
దుబాయ్: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లకు టాస్ పడే అవకాశాలు మెరుగయ్యాయి. 2028లో అమెరికాలో జరిగే ఈ విశ్వక్రీడల కోసం నిర్వాహకులు క్రికెట్ క్రీడను చేర్చేందుకు సిఫారసు చేశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హర్షం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహణ కోసం ఐసీసీ... లాస్ ఏంజెలిస్ నిర్వాహక కమిటీతో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతోంది.
మొత్తానికి కమిటీ సిఫారసు చేయడంతో ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదమే మిగిలుంది. ఐఓసీ ఓకే అంటే అమెరికాలో క్రికెట్ ఆటకు రంగం సిద్ధమవుతుంది. ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలో జరిగే ఐఓసీ సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో క్రీడాంశంగా చేర్చాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment