
పారిస్: ఒలింపిక్ క్రీడల ముగింపు ముంగిట్లో ఆదివారం ఓ వ్యక్తి పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కడం కలకలం రేపింది. 330 మీటర్ల ఎత్తున్న టవర్‌పై అతను రెండో సెక్షన్ వద్ద ఉండగా సిబ్బంది గమనించారు. దాంతో పర్యాటకులను ఖాళీ చేయించారు. అతన్ని కిందికి దించి అరెస్ట్ చేశారు.
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు మరో వేదికను నిర్ణయించడం తెలిసిందే. వీటికోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.