
Women's Olympic Football Tournament Paris 2024- Asian Qualifiers బిష్‌కెక్: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) మహిళల ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రౌండ్–1లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘జి’లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ విశేషంగా రాణించింది.
నిజామాబాద్ బిడ్డ
నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ మ్యాచ్‌లో ఒక గోల్ చేయడంతోపాటు సహచరిణి అంజు తమాంగ్ రెండు గోల్స్ చేయడంలో సహాయం చేసింది. భారత జట్టుకు అంజు తమాంగ్ (6వ, 42వ ని.లో) రెండు గోల్స్ అందించగా... సౌమ్య గుగులోత్ (45+3వ ని.లో), షిల్కీ దేవి (61వ ని.లో), రేణు (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించి పెట్టారు. శుక్రవారం కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుతోనే భారత్ రెండో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘జి’లోని మూడో జట్టు తుర్క్‌మెనిస్తాన్ టోర్నీ నుంచి వైదొలిగింది.
చదవండి: థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్
అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు!
IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు