తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్ చేసినందుకు గానూ పాకిస్తాన్ మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించబడింది. అలాగే ఐదు డబ్ల్యూటీసీ పాయింట్లు డాక్ చేయబడ్డాయి. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ కథనం మేరకు.. నిర్దేశిత సమయం ముగిసే లోగా పాక్ ఐదు ఓవర్లు వెనుకపడింది.
ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. నిర్దేశిత సమయంలోగా ఓవర్ వెనుకపడితే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధిస్తారు. అలాగే ఓ డబ్ల్యూటీసీ పాయింట్ డాక్ చేయబడుతుంది. ఐసీసీ విధించిన జరిమానాను పాక్ సారధి షాన్ మసూద్ స్వీకరించాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో (ఎనిమిది) ఉంది.
కాగా, సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో పాక్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోగలిగింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. బాబర్ ఆజమ్ (81) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో ఆకట్టుకోగా.. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.
పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment