
ఈఫిల్ టవర్‌కు తాజ్‌మహల్ స్వాగతం!
లండన్: పారిస్‌లోని ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్‌కు భారత్‌లోని చారిత్రక కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్, న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలు సాదర స్వాగతం పలికాయి! ఎక్కడని అనుకుంటున్నారా? ట్విట్టర్ అకౌంట్‌లో!! గతేవారమే ఈఫిల్ టవర్ పేరిట ట్విట్టర్‌లో అధికారక ఖాతాను ప్రారంభించారు.
దీంతో ఇదివరకే ట్విట్టర్ అకౌంట్ ఉన్న తాజ్‌మహల్, స్టాచ్యూ లిబర్టీ, ఇతర ప్రసిద్ధ కట్టడాలు ఈఫిల్‌కు స్వాగతం పలికాయి! అందుకు ప్రతిగా ఈఫిల్ కృతజ్ఞతలు అంటూ బదులిచ్చింది. ఇప్పటికే పేస్‌బుక్‌లో ఈఫిల్‌కు ఖాతా ఉంది. అందులో 1.7 మిలియన్ల మంది ఈఫిల్‌ను ఫాలో అవుతున్నారు.