Olympic Games
-
ఈఫిల్ టవర్‌పైకి ఆగంతకుడు
పారిస్: ఒలింపిక్ క్రీడల ముగింపు ముంగిట్లో ఆదివారం ఓ వ్యక్తి పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కడం కలకలం రేపింది. 330 మీటర్ల ఎత్తున్న టవర్‌పై అతను రెండో సెక్షన్ వద్ద ఉండగా సిబ్బంది గమనించారు. దాంతో పర్యాటకులను ఖాళీ చేయించారు. అతన్ని కిందికి దించి అరెస్ట్ చేశారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు మరో వేదికను నిర్ణయించడం తెలిసిందే. వీటికోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
Vivianne Robinson: ఒలింపిక్స్ ఇంటిపేరయింది
మనసు ఉంటే మార్గమే కాదు ‘మనీ’ కూడా ఉంటుంది. ‘అదెలా!’ అని ఆశ్చర్యపడితే... వివియానా రాబిన్సన్ గురించి తెలుసుకోవాల్సిందే. ‘ఒలింపిక్స్’ అనే మాట వినబడగానే ఆమె ఒళ్లు పులకించి΄ోతుంది. ప్రపంచ సంగ్రామ క్రీడను టీవీలో కాదు ప్రత్యక్షంగా చూడాలనేది ఆమె కల. అలా కల కని ఊరుకోలేదు. ఒక్కసారి కాదు ఏడుసార్లు ఒలింపిక్స్ వెళ్లింది... అలా అని ఆమె సంపన్నురాలేం కాదు. చాలా సామాన్యురాలు.ఒలింపిక్స్‌పై ఆసక్తి రాబిన్సన్కు 1984 ఒలింపిక్స్ సమయం లో మొదలైంది. ఆమె తల్లి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో అథ్లెట్లకు ట్రాన్స్‌లేటర్‌గా ఉండేది. తల్లి నోటినుంచి ఒలింపిక్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలు, విశేషాలు వినేది. ఆ ఆసక్తి రాబిన్సన్ను అట్లాంటా ఒలింపిక్స్‌కు వెళ్లేలా చేసింది.‘ఇప్పటిలా అప్పట్లో అథ్లెట్స్‌కు హైసెక్యూరిటీ ఉండేది కాదు. దీంతో ఎంతోమంది అథ్లెట్స్‌తో మాట్లాడే అవకాశం దొరికేది. కాని ఇప్పుడు సమీపంలోకి కూడా వెళ్లే పరిస్థితి లేదు’ అని ఆరోజులను గుర్తు చేసుకుంటుంది రాబిన్సన్.లాస్ ఏంజెల్స్, అట్లాంటా, సిడ్నీ, ఏథెన్స్, లండన్, రియో డి జెనీరోలతో పాటు తాజాగా ప్యారిస్ ఒలిపింక్స్‌కు కూడా వెళ్లింది.స్థలం కొనడానికో, ఇల్లు కొనడానికో, భవిష్యత్ అవసరాల కోసమో సాధారణంగా డబ్బు పొదుపు చేస్తారు. కాని రాబిన్సన్ మాత్రం ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డబ్బు పొదుపు చేస్తుంది. రోజుకు రెండు ఉద్యోగాలు చేసింది. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ కోసం కూడా ఎప్పటినుంచో పొదుపు మంత్రం పాటించింది.ఒలింపిక్ థీమ్డ్ ట్రాక్సూట్తో ప్యారిస్‌లో టూరిస్ట్‌లు, వాలెంటీర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది రాబిన్సన్. ఎంతోమంది ఆమెతో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు ఆమె పాపులర్ టిక్‌టాక్ వీడియోల గురించి మాట్లాడుతుంటారు.‘సాధారణ దుస్తుల్లో కంటే ఇలాంటి దుస్తుల్లో కనిపించడం వల్ల నాతో మాట్లాడటానికి ఉత్సాహం చూపుతారు’ అంటుంది తన ప్రత్యేక వేషధారణ గురించి చెబుతూ. ఒలింపిక్స్ పుణ్యమా అని ప్రఖ్యాత అథ్లెట్లతో పాటు టామ్ క్రూజ్, లేడీ గాగా లాంటి సెలబ్రిటీ ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది.ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత ఉండక΄ోవచ్చు. అయితే 66 సంవత్సరాల వయసులోనూ రాబిన్సన్ కు ఒలిపింక్స్పై ఆసక్తి తగ్గలేదు.‘డబ్బును పొదుపు చేస్తూ నేను బతికి ఉన్నంత వరకు ఒలింపిక్స్‌కు వెళుతూనే ఉంటాను’ అంటుంది మెరిసే కళ్లతో రాబిన్సన్. అయితే నెక్స్›్టఒలింపిక్స్ కోసం ఆర్థికరీత్యా రాబిన్సన్ అంతగా కష్టపడక్కర్లేదు. ఎందుకంటే తన హోమ్టౌన్ లాస్ ఏంజెల్స్‌లోనే అవి జరగనున్నాయి.వివియానా రాబిన్సన్ పేరుతో ఎంతోమంది ్రపొఫెసర్లు, రచయితలు, రకరకాల వృత్తుల వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఒలింపిక్స్’ అనేది రాబిన్సన్ ఇంటి పేరు అయింది. ఆటల ప్రేమికులు, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లకు వివియానా రాబిన్సన్ అనే కంటే ‘ఒలింపిక్స్ రాబిన్సన్’ అంటేనే సుపరిచితం.ఒలింపిక్స్ డైరీస్ఒక్కసారి ఒలింపిక్స్‌కు వెళ్లొస్తేనే ఆ అనుభవం ‘ఆహా ఓహో’ అనిపిస్తుంది. అలాంటిది ఏడుసార్లు వెళ్లడం అంటే అంతులేని అనుభూతి. అలాంటి అనుభూతిని సొంతం చేసుకుంది రాబిన్సన్. అథ్లెట్లకు లక్ష్యం మాత్రమే, వాలెంటీర్లకు వారు చేస్తున్న పని మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రేక్షకులుగా వెళ్లాలనుకునే వారికి మాత్రం 360 డిగ్రీల కోణంలో ఒలింపిక్స్ అనుభూతి సొంతం అవుతుంది. ఏడు ఒలింపిక్‌ల జ్ఞాపకాల సంపదను వృథా చేయవద్దు అంటున్నారు రాబిన్సన్ స్నేహితులు. సామాన్య ప్రేక్షకురాలిగా తాను చూసిన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన గ్రంథం అవుతుంది. డైరీలలో దాగి ఉన్న ఆమె ఒలింపిక్ అనుభవాలు ఏదో ఒకరోజు పుస్తకరూపం దాల్చుతాయని ఖాయంగా చెప్పవచ్చు. -
Tania Zeng: జెంగ్ సైరన్
‘కొన్ని విజయాలు కూడా పరాజయాలే. కొన్ని పరాజయాలు కూడా విజయాలే’ నిజమే! ఆటలోని పరాజితులు లోకం దృష్టిగా పెద్దగా రారు. అయితే టానియా జెంగ్ పరిస్థితి వేరు. ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణీ ప్రిలిమినరీ రౌండ్లోనే వైదొలగినా... ఆమె విజేతగానే వెలిగి΄ోయింది. దీనికి కారణం ఆమె వయసు. 58 సంవత్సరాల వయసులో తన ఒలింపిక్ కలను నిజం చేసుకున్న చైనీస్ – చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి టానియా జెంగ్ సంచలనం సృష్టించింది....తల్లి టేబుల్ టెన్నిస్ కోచ్ కావడంతో చిన్నప్పటి నుంచే ఆ ఆటపై జెంగ్‌కు ఆసక్తి ఏర్పడింది. బడిలో కంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కనిపించిందే ఎక్కువ. అక్కడ ఎంతోమందిప్రొఫెషనల్ ప్లేయర్స్‌తో మాట్లాడే అవకాశం దొరికింది.వారితో మాట్లాడడం అంటే... ఆటల పాఠాలు నేర్చుకోవడమే!తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి టేబుల్ టెన్నిస్‌లో జెంగ్‌కు తల్లి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. 11 ఏళ్ల వయసులో ఎలిట్ స్పోర్ట్స్ అకాడమీలో చేరింది జెంగ్. పన్నెండేళ్ల వయసులోప్రొఫెషనల్ ప్లేయర్ అయింది. నేషనల్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. పదహారు సంవత్సరాలకు చైనీస్ టేబుల్ టెన్నిస్ టీమ్‌లో చోటు సంపాదించింది. ప్రామిసింగ్ ప్లేయర్’గా పేరు తెచ్చుకుంది.‘అంతా ఓకే’ అనుకొని ఉంటే జెంగ్ ప్రయాణం మరోలా ఉండేది. అయితే ఆ సమయంలో టేబుల్ టెన్నిస్‌కు సంబంధించి నిబంధనలు ఏవో మార్చడం జెంగ్‌కు చిరాకు తెప్పించింది. ఆ చిరాకు కోపంగా మారి తనకు ్రపాణసమానమైన టేబుల్ టెన్నిస్‌కు దూరం అయింది.కొంత కాలం తరువాత...తనకు అందిన ఆహ్వానం మేరకు చిలీలో స్కూల్ పిల్లల టేబుల్ టెన్నిస్ కోచ్‌గా కొత్త ప్రయాణం ్రపారంభించింది. జియాంగ్ జెంగ్ పేరు కాస్తా టానియా జెంగ్గా మారింది. ‘జెంగ్’ తాను పుట్టిపెరిగిన చైనా అస్తిత్వం. ‘టానియ’ తనకు ఎంతో ఇష్టమైన, కొత్త జీవితాన్ని ఇచ్చిన చిలీ అస్తిత్వం.తన కుమారుడికి టేబుల్ టెన్నిస్‌లో కోచింగ్ ఇస్తున్న సమయంలో పోటీలలో పాల్గొనాలనే ఉత్సాహం జెంగ్లో మొదలైంది. 2004, 2005 నేషనల్ లెవల్ టోర్నమెంట్స్‌ను గెలుచుకుంది.టేబుల్ టెన్నిస్‌లో చూపించే అద్భుత ప్రతిభాపాటవాలతో చిలీ మీడియా ఎట్రాక్షన్‌గా మారింది జెంగ్. ఆమె ఆట ఆడే తీరు చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్‌కు ఎంతో ఇష్టం.ఎప్పటి నుంచో నేస్తంగా ఉన్న ‘విజయం’ ఒలింపిక్స్‌లో ముఖం చాటేసినా... జెంగ్ ముఖంలోని వెలుగు తగ్గలేదు. అదేపోరాట స్ఫూర్తి! కుమార్తెను ఒలింపిక్స్‌లో చూడాలనేది 92 సంవత్సరాల తండ్రి కల. ఆ కలను నిజం చేసి తండ్రి కళ్లలో వెలుగు నింపింది జెంగ్.‘గో ఎట్ ఇట్, గో విత్ ఎవ్రీ థింగ్’ అంబరాన్ని అంటే సంతోషంతో అంటున్నాడు ఆ పెద్దాయన.‘ఒలింపిక్ గ్రాండ్ మదర్’‘కమ్ బ్యాక్ క్వీన్’... ఇలా రకరకాల కాప్షన్లతో జెంగ్ గురించి సోషల్ మీడియాలో గొప్పగాపోస్టులు పెడుతున్నారు నెటిజనులు.‘ఒలింపిక్స్ అనేది నా జీవితకాల కల. క్వాలిఫై అవుతానని ఊహించలేదు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. విరివిగా ఆటలు ఆడాలనే ఉత్సాహం పెరిగింది’ అంటుంది టానియ జెంగ్.వివిధ ్రపాంతాలకు కుమారుడు ఒంటరిగాపోటీలకు వెళ్లే సమయానికి జెంగ్ టెన్నిస్ రాకెట్‌కు దూరం అయింది. సుదీర్ఘ విరామం తరువాత రీజినల్ టోర్నమెంట్స్ కోసం మళ్లీ రాకెట్ పట్టింది. మళ్లీ విజయపరంపర మొదలైంది. 2023 పాన్ అమెరికన్ గేమ్స్‌లో కాంస్యం గెలుచుకోవడంతో చిలీలో జెంగ్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. ఒలిపింక్స్ 2024కు క్వాలిఫై కావడంతో జెంగ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. -
Mann ki Baat: చీర్ఫర్ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న మన క్రీడాకారులను మరింత ఉత్సాహపరుద్దామని, వారిని ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత అథ్లెట్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఛీర్ ఫర్ భారత్ అని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం ఒలింపిక్స్ క్రీడల ద్వారా మన ఆటగాళ్లకు వచ్చిందన్నారు. వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం గణితశాస్త్రంలో ఒలింపిక్స్ జరిగాయని, నలుగురు భారతీయు విద్యార్థులు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారని ప్రశంసించారు. అస్సాంలోని అహోమ్ రాజుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడాల జాబితాలో స్థానం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది మనకు గర్వకారణమని అన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాల విష వలయంలో చిక్కుకుంటుండడం బాధాకరమని అన్నారు. అలాంటి వారిని బయటకు తీసుకురావడానికి ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి సంబంధించి ‘1933’ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలి ‘‘త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. మువ్వన్నెల జెండాతో సెల్ఫీ దిగి హర్గర్తిరంగా.కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఖాదీ, చేనేత వ్రస్తాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడినవారు ఇప్పుడు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తున్నారు. హరియాణాలోని రోహతక్‌లో 250 మంది మహిళలు బ్లాక్ పెయింటింగ్, డయింగ్ శిక్షణతో జీవితాలను తీర్చిదిద్దుకున్నారు’’ అని మోదీ ప్రశంసించారు.నల్లమల చెంచులు టైగర్ ట్రాకర్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారిని టైగర్ ట్రాకర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యపోతాం. టైగర్ ట్రాకర్స్‌గా వారు అడవిలో వన్యప్రాణుల సంచారంపై ప్రతి చిన్న సమాచారం సేకరిస్తారు. అటవీ ప్రాంతంలో అక్రమ కార్యక్రమాలపైనా నిఘా పెడతారు. టైగర్ ఫ్రెండ్స్‌గా వ్యవహరించే వీరు మానవులు, పులుల మధ్య ఎలాంటి వైరం లేకుండా చూస్తారు. చెంచుల కృషితో పులుల సంఖ్య పెరుగుతోంది’’ అని ‘మన్‌కీ బాత్’లో కొనియాడారు. దేశవ్యాప్తంగా పులుల జనాభా గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. ఇది మనకు చాలా గర్వకారణమని చెప్పారు.అభివృద్ధి, వారసత్వాలకు పెద్దపీటన్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా అవతరింపజేయడమే ఏకైక లక్ష్యంగా వికసిత్ భారత్ అజెండా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అయితే వికసిత్ భారత్ అజెండాలో ప్రాచీన, వారసత్వ కట్టడాలు, సంస్కృతులను కాపాడుకుంటూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ముఖ్యమంత్రి పరిషత్’ భేటీలో 13 మంది సీఎంలు, 15 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మాట్లాడారు. సమాజంలోని భిన్న వర్గాల్లో చిట్టచివరి వ్యక్తికి సైతం కేంద్ర పథకాలు, సుపరిపాలన గురించి తెలిసేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మోదీ సూచించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరలు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఎలా సమర్థంగా అమలు చేయాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ‘‘సంక్షేమ పథకాలు లబ్దిదారులందరికీ అందేలా చూడటం మీ తక్షణ కర్తవ్యం. బీజేపీపాలిత రాష్ట్రాలు సుపరిపాలనకు సిసలైన చిరునామాగా మారాలి’’ అని మోదీ అన్నారు. -
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా.. ఎక్కడ మొదలయ్యాయో తెలుసా?
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా క్రీస్తుపూర్వం 776లో నాటి గ్రీకు రాజ్యంలోని ఒలింపియా నగరంలో మొదలయ్యాయి. అప్పట్లో ఒకే ఒక్క పోటీ ఉండేది. అది పరుగు పందెం. ఇందులో పాల్గొనడానికి గ్రీకు రాజ్యంలో స్వతంత్ర పౌరులుగా పుట్టిన పురుషులు మాత్రమే అర్హులు. అప్పట్లో బానిసలకు, మహిళలకు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉండేది కాదు. నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడా పోటీలను నిర్వహించే పద్ధతి అప్పటి నుంచే ఉండేది.ఒలింపిక్ క్రీడలు మొదలైన తొలి రెండు శతాబ్దాల కాలంలో ఈ పోటీలు మత ప్రాధాన్యం గల ప్రాంతీయ పోటీలుగా మాత్రమే జరిగేవి. కాలక్రమంలో ఒలింపిక్ క్రీడలు గ్రీకు రాజ్యంలో జరిగే నాలుగు ప్రధాన క్రీడోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి.క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి ఒలింపిక్ క్రీడల వైభవం తగ్గుముఖం పట్టింది. రోమన్ చక్రవర్తి థియోడోసియస్ హయాంలో క్రీస్తుశకం 393లో చివరిసారిగా ఒలింపిక్ క్రీడలు జరిగినట్లు చరిత్రలో నమోదైంది. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు అదే పరిసమాప్తిగా భావించవచ్చు.గ్రీకు రాజ్యాన్ని రోమన్లు క్రీస్తుపూర్వం 146లో స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒలింపిక్స్ కొనసాగినా, ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. క్రీస్తుపూర్వం 86లో రోమన్ సేనాని సూలా ఒలింపియాను కొల్లగొట్టాడు. అక్కడ కొల్లగొట్టిన నిధులతో జరిపిన యుద్ధంలో విజయం సాధించి, క్రీస్తుపూర్వం 80లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాడు.రోమన్ చక్రవర్తి నీరో హయాంలో ఒలింపిక్ క్రీడలు అభాసుపాలయ్యాయి. పిచ్చిమారాజుల్లో ఒకడిగా పేరుమోసిన నీరో రథాల పందేల్లో తొండి ఆటలాడి తనను తానే విజేతగా ప్రకటించుకునేవాడు. తనను తాను మహా సంగీత విద్వాంసుడిగా భావించే నీరో చక్రవర్తి క్రీస్తుశకం 67లో తొలిసారిగా ఒలింపిక్స్‌లో గాత్ర, వాద్య సంగీత పోటీలను కూడా ప్రవేశపెట్టాడు.రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ హయాంలో ఒలింపిక్స్‌కు పునర్వైభవం వచ్చింది. అగస్టస్ సీజర్ ఆంతరంగికుడైన మార్కస్ అగ్రిపా ఒలింపియాలోని జూస్ ఆలయాన్ని పునరుద్ధరించి, క్రీస్తుపూర్వం 12లో ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించాడు.ఇవి చదవండి: యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ -
వసుధైక క్రీడోత్సవం: మరింత వేగంగా.. మరింత ఎత్తుకు.. మరింత బలంగా..
పారిస్ నగరం పగలు పెర్ఫ్యూమ్ బాటిల్లా, రాత్రి షాంపేన్ బాటిల్లా కనిపిస్తుందంటారు. ఇప్పుడు మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా ఒలింపిక్మయంగా మారిపోతోంది. ఫ్రెంచ్ వైన్‌ను మించిన స్పోర్ట్స్ మత్తులో నగరం మునిగిపోతోంది. 100 ఏళ్ల తర్వాత తమ ఇంట్లో జరగబోతున్న పండగతో సీన్ నదీ తీరమంతా క్రీడా సందడికి కేరాఫ్‌గా నిలుస్తోంది.రాబోయే కొన్ని రోజుల పాటు అక్కడ కలలు రెక్కలు విప్పుకుంటాయి. ఆశలు, అంచనాలు ఈఫిల్ టవర్‌ను తాకుతాయి. ఫ్యాషన్ స్ట్రీట్‌లో కూడా పతకాలు, పతాకాల గురించే చర్చ సాగుతుంది. గెలిచే మెడల్‌కు ఫ్రెంచ్ ముద్దుతోనే మురిపెం. ఒక్కసారి ఆడితే చాలు అదృష్టంగా భావించేవారు, ఒక్క పతకం గెలిస్తే చాలనుకునేవారు, కనకం కొడితే జన్మ ధన్యమైనట్లుగా సంబరపడేవారు, మళ్లీ మళ్లీ గెలిచి సగర్వంగా శిఖరాన నిలిచేవారు, అందరూ ఇక్కడే కలసిపోతారు. సంబరాలు, కన్నీళ్లు, ఆనందబాష్పాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కచోటే కనిపిస్తాయి.జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు క్రీడాకారుల గుండె లోతుల్లో పొంగే భావనను లెక్కకట్టేందుకు ఎలాంటి కొలమానాలు సరిపోవు. ఔను! సమస్త క్రీడా జాతిని ఏకం చేసే మెగా ఈవెంట్‌కు సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా ఆనందానుభూతి పంచేందుకు విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. ప్రఖ్యాత పారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్‌కు ఈనెల 26న తెర లేవనుంది.5 నగరాల నుంచి..2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేర్వేరు నగరాల నుంచి 2015 సెప్టెంబర్‌లోనే బిడ్లను ఆహ్వానించింది. ఒలింపిక్స్ ప్రణాళికలు, భిన్నమైన రీతిలో నిర్వహణ, వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, వేదికకు కావాల్సిన ఆర్థిక పుష్టి, గతానుభవం, ఆ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు తదితర అంశాలను దృష్టిలోకి తీసుకుంటూ బిడ్లను కోరారు. పారిస్ (ఫ్రాన్స్), లాస్ ఏంజెలిస్ (అమెరికా), బుడాపెస్ట్ (హంగరీ), హాంబర్గ్ (జర్మనీ), రోమ్ (ఇటలీ) నగరాలు తుది జాబితాలో నిలిచాయి. అయితే ఆర్థిక కారణాలతో మూడు నగరాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోమ్, హాంబర్గ్ నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా, ఎక్కువమంది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. బుడాపెస్ట్‌లో అయితే ఒలింపిక్స్ జరిగితే ఆర్థికంగా చితికిపోతామంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలు ‘నో ఒలింపిక్స్’ పేరుతో ఉద్యమమే నడిపించాయి. దాంతో చివరకు పారిస్, లాస్ ఏంజెలిస్ మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఐఏసీ 2024కే కాకుండా 2028 కోసం కూడా బిడ్‌ను ఖాయం చేసేందుకు సిద్ధమైంది. దాంతో లాస్ ఏంజెలిస్ వెనక్కి తగ్గి తాము 2028లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తామంటూ స్పష్టం చేయడంతో 2017 జూలైలో పారిస్‌కు గేమ్స్ ఖాయమయ్యాయి.రూ. 40 వేల కోట్లతో...పారిస్ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900 (రెండో ఒలింపిక్స్), 1924 (ఎనిమిదో ఒలింపిక్స్) కూడా ఇక్కడే జరిగాయి. ఒలింపిక్స్‌కు రెండుసార్లు నిర్వహించిన తొలి నగరంగా పారిస్ గుర్తింపు పొందింది. 2024 క్రీడల కోసం అక్షరాలా 4.38 బిలియన్ యూరోలు (సుమారు రూ. 40 వేల కోట్లు) కేటాయించారు. ఇదంతా 100 శాతం ప్రైవేట్ ఫండింగ్ కావడం విశేషం. ఇందులో టీవీ రైట్స్, టికెట్ల అమ్మకం, హాస్పిటాలిటీ, లైసెన్సింగ్, ఇతర భాగస్వామ్యపు ఒప్పందాలు కలసి ఉన్నాయి.ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి సహకారం లేకుండా ఈ ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే సహజంగానే ఒలింపిక్స్ నిర్వహణ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, క్రీడల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, స్టేడియాలు ఆ తర్వాత పనికి రాకుండా పోయి వృథాగా పడి ఉండటం గత కొన్ని ఒలింపిక్స్లుగా చూస్తూనే ఉన్నాం. దాంతో ఆర్థిక భారం అంశంపై ఈసారి బాగా చర్చ జరిగింది. అయితే పారిస్‌లో ఈసారి ఒలింపిక్స్ నిర్వహణ నష్టదాయకం కాదని, ఆర్థిక సమస్యలను తట్టుకోగలిగే శక్తి ఉందని పలు తాజా నివేదికలు వెల్లడించాయి.ముఖ్యంగా ఒలింపిక్స్ జరిగే సమయంలో పారిస్‌కు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల కారణంగా నగరానికి మంచి ఆదాయం రానుందనేది అంచనా. పారిస్ ప్రాంతానికి కనీసం 6.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 56 వేల కోట్లు) వరకు ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఎలా చూసినా ఒలింపిక్స్ నిర్వహణ లాభదాయకమే తప్ప నష్టం లేదని నిర్వహణా కమిటీ ఘంటాపథంగా చెబుతోంది.టార్చ్‌తో మొదలు..క్రీడల్లో ఒలింపిక్ జ్యోతికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఒలింపిక్ ఉద్యమానికి ఇది సూచిక. ప్రాచీన గ్రీకురాజ్యంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీనిని ఒలింపిక్స్ వరకు తీసుకొచ్చారు. ఏథెన్స్ సమీపంలోని ఒలింపియాలో సూర్యకిరణాల ద్వారా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం ప్రతి ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు జరిగే ప్రక్రియ. అక్కడ వెలిగిన జ్యోతితో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ద్వారా టార్చ్ రిలే కొనసాగుతుంది. శాంతి, స్నేహ సంబంధాల సందేశం ఇవ్వడం ఈ ఒలింపిక్ టార్చ్ ప్రధాన ఉద్దేశం.1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదటిసారి దీనిని వాడారు. తర్వాతి రోజుల్లో ఆతిథ్య దేశం ఆలోచనలు, వారి సంస్కృతికి అనుగుణంగా టార్చ్ల నమూనాలను రూపొందించడం సంప్రదాయంగా మారింది. క్రీడలు జరిగినన్ని రోజులు ఒలింపిక్ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మెగా ఈవెంట్ ముగిసిన తర్వాత దానిని ఆర్పేస్తారు. సాధారణంగా ఆయా దేశపు ప్రముఖ లేదా మాజీ క్రీడాకారులు ఒలింపిక్ టార్చ్ అందుకొని రిలేలో పాల్గొంటారు. పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి 10 వేల మంది టార్చ్ బేరర్లతో 400 నగరాల గుండా ఈ జ్యోతి ప్రయాణించింది.మస్కట్, లోగో..పారిస్ ఒలింపిక్స్ కోసం ‘ఫ్రీ జీ’ పేరుతో అధికారిక మస్కట్‌ను విడుదల చేశారు. ప్రాచీన ఫ్రెంచ్ సంప్రదాయ టోపీని ‘ఫ్రీజీ’గా వ్యవహరిస్తారు. ఆ దేశపు చరిత్ర ప్రకారం దీనిని ఒక టోపీగా మాత్రమే చూడరు. ఆ దేశపు స్వేచ్ఛకు సంకేతంగా భావిస్తారు. దీనికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం సమయంలో విప్లవకారులంతా ఇలాంటి టోపీలనే ధరించారు.ఫ్రాన్స్ దేశపు రోజువారీ వ్యవహారాల్లో ఈ ‘ఫ్రీజీ’ టోపీ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని రంగులైన ఎరుపు, నీలం, తెలుపు ఇందులో కనిపిస్తాయి. ఒలింపిక్స్‌కు సంబంధించిన డిజైనింగ్ టీమ్ దీనిని రూపొందించింది. ఒలింపిక్ జ్యోతిని బంగారపు రంగులో ప్రదర్శిస్తూ పారిస్ 2024 లోగోను తయారుచేశారు. ‘విడిగా మనం వేగంగా వెళ్లవచ్చు. కానీ కలసికట్టుగా మరింత ముందుకు పోవచ్చు’ అనేది ఈ ఒలింపిక్స్ మోటోగా నిర్ణయించారు.కొత్తగా ఆడుదాం..ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలను ప్రోత్సహించడం సంప్రదాయంగా వస్తోంది. అప్పటికే బాగా గుర్తింపు పొందిన ఆటలతో పాటు ఇలాంటి కొత్త క్రీడలు కొత్త తరం క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పనికొస్తాయని ఐఓసీ ఉద్దేశం. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలకు కొత్త క్రీడల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో కొత్తగా ఒక క్రీడాంశాన్ని ప్రవేశపెట్టారు.బ్రేకింగ్: 1970ల నుంచి అమెరికా సంస్కృతిలో భాగంగా ఉన్న డాన్స్‌లలో ఒక భాగం ఇది. సరిగ్గా చెప్పాలంటే మన దగ్గర సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన బ్రేక్ డాన్స్ రూపమిది. శారీరక కదలికలు, ఫుట్‌వర్క్‌లో స్టయిల్ తదితర అంశాలతో పాయింట్లు కేటాయిస్తారు. 1990 నుంచి ఇందులో పోటీలు జరుగుతున్నా ఒలింపిక్స్‌కు చేరేందుకు ఇంత సమయం పట్టింది. 2018 యూత్ ఒలింపిక్స్‌లో దీనికి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు ఒలింపిక్స్‌లో చేర్చారు.అమెరికాదే హవా... దీటుగా చైనా..1061 స్వర్ణాలు, 830 రజత పతకాలు, 738 కాంస్యాలు... మొత్తం 2629 పతకాలు... ఒలింపిక్స్ చరిత్రలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) అసాధారణ ఘనత ఇది. 1896లో తొలి ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా నాటి నుంచి ఇప్పటి వరకు తమ హవా కొనసాగిస్తూనే ఉంది. ఎన్నెన్నో అద్భుత ప్రదర్శనలు, ప్రపంచ రికార్డు ప్రదర్శనలు అన్నీ అలవోకగా అమెరికా ఆటగాళ్ల నుంచి వచ్చాయి.ముఖ్యంగా అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లోనైతే ఇతర దేశాల ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీ పడేందుకే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. ఇతర జట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడం అగ్ర రాజ్యానికే చెల్లింది. ఒలింపిక్స్‌లో నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి జట్లను ఒక ఆటాడుకోవడం అమెరికా ఆటగాళ్లకు అలవాటైన విద్య.ఎప్పుడో పుష్కరానికోసారి ఒక చిన్న సంచలనం, కాస్త ఏమరుపాటుతో కొన్నిసార్లు వెనుకబడినా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి మొత్తంగా అమెరికన్లకు తిరుగులేదు. అన్ని రకాలుగా క్రీడలకు ప్రోత్సాహం, సరైన వ్యవస్థ, ప్రొఫెషనల్ దృక్పథం, అభిమానుల మొదలు కార్పొరేట్ల వరకు అన్ని ఆటలకు అండగా నిలిచే తత్వం, సుదీర్ఘ కాలంగా క్రీడలు అక్కడి జీవితంలో ఒక భాగంగా మారిపోవడంవంటివి అమెరికా ముందంజకు ప్రధాన కారణాలు.మరోవైపు చైనా కూడా అమెరికాకు దాదాపు సమఉజ్జీగా నిలుస్తోంది. పతకాల్లో పోటీ పడుతూ రెండో స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్ ఓవరాల్ జాబితాలో 263 స్వర్ణాలు సహా 636 పతకాలతో చైనా ఐదో స్థానంలో కనిపిస్తోంది. అయితే 2004 ఒలింపిక్స్ వరకు చైనా ఖాతాలో పెద్దగా పతకాలు లేకపోవడమే ఐదో స్థానానికి కారణం.2008లో చైనా సొంతగడ్డ బీజింగ్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నాటి నుంచి ఆ దేశపు క్రీడా ముఖచిత్రమే మారిపోయింది. 2008–2020 మధ్య జరిగిన నాలుగు ఒలింపిక్ క్రీడల్లో చైనా 3 సార్లు రెండో స్థానంలో నిలిచి, ఒకసారి మూడో స్థానంతో ముగించింది. ఇది క్రీడా ప్రపంచంలో వచ్చిన మార్పునకు సంకేతం. కొత్త తరహా శిక్షణ, ప్రణాళికలతో 2008 కోసం ప్రత్యేక వ్యూహాలతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన చైనా ఆ తర్వాత తమ జోరును కొనసాగిస్తూ వచ్చింది. భిన్న క్రీడాంశాల్లో అమెరికాతో సై అంటే సై అంటూ పోటీ పడుతోంది.ఆధునిక ఒలింపిక్స్‌లో జేమ్స్ బ్రెండన్ బెనిట్ కొనలీ తొలి విజేతగా నిలిచాడు. అతడు ట్రిపుల్ జంప్‌లో ఈ విజయం సాధించాడు. హార్వర్డ్ విద్యార్థి అయిన కొనలీ సెలవు తీసుకుని ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అయితే, అనుమతి లేకుండా క్రీడా పోటీల్లో పాల్గొన్నందుకు హార్వర్డ్ వర్సిటీ అతడికి ఉద్వాసన పలికింది.తొలిసారిగా 1900లో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం లభించింది. ఆ ఒలింపిక్స్‌లో 22 మంది మహిళలు పాల్గొన్నారు. అప్పటికి ఇంకా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా రాలేదు. నానా పోరాటాల తర్వాత అమెరికాలో మహిళలకు 1920లో ఓటు హక్కు దక్కింది.ఆధునిక ఒలింపిక్స్‌లో 1896, 1900 సంవత్సరాల్లో పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత, కాంస్య పతకాలను మాత్రమే బహూకరించేవారు. అప్పట్లో మూడో బహుమతి ఉండేది కాదు. అయితే, 1904 నుంచి ప్రతి పోటీలోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను బహూకరించే ఆనవాయితీ మొదలైంది.ఒలింపిక్స్ సహా సమస్త క్రీడా కార్యక్రమాలను ఇప్పుడు టీవీల్లో చూడగలుగుతున్నాం. రోమ్‌లో 1960లో జరిగిన ఒలింపిక్స్ తొలిసారిగా టీవీలో ప్రసారమయ్యాయి. అప్పటి వరకు ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకోవడానికి పత్రికలే ఆధారంగా ఉండేవి.ఈఫిల్ టవర్ ఇనుముతో...ఒలింపిక్స్‌లో అన్నింటికంటే ఉద్వేగభరిత క్షణం విజేతలకు పతక ప్రదానం. ఏళ్ల శ్రమకు గుర్తింపుగా దక్కే స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో నిర్వాహకులు ప్రతిసారీ తమదైన ప్రత్యేకతను, భిన్నత్వాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా స్వర్ణపతకంలో బంగారం చాలా చాలా తక్కువ. ఇందులో 92.5 శాతం వెండిని వాడతారు. కేవలం 1.34 శాతమే బంగారం ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం కనీసం 6 గ్రాముల బంగారం ఇందులో ఉండాలి. రజత పతకంలో దాదాపు అంతా వెండి ఉంటుండగా, కంచు పతకంలో 95 శాతం రాగిని వాడతారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత ఉంది. తమ దేశంలో జరిగే ఒలింపిక్స్ పతకాలను భిన్నంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్వాహకులు కొత్తగా ఆలోచించారు.ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన అసలైన ఇనుమును పతకాల్లో చేర్చాలని నిర్ణయించారు. ఇన్నేళ్లలో ఈఫిల్ టవర్‌ను ఎన్నోసార్లు ఆధునికీకరించారు. ఈ క్రమంలో కొంత ఇనుమును పక్కన పెడుతూ వచ్చారు. ఇప్పుడు అందులోనుంచే చిన్న చిన్న ముక్కలను తాజా పతకాలలో చేర్చారు. గుండ్రటి పతకం మధ్య భాగంలో ఈ ఇనుమును పారిస్ 2024 లోగోతో కలిపి షడ్భుజాకారంలో ఉంచారు. ఎప్పటిలాగే వెనుక భాగంలో గ్రీకు విజయదేవత ఏథెనా నైకీ, ఆక్రోపొలిస్ భవనంతో పాటు మరో చివర ఈఫిల్ టవర్ కనిపిస్తుంది.10+9+16=35 ఒలింపిక్స్‌లో భారత పతకాల రికార్డు..1900లో జరిగిన రెండో ఒలింపిక్స్ (పారిస్)లో భారత్ తొలిసారి బరిలోకి దిగింది. వ్యక్తిగత విభాగంలో ఏకైక అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వేర్వేరు కారణాలతో తర్వాతి మూడు ఒలింపిక్స్‌కు భారత్ దూరంగా ఉండగా, 1920లో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లలో కలిపి ఐదుగురు క్రీడాకారులు బరిలోకి దిగగా, వ్యాపారవేత్త దొరాబ్జీ టాటా తదితరులు ఆర్థిక సహాయం అందించారు. అప్పటి నుంచి మన దేశం వరుసగా ప్రతీ ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చింది.ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీ అత్యధిక పతకాలు తెచ్చి పెట్టింది. జట్టు ఏకంగా 8 స్వర్ణాలు గెలిచింది. మన స్వర్ణయుగంగా సాగిన కాలంలో 1928–1956 మధ్య వరుసగా ఆరు స్వర్ణాలు సాధించిన టీమ్ 1960లో రజతం; 1968, 1972, 2020లలో కాంస్యం గెలుచుకుంది.1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో 2 రజతాలు సాధించాడు. ప్రిచర్డ్ జాతీయతపై కాస్త వివాదం ఉండటంతో అతను గెలుచుకున్న పతకాలు భారత్ ఖాతాలో వస్తాయా రావా అనేదానిపై చర్చ జరిగింది. అతను పాత బ్రిటిష్ కుటుంబానికి చెందిన వాడు కాబట్టి తమవాడే అనేది బ్రిటన్ చరిత్రకారుల వాదన.1900 ఒలింపిక్స్‌కు ముందు లండన్‌లో జరిగిన ఏఏఏ చాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శన ఆధారంగానే ఎంపికయ్యాడు కాబట్టి అతను ఇంగ్లిష్‌వాడే అనేది వారు చెప్పే మాట. అయితే ప్రిచర్డ్ కోల్‌కతాలో పుట్టడంతో పాటు సుదీర్ఘ కాలం భారత్‌లోనే గడిపాడు కాబట్టి భారతీయుడే అనేది మరో వాదన. అయితే 1900 క్రీడల్లో గ్రేట్ బ్రిటన్ టీమ్ కూడా బరిలోకి దిగింది. వారి తరఫున కాకుండా భారత్ తరఫున ఆడాడు కాబట్టి భారతీయుడే! చివరకు ఐఓసీ తమ పతకాల జాబితాలో ప్రిచర్డ్ రెండు రజతాలు భారత్ ఖాతాలోనే వేసి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.స్వతంత్ర భారతంలో తొలి పతకం 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ (రెజ్లింగ్) గెలుచుకున్నాడు. హాకీ కాకుండా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు...హాకీ 12..8 స్వర్ణాలు (1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్; 1948 లండన్; 1952 హెల్సింకీ, 1956 మెల్బోర్న్; 1964 టోక్యో, 1980 మాస్కో)1 రజతం (1960 రోమ్)3 కాంస్యాలు (1968 మెక్సికో, 1972 మ్యూనిక్, 2020 టోక్యో)షూటింగ్ 4..1 స్వర్ణం (అభినవ్ బింద్రా; 2008 బీజింగ్)2 రజతాలు (రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్; 2004 ఏథెన్స్... విజయ్‌కుమార్; 2012 లండన్), 1 కాంస్యం (గగన్ నారంగ్; 2012 లండన్)అథ్లెటిక్స్3..1 స్వర్ణం (నీరజ్ చోప్రా; 2020 టోక్యో)2 రజతాలు (నార్మన్ ప్రిచర్డ్; 1900 పారిస్)రెజ్లింగ్ 7..2 రజతాలు (సుశీల్ కుమార్; 2012 లండన్... రవి కుమార్ దహియా; 2020 టోక్యో)5 కాంస్యాలు (ఖాషాబా జాదవ్; 1952 హెల్సింకీ... సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్; 2012 లండన్... సాక్షి మలిక్; 2016 రియో... బజరంగ్ పూనియా; 2020 టోక్యో)బాక్సింగ్ 3..3 కాంస్యాలు (విజేందర్; 2008 బీజింగ్... మేరీ కోమ్; 2012 లండన్... లవ్లీనా బొర్గోహైన్; 2020 టోక్యో)బ్యాడ్మింటన్ 3..1 రజతం (పీవీ సింధు; 2016 రియో)2 కాంస్యాలు (సైనా నెహ్వాల్; 2012 లండన్, సింధు; 2020 టోక్యో)వెయిట్ లిఫ్టింగ్ 2..1 రజతం (మీరాబాయి చాను; 2020 టోక్యో)1 కాంస్యం (కరణం మల్లీశ్వరి; 2000 సిడ్నీ)టెన్నిస్ 1..1 కాంస్యం (లియాండర్ పేస్; 1996 అట్లాంటా)మనం ఎక్కడున్నాం?71, 71, 65, 50, 55, 67, 48... అట్లాంటాలో జరిగిన 1996 ఒలింపిక్స్ నుంచి టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్ వరకు పతకాల పట్టికలో భారత్ స్థానమిది. గత పోటీల్లోనైతే నీరజ్ చోప్రా ప్రదర్శనతో ఒక స్వర్ణపతకం చేరిన తర్వాత కూడా మనం 48వ స్థానానికే పరిమితమయ్యాం. అగ్రరాజ్యాల సంగతి సరే; చెక్ రిపబ్లిక్, క్రొయేషియా, స్లొవేనియా, ఉజ్బెకిస్తాన్, జార్జియా, ఉగాండా, ఈక్వెడార్, బహామాస్, కొసవో, బెలారస్ దేశాలు కూడా పతకాల పట్టికలో మనకంటే ముందు నిలిచాయి. ఈ ప్రదర్శన చూసి నిరాశ చెందాలో, లేక 1996కు ముందు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా లేకుండా సున్నా చుట్టి అసలు ఏ స్థానమూ సాధించని స్థితి నుంచి మెరుగయ్యామో అర్థం కాని పరిస్థితి.వ్యక్తిగత క్రీడాంశంలోనైతే 1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒక్క పతకమూ రాలేదంటే ఆటల్లో మన సత్తా ఏపాటిదో అర్థమవుతుంది. క్రికెట్లో విశ్వ విజేతలుగా నిలుస్తున్నా, ఇతర క్రీడాంశాలకు వచేసరికి భారత్ వెనుకబడిపోతూనే ఉంది. ఇక ఒలింపిక్స్ వచ్చే సమయానికి కాస్త హడావిడి పెరిగినా, చాలామంది క్రీడాకారులకు అది పాల్గొనాల్సిన లాంఛనమే తప్ప కచ్చితంగా పతకాలతో తిరిగి రాగలరనే నమ్మకం ఉండటం లేదు.అభిమానుల కోణంలో చూసినా సరే మెగా పోటీలు మొదలైన తొలిరోజు నుంచి పతకాల జాబితాలో మన వంతు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం అలవాటుగా మారిపోయింది. 1900 ఒలింపిక్స్‌లో ఒకే వ్యక్తిని పంపడం మినహాయిస్తే, 1920 నుంచి రెగ్యులర్‌గా మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు. అంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌తో భారత్ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలతో భారత్ మొత్తం 35 పతకాలు గెలుచుకోగలిగింది. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో పతకాలు గెలిచిన జట్ల జాబితాను చూస్తే భారత్ 56వ స్థానంలో ఉంది.ఒలింపిక్స్ సమయంలో మినహా...‘నా దృష్టిలో ఇది 1000 స్వర్ణాలతో సమానం. ఇంకా చెప్పాలంటే అది కూడా తక్కువే!’– 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్యం గెలిచినప్పుడు భారత స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇది. నిజానికి ఇది ఆ ప్లేయర్‌ను అభినందించినట్లుగా ఉంది. కానీ దేశమంతా అభిమానించే ఒక నటుడు ఈ విజయాన్ని అంత గొప్పగా చెబుతున్నాడంటే మనం ఎంత అల్పసంతోషులమో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు అప్పుడప్పుడూ సాధించే ఘనతలకు ఆకాశమంత గుర్తింపు దక్కుతుంది.ఆ సమయంలో సాగే హంగామా చూస్తే భారత్ ప్రపంచ క్రీడా వేదికపై అద్భుతాలు చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఒలింపిక్స్ సమయంలో మినహా మిగతా రోజుల్లో ఆయా క్రీడలపై చాలా మందికి కనీస ఆసక్తి కూడా ఉండదు. ఇలాంటి వాతావరణమే క్రికెటేతర క్రీడల్లో భారత్ ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తోంది. ఇటీవల భారత్ టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మహారాష్ట్రకు చెందిన నలుగురు ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు పురస్కారాన్ని అందించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ఎన్నో విజయాలు సాధిస్తున్న తనను కనీసం పట్టించుకోలేదని భారత బ్యాడ్మింటన్ ఆటగాడు చిరాగ్ శెట్టి బహిరంగంగానే విమర్శించడం చూస్తే ప్రభుత్వాల ప్రాధాన్యం ఏమిటో స్పష్టమవుతుంది.క్రీడా సంస్కృతి లేకపోవడం వల్లే...ఆటల్లోనూ అగ్రరాజ్యంగా నిలిచే అమెరికాలో క్రీడా మంత్రిత్వశాఖ అనేదే లేదు. క్రీడలకు ఒక మంత్రి కూడా లేడు. ఆశ్చర్యం అనిపించే వాస్తవమిది. క్రీడాకారులను తయారు చేయడంలో అక్కడి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. మరి ఇంత గొప్ప అథ్లెట్లు ఎక్కడి నుంచి, ఎలా పుట్టుకొస్తున్నారని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కొందరు పెద్ద పారిశ్రామికవేత్తలు ఆటలను ప్రోత్సహించేందుకు అండగా నిలుస్తున్నారు. వారికి కొన్ని పన్ను రాయితీలు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. అక్కడ స్కూల్స్, కాలేజీలు, స్థానిక పార్కుల్లోనే ఆటగాళ్లు తయారవుతారు. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించేవారిలో 80 శాతం మంది తమ నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) నుంచే వస్తారంటూ ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది.అమెరికాలో ప్రతి పార్కుకూ అనుబంధంగా తప్పనిసరిగా అథ్లెటిక్ ఫీల్డ్‌లు ఉంటాయి. మన దగ్గర అసలు ఇలాంటివి ఊహించగలమా? ఎక్కడో దూరం వరకు ఎందుకు, స్థానికంగా మన పాఠశాలల్లో చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో స్కూళ్లలో కనీసం గ్రౌండ్లు కూడా లేని పరిస్థితి ఉంది.భవిష్యత్తుపై నమ్మకం లేక...ఒలింపిక్స్‌లో సత్తా చాటి భారత్ తరఫున పతకం సాధించిన గుప్పెడు మందిని చూస్తే వారందరి విషయంలో ఒకే సారూప్యత కనిపిస్తుంది. దాదాపు అందరూ ఎన్నో ప్రతికూలతలను దాటి సొంతంగా పైకి ఎదిగినవారే! కెరీర్ ఆరంభంలో, వేర్వేరు వయో విభాగాలకు ఆడే దశల్లో ఎలాంటి సహకారం లభించలేకపోయినా, మొండిగా తమ ఆటను నమ్ముకొని వ్యక్తిగత ప్రతిభతో దూసుకొచ్చినవారే!వ్యవస్థ తయారు చేసిన క్రీడాకారుడు అంటూ ఒక్కరి గురించి కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మన దగ్గర అలాంటి అవకాశమే లేదు. గెలిచాక అభినందనలు, పోటీగా బహుమతులు, కనకవర్షం కురిపించడం సాధారణమే అయినా, అసలు సమయంలో అవసరం ఉన్నప్పుడు ఎవరూ వారిని పట్టించుకోలేదు. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఆదుకోలేదు. సరిగ్గా ఇదే అంశం తమ పిల్లలను క్రీడాకారులుగా మార్చడంలో సగటు భారతీయులను వెనక్కి నెడుతుంది.క్రీడల్లో సఫలమై ఏ స్థాయి వరకు చేరతారనే దానిపై ఎలాంటి గ్యారంటీ లేదు. కోచింగ్, ప్రాక్టీస్, ఎక్విప్మెంట్– ఇలా చాలా అంశాలు భారీ ఖర్చుతో ముడిపడి ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితాలు దక్కకపోవచ్చు కూడా. ఈ అనిశ్చితి వల్ల క్రీడలను కెరీర్‌గా చూడటం కష్టంగా మారిపోయింది. అందుకే దాదాపు అందరూ తమ పిల్లలు బాగా చదువుకుంటే చాలనే ఆలోచనతో దానిపైనే దృష్టి పెడుతున్నారు. మనవాళ్ల ప్రాధాన్యాల జాబితాలో క్రీడలు ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉంటాయి. ఎదుటివారి విజయాలకు చప్పట్లు కొట్టి అభినందించడమే తప్ప తమ పిల్లలను క్రీడల్లోకి పంపే సాహసం చేయడం లేదు. ఆటలు ఆడితే లాభం లేదనే సంస్కృతి మన జీవితాల్లో ‘ఖేలోగే కూదోగే తో హోంగే ఖరాబ్. పఢోగే లిఖోగే తో బనోగే నవాబ్’లాంటి మాటలతో నిండిపోయింది.సౌకర్యాలు కల్పించకుండా...‘మేం ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఎంత ఖర్చు చేశామో తెలుసా? అక్షరాలా 45 లక్షల పౌండ్లు’ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత బ్రిటిష్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్య ఇది. అంటే భారత కరెన్సీలో అప్పట్లోనే ఇది దాదాపు రూ. 38 కోట్లు. పతకమే లక్ష్యంగా ఆటగాళ్లకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి చేసిన క్రీడా సదుపాయాలు, డైట్, ఫిట్నెస్ వంటి అన్ని అంశాలూ ఇందులో కలసి ఉన్నాయి. అలా చూస్తే మన దేశంలో ఇలాంటిది సాధ్యమా? మన వద్ద గెలిచి వచ్చిన తర్వాత ఇంత మొత్తం ఆటగాళ్లకు ఇస్తారేమో గాని, గెలిచేందుకు కావాల్సిన వాతావరణాన్ని అందించే ప్రయత్నం మాత్రం చేయరు. భారతదేశ జనాభా దాదాపు 141.72 కోట్లు. ప్రపంచంలో మొదటి స్థానం.టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 7 మాత్రమే. దేశ జనాభా, గెలుచుకున్న పతకాలను లెక్క గట్టి సగటు చూస్తే అన్ని దేశాల్లోకి అత్యంత చెత్త ప్రదర్శన మనదే! నిజానికి జనాభాను బట్టి పతకాలు గెలుచుకోవాలనే లెక్క ఏమీ లేదు గాని, సహజంగానే ఇది చర్చనీయాంశం. చాలా తక్కువ మంది మాత్రమే ఆటల వైపు వెళ్లుతున్నారనేది వాస్తవం. వీరిలో అన్ని దశలను దాటి ఒలింపిక్స్ వరకు వెళ్లగలిగేవారు చాలా తక్కువ మంది మాత్రమే! 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం 126 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. మనం గెలుచుకున్న 7 పతకాలే ఇన్నేళ్లలో మన అత్యుత్తమ ప్రదర్శన. అమెరికా తరహాలో కార్పొరేట్లు పెద్ద ఎత్తున అండగా నిలవడం ఇక్కడ సాధ్యం కావడం లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచే క్రీడల అభివృద్ధికి తొలి అడుగు పడాలనేది వాస్తవం.మన పేలవ ప్రదర్శనకు కారణాలను ఎంచడం చూస్తే వాటికి పరిమితి ఉండదు. ఒలింపిక్స్ స్థాయికి తగిన స్టేడియాలు, కనీస సౌకర్యాలు లేకపోవడం, బడ్జెట్లో క్రీడలకు అతి తక్కువ నిధులు కేటాయించడం, ప్రాథమిక స్థాయిలో ఆటలపై అసలు దృష్టి పెట్టకపోవడం, పరిపాలనా వ్యవస్థలోని లోటుపాట్లు క్రీడలకు అడ్డంకులుగా మారుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఏదోలా అక్కడక్కడా పైకి దూసుకొచ్చినవారిపైనే ఒలింపిక్స్‌లో మన ఆశలన్నీ ఉంటున్నాయి. ఇప్పటికీ ఫలానా క్రీడాంశంలో మనం పూర్తి ఆధిక్యం కనబరుస్తాం అని నమ్మకంగా చెప్పలేని పరిస్థితిలోనే మనం ఉన్నాం. అందుకే ఒకటీ, రెండు, మూడు అంటూ వేళ్లపై లెక్కించగలిగే పతకాలు వస్తున్న ప్రతిసారీ మనం వాటికి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నాం.ఈసారి రాత మారేనా?ఒలింపిక్స్‌లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదంటూ సుదీర్ఘకాలంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెంటనే ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో ఎక్కువ మందిని ఆటల వైపు ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావించింది. ఈ క్రమంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014లో మొదటిసారి దీనిని తీసుకొచ్చినా, స్వల్ప మార్పులతో 2018లో ‘టాప్స్’ను అదనపు అంశాలు జోడించి రూపొందించారు.ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. అయితే దీనిని పూర్తి స్థాయిలో వ్యవస్థాగతంగా సౌకర్యాల కల్పన, మైదానాల ఏర్పాటువంటివాటితో చూడలేం. కానీ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చేందుకు ఇది పనికొస్తోంది. సన్నద్ధతలో భాగంగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి స్థానికంగా శిక్షణ, అవసరమైతే విదేశాల్లో కోచింగ్, ఎక్విప్మెంట్, విదేశాల్లో పోటీలకు హాజరయ్యేందుకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. వీటితో పాటు ఉద్యోగం లేని ప్లేయర్లకు ఊరటగా నెలకు రూ.50 వేల స్టైపెండ్ కూడా లభిస్తుంది.దీని వల్ల ప్లేయర్లు ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా, ఏకాగ్రత చెదరకుండా పూర్తి స్థాయిలో తమ ఆటపైనే దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల సమూలంగా మార్పులు రాకపోయినా...గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుపు పడినట్లే. ప్రస్తుతం టాప్స్ స్కీమ్ కోర్ గ్రూప్‌లో మొత్తం 172 మంది ఆటగాళ్లు ఉన్నారు. నిజానికి టోక్యో ఒలింపిక్స్‌కు ముందే కొందరు ఆటగాళ్లు టాప్స్ ద్వారా శిక్షణ పొందారు. కానీ అప్పటికి తగినంత సమయం లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు పారిస్ లక్ష్యంగా క్రీడాకారులు సన్నద్ధమయ్యారు. మరి ఈసారి మన పతకాల సంఖ్య పెరిగి రెండంకెలకు చేరుతుందా అనేది చూడాలి.రెండో ప్రపంచయుద్ధం వల్ల 1940, 1944 సంవత్సరాల్లో జరగాల్సిన ఒలింపిక్స్ రద్దయ్యాయి. నిజానికి 1940 ఒలింపిక్స్ టోక్యోలో జరగాల్సి ఉన్నా, జపాన్‌లో యుద్ధబీభత్సం కారణంగా ఆ ఏడాది ఒలింపిక్ వేదిక ఫిన్లండ్‌కు మారింది. అయినా, తర్వాత అది కూడా రద్దయింది. – మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ -
Olympics–2024: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో తొలి అడుగు..!
'ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భారత్ నుంచి టీమ్ ప్రాతినిధ్యం ఎన్నడూ లేదు. వ్యక్తిగత విభాగాల్లో మన ప్లేయర్లు బరిలోకి దిగినా ఏనాడూ పతకానికి చేరువగా రాలేదు. అయితే ఈతరంలో కొత్తగా దూసుకొచ్చిన టీటీ బృందం ఆశలు రేపుతోంది. ఇటీవల వరుస విజయాలతో భారత జట్టు పారిస్ ఒలింపిక్స్–2024కు అర్హత సాధించింది. సమష్టి ప్రదర్శనలతో మన ప్యాడ్లర్లు ఆకట్టుకున్నారు. అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లోనూ తొలిసారి భారత జట్టు.. టీమ్ ఈవెంట్స్ బరిలోకి దిగనుండటం విశేషం. దేశం తరఫున ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ పది మంది ప్లేయర్ల వివరాలను చూస్తే..' ఆచంట శరత్ కమల్: భారత టేబుల్ టెన్నిస్‌లో నిస్సందేహంగా ఆల్‌టైమ్ గ్రేట్. చెన్నైకి చెందిన 41 ఏళ్ల శరత్ కమల్‌కి ఏకంగా 10సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఘనత ఉంది. సుదీర్ఘ కాలంగా భారత టీటీకి దిక్సూచిలా, మార్గదర్శిలా ముందుండి నడిపిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలతో ప్రతిసారీ మన దేశ ఆశలు మోస్తున్న సీనియర్ ప్లేయర్. 2006 నుంచి 2022 మధ్య ఆరుసార్లు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శరత్ కమల్ 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. రెండు ఆసియా క్రీడల కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. 2004 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్: 31 ఏళ్ల సత్యన్ స్వస్థలం చెన్నై. నాలుగేళ్ల క్రితం ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరిన సత్యన్.. టాప్–25లోకి అడుగు పెట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున అతనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించిన సత్యన్ ఆసియా క్రీడల్లోనూ ఒక కాంస్యం అందుకున్నాడు. 2018లో అతనికి అర్జున అవార్డు దక్కింది. మానవ్ ఠక్కర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్–18 స్థాయి ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకోవడంతో మానవ్ ఠక్కర్‌కు తొలిసారి చెప్పుకోదగ్గ గుర్తింపు లభించింది. ఆ తర్వాత అండర్–21లోనూ అతను నంబర్‌వన్‌గా నిలిచాడు. 23 ఏళ్ల ఠక్కర్ స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో ఒక కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు సాధించాడు. శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ తర్వాత ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక టీటీ లీగ్ బుందేస్లిగాలో ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. భారత వర్ధమాన ఆటగాళ్లలో అందరికంటే ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఠక్కర్ ఒలింపిక్స్‌లో పతకం గెలవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. హర్మీత్ దేశాయ్: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హర్మీత్ దేశాయ్ కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యంతో పాటు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టులో హర్మీత్ సభ్యుడిగా ఉన్నాడు. 30 ఏళ్ల హర్మీత్ గుజరాత్ నుంచి జాతీయ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్రీడా పురస్కారం అర్జున అవార్డు అతని ఖాతాలో ఉంది. మనుష్ షా: 22 ఏళ్ల మనుష్ షా స్వస్థలం గుజరాత్‌లోని వడోదరా. రెండేళ్ల క్రితం సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించడంతో వెలుగులోకి వచ్చిన అతను అంతే వేగంగా దూసుకుపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి టాప్–100లోకి వచ్చిన పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు. 10 ఏళ్ల క్రికెటర్‌గా మారే ప్రయత్నంలో అతను సాధన కొనసాగించాడు. అయితే స్కూల్లో ఎత్తు నుంచి పడిపోవడంతో డాక్టర్ల సూచనతో అవుట్డోర్ ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అతను టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు భారత్ తరఫున టీమ్ ఈవెంట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. ఆకుల శ్రీజ: హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఆకుల శ్రీజ ఇప్పుడు భారత్ తరఫున అత్యంత విజయ వంతమైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. 2021 సీనియర్ నేషనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీజ తర్వాతి ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన కనబరచింది. 2022లో జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. 1964లో మీర్ ఖాసిం అలీ తర్వాత హైదరాబాద్ నుంచి టీటీలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన తొలి ప్లేయర్ శ్రీజ కావడం విశేషం. రెండేళ్ల క్రితం బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఆమె కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. చదువులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పని చేస్తోంది. ప్రస్తుతం భారత నంబర్‌వన్‌గా ఉన్న ఈ అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం శ్రీజ అర్జున అవార్డు కూడా గెలుచుకుంది. మనికా బత్రా: రెండేళ్ల క్రితం అర్చనా కామత్‌తో కలసి మనికా బత్రా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరింది. ఏ విభాగంలోనైనా ఇప్పటి వరకు భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలతో భారత టేబుల్ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం గెలుచుకున్న ఆమె ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఇంట్లో సోదర, సోదరీలను చూసి టీటీ వైపు ఆసక్తి పెంచుకున్న 28 ఏళ్ల మనికా ఇప్పుడు భారత జట్టులో కీలక సభ్యురాలు. అర్జున, ఖేల్‌రత్న అవార్డులను అందుకున్న ఈ ఢిల్లీ ప్లేయర్‌కు మున్ముందు మరిన్ని ఘనతలు సాధించగల సత్తా ఉంది. ఆటతో పాటు అందం ఉన్న మనికకు మంచి బ్రాండింగ్ సంస్థల నుంచి మోడలింగ్ అవకాశాలు వచ్చినా.. టీటీపైనే దృష్టి పెట్టేందుకు వాటన్నింటినీ తిరస్కరించింది. ఐహికా ముఖర్జీ: కోల్‌కతా శివార్లలోని నైహతి ఐహికా స్వస్థలం. గత ఏడాది ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జీతో కలసి ఐహికా సెమీఫైనల్‌కు చేరింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్న ఈ జోడి ఆసియా క్రీడల మహిళల డబుల్స్‌లో భారత్‌కు తొలిసారి పతకాన్ని అందించింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో చైనా దిగ్గజం సున్ యింగ్షాపై సాధించిన పలు విజయాలు ఐహిక ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే ఐహికకు అర్జున అవార్డు కూడా దక్కింది. దియా చిటాలే: ముంబైకి చెందిన 21 ఏళ్ల దియా చిటాలే జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలతో గుర్తింపులోకి వచ్చింది. అండర్–15 స్థాయి నుంచి వరుసగా కేడెట్, జూనియర్ స్థాయిలలో వేర్వేరు వయో విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. ఆటతో పాటు రెండేళ్ల క్రితం చెలరేగిన ఒక వివాదంతో దియా వార్తల్లో నిలిచింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో దియా కోర్టును ఆశ్రయించింది. తన ప్రదర్శన, రికార్డులతో ఆమె కోర్టులో పోరాడింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో దియాకు భారత జట్టులో స్థానం లభించడం విశేషం. అర్చనా కామత్: 23 ఏళ్ల అర్చనా కామత్ స్వస్థలం బెంగళూరు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 11 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ అండర్–12, అండర్–18 టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించింది. 14 ఏళ్లకే అండర్–21లో కూడా విజేతగా నిలవడంతో మరింత గుర్తింపు లభించింది. 2018లో తొలిసారి సీనియర్ నేషనల్స్ గెలిచిన తర్వాత ఆమె వేగంగా దూసుకుపోయింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు ముందుగా జట్టులో ఎంపికై ఆ తర్వాత దియా చిటాలేకు వచ్చిన అనుకూల కోర్టు తీర్పుతో చోటు కోల్పోయింది. అయితే తర్వాతి ఏడాది సీనియర్ జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో డబుల్స్‌లో కొంతకాలంగా టాప్–15లో కొనసాగుతోంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: PSL 2024: నిరాశపరిచిన బాబర్.. ఫైనల్‌కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు -
లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!
దుబాయ్: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లకు టాస్ పడే అవకాశాలు మెరుగయ్యాయి. 2028లో అమెరికాలో జరిగే ఈ విశ్వక్రీడల కోసం నిర్వాహకులు క్రికెట్ క్రీడను చేర్చేందుకు సిఫారసు చేశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హర్షం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహణ కోసం ఐసీసీ... లాస్ ఏంజెలిస్ నిర్వాహక కమిటీతో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి కమిటీ సిఫారసు చేయడంతో ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదమే మిగిలుంది. ఐఓసీ ఓకే అంటే అమెరికాలో క్రికెట్ ఆటకు రంగం సిద్ధమవుతుంది. ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలో జరిగే ఐఓసీ సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో క్రీడాంశంగా చేర్చాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. -
ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్.. స్పీడ్ అదిరిపోలే?
బీజింగ్: ఫిబ్రవరిలో జరగబోయే బీజింగ్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు ముఖ్య ప్రత్యేకత ఇందులో డ్రైవర్ లేకపోవడమే. కేవలం ఈ ఒలింపిక్స్ కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్ బుల్లెట్ రైలు గంటకు 217 మైళ్ల(350 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న ఎనిమిది క్యారేజీలలో 564 మంది ప్రయాణీకుల వెళ్లగలరు. చైనా రాజధాని బీజింగ్ - జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. ఇందులో 5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో ఉంది. దీని ద్వారా పాత్రికేయులు ప్రసారం చేయవచ్చు. బీజింగ్ డౌన్ టౌన్ జిల్లా నుంచి జాంగ్జియాకౌలోని ఒలింపిక్స్ గేమ్స్ జరిగే వేదికలకు ప్రయాణీకులను తరలించడానికి కేవలం 50 నిమిషాలు పడుతుందని ఆ దేశ క్సిన్హువా పత్రిక నివేదించింది. 2018లో ఈ రైల్వే నిర్మాణం ప్రారంభమైంది. కేవలం ఏడాది కాలంలోనే 2019లో ఈ మార్గాన్ని(బీజింగ్-జాంగ్జియాకౌ) పూర్తిచేసింది. The first train custom-made for the Beijing Winter Olympics set off on Thursday on the high-speed railway linking Beijing and Zhangjiakou, the co-host cities of the upcoming 2022 Winter Games. #GLOBALink pic.twitter.com/GYdzzdpwvG — China Xinhua News (@XHNews) January 6, 2022 (చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?) -
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!
దుబాయ్: అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మనం క్రికెట్‌ను కూడా చూడొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒలింపిక్స్‌లో జెంటిల్మెన్ గేమ్ కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. క్రికెట్‌ను చేర్చేందుకు బిడ్ దాఖలు చేయనుంది. ఇందుకోసం ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ‘విశ్వవ్యాప్తమైన మా క్రికెట్‌ను ఒలింపిక్ విశ్వక్రీడల్లోనూ చూడాలనుకుంటున్నాం. క్రికెట్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా అభిమానులున్నారు. ఇందులో 90 శాతం మంది క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలనుకుంటున్నారు’ అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే ఒక తెలిపారు. బర్మింగ్‌హాంలో జరిగే 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను చేర్చారు. కాగా ఈ క్రీడల్లో క్రికెట్ 1998లో ఒకసారి ఆడించిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఇయాన్ వాట్మోర్ నేతృత్వంలో ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ పనిచేస్తుంది. ఇందులో ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్ ఇంద్రనూయి, తవెంగ్వా ముకులని (జింబాబ్వే), మహీంద్ర వల్లిపురం (ఆసియా క్రికెట్ మం డలి), పరాగ్ మరాఠే (అమెరికా) సభ్యులుగా ఉన్నారు. నిజానికి ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చేందుకు బీసీసీఐ ఇన్నాళ్లు ససేమిరా అనడంతో అడుగు ముందుకు పడలేదు. ఒలింపిక్ సంఘం గొడుకు కిందికి వస్తే తమ స్వయం ప్రతిపత్తికి ఎక్కడ ఎసరు వస్తుందని బీసీసీఐ భావించింది. కానీ ఇటీవల బీసీసీఐ కార్య దర్శి జై షా సుముఖత వ్యక్తం చేయడంతో ఐసీసీ చకచకా పావులు కదుపుతోంది. చదవండి: టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన కివీస్.. ఇద్దరు సీనియర్లు ఔట్ -
శరణార్థుల జట్టు.. ఇది ప్రపంచ జట్టు
ప్రపంచంలోని అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. ఇక శరణార్థులకు క్రీడల్లోనూ అవే కష్టాలు. ఆటపై మమకారం చంపుకోలేక.. తమ సొంత దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేక ఎంతో వేదన చెందుతున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఓ గొప్ప ఆలోచన చేసింది. వారికి ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్లతో పోటీపడే అవకాశం ఇవ్వడం కోసం టోక్యో 2020 ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టును బరిలోకి దించుతోంది. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ పోటీలో మొట్టమొదటిసారిగా ‘‘శరణార్థుల జట్టు’’ పోటీ పడింది. ఈ జట్టులో ఇథియోపియా, దక్షిణ సూడాన్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ► గత ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు విజయవంతంగా పాల్గొనడంతో ఐఓసీ.. ఈసారి 29 మందితో కూడిన బలమైన జట్టుకు టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం కల్పించింది. ► 13 దేశాలకు చెందిన 55 మంది ప్రతిభావంతులైన అథ్లెట్ల నుంచి వీరిని ఎంపిక చేశారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, తైక్వాండో, కరాటె, జూడో, సైక్లింగ్, స్విమ్మింగ్.. తదితర క్రీడల్లో ఈ శరణార్థ అథ్లెట్లు పోటీపడతారు. ఇందులో రియోలో పోటీపడ్డవాళ్లు ఆరుగురు ఉన్నారు. ► ఆరంభోత్సవ కార్యక్రమంలో శరణార్థుల జట్టు.. గ్రీస్ తర్వాత రెండో జట్టుగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. ఒలింపిక్ పతాకం కింద పోటీపడే వీళ్లు ఒకవేళ పతకం గెలిస్తే.. పతక ప్రదాన కార్యక్రమం సందర్భంగా ఒలింపిక్ గీతాన్ని వినిపిస్తారు. ► ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే మిగతా 206 ఎన్ఓసిల మాదిరిగానే, ఈ బృందం ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండి అక్కడ స్వయంగా స్వాగత వేడుకను పొందుతుంది. టోక్యో 2020 ఒలింపిక్ క్రీడల తర్వాత కూడా శరణార్థుల అథ్లెట్లకు ఐఓసి మద్దతు ఇస్తుంది. ► ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, క్రొయేషియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, జోర్డాన్, కెన్యా, లక్సెంబర్గ్, పోర్చుగల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ట్రినిడాడ్, టొబాగో, టర్కీ, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ దేశాల నుంచి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కానోయింగ్, సైక్లింగ్, జూడో, కరాటే, టైక్వాండో, షూటింగ్, ఈత, వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ వంటి 12 క్రీడల్లో ‘‘శరణార్థుల జట్టు’’ క్రీడాకారులు పోటీపడనున్నారు. ‘‘శరణార్థుల ఒలింపిక్ జట్టు టోక్యో 2020 ఒలింపిక్స్‌లో పాల్గొనడమంటే.. శాంతిని ఉత్సవంలా జరుపుకోవడమే. ఇది శరణార్థుల సమస్యలపై ప్రపంచం దృష్టి మళ్లేలా చేస్తుంది. ఫలితంగా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరమవుతాయి’’ అని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో వ్యాఖ్యానించారు. -
టాప్–10లో నిలవాలి
న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో టాప్–10లో నిలుస్తుందనే నమ్మకముందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రానున్న కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో కొత్త చరిత్ర లిఖిస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మానసిక శక్తితో ఆటగాళ్లు కోవిడ్–19ను దీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను కోవింద్ స్మరించుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన ఆటగాళ్లను, కోచ్‌లను అభినందించారు. క్రీడాకారులంతా అద్వితీయ ప్రదర్శనలతో భారతీయులందరికీ మరపురాని మధుర స్మృతులను అందించారని కొనియాడారు. ‘వర్చువల్’గా అవార్డుల స్వీకరణ 44 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా కొత్త సంప్రదాయానికి తెర తీయాల్సి వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరగాల్సిన ఈ వేడుకలు సాంకేతిక హంగులతో ముందుకొచ్చాయి. వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో అలరించాయి. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్‌రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది ఈ ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా శనివారం 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు. ఖేల్‌రత్నకు ఎంపికైన మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు. భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ అవార్డు విజేతలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరో తీపి కబురు అందించింది. జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్‌రత్న పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది. దీనితో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... ఈ ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు. దీనిపై మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ ‘చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి. ప్రతీ పదేళ్లకోసారి ఈ మొత్తాన్ని సమీక్షించాల్సిన అవసరముంది. ప్రతీ రంగంలోని నిపుణుల సంపాదనలో ఏటికేడు వృద్ధి ఉంటున్నప్పుడు క్రీడాకారులకు ఎందుకు ఉండకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈసారి ఎక్కువ సంఖ్యలో అవార్డు విజేతలను ఎంపిక చేయడం పట్ల వస్తోన్న విమర్శలను ఆయన తప్పి కొట్టారు. ‘ప్రపంచ వేదికపై మన అథ్లెట్ల ప్రదర్శన గణనీయంగా మెరుగైంది. అందుకే వారి కృషికి గుర్తింపునిచ్చాం. అథ్లెట్ల ఘనతల్ని ప్రభుత్వం గుర్తించకపోతే వారిని నిరాశపర్చినట్లే. గత నిర్ణయాలతో తాజా వాటిని పోల్చకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
పతకధారి పేస్...
భారత బృందం ఎప్పుడు ఒలింపిక్స్‌కు వెళుతున్నా ఎవరిలోనూ పెద్దగా ఆశలు లేని రోజులవి... పతకాల సంగతి దేవుడెరుగు, మనవాళ్లు కనీసం పరువు నిలబెట్టుకునే ప్రదర్శన చేసినా గొప్పే అనిపించేది. 1980 మాస్కో ఒలింపిక్స్‌తోనే టీమ్ ఈవెంట్ హాకీ జోరు ముగిసింది. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో 5, 6, 7 స్థానాల్లో నిలవడంతో దానినీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక వ్యక్తిగత విభాగంలో విజయం అంటే సుదూర స్వప్నం. కానీ ఇలాంటి సమయంలో 23 ఏళ్ల కుర్రాడి సంచలన ప్రదర్శన ఒక్కసారిగా దేశంలో అమితానందం నింపింది. ఎవరూ ఊహించని విధంగా టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్యం సాధించి లియాండర్ పేస్ అద్భుతం చేసి చూపించాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అతను గెలుచుకున్న కంచు పతకం అందరి దృష్టిలో బంగారమైంది. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా అసమాన ఆటతీరు కనబర్చడం లియాండర్ పేస్‌లో కనిపించే ప్రత్యేక లక్షణం. ఆసియా క్రీడల్లో, డేవిస్కప్లాంటి పోటీల్లో అతని రికార్డులే చెబుతాయి. భారత్‌కు ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఎంత బలమైనవాడో, ఏ ర్యాంకులో ఉన్నాడో అతనికి కనిపించదు. తన అత్యుత్తమ ఆటతీరుతో చెలరేగిపోయే తత్వంతో పేస్ పలు సంచలన విజయాలు నమోదు చేశాడు. సరిగ్గా ఇదే శైలితో అతను ఒలింపిక్స్‌లో భారత జాతీయ పతకాన్ని ఎగురవేశాడు. సన్నాహాలు... లియాండర్ పేస్‌కు ఇది రెండో ఒలింపిక్స్. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అతను రమేశ్ కృష్ణన్‌తో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు కానీ పెద్దగా ఫలితం దక్కలేదు. దాంతో తర్వాతి ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అతను ఆ తర్వాత వెల్లడించాడు. 1996 ఒలింపిక్స్ కోసం నాలుగేళ్లు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు. ఇందుకోసం ప్రొఫెషనల్ టూర్లో కొన్ని టోర్నీలను వదిలేసుకున్నాడు. ఒలింపిక్స్ జరిగే అట్లాంటాలోని స్టోన్ మౌంటెయిన్ను పోలి ఉండే వాతావరణంలో (సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉంటుంది) జరిగే టోర్నీలలో, అదీ హార్డ్‌కోర్టు టోర్నీలలో మాత్రమే పాల్గొన్నాడు. ప్రతిభ ప్లస్ అదృష్టం... అయితే ఇంతగా శ్రమించినా ఒలింపిక్స్ ‘డ్రా’ చూడగానే అతనిలో ఉత్సాహం ఆవిరైంది. తొలి రౌండ్ ప్రత్యర్థిగా దిగ్గజ ఆటగాడు పీట్ సంప్రాస్ ఎదురయ్యాడు. దాంతో సహచరులు కూడా అయ్యో అంటూ ఓదార్చారు. కానీ అతని కష్టం వృథా పోలేదు. అనూహ్యంగా సంప్రాస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఊపిరి పీల్చుకొని వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పోయాడు. ఆ సమయంలో పేస్ ప్రపంచ ర్యాంక్ 126. కానీ అతని పట్టుదల ముందు ర్యాంక్‌లు పని చేయలేదు. వరుస రౌండ్లలో రికీ రెనెబర్గ్ (వరల్డ్ నంబర్ 20), నికోలాస్ పెరీరా (వరల్డ్ నంబర్ 74), థామస్ ఎన్క్విస్ట్ (వరల్డ్ నంబర్ 10), రెంజో ఫుర్లాన్ (వరల్డ్ నంబర్ 26)లను పడగొట్టి పేస్ ముందుకు దూసుకుపోయాడు. నాలుగు విజయాల తర్వాత లియాండర్ దిగ్విజయంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతనికి మరో సూపర్ స్టార్, అప్పటి ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆండ్రీ అగస్సీ ఎదురయ్యాడు. అయితే అప్పటికే ఆత్మవిశ్వాసంతో ఉన్న పేస్ బెదరలేదు. తొలి సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లగలిగాడు. అయితే చివరికు అగస్సీ ముందు 6–7 (5/7), 3–6తో తలవంచక తప్పలేదు. అసలు సమరం... సెమీస్ మ్యాచ్‌లోనే పేస్ కుడి మణికట్టుకు గాయమైంది. అది తగ్గకుండానే తర్వాతి రోజు కాంస్య పతకం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. బ్రెజిల్‌కు చెందిన వరల్డ్ 93వ ర్యాంకర్ ఫెర్నాండో మెలిగినీ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన సమరంలో గాయాలను పట్టించుకునే స్థితిలో అతను లేడు. నొప్పిని భరిస్తూనే మైదానంలోకి దిగాడు. ఆ రోజు పేస్ తన కోసం కాకుండా దేశం కోసం ఆడినట్లు కనిపించాడు. భారత జాతి యావత్తూ కూడా అన్నీ ఆపేసి అతని విజయం కోసం ఎదురుచూసింది. గెలుపు దక్కాలని కోరుకుంది. కానీ తొలి సెట్‌ను పేస్ 3–6తో కోల్పోయాడు. కోర్టు మొత్తం నిశ్శబ్దం. అదే సమయంలో వాన రావడంతో ఆట ఆగిపోయింది. అయితే ఒక్కసారి వర్షం వెలిశాక పేస్ కొత్తగా కనిపించాడు. రెండో సెట్లో 1–2తో వెనుకబడి 30–40తో మరో గేమ్ కోల్పోయే దశలో ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. అంతే... అతడిని ఆపడం మెలిగినీ వల్ల కాలేదు. వరుసగా రెండు సెట్లు పేస్ ఖాతాలో చేరాయి. చివరకు 3–6, 6–2, 6–4తో అద్భుత విజయం అందుకొని కన్నీళ్లపర్యంతమయ్యాడు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లర్ ఖాషాబా జాదవ్ తర్వాత వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన రెండో భారతీయుడిగా పేస్ నిలిచాడు. కోట్లాది భారతీయులు ఈ విజయం తామే సాధించినంతగా సంబరపడ్డారు. పేస్ తండ్రి వీస్ పేస్ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు. దాంతో ఒకే కుటుంబంలో రెండు ఒలింపిక్ పతకాలు చేరడం విశేషం. -
టోక్యో వాయిదా... మాకూ భారమే: ఐఓసీ
టోక్యో: ఈ ఏడాది ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)పై కూడా భారం పడుతుందని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ చెప్పారు. ఓ జర్మన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వాయిదా వల్ల మాకూ వందల కోట్ల నష్టం (వందల మిలియన్ డాలర్లు) వస్తుంది. ఇక మిగతాదంతా జపానే భరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ‘ఆతిథ్య ఓప్పందం’లో స్పష్టంగా తెలియజేశాం. జపాన్ ప్రధాని సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. అదనపు భారంలో సింహభాగాన్ని ఆతిథ్య దేశం భరించాల్సిందేనని నియమ నిబంధనల్లో ఉంది. కొంత నష్టాన్ని ఐఓసీ భరిస్తుంది’ అని అన్నారు. తాజా అంచనాల ప్రకారం 2 నుంచి 6 బిలియన్ డాలర్లు (రూ.15 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లు) వరకు ఈ భారం ఉంటుంది. అంటే మొత్తం నిర్వహ ణకు అయ్యే వ్యయంలో ఇంచు మించు సగమన్నమాట! ఇప్పటి వరకు జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న టోక్యో ఈవెంట్ కోసం రూ. 92 వేల కోట్లు (12.6 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. అయితే ఇటీవల టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ తోషిరో ముటో వచ్చే ఏడాది కూడా జరిగేది సందేహాస్పదమేనన్నారు. ‘అప్పటికల్లా మహమ్మారి అదుపులోకి వస్తుందని ఎవరైనా చెప్పగలరా’ అని అన్నారు. దీనిపై బాచ్ మాట్లాడుతూ స్పష్టమైన జవాబు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని... అయితే మరో వాయిదాకు అవకాశమైతే లేదని జపాన్ వర్గాలు చెప్పినట్లు వెల్లడించారు. -
వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది
న్యూఢిల్లీ: శిష్యులు గొప్ప విజయాలు సాధించిన ప్పుడు తెగ సంబరపడిపోడు! అలాగే విమర్శలొచ్చినా పట్టించుకోడు! ఎప్పుడైనా సరే తన పని తను చూసుకొనే మనస్తత్వం పుల్లెల గోపీచంద్‌ది. అలాంటి గోపీ అప్పుడెప్పుడో సైనా నెహ్వాల్‌తో వచ్చిన మనస్పర్థలపై తాజాగా స్పందించాడు. త్వరలో విడుదల కానున్న ‘డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్: ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్’ అనే పుస్తకంలో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్... దిగ్గజ బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ ప్రకాశ్ పదుకొనేపై కూడా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు. ‘నా అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం నాకిష్టం లేదు. నా ప్రియమైన శిష్యురాలు నా నుంచి దూరమవుతోందనిపించింది. అందుకే ఆమెను అకాడమీ నుంచి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాను. కానీ ఆమె అప్పటికే ఇతరుల మాటల్ని చెవికెక్కించుకుంది. నా మాట వినలేదు. ఆమె ఆట ప్రగతి కోసం తపించినప్పటికీ నా అకాడమీలోనే ఉండే విధంగా ఒప్పించలేకపోయాను. అది మా ఇద్దరికి మంచిది కాదని తెలుసు. కానీ ఏం చేస్తాం. ఓ కోచ్‌గా సింధు ప్రదర్శనపై కూడా నమ్మకంతో ఉన్నాను. ఇది నిజమే. ఆమెకూ శిక్షణ ఇచ్చాను. అయితే అదే సమయం (2012–2014)లో సైనాకిచ్చే శిక్షణలో, ప్రాధాన్యంలో నిర్లక్ష్యమేమీ చూపలేదు. అయితే ఈ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో’ అని అప్పటి గతాన్ని ఆ పుస్తకంలోని ‘బిట్టర్ రైవలరీ’ అనే అధ్యాయంలో క్లుప్తంగా వివరించాడు గోపీచంద్. ఈ విషయంలో ఒలింపిక్స్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్, వీరేన్ రస్కినాలెవరూ చొరవ చూపించలేదని, తన శిక్షణలోనే ఆమెకు మంచి జరుగుతుందని వాళ్లెవరూ ఆమెతో చెప్పలేపోయారని గోపీచంద్ అన్నాడు. ‘వీళ్లంతా సైనాతో మాట్లాడి ఒప్పించవచ్చు. కానీ వాళ్లెందుకు అలా చేయలేదో తెలియదు. పైగా హైదరాబాద్ వీడేందుకు ఆమెను ప్రోత్సాహించారు కూడా! నా రోల్ మోడల్ అయిన ప్రకాశ్ సర్‌ను ఎంతగానో అభిమానిస్తాను. కానీ ఆయన మాత్రం బ్యాడ్మింటన్‌కు ఇంతచేసినా నా సేవల గురించి ఎక్కడా, ఎప్పుడూ ఒక్క మంచి మాటగానీ చెప్పలేదు. ప్రశంసలుగానీ కురిపించలేదు. ఇది నాకు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే’ అని గోపీచంద్ తెలిపాడు. ప్రముఖ క్రీడా పాత్రికేయులు బొరియా మజుందార్, నళిన్ మెహతా రచించిన ఈ పుస్తకం ఈనెల 20న విడుదలవుతుంది. ఈ పుస్తకంలో సైనా భర్త, షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. ‘గోపీచంద్ తనకు మాత్రమే కోచ్‌గా ఉండాలని సైనా భావించింది. అయితే ఒక్కసారిగా సింధు మంచి ఫలితాలు సాధించడంతో గోపీచంద్ కేవలం సైనాపైనే దృష్టి పెట్టకుండా ఇతరులకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అయితే ఈ అంశాన్ని సైనా పాజిటివ్‌గా తీసుకోకుండా నెగెటివ్‌గా తీసుకుంది. నా వంతుగా సైనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె నా మాటలు పట్టించుకోలేదు. 2016 రియో ఒలింపిక్స్‌లో సైనా గాయంతోనే ఆడింది. లీగ్ దశలోనే వెనుదిరిగింది. నిజంగా సైనాకు అది గడ్డుపరిస్థితి. గోపీ అకాడమీ నుంచి నిష్క్రమించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ హరియాణా వాసి ఎలా ప్రవర్తిస్తుందో అలాగే చేసింది. వాళ్లంతే! తాము అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. దాన్నే తలదాకా ఎక్కించుకుంటారు. ఆ గర్వమే సైనాకు నష్టం కలిగించింది’ అని చెప్పుకొచ్చాడు. 2014 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు కాంస్యం సాధించడం... సైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత గోపీచంద్ అకాడమీ వీడాలని సైనా నిర్ణయించుకొని బెంగళూరులో విమల్ కుమార్ వద్ద శిక్షణకు వెళ్లిపోయింది. రెండేళ్లపాటు విమల్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించడంతోపాటు మూడు టైటిల్స్‌ను గెలిచింది. 2015 ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రన్నరప్‌గా నిలిచింది. అయితే 2016లో గాయాల బారిన పడ్డ ఆమె పూర్తి ఫిట్నెస్ లేకుండానే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంది. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. గాయాలు తిరగబెట్టడం... ఆటతీరు గాడి తప్పడం... బెంగళూరులో తనకు స్నేహితులు లేకపోవడంతో సైనాకు ఏమి చేయాలో తోచలేదు. సన్నిహితులతో చర్చించి, కెరీర్ గాడిలో పడాలంటే ఏం చేయాలో ఆలోచించి 2017 ప్రపంచ చాంపియన్ప్ ముగిశాక గోపీచంద్ గూటికే మళ్లీ చేరాలని సైనా నిర్ణయం తీసుకుంది. -
భారత్ డబుల్ ధమాకా
టోక్యో: జపాన్ గడ్డపై భారత పురుషుల, మహిళల హాకీ జట్లు గర్జించాయి. ఒలింపిక్ టెస్టు ఈవెంట్లో భారత జట్లే విజేతలుగా నిలిచాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు కొత్తగా నిర్మించిన స్టేడియాలని ప్రాక్టికల్‌గా పరిశీలించేందుకు ఈ టోర్నీలను నిర్వహిస్తారు. ఇందులో పురుషుల జట్టయితే లీగ్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 5–0తో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ ని.), షంషీర్ సింగ్ (18వ ని.), నీలకంఠ శర్మ (22వ ని.), గుర్సాహిబ్జిత్ సింగ్ (26వ ని.), మన్దీప్ సింగ్ (27వ ని.) తలా ఒక గోల్‌తో భారత్‌కు ఎదురులేని విజయాన్ని అందించారు. మహిళల జట్టు జపాన్‌పై... భారత మహిళల జట్టు ఆతిథ్య జట్టును 2–1తో ఓడించి టైటిల్ గెలుచుకుంది. భారత్ తరఫున నవజ్యోత్ కౌర్ (11వ ని.), లాల్రెమ్సియామి (33వ ని.) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున మినామి (12వ ని.) ఏకైక గోల్ సాధించింది. -
భారత హాకీ జట్ల జోరు
టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు నిర్మించిన స్టేడియంలో టెస్ట్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఇందులో భారత హాకీ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన పోరులో పురుషుల జట్టు ఏకంగా అరడజను గోల్స్‌తో హోరెత్తించింది. దీంతో భారత్ 6–3 గోల్స్‌తో ఆతిథ్య జపాన్ను కంగుతినిపించి ఫైనల్ బెర్తు కొట్టేసింది. స్ట్రయికర్ మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగాడు. మన్దీప్ 9, 29, 30 నిమిషాల్లో మూడు గోల్స్ చేశాడు. మిగతా వారిలో నీలకంఠ శర్మ (3వ ని.), నీలమ్ సంజీప్ (7వ ని.), గుర్జంత్ సింగ్ (41వ ని.) తలా ఒక గోల్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది. ‘డ్రా’తో ఫైనల్‌కు... భారత మహిళల జట్టు చైనాతో ‘డ్రా’ చేసుకొని ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ అయినా నమోదు కాలేదు. ఈ ఫలితంతో భారత మహిళల జట్టు పాయింట్ల పట్టికలో 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో ఆతిథ్య జపాన్‌తో తలపడుతుంది. -
ఒలింపిక్స్ అవకాశాలు గల్లంతు!
మాండలే : ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మూడో దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు విఫలమైంది. మంగళవారం మయన్మార్‌తో జరిగిన ఈ మ్యాచ్ 3–3తో డ్రాగా ముగిసింది. ఫలితంగా టోర్నీనుంచి నిష్క్రమించిన జట్టు ఒలింపిక్స్ అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోయింది. గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిస్తే భారత్ ముందంజ వేసేది. ఈ గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 7 పాయింట్లతో భారత్, మయన్మార్ సమంగా ఉన్నా గోల్స్ తేడాతో (4–8) మయన్మార్ అగ్రస్థానం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సంధ్య రంగనాథన్ (10వ నిమిషం), సంజు (32వ ని.), రత్నబాల దేవి (64వ ని.) గోల్స్ సాధించగా... మయన్మార్ తరఫున విన్ టున్ హ్యాట్రిక్ (17వ ని., 21వ ని., 72వ ని.) గోల్స్ కొట్టింది. మ్యాచ్ 76వ నిమిషంలో చెలరేగిపోయిన సంజు గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా... మయన్మార్ గోల్ కీపర్ మే వే అద్భుతంగా అడ్డుకుంది. -
అమరావతిలో ఒలింపిక్ క్రీడలు?
ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు ముంబై స్టాక్ ఎక్సే్చంజ్‌లో అమరావతి బాండ్ల క్రయవిక్రయాలను ప్రారంభించడానికి వెళ్లి అక్కడ ముంబై స్టాక్ ఎక్సే్చంజ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో భాగంగా, భారత్‌లో ఇంతవరకు ఒలిం పిక్ క్రీడలు నిర్వహించలేదని ఈ క్రీడలు అమరావతి నగరంలో నిర్వహించడానికి సిద్ధమని పేర్కొన్నారు. భారతదేశంలో ఇంతవరకు ఒలింపిక్ క్రీడలు నిర్వహించకపోవడం మనమందరం ఆలోచించాల్సిన విషయం. అయితే ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన వివిధ దేశాల అనుభవాలను పరిశీలిస్తే మనం ఈనాడు దేశానికి లాభసాటి అయ్యేవిధంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించుకునే పరిస్థితి ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది. గత నాలుగు ఒలిం పిక్ క్రీడలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిర్వహించారు. అవి గ్రీసు, చైనా, లండన్, బ్రెజిల్. వీటిలో ఇంగ్లండ్‌ను అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. చైనా ప్రపంచంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న దేశం. గ్రీసు దేశం ఒలింపిక్ క్రీడలు నిర్వహించక ముందు కూడా అభివృద్ధి చెందిన దేశమే. ఎటొచ్చీ ఒలింపిక్ క్రీడల అనంతరం ఆ దేశానికి సమస్యలు మొదలైనాయి. బ్రెజిల్ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక ప్రముఖ దేశం. అవినీతి, ఆర్థిక అసమానతలు ఈ దేశంలో కూడా మనకు కనిపిస్తాయి. ఈ నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రభావాన్ని పరిశీలించే ముందు ఒలింపిక్ క్రీడల నిర్వహణకు అయ్యే ఖర్చు ఒకసారి చూద్దాం. ఒలింపిక్ నిర్వహణ ఖర్చులు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. గ్రీసు దేశం ఖర్చు 65 వేల కోట్లుగా అంచనా వేసింది. అదే చైనా దేశంలో ఈ ఖర్చులు 3 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇంగ్లండ్ దేశం లక్ష కోట్ల రూపాయలు ఒలింపిక్ ఖర్చులుగా పరిగణించింది. బ్రెజిల్ దేశంలో ఖర్చు అన్ని మౌలిక సదుపాయాలను లెక్కలోకి తీసుకుంటే లక్షా 40 వేల కోట్లుగా లెక్కవేశారు. కనీస ఖర్చు ఇంగ్లండ్‌లో లాగానే లక్ష కోట్ల రూపాయలు. కాగా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లక్షా 30 వేల కోట్ల రూపాయలు. ఇది ఒలిం పిక్ నిర్మాణ ఖర్చుకు సమానంగా ఉంది. 25 లక్షల కోట్ల భారతదేశ బడ్జెట్లో 4% ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి కావాల్సి ఉంటుంది. ఇకపై నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒలిం పిక్ క్రీడలు ఏవిధంగా ప్రభావితం చేశాయో పరిశీ లిద్దాం. ఇంగ్లండ్, చైనా దేశాల్లో ఒలింపిక్ క్రీడల నిర్వహణ ఆ దేశ ఆర్థిక వ్యవస్థలు మరింత పుంజుకోవటానికి దోహదం చేశాయి. రెండు దేశాల్లోనూ క్రీడలు అయిన తర్వాత ఆ సదుపాయాలను ఎట్లా వినియోగించాలని ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి సదుపాయాలు నిరర్థకంగా ఉండిపోలేదు. ఉదాహరణకు ఇంగ్లండ్ దేశంలో ఒలింపిక్స్ కోసం నిర్మించిన ప్రధాన క్రీడా స్థలాన్ని ఫుట్‌బాల్ క్రీడాస్థలంగా వాడుకున్నారు. ఇక గ్రీసు దేశం విషయంలో ఆ దేశం అప్పుల ఊబిలోకి నెట్టబడటానికి ఒలింపిక్ క్రీడలు కూడా ఒక ప్రధాన కారణమని ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వారి జాతీయ స్థూల ఉత్పత్తిలో 4 శాతం నష్టం ఒలింపిక్ క్రీడల వల్ల ఏర్పడిందని ఒక ఆర్థిక శాస్త్రవేత్త అంచనా వేశారు. ప్రాచీన కాలపు శి«థిలాలకు ప్రసిద్ధి చెందిన గ్రీసు దేశం ఒలింపిక్ క్రీడల తర్వాత ఒలింపిక్ క్రీడా ప్రాంగణాల రూపంలో ఆధునిక శిథిలాలకు ప్రసిద్ధి చెందిందని హాస్య పూర్వకంగా ఒకరు వ్యాఖ్యానించారు. ఒలింపిక్ క్రీడల నిర్వహణ వలన భారీగా నష్టపోయిన దేశం బ్రెజిల్. క్రీడలు మొదలవటానికి ముందే దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. క్రీడలు పూర్తయిన తర్వాత దేశంలో ఆర్థిక మాంద్యం చోటు చేసుకుంది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. క్రీడల నిర్వహణలో లోటుపాట్ల మూలం గా దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరు రాలేదు. భారతదేశ పరిస్థితి బ్రెజిల్ కన్నా భిన్నంగా ఉంటుందని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఈనాడు దేశంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ కన్నా చాలా ముఖ్యమైన ప్రాధాన్యాలు ఉన్నాయి. అభివృద్ధి రేటు పెంపు, మానవ అభివృద్ధి సూచికలో పెరుగుదల, శిశు మరణాలు అరికట్టడం, అక్షరాస్యత వంటి అంశాలలో గణనీయమైన అభివృద్ధి సాధించగలిగిన నాడు దానంతటదే ఒలింపిక్ క్రీడలు నిర్వహించే అర్హత భారతదేశానికి వస్తుంది. ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు క్రీడలు నిర్వహించటం చైనా, ఇంగ్లండ్ దేశాల లాగా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తుంది. అది కాదని తొందరపడితే బ్రెజిల్, గ్రీసు దేశాల అనుభవాలే మనకు ఎదురవుతాయి. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
శ్రమిస్తే విజయం తథ్యం
తమిళసినిమా: కష్టపడి శ్రమిస్తే విజయం తథ్యమని ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మారియప్పన్ పేర్కొన్నారు. తిరు వీ కా పూంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయనపై విధంగా వ్యాఖ్యానించారు. సెంథిల్.సెల్ అమ్ కథానాయకుడిగా నటించి ద బడ్జెట్ ఫిలిం కంపెనీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం తిరు వీ కా పూంగా. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా పాల్గొన్న మారియప్పన్ మాట్లాడుతూ చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడు సెంథిల్ తనను బెంగళూర్‌లో కలిసి తిరు వీ కా పూంగా చిత్రం గురించి చెప్పి, ఇది ప్రేమలో విఫలమైన వారు ఆత్మహత్యలకు పాల్గొంటున్నారని, అలాంటి వాటిని అడ్డుకునే చిత్రంగా ఉంటుందని అన్నారన్నారు. చిత్రాన్ని ప్రదర్శించి చూపించారని తెలిపారు. చిత్రం తనకు చాలా నచ్చిందన్నారు. ఎందుకంటే మా కుటంబంలో తనతో పాటు అక్క, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని, నాన్న లేరని చెప్పారు. అమ్మే కష్టపడి మమ్మల్ని పెంచి పోషించారని తెలి పారు. అమ్మ లేకపోతే తానీ స్థానంలో నిలబడే వాడిని కాదని అన్నా రు. ప్రేమలో విఫలం అయితే ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. అలా అయితే తానూ క్రీడను ప్రేమించానని, ఆర్థిక సమస్యల కారణంగా క్రీడాకారునిగా కొనసాగడానికి చాలా కష్టపడ్డానని అన్నారు. 2012లో పాస్‌పోర్టు లేక ఒలింపిక్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని చెప్పారు. ఆ తరుణంలో కలత చెంది ఏదైనా తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటే ఇప్పుడీ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు. మంచి సందేశంతో చిత్రం చేసిన తిరు వీ కా పూంగా చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడు సెంథిల్‌కు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని మారియప్పన్ అన్నారు. -
సెహ్వాగ్.. ఇరగదీశాడు!
విమర్శకులకు ఎప్పుడూ తన బ్యాట్‌తో సమాధానమిచ్చే డాషింగ్ హీరో వీరేంద్ర సెహ్వాగ్.. ఈసారి మాటలతో కూడా గట్టిగా సమాధానం చెప్పాడు. 125 కోట్ల మంది జనాభా ఉన్నా కేవలం రెండు పతకాలు సాధించి దానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారానే సెహ్వాగ్ ఘాటుగా జవాబు చెప్పాడు. ఇది వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముందుగా మోర్గాన్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా, భారతీయులు ప్రతి చిన్న విషయానికీ ఆనందిస్తూనే ఉంటారని సెహ్వాగ్ చెప్పాడు. అది సరేగానీ, క్రికెట్‌ను కనుగొన్నది తామేనంటూ జబ్బలు చరుచుకునే ఇంగ్లండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదని, అయినా ఇప్పటికీ ప్రపంచకప్‌లో ఆడుతూనే ఉండటం ఇబ్బందికరంగా ఏమీ లేదా అని ప్రశ్నించాడు. ఒక్కసారిగా సెహ్వాగ్ సమాధానానికి ట్విట్టర్ జనాలు అభిమానులు అయిపోయారు. కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, దానికి మించి లైకుల వర్షం కురిసింది. అయితే అది అక్కడితో ఆగలేదు. సెహ్వాగ్ ట్వీట్‌కు మోర్గాన్ మరోసారి స్పందించాడు. కెవిన్ పీటర్సన్ ఆడి ఉంటే, ఇంగ్లండ్ తప్పనిసరిగా ప్రపంచకప్ గెలిచేదని చెప్పాడు. కానీ హనుమంతుడి ముందు కుప్పగంతులా అన్నట్లు క్రికెట్ గురించి సెహ్వాగ్‌కు చెబితే ఎలా? అందుకే వీరూ దానికి కూడా గట్టిగానే చెప్పాడు. అసలు పీటర్సన్ ఇంగ్లండ్ వ్యక్తి కాదని, దక్షిణాఫ్రికాలో పుట్టాడని, అందులోనూ ఆయన 2007 ప్రపంచకప్‌లో ఆడాడని.. అయినా ఇంగ్లండ్ ఓడిపోయిందని చకచకా చెప్పేశాడు. దాంతో ఇక మోర్గాన్ మాట్లాడేందుకు ఏమీ లేక నోరు మూసేశాడు. We cherish every small happiness', But Eng who invented Cricket,&yet2win a WC,still continue to playWC.Embarrassing? https://t.co/0mzP4Ro8H9 — Virender Sehwag (@virendersehwag) 24 August 2016 Very embarrassing, Legend. If @KP24 was playing, we'd win the WC. Just as we won T20 WC & he was Man of Series. https://t.co/50X5YMQSQU — Piers Morgan (@piersmorgan) 24 August 2016 KP is a legend no doubt,bt wasnt he born in SA,&by ur logic Eng shd hv won 2007WC. Why hv prblm wid our ppl,celbrtng https://t.co/ZigCrzVG05 — Virender Sehwag (@virendersehwag) 24 August 2016 -
అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం: చంద్రబాబు
ఇప్పటికి ఇంకా నిర్మాణమే మొదలుకాని అమరావతి నగరంలో త్వరలోనే ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రజలు విజయవాడ పేరును బెజవాడగా మార్చాలని కోరితే ఆ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు వీలైనంత త్వరగా యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాధారణంగా ఇవ్వాల్సిన నిధులనే ఇచ్చింది తప్ప అదనపు నిధులేమీ ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు. -
ఒలింపిక్ హీరోకు దొంగలు గట్టి ఝలక్
రియోడిజనిరో: అతడు ఓ ఒలింపిక్ హీరో.. కానీ.. ముగ్గురు దొంగలముందు మాత్రం జీరో అయ్యాడు. మారు వేషాల్లో వచ్చిన దొంగలు తాము పోలీసుల మని చెప్పి గట్టి ఝలక్ ఇచ్చారు. ఆ ఒలింపిక్ హీరోను మరో ముగ్గురు ఒలింపిక్ అథ్లెట్లను దోచుకున్నారు. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి దొంగలు ఈ పని చేశారు. అసలే బ్రెజిల్ దోపిడీలకు అడ్డా అని ముందుగానే అందరికీ తెలిసిందే. అమెరికన్ స్విమ్మర్ రియా లోక్టే.. తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో అప్పుడే ఓ బంగారు పతకాన్ని తన ఖాతాలో కూడా వేసుకున్నాడు. ఈ గేమ్ ముగిసిన వెంటనే మరో ముగ్గురు అథ్లెట్లతో కలిసి ఓ రెస్టారెంట్ లో పార్టీకి వెళ్లిన అతడు ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగొస్తుండగా అనూహ్యంగా వారి కారును ముగ్గురు వ్యక్తులు ఆపేశారు. వారంతా పోలీసులు దుస్తుల్లో ఉన్నారు. ఆ రియన్ తో సహా ముగ్గురుని గ్రౌండ్‌పై మోకరిల్లమని బెదిరించారు. మిగితా ముగ్గురు అలా చేయగా తాను ఏం తప్పు చేయలేదని, ఎందుకు మొకాళ్లపై నిల్చోవాలని రియాన్ ప్రశ్నించాడు. దీంతో ఆ దొంగ పోలీసుల్లో ఒకరు రియాన్ తలకు తుపాకీ గురిపెట్టారు. అనంతరం వారి పర్సులను తీసుకొని ఉడాయించారు. ఈ సీన్ రియాన్ కు చెమటలు పట్టించింది. వారి ఏం చేయకుండానే వెళ్లడంతో హమ్మయ్య అనుకొని బయల్దేరారు. జరిగిన ఘటనను పోలీసులకు వివరించారు. -
సయోధ్య సాధ్యమేనా?
► బోపన్న చేతిలో పేస్ ‘రియో’ భవితవ్యం ► ఏఐటీఏకు మళ్లీ ఒలింపిక్ సెలక్షన్ తలనొప్పి ఏ భారత క్రీడాకారుడూ ఇప్పటివరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు మాత్రమే ఈ అవకాశముంది. అయితే లియాండర్ పేస్ ఈ అరుదైన ఘనత సాధించాలంటే మాత్రం రోహన్ బోపన్న పరోక్షంగా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పేస్‌కు రోహన్ బోపన్న సహకరిస్తాడా? నిరాకరిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదైతేనేం మళ్లీ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు ‘రియో’ ఒలింపిక్స్ సెలెక్షన్ టెన్షన్ పట్టుకుంది. న్యూఢిల్లీ: వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడమే కాకుండా సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకం కూడా సాధించిన లియాండర్ పేస్ ‘రియో’ ఆశలు డోలాయమానంలో పడ్డాయి. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకిం గ్స్‌లో భారత్‌కే చెందిన రోహన్ బోపన్న పదో స్థానానికి ఎగబాకి టాప్-10లోకి వచ్చా డు. పేస్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రియో ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్ అర్హత నిబంధనల ప్రకారం... టాప్-10లో ఉన్న డబుల్స్ క్రీడాకారుడు తమ దేశానికే చెందిన ఏటీపీ ర్యాంక్ ఉన్న క్రీడాకారుడితో జతగా కలిసి బరిలో దిగే అవకాశముంది. నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్‌తో కలిసి ఆడేందుకు రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పేస్ టాప్-10లో ఉండటంతో భారత్‌కే చెందిన విష్ణువర్ధన్తో కలిసి లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి బరిలోకి దిగాడు. మహేశ్ భూపతితో కలిసి రోహన్ బోపన్న ఆడాడు. అయితే వీరందరూ లండన్ నుంచి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు. నాలుగేళ్లు గడిచాయి. పరిస్థితులు తారుమారయ్యాయి. 36 ఏళ్ల బోపన్న టాప్-10లోకి వచ్చాడు. మరోవైపు మరో రెండు వారాల్లో 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న పేస్ ర్యాంకేమో పడిపోయింది. మహిళల డబుల్స్‌లో 29 ఏళ్ల సానియా మీర్జా ప్రపంచ నంబర్‌వన్ స్థానంలో ఉంది. టాప్-10లోకి తాను వస్తే ఒలింపిక్స్‌లో తన భాగస్వామి ఎవరో నిర్ణయించుకునే హక్కు తనకు ఉంటుందని రోహన్ బోపన్న స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో బోపన్న తనకు లియాండర్ పేస్‌తో కలిసి ఆడే ఉద్దేశం లేదని పరోక్షంగా తెలియజేశాడు. బోపన్న అంగీకరించకుంటే మాత్రం పేస్ ‘రియో’ ఆశలు ఆవిరైనట్టే. బోపన్న, పేస్ కాకుండా భారత్ నుంచి డబుల్స్ ర్యాంకింగ్స్‌లో పురవ్ రాజా (103), దివిజ్ శరణ్ (114), సాకేత్ మైనేని (125), జీవన్ నెదున్‌చెజియాన్ (134), మహేశ్ భూపతి (164) టాప్-200లో ఉన్నారు. ఒలింపిక్స్‌లో ఆడాలంటే ఆయా ఆటగాళ్లు గత నాలుగేళ్లలో కనీసం మూడుసార్లు డేవిస్ కప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న నిబంధన ఒకటుంది. దీనిని కచ్చితంగా పాటిస్తే మాత్రం పురవ్, దివిజ్, జీవన్, భూపతిలకు రియో అవకాశాల్లేవు. కేవలం సాకేత్ మాత్రమే ఈ నిబంధనకు లోబడి ఉన్నాడు. అయితే జాతీయ టెన్నిస్ సమాఖ్య అభ్యర్థిస్తే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డేవిస్ కప్ నిబంధనను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. రంగంలోకి ఏఐటీఏ... ఒలింపిక్స్‌కు అర్హత కోసం ర్యాంకింగ్ తుది గడువు పూర్తి కావడంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులు రంగంలోకి దిగారు. లండన్ ఒలింపిక్స్ సమయంలో జరిగిన రచ్చ ఈసారి కాకుండా సాఫీగా సెలెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈనెల 11న సమావేశం కానున్నారు. బోపన్న, పేస్, సానియా మీర్జాలతో కూడా చర్చించాలని భావిస్తున్నారు. పేస్‌తో కలిసి ఒలింపిక్స్‌లో ఆడాలని రోహన్ బోపన్నను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ‘డబుల్స్‌లో భారత్ తరపున నంబర్‌వన్, రెండో ర్యాంక్ ఉన్న ఆటగాళ్లు జతగా ఆడటం సముచితంగా ఉంటుంది. పేస్, బోపన్న ఇద్దరూ అనుభవజ్ఞులే. బోపన్నకు తన భాగస్వామిని ఎంచుకునే అర్హత ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి భేషజాలకు పోకుండా బోపన్న వివేకంగా వ్యవహరిస్తే సమస్యే ఉత్పన్నం కాదు. ప్రస్తుతం పేస్ ర్యాంక్ పడిపోయిన విషయం వాస్తవమే. అయితే పేస్ సాధించిన ఘనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఏఐటీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే రోహన్ బోపన్న ఏఐటీఏ అధికారుల ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తాడా లేక లండన్ ఒలింపిక్స్ సమయంలో వ్యవహరించినట్టు మొండిగా ఉంటాడా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్నలకు అవకాశం మిక్స్డ్ డబుల్స్ విషయానికొస్తే... ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల కంబైన్డ్ ర్యాంకింగ్ ఆధారంగా ఎంట్రీ లభిస్తుంది. 16 జోడీలు మాత్రమే మిక్స్డ్ డబుల్స్‌లో పాల్గొనే వీలుంది. మహిళల డబుల్స్‌లో సానియా నెంబర్‌వన్ ర్యాంక్, పురుషుల డబుల్స్‌లో బోపన్న పదో ర్యాంక్ కలిపితే వీరిద్దరి కంబైన్డ్ ర్యాంక్ 11 అవుతుంది. కాబట్టి భారత్ నుంచి రోహన్ బోపన్న, సానియా మీర్జాలకు మాత్రమే మిక్స్డ్ డబుల్స్‌లో ఆడే అవకాశముంది. దాంతో మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్‌కు బరిలో దిగే చాన్స్ లేదు. సానియాకు కూడా బోపన్నతో కలిసే మిక్స్డ్ డబుల్స్‌లో ఆడాలని కోరిక ఉంది. -
కిక్ కూ ఓ లెక్కుంది..!
♦ ఒలంపిక్ క్రీడల్లో ఒకేఒక్క మార్షల్ ఆర్ట్ ♦ ప్రభుత్వ గుర్తింపు పొందిన తైక్వాండో ♦ 150 దేశాల్లో అధికారికంగా పోటీలు ♦ సర్టిఫికెట్ ఉంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సంగారెడ్డి టౌన్: ‘కెయ్...’ అంటూ గాల్లోకి ఎగిరి రెప్పపాటులో కిక్ ఇవ్వడం తైక్వాండో టెక్నిక్. అంతేకాదు ప్రత్యర్థిపై తొడగొట్టి.. పడగొట్టి.. పథకాలు కూడా ఎగరేసుకుపోవచ్చు. మార్షల్‌ఆర్ట్స్‌లో ఒలంపిక్ మెడల్స్ ఏంటా! అని ఆశ్చర్యపోతున్నారా? ఏ సంప్రదాయ యుద్ధకళకు లేని స్థానం తైక్వాండోకు దక్కింది. అందుకే ఒలంపిక్ క్రీడగా 150 దేశాల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సర్టిఫికెట్ ఉంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా పొందొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఈ కళ గ్రామీణులకు పెద్దగా చేరువ కాకపోవడం కొంత నిరాశ కలిగించే విషయం. ఐటీఎఫ్ ఏర్పడి అర్ధశతాబ్దం ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్(ఐటీఎఫ్) ఏర్పడి అర్ధశతాబ్దం అవుతోంది. యుద్ధకళకు క్రీడా హోదా సాధించడంలో ఐటీఎఫ్ పాత్ర మరువ లేనిది. ఆస్ట్రేలియాలోని వియాన్నా ప్రధాన కార్యాలయంగా 1966 మార్చి 22న చోయ్ హాంగ్ హి(ఛిజిౌజీ ఏౌజ ఏజీ) ఆధ్వర్యంలో ఐటీఎఫ్ ప్రారంభమైంది. ఫెడరేషన్ విధులు ప్రపంచ వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్లు, శిక్షణ, సెమినార్లకు అనుమతి ఇవ్వడం, గుర్తింపున్న ఫెడరేషన్ల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం, అభ్యర్థులకు ర్యాంకులు, ధ్రువపత్రాలు అందించడం. తైక్వాండోకు అంతర్జాతీయ క్రీడాస్థాయిని ఇవ్వడంలో, ఒలంపిక్ గేమ్‌గా తీసుకురావడంలో ఐటీఎఫ్ కృషి అమోఘం. కాబట్టే దాదాపు 150 దేశాల్లో నేడు తైక్వాండో వెలుగుతోంది. సంస్థ 50 వసంతాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని కరోలిన్ స్ప్రింగ్, విక్టోరియాలో జాతీయ పోటీలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కజకిస్తాన్ టైక్వాండో ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 26వ తేదీ నుంచి 30 వరకు అల్మటీ, ఖజకిస్తాన్‌లో 8వ ఏషియన్ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచ క్రీడగా అవతరణ యుద్ధకళా నైపుణ్యమే కాకుండా అంతకు మించి మానసిక శక్తిని పెంపొందించి, జీవన విధానాన్ని, క్రమ శిక్షణను బోధించే ఆర్ట్‌గా తైక్వాండో ప్రసిద్ధి చెందింది. ‘తై’ అంటే ఫుట్(కాలు), ‘క్వాన్’ అంటే ఫిస్ట్(పిడికిలి), ‘డూ’ అంటే వే(క్రమశిక్షణ) ఈ మూడు భాగాల కలయికే ‘తైక్వాండో’. కాళ్లు, చేతుల కదలికలతో మొత్తం శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకోవడమే ఈ క్రీడ ప్రత్యేకత. కొరియన్ యుద్ధకళ కొరియాలో ఆయుధాలతో, అవి లేకుండా పోరాడే యుద్ధకళగా సుబాకు(టెక్కియాన్) ప్రాచుర్యం పొందింది. కీ.శ.1392-1910 వరకు కొరియాను పరిపాలించిన చొసున్ రాజ్యంలో సుబాకుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కళతో పాటు జీవన విధానాన్ని బోధించేవారు. ముఖ్యంగా మిలటరీ వ్యక్తులకు ఈ కళలో తర్ఫీదు ఇచ్చేవారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం జపాన్ కొలోనల్ పరిపాలన నుంచి కొరియా స్వాతంత్య్రం పొందింది. మొదటి అధ్యక్షుడు సింగమ్రీ ఆధ్వర్యంలో ఈ విద్య కళలకు పునరుజ్జీవం పోశారు. దీంతో టెక్కియాన్ మార్షల్ఆర్ట్ తైక్వాండ్గా రూపాంతరం చెందింది. 1950-1953 మధ్య తైక్వాండో పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చింది. 1971లో కొరియా జాతీయ క్రీడాగా గు ర్తింపు పొందింది. 1972లో కొరియా అధ్యక్షుడు కుక్కివాన్ తైక్వాండోకు సంబంధించి జాతీయస్థాయిలో కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు పోటీలకు అనుమతిని చ్చాడు. 1966 మార్చి 22న ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1973లో వల్డ్ తైక్వాండో ఫెడరేషన్(డబ్ల్యూటీఓ)ఏర్పాటైంది. అదే సంవత్సరం నుంచి ప్రపంచ తైక్వాండో పోటీలు ప్రారంభమైంది. ఒలంపిక్ ఆట అతి తక్కువ కాలంలోనే ఆసియా దేశాల్లో తైక్వాండో ప్రజాదరణ పొందింది. 1975లో అమెరికాకు చెందిన అమెచూర్ అథ్లెట్ యూనియన్‌లో సభ్యత్వం, 1976లో అంతర్జాతీయ మిలటరీ క్రీడలలో భాగస్వామ్యమైంది. 1984లో ఆసియా క్రీడల్లో అధికారిక క్రీడగా గుర్తింపు లభించింది. 1980లో ఇంటర్నేషన్ ఒలంపిక్ కౌన్సిల్(ఐఓసీ) స్పోర్ట్ ఫెడరేషన్ డబ్ల్యూటీఓను గుర్తించింది. ఐఓసీ గుర్తుంపు లభించిన తర్వాత 1981లో వల్డ్ గేమ్స్‌లో అధికారిక క్రీడగా అడుగుపెట్టింది. 1986లో పాన్ అమెరికా క్రీడల్లో స్థానం సంపాదించింది. ఆసియా ఖండం నుంచి ఒకేఒక్క మార్షల్ ఆర్ట్ క్రీడగా సిడ్నిలో 2000లో జరిగిన ఒలంపిక్ క్రీడలలో పాల్గొంది. 2010లో కామన్వెల్త్ క్రీడల్లో గుర్తింపు లభించింది. నైపుణ్యానికి గ్రేడింగ్ 06 సంవత్సరాల వయస్సు నుంచి 60 సంవత్సరాల వారు తైక్వాండోను నేర్చుకోవచ్చు. ప్రాథమిక శిక్షణ తర్వాత నైపుణ్యాలను పెంచుతూ గ్రేడింగులు(బెల్టులతో) ఇస్తారు. వైట్ బెల్టుతో మొదలై ఎల్లో, గ్రీన్, గ్రీన్ 1, బ్లూ, బ్లూ 1, రెడ్, రెడ్ 1 తర్వాత బ్లాక్‌బెల్ట్ ఇస్తారు. ఒక్కో బెల్టుకు కనీసం నాలుగు నెలల శిక్షణ ఉంటుంది. బ్లాక్‌బెల్ట్ సాధించాలంటే దాదాపు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. రెడ్ 1 బెల్డ్ సాధిస్తే మాస్టర్‌గా గుర్తింపు లభిస్తుంది. భిన్నమైన పోటీలు తొంబై శాతం స్టాండింగ్, ఫ్లయింగ్ కిక్‌లు, పది శాతం చేతి కదలికలతో ఉండే తైక్వాండో.. పో టీల్లో మాత్రం కిక్‌లు మాత్రమే ఉపయోగిం చాలి. పంచ్‌లకు స్థానం లేదు. నడుముకు కట్టుకునే బెల్టు నుంచి తల వరకు స్పారింగ్లో కిక్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. బెల్టు కింద కిక్‌లు తగిలితే పరిగణనలోకి తీసుకోరు. నిబంధనలకు అనుగుణంగా వేగంగా, సరైన పద్ధతిలో ఉపయోగించిన కిక్‌లకు మాత్రమే పాయింట్స్ ఉంటాయి. ఐదుగురు జడ్జిలు పోటీల్లో నలుగురు రెఫరీలు, ఒక జడ్జి ఉంటారు. బౌట్ నాలుగు వైపులా నలుగురు రెఫరీలు ఉంటారు. జడ్జి బౌట్‌ను పర్యవేక్షిస్తుంటాడు. మూడు నిమిషాల సమయం ఇచ్చి గేమ్ స్టార్ట్ చేస్తారు. నలుగురు రెఫరీలు నాగులు కోణాల్లో అభ్యర్థులను గమనిస్తారు. మూడు నిమిషాల అనంతరం రెఫరీలు రహస్యంగా చీటీపై రాసి జడ్జికి ఇస్తారు. ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వారు విజైతలవుతారు. నాక్ఔట్ అయితే అంతటితో ఆగిపోతుంది. గార్డ్స్ ముఖ్యం ఇతర క్రీడలకు భిన్నంగా రక్షణకు వివిధ రకాల గార్డ్స్ ఉపయోగిస్తారు. తలకు రక్షణ కోసం గార్డ్, చెస్ట్, గ్లాయిన్స్, ఎల్బో గార్డులను ఉపయోగిస్తారు. లేకుంటే వేగంగా కిక్‌లు తగిలితే చాలా ప్రమాదం.