధికారులు తెలిపుతున్నారు. ఈ వంతెన పూర్తి అయితే చైనాలోని సుభై(275 మీటర్లు) వంతెన రికార్డును అధికమిస్తుంది. దీనిని పూర్తి చేయడం ఇండియన్ రైల్వేకు ఓ సవాలు లాంటిదని, పూర్తి చేస్తే ఇంజనీరింగ్ అద్భుతం అవుతుందని రైల్వేశాఖా అధికారి తెలిపారు. ఈభారీ నిర్మాణంలో సుమారు 24వేల టన్నుల ఇనుమును ఉపయోగించనున్నారు. ఇది చీనాబ్నది ఉపరితలానికి సుమారు 359మీటర్లు ఎత్తులో నర్మించనున్నారు. ఉగ్రదాడులు, తక్కువ ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోనే విధంగా ప్రత్యేక ఇనుమును ఇందులో వాడనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ఆన్లైన్లో నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. -
ఈఫిల్ టవర్‌కు రక్షణగా గాజు గోడ
పారిస్: ఈఫిల్ టవర్‌పై దాడులను నిరోధించేందుకు దాని చుట్టూ 2.5 మీటర్ల ఎత్తున్న గాజు గోడను నిర్మించనున్నారు. గతేడాది యూరో ఫుట్‌బాల్ టోర్నీ సందర్భంగా ఈఫిల్ టవర్‌కు రక్షణగా ఏర్పర్చిన లోహపు కంచెల స్థానంలో ఈ గోడను నిర్మిస్తున్నారు. ఫ్రాన్స్ లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడుల నేపథ్యంలో ఈఫిల్ టవర్ సహా ఇతర చారిత్రక కట్టడాల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. -
ఈఫిల్ టవర్ వద్ద సామూహిక లైంగిక దాడి
పారిస్: మాయమాటలు చేసి రప్పించి ముగ్గురు వ్యక్తులు ఈఫిల్ టవర్ వద్ద ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద చోటుచేసుకుంది. ఈ లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురిలో ఒకరు ఆమెతో ఫేస్బుక్ లో చాట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం అల్జీరియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళతో ఫేస్ బుక్‌లో పరిచయం పెంచుకున్నారు. వారిలో ఒకతను ఆమెకు మాయమాటలు చెప్పి బాగా దగ్గరవ్వగా ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడేందుకు ముందే వ్యూహం పన్నారు. పథకం ప్రకారం ఆమెను పారిస్ లోని ఈపిల్ టవర్ వద్దకు రప్పించారు. అనంతరం ఆమెపై అక్కడే ఉన్న చాంప్ దే మార్స్ గార్డెన్లో లైంగిక దాడి చేశారు. ఆ ముగ్గురుని ఓ హోటల్ లో పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి భద్రత, విచారణ దృష్ట్యా పోలీసులు ఇంతకంటే ఎక్కువగా వివరాలు అందించలేదు. -
మూతపడ్డ ఈఫిల్ టవర్!
పారిస్ః అభిమానులు పోలీసుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. యూరో కప్ సాకర్ మ్యాచ్ సమయంలో రేగిన ఘర్షణలు పారిస్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ మూసివేతకు కారణమైంది. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని పారిస్ లోని ఈఫిల్ టవర్ ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పారిస్ లో జరిగిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లకు మధ్య జరిగిన యూరోకప్ సాకర్ 2016 ఫైనల్ మ్యాచ్ లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ ఓటిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్టేడియంలోకి అభిమానులు ప్రవేశించడానికి పోలీసులు నిరాకరించడంతో అసలు గొడవ మొదలైంది. అడ్డుకున్న పోలీసులపైకి అభిమానులు రాళ్ళు రువ్వడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువును, వాటర్ క్యాన్స్ సైతం ప్రయోగించారు. ఈఫిల్ టవర్ ప్రాంతం భాష్సగోళాల పొగతో నిండిపోయింది. ఆందోళనకు దిగిన 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల్లో అక్కడి వాహనాలకు, చెత్తకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ సందర్భంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈఫిల్ టవర్ ను ఒక రోజంతా మూసివేస్తున్నట్లు ఈఫిల్ టవర్ నిర్వాహకులు వెల్లడించారు. -
ఈఫిల్ టవర్ వద్ద యోగా పండుగ!
పారిస్ః ఈఫిల్ టవర్ ప్రాంతం ధ్యానసాధకులతో నిండిపోయింది. రెండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు భారీగా పాల్గొని ధ్యానంలో మునిగిపోయారు. ఇండియన్ ఎంబసీ నిర్వహించిన యోగా కార్యక్రమం ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్త పండుగగా జరుపుకుంటున్న యోగా దినోత్సవం నాడు పారిస్ లోని ఈఫిల్ టవర్ ప్రాంతం యోగ సాధకులతో సందడి చేసింది. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఆదివారం పారిస్ లో నిర్వహించిన వేడుకలో సుమారు 300 కు పైగా యోగా ప్రియులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకలో పాల్గొన్న వారితో పారిస్ లోని శివానంద యోగా సెంటర్ కు చెందిన అధ్యాపకులు... ప్రత్యేక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. -
ఈఫిల్ టవర్ మూసివేత!
ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ మంగళవారం మూతపడింది. ప్రతిరోజు వేలమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. గతేడాది 70 లక్షలకు పైగా పర్యాటకులు ఈ అద్భుతాన్ని సందర్శించగా ఇందులో 80 శాతానికి పైగా విదేశీయులు ఉన్నారు. అయితే ఫ్రాన్స్ కార్మిక చట్టాలు తమకు అడ్డుగా నిలుస్తున్నాయని, దీంతో తాము అధిక ఒత్తిడికి గురవుతున్నాయని కార్మికులు ధర్నా చేశారు. ఈ కారణంగా ఈఫిల్ టవర్ ను మంగళవారం మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈఫిల్ టవర్ కు వచ్చే సందర్శకులను రిసీవ్ చేసుకోవడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, టవర్ వద్ద పనిచేయడం, మొదలైన పనులు నిర్వహించడం తమకు చాలా కష్టమవుతుందని ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది ఇక్కడకి వస్తుంటారని, తగిన స్టాప్ లేకపోవడంతో ఒక కార్మికుడు రెండు, మూడు డిపార్ట్ మెంట్స్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల కారణంగానే నిరుద్యోగిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కార్మికులు వాపోయారు. వర్కర్స్ ఎవరూ రాకపోవడంతో ఈఫిల్ టవర్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. -
అద్దెకు ఈఫిల్ టవర్!
పారిస్: యూరో ఫుట్ బాల్-2016 సందర్భంగా రెంటల్ కంపెనీ కస్టమర్లకు ఓ అద్భుత అవకాశాన్ని కల్పించింది. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌లో నాలుగు రోజుల పాటు నివసించేందుకు నలుగురు లక్కీ కస్టమర్లను ఓ పోటీ ద్వారా ఎన్నుకోనుంది. ఇందుకోసం గురువారం నుంచి పోటీని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఈవో బ్రియాన్ షార్పెల్స్ తెలిపారు. ఈఫిల్ టవర్లోని మొదటి అంతస్తులో గల 300 చదరపు అడుగుల గదిలో బస కోసం ఇప్పటికే ఏర్పాట్లను మొదలు పెట్టేసింది. ఇక్కడి నుంచి ఆర్క్ డీ ట్రిమోఫె, ది సాక్రె కోయూర్, సీయన్ నదిని చూడొచ్చని తెలిపింది. జీవితాకాలం చెప్పుకోదగ్గ జ్ఞాపకాల్లో ఇదొకటిగా ఎంపికైన కస్టమర్లకు మిగిలిపోతుందని బ్రియాన్ అన్నారు. -
నిజమే.. నమ్మండి!
కొన్ని ఘటనలు నమ్మశక్యంగా ఉండవు. అవి చరిత్ర, శాస్త్రవిజ్ఞానం, భూ, ఖగోళ శాస్త్రం.. ఇలా అంశమేదైనా వీటికి సంబంధించిన అనేక సంఘటనలు తెలుసుకోవడానికి వింతగా ఉంటాయి. వాటి వెనుక ఎన్నో ఆసక్తికర కథలూ ఉంటాయి. అలా కొన్ని అరుదైన సంఘటనల గురించి తెలుసుకుందాం.. ఈఫిల్ టవర్‌నే అమ్మేశాడు.. ఈ భూమ్మీదున్న అద్భుత నిర్మాణాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరంలో ఉన్న ఈఫిల్ టవర్ నిర్మాణశైలిని ఇప్పటికీ ఓ ఇంజనీరింగ్ వింతగానే అభివర్ణిస్తారు. 1889లో నిర్మితమైన ఇది నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. గత ఏడాది దీన్ని దాదాపు 70 లక్షల మంది సందర్శించి ఉంటారని అంచనా. ఇంతగా పర్యాటకులను ఆకర్షిస్తూ, ఫ్రాన్స్‌కే తలమానికంగా నిలిచిన ఈఫిల్ టవర్‌ను ఓ వ్యక్తి అమ్మేశాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. చెక్ రిపబ్లిక్కు చెందిన విక్టర్ లాస్టింగ్ అనే వ్యక్తి అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతుండేవాడు. అవకాశం ఉన్న ప్రతిచోట ఏదో ఒకలా మోసానికి పాల్పడి, అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో 1925లో ఓ రోజు దినపత్రికలో ఈఫిల్ టవర్‌కు సంబంధించిన వార్త ప్రచురితమైంది. ఈఫిల్ శిథిలావస్థలో ఉందని, దాదాపు 20 ఏళ్లకు మించి అది నిలబడదని, దాని నిర్వహణ, మరమ్మతులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయనేది ఆ వార్త సారాంశం. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని ఈఫిల్ టవర్‌ను అమ్మేసేందుకు విక్టర్ ప్రణాళిక రచించాడు. పాత సామగ్రి కొనే వ్యాపారులను కలిశాడు. తాను ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగినని, ఈఫిల్ టవర్‌ను అమ్మేసే బాధ్యత ప్రభుత్వం తనకు అప్పగించిందని వారిని నమ్మించాడు. ఈఫిల్ టవర్‌ను అమ్మేస్తున్నామని, దాన్ని పడగొట్టిన తర్వాత ముడి పదార్థమైన ఇనుమును కొనుక్కోవాల్సిందిగా సూచించాడు. దీన్ని నమ్మిన ఓ సంస్థ విక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అతడికి దాదాపు 20,000 డాలర్లను కూడా ముట్టజెప్పింది. తీరా ఆ డబ్బు తీసుకుని విక్టర్ అక్కడినుంచి పారిపోయాడు. చివరకు టవర్‌ను అమ్మడం అబద్దమని తెలుసుకున్న ఆ సంస్థ మోసపోయామని గ్రహించింది. ఇలా ఓ సంస్థకు ఈఫిల్ టవర్‌నే అమ్మేసి, విక్టర్ నేరస్థుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. 58 ఏళ్లైనా దొరకని అణుబాంబు.. 1958 ఫిబ్రవరి 5న జార్జియాకు చెందిన ఓ యుద్ధ విమానం 7,000 పౌండ్ల బరువు కలిగిన అణుబాంబును మోసుకెళ్తోంది. అయితే విమానం ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తలెత్తింది. అణుబాంబుతో కూడిన విమానం నేలను ఢీకొంటే బాంబు పేలడం ఖాయం. అణుబాంబు పేలితే జరిగే నష్టం అంచనాలకందదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ అణుబాంబును ఓ నదీ తీరంలో జారవిడిచాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి పైలట్ బయపడ్డాడు. అయితే నదిలో పడ్డ అణుబాంబును కనుగొనేందుకు నేవీ అధికారులు చాలాకాలం పాటు వెతికారు. కానీ వారికి దాని జాడ దొరకలేదు. ఇప్పటికీ ఆ బాంబు కోసం ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అణుబాంబు అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి, దాన్ని కనుక్కొని, నిర్వీర్యం చేయాలని వారి ఆలోచన. ఆ బాంబు ఎక్కడ ఉన్నా, దానికి ఎలాంటి ఇబ్బందీ, తాకిడీ లేనంత వరకు అది పేలదని అధికారుల వాదన. ఏదేమైనా 58 ఏళ్లు గడిచినా, ఇంకా ఆ బాంబు పేలకుండా, దొరకకుండా నేవీ అధికారులను కలవరపెడుతోంది. చికాగో ఎత్తు పెరిగింది.. 1855లో చికాగో నగరం ఎప్పుడూ బురద నీటిలోనే ఉంటూ ఉండేది. కారణం ఈ నగరం నదీ తీరానికి దగ్గరగా ఉండడంతోపాటు డ్రైనేజీ, వరద నీటి పారుదల వ్యవస్థలు కూడా సరిగ్గా ఉండేవి కావు. దీంతో ప్రజలు టైఫాయిడ్ జ్వరం, కలరా వంటి పలు వ్యాధులతో సతమతమయ్యేవారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏవీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈ.చెస్బ్రో అనే ఇంజనీర్‌ను నియమించి, దీనికి పరిష్కారం కనుగొనమన్నారు. నగరానికి ఈ సమస్య తప్పాలంటే, భారీ వరద కాలువలు తవ్వాలని, ఇందుకోసం చికాగో నగరం ఎత్తు పెంచాలని అతడు సూచించాడు. అనేక చర్చల అనంతరం దీనికి అధికారులు అంగీకరించారు. అలా నగరంలోని వీధులు, ఫుట్‌పాత్‌లు, బిల్డింగుల ఎత్తు పెంచేందుకు పూనుకున్నారు. బిల్డింగుల పునాదుల ఎత్తు పెంచడం ద్వారా అవి ఎత్తులో నిలిచాయి. ఇలా నగరంలోని చాలా చోట్ల ఎత్తు పెరిగింది. దాదాపు 4-14 అడుగుల వరకు వీలున్న చోటల్లా నగరం ఎత్తు పెంచుతూ వచ్చారు. ఫలితంగా ఉపరితలం నుంచి డ్రైనేజీలు, కాలువల ఎత్తు పెరిగింది. నది కంటే నగరం ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల నీరు పల్లానికి చేరేది. అయితే ఈ తతంగం అంతా పూర్తి కావడానికి దాదాపు రెండు దశాబ్దాలకు పైగాపట్టింది. ఈ పనులు చేసే సమయంలో సాధారణ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకున్నారు. -
నిజమే.. నమ్మండి!
కొన్ని ఘటనలు నమ్మశక్యంగా ఉండవు. అవి చరిత్ర, శాస్త్రవిజ్ఞానం, భూ, ఖగోళ శాస్త్రం.. ఇలా అంశమేదైనా వీటికి సంబంధించిన అనేక సంఘటనలు తెలుసుకోవడానికి వింతగా ఉంటాయి. వాటి వెనుక ఎన్నో ఆసక్తికర కథలూ ఉంటాయి. అలా కొన్ని అరుదైన సంఘటనల గురించి తెలుసుకుందాం.. ఈఫిల్ టవర్‌నే అమ్మేశాడు.. ఈ భూమ్మీదున్న అద్భుత నిర్మాణాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరంలో ఉన్న ఈఫిల్ టవర్ నిర్మాణశైలిని ఇప్పటికీ ఓ ఇంజనీరింగ్ వింతగానే అభివర్ణిస్తారు. 1889లో నిర్మితమైన ఇది నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. గత ఏడాది దీన్ని దాదాపు 70 లక్షల మంది సందర్శించి ఉంటారని అంచనా. ఇంతగా పర్యాటకులను ఆకర్షిస్తూ, ఫ్రాన్స్‌కే తలమానికంగా నిలిచిన ఈఫిల్ టవర్‌ను ఓ వ్యక్తి అమ్మేశాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. చెక్ రిపబ్లిక్కు చెందిన విక్టర్ లాస్టింగ్ అనే వ్యక్తి అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతుండేవాడు. అవకాశం ఉన్న ప్రతిచోట ఏదో ఒకలా మోసానికి పాల్పడి, అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో 1925లో ఓ రోజు దినపత్రికలో ఈఫిల్ టవర్‌కు సంబంధించిన వార్త ప్రచురితమైంది. ఈఫిల్ శిథిలావస్థలో ఉందని, దాదాపు 20 ఏళ్లకు మించి అది నిలబడదని, దాని నిర్వహణ, మరమ్మతులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయనేది ఆ వార్త సారాంశం. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని ఈఫిల్ టవర్‌ను అమ్మేసేందుకు విక్టర్ ప్రణాళిక రచించాడు. పాత సామగ్రి కొనే వ్యాపారులను కలిశాడు. తాను ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగినని, ఈఫిల్ టవర్‌ను అమ్మేసే బాధ్యత ప్రభుత్వం తనకు అప్పగించిందని వారిని నమ్మించాడు. ఈఫిల్ టవర్‌ను అమ్మేస్తున్నామని, దాన్ని పడగొట్టిన తర్వాత ముడి పదార్థమైన ఇనుమును కొనుక్కోవాల్సిందిగా సూచించాడు. దీన్ని నమ్మిన ఓ సంస్థ విక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అతడికి దాదాపు 20,000 డాలర్లను కూడా ముట్టజెప్పింది. తీరా ఆ డబ్బు తీసుకుని విక్టర్ అక్కడినుంచి పారిపోయాడు. చివరకు టవర్‌ను అమ్మడం అబద్దమని తెలుసుకున్న ఆ సంస్థ మోసపోయామని గ్రహించింది. ఇలా ఓ సంస్థకు ఈఫిల్ టవర్‌నే అమ్మేసి, విక్టర్ నేరస్థుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. 58 ఏళ్లైనా దొరకని అణుబాంబు.. 1958 ఫిబ్రవరి 5న జార్జియాకు చెందిన ఓ యుద్ధ విమానం 7,000 పౌండ్ల బరువు కలిగిన అణుబాంబును మోసుకెళ్తోంది. అయితే విమానం ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తలెత్తింది. అణుబాంబుతో కూడిన విమానం నేలను ఢీకొంటే బాంబు పేలడం ఖాయం. అణుబాంబు పేలితే జరిగే నష్టం అంచనాలకందదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ అణుబాంబును ఓ నదీ తీరంలో జారవిడిచాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి పైలట్ బయపడ్డాడు. అయితే నదిలో పడ్డ అణుబాంబును కనుగొనేందుకు నేవీ అధికారులు చాలాకాలం పాటు వెతికారు. కానీ వారికి దాని జాడ దొరకలేదు. ఇప్పటికీ ఆ బాంబు కోసం ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అణుబాంబు అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి, దాన్ని కనుక్కొని, నిర్వీర్యం చేయాలని వారి ఆలోచన. ఆ బాంబు ఎక్కడ ఉన్నా, దానికి ఎలాంటి ఇబ్బందీ, తాకిడీ లేనంత వరకు అది పేలదని అధికారుల వాదన. ఏదేమైనా 58 ఏళ్లు గడిచినా, ఇంకా ఆ బాంబు పేలకుండా, దొరకకుండా నేవీ అధికారులను కలవరపెడుతోంది. చికాగో ఎత్తు పెరిగింది.. 1855లో చికాగో నగరం ఎప్పుడూ బురద నీటిలోనే ఉంటూ ఉండేది. కారణం ఈ నగరం నదీ తీరానికి దగ్గరగా ఉండడంతోపాటు డ్రైనేజీ, వరద నీటి పారుదల వ్యవస్థలు కూడా సరిగ్గా ఉండేవి కావు. దీంతో ప్రజలు టైఫాయిడ్ జ్వరం, కలరా వంటి పలు వ్యాధులతో సతమతమయ్యేవారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏవీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈ.చెస్బ్రో అనే ఇంజనీర్‌ను నియమించి, దీనికి పరిష్కారం కనుగొనమన్నారు. నగరానికి ఈ సమస్య తప్పాలంటే, భారీ వరద కాలువలు తవ్వాలని, ఇందుకోసం చికాగో నగరం ఎత్తు పెంచాలని అతడు సూచించాడు. అనేక చర్చల అనంతరం దీనికి అధికారులు అంగీకరించారు. అలా నగరంలోని వీధులు, ఫుట్‌పాత్‌లు, బిల్డింగుల ఎత్తు పెంచేందుకు పూనుకున్నారు. బిల్డింగుల పునాదుల ఎత్తు పెంచడం ద్వారా అవి ఎత్తులో నిలిచాయి. ఇలా నగరంలోని చాలా చోట్ల ఎత్తు పెరిగింది. దాదాపు 4-14 అడుగుల వరకు వీలున్న చోటల్లా నగరం ఎత్తు పెంచుతూ వచ్చారు. ఫలితంగా ఉపరితలం నుంచి డ్రైనేజీలు, కాలువల ఎత్తు పెరిగింది. నది కంటే నగరం ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల నీరు పల్లానికి చేరేది. అయితే ఈ తతంగం అంతా పూర్తి కావడానికి దాదాపు రెండు దశాబ్దాలకు పైగాపట్టింది. ఈ పనులు చేసే సమయంలో సాధారణ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకున్నారు. -
ఈఫిల్ టవర్‌కు తాజ్‌మహల్ స్వాగతం!
లండన్: పారిస్‌లోని ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్‌కు భారత్‌లోని చారిత్రక కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్, న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలు సాదర స్వాగతం పలికాయి! ఎక్కడని అనుకుంటున్నారా? ట్విట్టర్ అకౌంట్లో!! గతేవారమే ఈఫిల్ టవర్ పేరిట ట్విట్టర్లో అధికారక ఖాతాను ప్రారంభించారు. దీంతో ఇదివరకే ట్విట్టర్ అకౌంట్ ఉన్న తాజ్‌మహల్, స్టాచ్యూ లిబర్టీ, ఇతర ప్రసిద్ధ కట్టడాలు ఈఫిల్‌కు స్వాగతం పలికాయి! అందుకు ప్రతిగా ఈఫిల్ కృతజ్ఞతలు అంటూ బదులిచ్చింది. ఇప్పటికే పేస్‌బుక్‌లో ఈఫిల్‌కు ఖాతా ఉంది. అందులో 1.7 మిలియన్ల మంది ఈఫిల్‌ను ఫాలో అవుతున్నారు. -
'ఇప్పుడే ఏమైంది.. ఇంకా విధ్వంసం సృష్టిస్తాం'
-
'ఇప్పుడే ఏమైంది.. ఇంకా ఘోర విధ్వంసం సృష్టిస్తాం'
పారిస్: భవిష్యత్తులో పారిస్‌లో అత్యంత జుగుప్సకరమైన పరిస్థితులు కనిపించేలా దాడులు నిర్వహిస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ దాడులు మొన్న జరిగిన దాడికంటే భయంకరంగా ఉంటాయని హెచ్చరించింది. ఇందుకు ఓ ట్రయల్‌గా 'జీఐ జో: ది రైస్ ఆఫ్ కోబ్రా' అనే చిత్రంలోని ఓ వీడియో క్లిప్ ను ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రకారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈఫిల్ టవర్‌ను ఓ క్షిపణి బలంగా ఢీకొట్టడంతోపాటు చిన్న రొబోటిక్ డిస్ట్రాయర్స్ ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ టవర్ అందరు చూస్తుండగా నది మీదుగా కూలిపోతుంటుంది. ఈ వీడియో ద్వారా పారిస్ కు హెచ్చరికలు పంపించినట్లవుతుందని ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఈ వీడియోకు 'పారిస్ కుప్పకూలిపోయింది' అని పేరుపెట్టి మరీ విడుదల చేసింది. 2009 'జీఐ జో: ది రైస్ ఆఫ్ కోబ్రా' చిత్రం విడుదలైంది. నిజంగానే ఆ సినిమాలో ఈఫిల్ టవర్ కూలిపోయే సందర్భాన్ని చూస్తే ఒళ్లు ఎంత గగుర్పొడుస్తుందో తాము దాడులకు దిగినప్పుడు అలాంటి భయాందోళనలే కలుగుతాయని ఐఎస్ హెచ్చరించింది. -
ఏమీ లేకుండానే ఈఫిల్ టవర్ ఎక్కేశాడు..
ప్రముఖ అధిరోహకుడు కింగ్స్టన్ చేతిలో ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే ఈఫిల్ టవర్ ఎక్కేశాడు. 25 ఏళ్ల కింగ్స్టన్ రెండేళ్ల కిందే భారీ క్రేన్ అధిరోహించి ఆ వీడియోని ఆన్లైన్లో పెట్టడంతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత భారీ భవనాలు, భారీ క్రేన్లు, ఎత్తైన పరిశ్రమల గొట్టాలు ఎక్కి ప్రపంచంలోని ప్రముఖ అధిరోహకుల్లో ఒకడయ్యాడు. ఇప్పుడు ఈఫిల్ టవర్ ఎక్కుతూ తీసిన వీడియో కూడా ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఈఫిల్ టవర్ ఎక్కడం విశేషం. కింగ్స్టన్, అతని క్లైంబింగ్ సహాచరుడు మాట్లాడుతూ..'ముందుగా టికెట్లు కొనుక్కొని టవర్ ప్రవేశం ద్వారం వైపుగా మెట్ల వరుస నుంచి అధిరోహించాలనుకున్నాము. అయితే చాలా మంది ఉండటంతో అక్కడి నుంచి అధిరోహించడం అంత సులువు కాదని భావించాము. బయట నుంచే ఆ టవర్‌ని అధిరోహించాలని మేం ఇద్దరం నిర్ణయించుకున్నాము. రాత్రి సమయంలో మేం టవర్ అధిరోహించడం ప్రారంభించాం. సెక్కురిటీని తృటిలో తప్పించుకుంటూ నిదానంగా మా ప్రయాణం ప్రారంభమైంది. వాళ్లు ప్రెంచ్ ఆర్మీలా పెద్ద గన్లతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. మేం టవర్ ఎక్కే సమయంలో లెక్కలేనన్ని సీసీ టీవీలు మాకు కనిపించాయి. ఎప్పుడైతే 20 మీటర్లు పైకి ఎక్కామో ఇక ఈఫిల్ టవర్ ఎక్కగలం అనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత సూర్యోదయం సమయానికి టవర్ ఎక్కేశాము' అని తెలిపారు. అప్పటికే కింద ఉన్న భద్రతా అధికారులు వారిని గుర్తించడంతో వారిద్దరూ కిందికి దిగడంతోనే అరెస్ట్ చేశారు. వారిని ఆరు గంటల పాటూ విచారించిన అనంతరం.. మరోసారి ఈఫిల్ టవర్ అధిరోహించమని చెప్పడంతో వదిలేశారు. -
ఈఫిల్ వెలుగులు
-
ఈఫిల్ టవర్ ఎక్కిన తీవ్రవాది!
పారిస్: ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉన్న సుప్రసిద్ధ ఈఫిల్ టవర్ ను మూసివేశారు. అనుమానిత బ్యాగ్ తో తీవ్రవాది అందులోకి ప్రవేశించాడనే కారణంతో ఈఫిల్ టవర్ కు తాళాలు వేశారు. అంతకుముందు పర్యాటకులను బయటకు పంపించేశారు. టూరిస్టులను అప్రమత్తం చేసేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) అత్యవసర అలారం మోగించారు. యాంటి-టెర్రరిస్ట్ దళాలు హెలికాప్టర్ సహాయంతో గాలింపు చేపట్టాయని స్థానిక మీడియా తెలిపింది. అనుమానిత తీవ్రవాది పెద్ద బ్యాగుతో ఈఫిల్ టవర్ ఎక్కినట్టు వెల్లడించింది. ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈఫిల్ టవర్ ను సందర్శించేందుకు ప్రతిరోజు లక్షలాది టూరిస్టులు పారిస్ కు వస్తుంటారు. -
'లా పారిసిన్నే'లో మహిళల సందడి
-
‘చంద్రభంగ’పై వేలాడే వంతెన
పుణే : ప్రముఖ పుణ్యక్షేత్రం పండర్పూర్ వద్ద ఉన్న చంద్రభంగ నదిపై వేలాడే వంతెన (హ్యాంగింగ్ బిడ్జ్) నిర్మించనున్నట్లు పండర్పూర్ డవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) తెలిపింది. అలాగే నదికి మూడు కిలోమీటర్ల పరిధిలో ‘దర్శన్ బారీ కాంప్లెక్స్’ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. ‘షోలాపూర్ జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రం పండర్పూర్లోని విఠల్, రుక్మాయ్ దేవాలయాన్ని సందర్శించేందుకు ఏటా జూన్-జూలై మధ్య రాష్ర్టం నుంచే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ తీర్థయాత్ర సమయంలో ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తీర్థయాత్రను ‘వారి’ అంటా రు’ అని పండర్పూర్ సబ్ డివిజనల్ అధికారి సంజయ్ తేలి అన్నా రు. వంతెన నమూనాకు ఆమోదం తెలిపే ముందు రిషీకేష్‌లోని లక్ష్మణ్ ఝూలా, సియోల్‌లోని హన్ బ్రిడ్జి, మౌంట్ టిట్లిస్ సస్పెన్షన్ బ్రిడ్జి, ఈఫిల్ టఫర్ లిఫ్టులపై అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు. హ్యాంగింగ్ బ్రిడ్జి కోసం రూ.400-500 కోట్ల వరకు ఖర్చవనుందని వివరించారు. -
ఘనంగా బాసిల్లే దినోత్సవం
-
సంబర ‘చిత్రం’
టెక్యుగం ఒకవైపు ఆనందించాలి.. మరోవైపు ఆ ఆనందాన్ని క్యాప్చర్ చేయాలి. కళ్లతో కాదు, కెమెరాతో! స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఈ మానియా మరింత పెరిగింది. అందుకు సాక్ష్యం ఈ చిత్రం. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్‌టవర్ ముందు ‘కలర్ రన్' జరిగింది. ప్రతియేటా జరిగే ఈ ఉత్సవంలో రంగులు చల్లుకొంటూ కొన్ని వేల మంది ఐదు కిలోమీటర్ల దూరం పరిగెత్తుతారు. ఈసారి ఇలా వచ్చిన వారు చేతుల్లోని రంగులను చల్లుకోవడంతో పాటు అవే చేతులతోనే ఫోటోలు తీసుకోవడం కూడా కనిపించింది. సంబరాన్నంతా ఫోటోలుగా బంధించేయాలన్నంత ఉత్సాహం, తాపత్రయం వారిది! -
‘ఈఫిల్‌టవర్’ని అమ్మేశాడు...
కొనేవాళ్లుంటే... ఫ్రాన్స్‌లోని చిరప్రసిద్ధ చారిత్రక కట్టడం ఈఫిల్ టవర్. పారిస్ నగరం అంటే గుర్తొచ్చే ఒక ప్రపంచ వింత కూడా. అయితే మాత్రం నాకేంటి అనుకున్నాడు విక్టర్ లుస్టింగ్ అనే జగదేక మాయగాడు. దానిని అమ్మి పారేశాడు. ఒకసారి అమ్మితే ఏమంత ఘనత అనుకున్నాడేమో, ఏకంగా రెండుసార్లు అమ్మేశాడు. ఇతగాడు పారిస్- న్యూయార్క్ నగరాల మధ్య తరచు పర్యటించేవాడు. అందంగా కబుర్లు చెబుతూ జనాలను ఘరానాగా బురిడీ కొట్టించేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పారిస్ అప్పుడప్పుడే తేరుకుంటున్న సమయంలో లుస్టింగ్ కన్ను ఈఫిల్ టవర్‌పై పడింది. ఇంకేం! సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. తుక్కు సామాన్లు టోకుగా కొనే ఆరుగురు బడా వ్యాపారులను ఆహ్వానించి, ఒక బడా హోటల్లో ‘ఆంతరంగిక’ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. తనను తాను ప్రభుత్వాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఈఫిల్ టవర్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారిందని, నిర్వహించలేని తుక్కు సామానుగా అమ్మేయాలను కుంటోందని నమ్మబలికాడు. ప్రభుత్వ అధికారిననే అబద్ధాన్ని నిజం చేయడానికి టవర్‌కు ధర నిర్ణయంలో లాభం చేకూరుస్తానని ఒక వ్యాపారి నుంచి లంచం పుచ్చుకున్నాడు. ఆ ధరకే అమ్మేశాడు. ఇది జరిగిన నెల్లాళ్ల వ్యవధిలోనే మళ్లీ ప్యారిస్ వచ్చి, ఇదే పద్ధతిలో రెండోసారి కూడా ఈఫిల్ టవర్‌ను మరొకరికి అమ్మేశాడు. -
శ్రమ దోపిడీపై పోరాడుదాం..
- టఫ్ కో కన్వీనర్ విమలక్క జవహర్‌నగర్ : కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) కో కన్వీనర్ విమలక్క అన్నారు. బాలాజీనగర్‌లో శుక్రవారం రాత్రి ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ర్ట, ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకువచ్చేవరకు రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శ్రమదోపిడీకి గురవుతున్న కష్టజీవుల్ని ఐక్యం చేసి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాలతో పాలకులు ముందుకు వెళ్తున్నారని, ఫలితంగా ఉద్యోగ కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రాజ్ మాట్లాడుతూ.. కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కరువైందన్నారు. ఆకాశాన్నంటిన ధరలతో పేద ప్రజలు బతికేందుకు కష్టమైపోయిందన్నారు. కార్మికుల హక్కులకోసం ఏఐఎఫ్టీయూ పనిచేస్తోందని, పోరాటాలతోనే హక్కులను సాధించుకుంటామన్నారు. అనంతరం అరుణోదయ కళాకారుల బృందం ఆట పాటలతో హుషారెత్తించారు. కార్యక్రమంలో జవహర్‌నగర్ సర్పంచ్ గడ్డమీది మల్లేష్, టఫ్ రాష్ట్ర నాయకుడు హనుమాన్లు, ఏఐఎఫ్టీయూ జంటనగరాల ప్రధాన కార్యదర్శి శివబాబు, రాష్ట్ర నాయకుడు నాగేశ్వరావు, అసంఘటిత భవన నిర్మాణరంగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.మల్లేష్ , ఏఐఎఫ్టీయూ జవహర్‌నగర్ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు బిర్రు యాకస్వామి, డాక్టర్ రవి, చెన్నాపురం యాదయ్య, సత్యనారాయణ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
యానాం పోవాలా.. ఈఫిల్ చూడాలా...!
యానాం: విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్ చూడాలనుకుంటున్నారా... అయితే యానాం పదండి. ఈఫిల్ టవర్ ప్యారిస్ లో కదా ఉంది. యానాం ఎందుకు అంటారా. అచ్చుగుద్దినట్టు ఈఫిల్ టవర్ ను పోలిన కట్టడాన్ని యానాంలో నిర్మించారు. స్థానిక గిరియాంపేటలో నిర్మించిన ఈ కట్టడానికి ఒబిలిస్క్‌టవర్ (యానాం టవర్)గా నామకరణం చేశారు. 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ లో పలు ప్రత్యేకతలున్నాయి. కింది అంతస్థులో మీటింగ్ హాల్ ఉంది. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్ట్ లో వెళ్లొచ్చు. 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్, 26.5 మీటర్ల ఎత్తులో వీక్షణ మందిరం నిర్మించారు. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడేలా దీన్ని డిజైన్ చేశారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎ.అజయ్ కుమార్ సింగ్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. పర్యాటకులను ఒబిలిస్క్‌టవర్ విశేషంగా ఆకట్టుకోనుంది. మీరు చూడాలనుకుంటే యానాంకు పయనం కట్టండి. -
బైస్ట్రో చైర్ కంపెనీ నిర్మించిన బుల్లి ఈఫిల్ టవర్
విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్‌కు దీటుగా నిలిచిన ఈ టవర్ నిజానికి స్టీల్‌తో మాత్రం తయారుకాలేదు. బైస్ట్రో రకం కుర్చీలతో దీనిని తయారుచేశారు. ఫెర్మోబ్ అనే ఫర్నీచర్ తయారీ సంస్థ 125 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 324 మీటర్ల ఎత్తయిన ఈఫిల్ టవర్ ఎదురుగా 324 కుర్చీలతో దీన్ని ఇలా ఏర్పాటుచేశారు. ఈఫిల్ టవర్‌ను సైతం సరిగ్గా 125ఏళ్ల క్రితం ప్రారంభించారు.