మాండలే : ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మూడో దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు విఫలమైంది. మంగళవారం మయన్మార్‌తో జరిగిన ఈ మ్యాచ్ 3–3తో డ్రాగా ముగిసింది. ఫలితంగా టోర్నీనుంచి నిష్క్రమించిన జట్టు ఒలింపిక్స్ అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోయింది. గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిస్తే భారత్ ముందంజ వేసేది. ఈ గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 7 పాయింట్లతో భారత్, మయన్మార్ సమంగా ఉన్నా గోల్స్ తేడాతో (4–8) మయన్మార్ అగ్రస్థానం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సంధ్య రంగనాథన్ (10వ నిమిషం), సంజు (32వ ని.), రత్నబాల దేవి (64వ ని.) గోల్స్ సాధించగా... మయన్మార్ తరఫున విన్ టున్ హ్యాట్రిక్ (17వ ని., 21వ ని., 72వ ని.) గోల్స్ కొట్టింది. మ్యాచ్ 76వ నిమిషంలో చెలరేగిపోయిన సంజు గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా... మయన్మార్ గోల్ కీపర్ మే వే అద్భుతంగా అడ్డుకుంది.
Comments
Please login to add a commentAdd a comment