
ఈఫిల్ టవర్ ఎక్కిన తీవ్రవాది!
పారిస్: ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉన్న సుప్రసిద్ధ ఈఫిల్ టవర్ ను మూసివేశారు. అనుమానిత బ్యాగ్ తో తీవ్రవాది అందులోకి ప్రవేశించాడనే కారణంతో ఈఫిల్ టవర్ కు తాళాలు వేశారు. అంతకుముందు పర్యాటకులను బయటకు పంపించేశారు. టూరిస్టులను అప్రమత్తం చేసేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) అత్యవసర అలారం మోగించారు.
యాంటి-టెర్రరిస్ట్ దళాలు హెలికాప్టర్ సహాయంతో గాలింపు చేపట్టాయని స్థానిక మీడియా తెలిపింది. అనుమానిత తీవ్రవాది పెద్ద బ్యాగుతో ఈఫిల్ టవర్ ఎక్కినట్టు వెల్లడించింది. ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈఫిల్ టవర్ ను సందర్శించేందుకు ప్రతిరోజు లక్షలాది టూరిస్టులు పారిస్ కు వస్తుంటారు.