Soumya
-
ఒక గృహిణి.. 4 సర్కారీ నౌకరిలు
చేవెళ్ల /మొయినాబాద్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగ సాధన కత్తిమీద సాము లాంటిదే. కానీ పట్టుదలకు శ్రమ తోడైతే సాధించలేనిది ఏదీ లేదని పలువురు నిరూపిస్తున్నారు. మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన గడ్డం సౌమ్యారెడ్డి ఏడాది కాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంది. గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్‌తో పాటు గత బుధవారం విడుదలైన ఫలితాల్లో గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ంది. 2014లో వివాహం జరిగిన అనంతరం భర్త శ్రీధర్‌రెడ్డితో కలిసి చిలుకూరులో ఉంటూ డిగ్రీ, పీజీ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసింది. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల పోషణను చూసుకుంటూనే పట్టుదలగా చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.ఉద్యోగం చేస్తూనే..చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన సుదర్శన్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2018లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన ఆయన.. ప్రస్తుతం గచ్చిబౌలి పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ ఫ్రొఫెసర్ కావాలనే తల లక్ష్యాన్ని మరవలేదు. జాబ్ చేస్తూనే చదువు కొనసాగిస్తూ 2022లో ఉస్మానియా యునివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నాడు. ఈక్రమంలో తెలంగాణ సాహితీవేత్తలు, హృదయ ఘోష, స్వాతంత్య్ర సమరయోధుడు అడ్డూరి అయోధ్య రామయ్య అనే పుస్తకాలు రచనలు చేశాడు. గెజిటెడ్ అధికారిగా ఎదగాలనే ఆలోచనతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసిన జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాసి, జేఎల్‌గా ఎంపికయ్యాడు. సామాన్య పేద కుటుంబానికి చెందిన తనను తల్లిదండ్రులు జంగమ్మ, పర్మయ్య చాలా కష్టపడి చదివించారని తెలిపాడు. లెక్చరర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని, ప్రొఫెసర్ కావాలనే తన కల సాకారానికి మొదటి అడుగు పడిందని చెప్పాడు. -
అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్!
ఉన్నది ఒకటే జీవితం! దాన్ని జీతానికి తాకట్టు పెడితే ఆర్జిస్తున్నామనే ఆనందం కూడా మిగలదు! ఉద్యోగం వేతనాన్నే కాదు చేస్తున్న పని పట్ల సంతృప్తినీ ఇవ్వాలి.. ఆస్వాదించే సమయాన్నుంచాలి.. మన జీవితాన్ని మనకు మిగల్చాలి! ఇది జెన్ జెడ్ ఫిలాసఫీ! అందుకే వాళ్లు రెజ్యుమే ప్రిపేర్ చేయట్లేదు. పోర్ట్‌ఫోలియో కోసం తాపత్రయపడుతున్నారు. వర్క్ స్టయిల్ని మార్చేస్తున్నారు. ఆఫీస్ డెకోరమ్ నుంచి ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు. ముందుతరాల ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. మేనేజ్మెంట్కి ఆప్షన్ లేకుండా చేస్తున్నారు.‘చూసేవాళ్లకు కేర్ఫ్రీగా కనిపిస్తున్నామేమో కానీ చేసే పని పట్ల, మా ఫ్యూచర్ పట్ల క్లారిటీతోనే ఉంటున్నాం. జాబ్ అండ్ జిందగీ, ప్యాకేజ్ అండ్ ఫ్యాషన్ల మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసు మాకు. అందుకే మేము మా స్కిల్‌ని నమ్ముకుంటున్నాం.. లాయల్టీని కాదు’ అంటోంది జెన్ జెడ్ ప్రతినిధి, బిజినెస్ అనలిస్ట్ చిలుకూరు సౌమ్య.నిజమే.. తమకేం కావాలి అన్నదాని పట్ల జెన్ జెడ్‌కి చాలా స్పష్టత ఉంది. వాళ్లు దేన్నీ దేనితో ముడిపెట్టట్లేదు. దేనికోసం దేన్నీ వదులుకోవట్లేదు. నైపుణ్యం కంటే విధేయతకే ప్రాధాన్యమిస్తున్న సంస్థల్లో పని వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే సంస్థలో ఉద్యోగాన్నీడ్చే ముందు తరాల మనస్తత్వాన్ని ఔట్ డేటెడ్‌గా చూస్తున్నారు. తక్కువ సర్వీస్‌లో వీలైనన్ని జంప్‌లు, వీలైనంత ఎక్కువ ప్యాకెజ్ అనే ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.వాళ్ల రూటే వేరు..సంప్రదాయ జీవన శైలినే కాదు ట్రెడిషనల్ వర్క్ స్టయిల్‌నూ ఇష్టపడట్లేదు జెన్ జెడ్. ‘పదహారు.. పద్దెనిమిదేళ్లు చదువు మీద పెట్టి, తర్వాత లైఫ్ అంతా 9 టు 5 పనిచేస్తూ, కార్పొరేట్ కూలీలుగా ఉండటం మావల్ల కాదు’ అంటున్నారు బెంగళూరుకు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ‘జెన్ జెడ్.. మాలాగా కాదు. వాళ్లు సంస్థ ప్రయోజనాల కోసం చెమటోడ్చట్లేదు. అలాంటి షరతులు, డిమాండ్లకూ తలొగ్గట్లేదు. వాళ్లకు పనికొచ్చే, వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించుకునే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రైటింగ్, డిజైన్ లాంటి టాస్క్స్నే తీసుకుంటున్నారు. అంతే నిర్మొహమాటంగా గుర్తింపును, కాంప్లిమెంట్స్నూ కోరుకుంటున్నారు. కొలీగ్స్‌తో మాట్లాడినంత క్యాజువల్‌గా సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడేస్తున్నారు. సీనియర్స్, సుపీరియర్స్ని ‘సర్’ అనో, ‘మేడమ్’ అనో పిలవడం వాళ్ల దృష్టిలో ఫ్యూడల్, ఓల్డ్ ఫ్యాషన్డ్. పేరుతో పిలవడాన్ని అప్ డేటెడ్‌గా, ఈక్వల్‌గా ట్రీట్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు మిలేనియల్ తరానికి చెందిన కొందరు బాస్‌లు. దీన్నిబట్టి జెన్ జెడ్‌కి ఆఫీస్ మర్యాదల మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు యజమాని – ఉద్యోగి సంబంధాన్ని సింపుల్‌గా ‘మీకు అవసరమైన పని చేసిపెడుతున్నాం.. దానికి చార్జ్ చేసిన డబ్బును తీసుకుంటున్నాం’ అన్నట్లుగానే పరిగణిస్తున్నారు తప్ప ఎలాంటి అటాచ్మెంట్లు, సెంటిమెంట్లకు చోటివ్వట్లేదు.40 కల్లా..చేసే ఉద్యోగం, జీతం, పని వేళలు, ఆఫీస్ వాతావరణమే కాదు ఎన్నాళ్లు పనిచేయాలనే విషయంలోనూ జెన్ జెడ్‌కి ఒక అవగాహన ఉంది. తర్వాత ఏం చేయాలనేదాని పట్లా ఆలోచన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘జీవిక కోసం జీతం.. ప్యాషన్ కోసం జీవితం’ అని నమ్ముతున్నారు వాళ్లు. 35– 40 ఏళ్ల కల్లా రిటైర్మెంట్ అంటూ పెద్దవాళ్లు విస్తుపోయేలా చేస్తున్నారు. ‘మేము 60 ఏళ్లకు రిటైరైన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ చేయాలని చూస్తుంటే మా పిల్లలేమో 35 – 40 ఏళ్ల వరకే ఈ ఉద్యోగాలు.. తర్వాత అంతా మాకు నచ్చినట్టు మేం ఉంటామని చెబుతున్నారు. ఆశ్చర్యమేస్తోంది వాళ్ల ధైర్యం, భరోసా, నమ్మకం చూస్తుంటే’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. 40 ఏళ్ల కల్లా రిటైరైపోయి తమకు నచ్చిన రంగంలో సెకండ్ కెరీర్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. దీనికోసం ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే అన్నిరకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు. పొదుపుతో జాగ్రత్తపడుతున్నారు. సిప్‌లు,షేర్లలో మదుపు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో అప్డేట్ అవుతున్నారు. తమ లక్ష్యాలకు సరిపోయే ప్యాకేజ్ని కోట్ చేస్తూ అర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తున్నారు.రెజ్యుమే టు పోర్ట్‌ఫోలియో..ఒక వ్యక్తి కొన్నాళ్లు ఓడరేవులో పని చేస్తాడు. అక్కడి నుంచి చెరుకు తోటలకు కూలీగా వెళ్తాడు. ఇంకొన్నాళ్లు బడిలో పాఠాలు చెబుతాడు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా కనపడతాడు. మరికొన్నాళ్లకు ఇంకో కొలువును చేపడతాడు. ఆఖరికి ఏ సైంటిస్ట్గానో, రాజకీయవేత్తగానో, రచయితగానో తన మజిలీ చేరుకుంటాడు. ఇలాంటివన్నీ సాధారణంగా పాశ్చాత్య నవలలు, ఆటోబయోగ్రఫీలు, సినిమాల్లో కనపడతాయి. కానీ ఈ ధోరణిని ఇప్పుడు జెన్ జెడ్‌లోనూ కనపడుతోంది. 60 ఏళ్లకు రిటైర్మెంట్నే కాదు రిటైర్మెంట్ వరకు ఒకే కొలువు అనే కాన్సెప్ట్‌నూ ఇష్టపడట్లేదు వాళ్లు. కెరీర్లో రెండుమూడు జంప్ల తర్వాత ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్ కన్నా ఫ్రీలాన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక, మనసుకు నచ్చిన పనిచేసుకునే అవకాశమూ దొరుకుతోంది అంటున్నారు.వివిధ రంగాల్లోని చాలామంది జెన్ జెడ్ ఉద్యోగులు పలు స్టార్టప్స్‌కి పనిచేస్తున్నారు, స్టార్టప్స్ నడుపుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వ్లాగర్స్, యూట్యూబర్స్‌గా కొనసాగుతున్నారు. అడ్వర్టయిజ్మెంట్ కాపీ రైటర్స్‌గా, ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి క్యురేటర్స్గా సేవలందిస్తున్నారు. యోగా టీచర్స్‌గా, అనువాదకులుగా, కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. వాయిస్ ఓవర్ చెబుతున్నారు. డిస్కవరీ, జాగ్రఫీ, యానిమల్ ప్లానెట్ లాంటి చానళ్ల కోసం పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్స్ రాస్తున్నారు. ఎడిటింగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అందిస్తున్నారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైన్, మోడలింగ్‌లో ఉన్నారు. ఐడియా బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో.. వైవిధ్యమైన పని అనుభవాలతో రెజ్యుమే ప్లేస్‌లో పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బుతోపాటు జాబ్ శాటిస్ఫాక్షన్ను పొందుతున్నారు.ఫిన్‌ఫ్లుయెన్సర్స్..40 ఏళ్లకే రిటైరై.. సెకండ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన వాళ్లు, రకరకాల ఉద్యోగాలతో ఫ్రీలాన్స్ చేçస్తున్న వాళ్లు ఆర్థిక క్రమశిక్షణలోనూ ఆరితేరుతున్నారు. పలు స్టార్టప్స్‌లో, సేవల రంగంలో పెట్టుబడులు పెడుతూ ఫిన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు.ఈ ధోరణికి కారణం.. ఇంటర్నెట్, ఏఐ లాంటి ఫాస్ట్‌మూవింగ్ టెక్నాలజీ, కరోనా పరిస్థితులు .. కెరీర్, ఆఫీస్ వర్క్‌కి సంబంధించి ఎన్నో మార్పులను తెచ్చాయి. అవి జెన్ జెడ్‌ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. ఈ మధ్య చోటుచేసుకున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఏర్పడ్డ ఆర్థికమాంద్యం, ఉద్యోగాల కోత వంటి పరిణామాలు కూడా ఆ ధోరణిని కొనసాగేలా చేస్తున్నాయి. దీనికి పేరెంటింగ్నూ మరో కారణంగా చూపుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఇంజినీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకో చదువు లేదు, మరో కెరీర్ కెరీర్ కాదనే పెంపకమూ ఫ్రీలాన్సింగ్, అర్లీ రిటైర్మెంట్ ట్రెండ్‌కి ఊతమవుతోందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.జెన్ జెడ్ ఫ్రీలాన్స్ వర్కింగ్ ట్రెండ్ మీద అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అప్‌వర్క్ ఆన్లైన్ ఫ్రీలాన్స్ నెట్వర్కింగ్’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అనుగుణమైన పనివేళలు, ఆదాయ భరోసా ఉండటం వల్లే వాళ్లు ఏ రంగంలోనైనా ఫ్రీలాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ఎక్కువమంది కోవిడ్ చరమాంకం నుంచి ఈ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్‌లో కొనసాగుతున్నారట. వాళ్లంతా వారానికి 40 గంటలు, పలురకాల పనుల్లో ఫ్రీలాన్స్ చేస్తున్నారు. కొందరేమో పనిచోట సీనియర్స్– జూనియర్స్, కుల, మత, జాతి, లింగ వివక్షను భరించలేక, ఆ వాతావరణం నుంచి దూరంగా ఉండటానికి ఫ్రీలాన్స్ని ఎంచుకున్నట్లు చెప్పారు. మరికొందరు వ్యక్తిగత జీవితం తమ చేతుల్లోనే ఉంటుందని, సొంతంగా ఎదిగే వీలుంటుందని ఫ్రీలాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్ నిషేధం తర్వాత చాలామంది క్రియేటర్స్‌కి ఇన్స్టాగ్రామ్ ఓ ప్రత్యామ్నాయ వేదికగా మారడంతో వాళ్లంతా మళ్లీ ఫ్రీలాన్స్కి మళ్లారు. మైక్రోసాఫ్ట్, లింక్డిన్ డేటా ప్రకారం జెన్ జెడ్ ఫ్రీలాన్సర్స్.. సంస్థలు ఇచ్చే శిక్షణ మీద ఆధారపడకుండా సొంతంగా శిక్షణ తీసుకుని ఏఐ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలను చాలా చక్కగా వాడుకుంటున్నారు. మిలేనియల్స్ మాదిరి జెన్ జెడ్.. లాప్‌టాప్‌ను, కంప్యూటర్ను ఎక్స్ట్రా ఆర్గాన్‌గా మోయట్లేదు. ఆఫీస్‌ను మొదటి ఇల్లుగా చేసుకోవట్లేదు. ఉన్న చోటు నుంచే తమ దగ్గరున్న డివైస్లోంచే పనిచేసుకుంటున్నారు.. ఆడుతూ.. పాడుతూ.. హ్యాపీగా! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్నీ జెన్ జెడ్‌కి ఫ్రీలాన్సింగ్ ఇచ్చేలా కొందరు బిజినెస్ లీడర్లు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కొన్ని సంస్థలూ ఆలోచిస్తున్నాయి.ఉరుకులు, పరుగులు నచ్చక..చదువైపోయిన వెంటనే అమెజాన్‌లో జాబ్ వచ్చింది. 9 టు 5 వర్క్ వల్ల పర్సనల్‌గా నేను బావుకుంటున్నదేమీ లేదని రియలైజ్ అయ్యాను. అందుకే లాస్టియర్ జాబ్ మానేసి ఫ్రీలాన్సర్‌గా మారాను. దీనివల్ల డబ్బుతో పాటు జాబ్ శాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతోంది. అంతేకాదు చుట్టుపక్కలవాళ్లకు తోచిన సాయం చేయగలుగుతున్నాను. నాకు ట్రావెల్, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇప్పుడు టైమ్ నా చేతిలో ఉంటోంది కాబట్టి, మ్యూజిక్ షోస్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన చోటికి వెళ్తున్నాను. – కార్తిక్ సిరిమల్ల, హైదరాబాద్డబ్బును కాదు టైమ్‌ని చేజ్ చేస్తోందిజర్మనీలో మాస్టర్స్ చేసి, అక్కడే మంచి జాబ్ కూడా సంపాదించుకున్నాను. అయినా హ్యాపీనెస్ లేదు. ఆఫీస్‌లో అన్నేసి గంటలు చేసిన వర్క్‌కి ఎండ్ ఆఫ్ ద డే అంతే ఔట్పుట్ కనిపించలేదు! అంతే శ్రమ నాకు నచ్చిన దాని మీద పెడితే ఆ శాటిస్ఫాక్షనే వేరు కదా అనిపించింది! అందుకే ఇండియాకు వచ్చేసి, థీమ్ రెస్టరెంట్ పెట్టాను. ఆన్లైన్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాను. ఫ్యూచర్లో కొంతమంది ఫ్రెండ్స్‌మి కలసి మాకు నచ్చిన ఓ పల్లెలో కొంచెం ల్యాండ్ కొనుక్కొని మినిమలిస్టిక్ లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నాం. మా జెనరేషన్ డబ్బును చేజ్ చేయట్లేదు. టైమ్‌ని చేజ్ చేస్తోంది. – వుల్లి సృజన్, హైదరాబాద్టాక్సిక్ వాతావరణం..యూకేలో ఏంబీఏ చేశాను. కొన్ని రోజులు హెచ్ఆర్ జాబ్‌లో ఉన్నాను. కానీ ఆఫీస్‌లోని టాక్సిక్ వాతావరణం నచ్చక వదిలేశాను. నాకు ముందు నుంచీ ఫ్యాషన్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్. అయితే జాబ్ వదిలేయగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. నాకు బ్యూటీపార్లర్ పెట్టాలనుందని చెప్పాను. పెళ్లి ఖర్చులకు ఎంతనుకున్నారో అందులో సగం నా బిజినెస్‌కి హెల్ప్ చేయమని అడిగాను. ఏడాదిలో పికప్ కాకపోతే పెళ్లికి ఓకే అనాలనే షరతు మీద డబ్బిచ్చారు నాన్న. ఇంకొంత లోన్ తీసుకుని పార్లర్ అండ్ స్పా పెట్టాను. ఏడాదిన్నర అవుతోంది. మంచిగా పికప్ అయింది. – ప్రత్యూష వావిలాల, కరీంనగర్. -
నాపై 74 తులాల బంగారం చోరీ కేసు, చచ్చిపోదామనుకున్నా:నటి
జూనియర్ ఆర్టిస్ట్, నటి సౌమ్య శెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిందంటూ కొద్దిరోజుల క్రితం ఓ వార్త వైరలైంది. విశాఖపట్నం దొండపర్తిలో రిటైర్డ్ పోస్టల్ అధికారి జనపాల ప్రసాద్‌బాబు ఇంట్లో 74 తులాల బంగారం చోరీ చేసిందంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ నగల్లో కొంత విక్రయించి గోవా వెళ్లి ఎంజాయ్ చేయగా మిగిలిన 40 తులాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నోరు నొక్కేస్తున్నారు బెయిల్‌మీద బయటకు వచ్చిన సౌమ్య ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నా మీద తప్పుడు కేసు పెట్టారు. లేనిపోని నిందలు వేశారు. రిమాండ్‌లో లేకపోయినా రిమాండ్‌లో ఉంది, జైల్లో ఉందంటూ అసత్య ప్రచారం చేసి నన్ను జాతీయ స్థాయిలో పాపులర్ చేశారు. బయటకొచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి నోరు నొక్కేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా.. కానీ నా భర్త బతికి పోరాడాలని చెప్పారు. ఫైట్ చేస్తాను. పోరాడతా.. మీరు అబద్ధాన్ని నిజం చేశారు. కానీ నన్ను భయపెట్టలేరు. నాకు దొంగ అని ట్యాగ్ వేసి పిచ్చికుక్కను చేసి జైల్లో వేద్దామనుకున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. నేనూ నా నిజం చెప్పుకోవాలి. కోర్టులో ఏది రుజువు కాకముందే నా జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేశారు. నా వైపు దేవుడున్నాడు. పోరాడతాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. అలాగే రిటైర్డ్ పోస్టల్ అధికారి కుటుంబానిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తనపై దుష్ప్రచారం చేసిన గీతూరాయల్, ధనుష్‌లపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Soumya killampalli (@soumyashettysomu23) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే.. మరి థియేటర్లో..! -
పరీక్ష వేళ భవిష్యత్తు అంధకారం కావొద్దని..
కాటారం (ములుగు): ఓ విద్యార్థిని భవిష్యత్ అంధ కారం కావొద్దని ఆలోచించా రు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి తనకు దూరమైందనే విషయం తెలి యకూడదని.. చివరి పరీక్ష సజావుగా రాయాలని ఆకాంక్షించారు. సదరు విద్యార్థిని పరీక్ష రాసేలా కృషి చేశారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో గురువారం జరి గిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రొంటాల రమాదేవికి, కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త కరోనా సమ యంలో మృతి చెందాడు. కూతురు సౌమ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. రమాదేవి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బుధవారం కొడుకును తీసుకుని ద్విచక్ర వాహ నంపై ములుగు ఆస్పత్రికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమాదేవి మృతి చెందగా...కొడుకు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయాన్ని సౌమ్య కుటుంబ సభ్యులు కళాశాలకు తెలియజేశారు. అయితే సౌమ్యకు చివరి పరీక్ష కావడంతో ఆమె భవి ష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల ఆమోదంతో...ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లి మృతి చెందిన విషయం విద్యార్థినికి తెలియకుండా దాచారు. గురువారం పరీక్ష రాసిన సౌమ్య అమ్మ వస్తుందనే సంతోషంతో బయటకు రాగా..అమ్మ కాకుండా బంధువులు వచ్చారు. దీంతో అమ్మకేదో ఆపద వచ్చిందని భావించి ఇంటికి వెళ్లిన సౌమ్య తల్లి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. -
కారు ఎవరిది..? డాక్యుమెంట్లు ఎవరి పేరున ఉన్నాయి..?
హైదరాబాద్: ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా దుర్భాషలాడిన సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్ జాన్‌బీని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. గత నెల 24న రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు గొడుగు విఘ్నేష్ కారులో ఓ యువతి రాంగ్రూట్లో వస్తుండగా అడ్డుకున్నాడు. . దీంతో రెచ్చిపోయిన ఆమె హోంగార్డు విఘ్నేష్ పై దాడి చేయడమేగాక దుస్తులు చించేసి అడ్డువచి్చన పోలీసులను కూడా దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న పోలీసులను ఆటంకం కలిగిస్తూ నోటికొచి్చనట్లు తిట్టడంతో పాటు న్యూసెన్స్‌కు కూడా పాల్పడింది. అదే రోజు రాత్రి హోంగార్డు విఘ్నేష్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతిని సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్జాన్బీగా గుర్తించి ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లి విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమెకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆమె తరపు న్యాయవాదులు పోలీసులకు చూపించారు. అప్పటికప్పుడు ఆమెకు 41ఏ నోటీసు ఇచ్చి రెండు గంటల పాటు విచారించారు. ఆ రోజు నడిపిన జాగ్వార్ కారు ఎవరిది, కారుకు సంబంధించిన డాక్యుమెంట్లను మూడు రోజుల్లో చూపించాలన్నారు. అలాగే మెడిసిన్ కోసం వెళుతున్నట్లుగా ఆమె చెప్పిందని, మెడిసిన్ ప్రిస్కప్షన్ కూడా చూపించాలని ఆదేశించారు. ఆ రోజు రాంగ్రూట్లో వెళ్లడానికి గల కారణం, పోలీసులపై ఎందుకు దుర్భాషలాడారు, హోంగార్డును ఎందుకు అడ్డుకున్నారు అన్న విషయాలపై ఆమెను ప్రశి్నంచారు. మొత్తం ఎనిమిది ప్రశ్నలు సంధించిన పోలీసులు వాటికి జవాబు ఇవ్వాలని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసులో సూచించారు. మూడు రోజుల్లో మరోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని, విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను ఆదేశించారు. నేను ఎవరిపైనా దాడి చేయలేదు అనంతరం సౌమ్యాజాను మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరిపై దాడి చేయలేదని తెలిపింది. ఆరోజు తాను నడిపిన జాగ్వార్ కారు తన స్నేహితులదని, తాను రాంగ్ రూట్లో వెళ్లిన మాట వాస్తవవేనని, తనది పొరపాటేనని తెలిపింది. తనపై మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, త్వరలో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. -
Sowmya Janu: నటి సౌమ్య జాను వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ నటికి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను రాంగ్ రూట్లో రావడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ హౌంగార్డ్ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ కేసుపై నటి సౌమ్య జాను హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సౌమ్యకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా మార్చి 11 లోపు పోలీసుల ఎదుట హాజరు కావాలని సౌమ్యకు హైకోర్ట్ సూచించింది. అసలేం జరిగిందంటే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడికి పాల్పడిందని సినీనటి సౌమ్యజానుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతనెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. -
ఒక అమ్మాయిని బూతులు తిట్టే హక్కు ఉందా?: ఏడ్చేసిన నటి
ఇటీవల హైదరాబాద్‌లో నటి సౌమ్య జాను ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాంగ్ రూట్లో వెళ్తుండగా ట్రాఫిక్ హోంగార్డ్‌తో జరిగిన గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు.. జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను అడ్డగించారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజగా నటి సౌమ్య జాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయంలో తాను రాంగ్ రూట్లో వెళ్లినట్లు తెలిపింది. కానీ ట్రాఫిక్ పోలీస్ వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిజాలు చెప్పుకొచ్చింది. సౌమ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' అసలు నా గురించి వీడియో సోషల్ మీడియాలో వస్తున్న సంగతే తెలీదు. ఇక్కడ పెద్ద బ్లండర్ ఎంటంటే.. నాకు మందు అలావాటే లేదు. నేను రాంగ్‌లో రూట్లోనే వెళ్లా. దీనికి సారీ చెబుతున్నా. నేను మెడిసిన్స్ కోసం వెళ్తున్నా. ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా మదర్‌కు మందులు అర్జెంట్‌గా కావాలి. ఆ విషయం అతనికి కూడా చెప్పాను. కానీ వినకుండా కారు వెనక్కి తీయమన్నారు. తను చాలా ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. కానీ ఆ ఒక్క బూతు మాట నేను తీసుకోలేకపోయాను. రెండు రోజుల నుంచి మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నా. ఆ మాటలకే నాకు కోపం వచ్చింది. అసలు ఆ మాట అనడానికి అతనికి నోరెలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ప్రతి మగాడు.. ఒక ఆడదాన్ని అలా ఎందుకంటాడు.' అంటూ ఏడ్చేసింది. సౌమ్య మాట్లాడుతూ..'ఒక అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు. కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. అయిన వాళ్లను అనే హక్కు ఎవరికీ లేదు. మన సమాజంలో గేలు కూడా ఉంటారు. వాళ్లను ఉద్దేశించి ఎవరికీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఆ దేవుడు వారికి అలాంటి లైఫ్ ఇచ్చాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆ మాటలు నన్ను ఎలా అంటారు. అక్కడ నేనేం నానా హంగామా చేయలేదు. కావాలంటే సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీ. కానీ అతను అన్న మాటలకు నా కుటుంబం నరకం అనుభవిస్తున్నాం. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంటి ఇలా అయింది? అని అడుగుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఆ రోజు నాకు మా అమ్మ ఆరోగ్యమే ముఖ్యం. అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఎక్కడికీ పోలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. అతను చేసింది మాత్రం చాలా తప్పు. దీనిపై ఎంతవరకైనా పోరాడతా' అని అన్నారు. -
జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి
న్యూఢిల్లీ: అరవై ఏళ్ల వయసులో కూతురు హత్యకు గురైంది. 2008లో కూతురు చనిపోయిన తర్వాతి రోజు నుంచి ఆ తండ్రి దినచర్య పూర్తిగా మారిపోయింది. కూతురిని చంపిన వారికి శిక్ష పడేందుకు 15 ఏళ్లు ప్రతిరోజు ఆయన శ్రమించాడు. ఎక్కడా అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ పట్టు వదలని విక్రమార్కునిలా తిరిగాడు. చివరకు ఈ ఏడాది నవంబర్ చివరిలో తన కూతురును చంపిన నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష పడేలా చేశాడు. విషాదమేంటంటే కూతురు 41వ జయంతికి ముందు రోజు శనివారం ఆ 82 ఏళ్ల తండ్రి కన్నుమూశాడు. ఢిల్లీలోని ఓ న్యూస్ ఛానల్లో విధులు ముగించుకుని సొంత కారులో ఆలస్యంగా ఇంటికి వస్తున్న టీవీ జర్నలిస్టు సౌమ్యను 2008 సెప్టెంబర్ 30న నలుగురు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.ఈ కేసు విచారణ 15 ఏళ్ల పాటు నడిచింది. రెండు వారాల క్రితమే కోర్టు నలుగురు నిందితులకు శిక్ష విధించింది. నిందితులను దోషులుగా నిరూపించడం వెనుక సౌమ్య తండ్రి విశ్వనాథన్ తీవ్ర కృషి ఉంది. 15 ఏళ్ల పాటు రోజు పొద్దున్నే లేచి కూతురు హత్య కేసు ఫాలోఅప్ చేయడమే ఆయన పని. అయితే అనుకున్నది సాధించి కూతురును చంపిన వారికి శిక్ష వేయించిన తర్వాత కొద్ది రోజులకే ఆయన కన్ను మూయడం పలువురి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్ -
జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ సాకేత్ కోర్టు శనివారం శిక్షలు ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈమేరకు జడ్జి రవీంద్రకుమార్ పాండే తీర్పు వెలువరించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పుఇచ్చింది. అయితే క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్(శిక్ష ఎంత) అన్నది తేల్చడానికి శుక్రవారం వరకు కోర్టు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరపు వాదనలు విన్నది. వాదనల అనంతరం నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 2008లో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ టీవీ చానళ్లో పనిచేస్తున్న జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ విధులు ముగించుకుని తెల్లవారు జామున ఇంటికి తిరిగి వెళుతోంది. ఇదే సమయంలో నలుగురు నిందితులు కారును అడ్డగించి ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు అతి జాగ్రత్తగా విచారణ జరిపి సాక్షాధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడేలా చేశారు. ఇదీచదవండి...ఎల్1కు చేరువలో ఆదిత్య : ఇస్రో చైర్మన్ -
ఒక టెకీ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కొత్త ఒరవడి సృష్టించింది!
సౌమ్యంగా సాధించింది సౌమ్య ఈ తరం టెకీ. సాంకేతికతను ఆరోగ్యానికి అద్దింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో వైద్యరంగంలో కొత్త ఒరవడి తెచ్చింది. వైద్యరంగం, ఔషధాల తయారీ రంగాలు సాంకేతికతను అందుకోవాల్సినంత వేగంగా అందుకోవడం లేదనుకుంది సౌమ్య. ‘మల్టిప్లైయర్ ఏఐ’ పేరుతో హెల్త్‌కేర్ రంగంలో ప్రవేశించింది. ఇంత సునిశితమైన, సంక్లిష్టమైన పరిశ్రమను నిర్వహించడం మగవాళ్లకే సాధ్యం అనే అభిప్రాయాన్ని చెరిపేసిందామె. ‘మగవాళ్ల ప్రపంచం అనే భావన మహిళలు ప్రవేశించేటంత వరకే. ఒకసారి మహిళలు ప్రవేశిస్తే ఇక అది అపోహ మాత్రమేనని నిర్ధారణకు వచ్చేస్తాం. మా టీమ్ లో సగానికి పైగా మహిళలే. సేల్స్ విభాగంలో కూడా మహిళలు సమర్థంగా పని చేస్తున్నార’ని చెప్పింది. ఒక టెకీ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి దారితీసిన పరిస్థితులను, హైదరాబాద్‌లో సంస్థ స్థాపించి సక్సెస్ అందుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు సౌమ్య. భారీ మూల్యం చెల్లించాం ‘‘నన్ను హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోకి రప్పించిన కారణాలు అత్యంత బాధాకరమైనవి. మాది ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ (అలహాబాద్). నాన్న రవిప్రకాశ్ శ్రీవాస్తవ ఐఏఎస్ ఆఫీసర్. నాన్న డయాబెటిస్తో బాధపడుతుండేవారు. రొటీన్ టెస్ట్‌లు, మెడికేషన్ ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. మా జీవితాలు భారీ మూల్యం చెల్లించుకున్న పొరపాటు అది. వైద్యుల నిర్లక్ష్యం, రాంగ్ మెడికేషన్ కారణంగా ఆయన హటాత్తుగా ప్రాణాలు వదిలారు. నేనప్పుడు బీటెక్ సెకండియర్‌లో ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసంవత్సరాల్లోనే అమ్మకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. మేము తెలుసుకునేటప్పటికే వ్యాధి మూడవ దశకు చేరింది. చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆరు నెలలకే అమ్మను కూడా కోల్పోయాను. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాను. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ వైద్యరంగం ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడుతోంది. ఆ వెనుకబాటు తెచ్చిన నష్టంలో మా అమ్మానాన్నల మరణాలు కూడా భాగమేననిపించింది. ఈ రెండు రంగాల మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయాలనే సంకల్పం కలిగింది, చేయగలననే నమ్మకం కూడా. సమాచారలోపం తలెత్తని విధంగా మెడికల్ డాటాను పరిరక్షించగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాను. మల్టిప్లైయర్ ఏఐ స్థాపించి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా డాటా అనలైజేషన్, డాటా మెయింటెయిన్ చేస్తున్నాం. మా సంస్థకు ‘ఐఎస్ఓ 27001’ సర్టిఫికేట్ వచ్చింది. మా సర్వీస్‌ను దేశవిదేశాల్లో పెద్ద ఆరోగ్య సంస్థలు తీసుకుంటున్నాయి. పేషెంట్ కేర్‌లో మొదటిది పేషెంట్ ఆరోగ్య చరిత్ర, క్రమం తప్పని పరీక్షల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, పరీక్షల నివేదికల నిర్వహణ ప్రధానమైనవి. ఇక్కడ పొరపాటు జరిగితే ప్రాణాలు దక్కవని చెప్పడానికి మా పేరెంట్సే ఉదాహరణ. ఫాలో అప్ సర్వీస్ వ్యాధి నిర్ధారణ ఆధారంగా వైద్యం అందించిన తర్వాత తదనంతర పరీక్షలను, వైద్యాన్ని అందించాల్సిన సమయానికి ఫాలో అప్ చేయడం కూడా మా సర్వీస్‌లో భాగంగా ఉంది. అలాగే భవిష్యత్తులో టెలిమెడిసిన్ విస్తరించాల్సిన అవసరం ఉంది. వైద్యచికిత్సను కుగ్రామాలకు చేరడానికి చక్కటి మాధ్యమం ఇది. పేషెంట్‌ను ఉన్న చోటనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని మానిటర్ చేయడం సాధ్యమవుతుంది. నేను చదివిన టెక్, బయోటెక్ పరిజ్ఞానం ఇందుకు దోహదం చేసింది. నాకు సవాళ్లు ఎదురయ్యాయా అంటే సవాళ్లు లేని ప్రొఫెషన్ అంటూ ఏదైనా ఉంటుందా? డిజిటల్ బ్రాండింగ్, మార్కెటింగ్‌లో అవరోధాలు వచ్చాయి. మా క్లయింట్ల సందేహాలను తీరుస్తూ, వాళ్లు సమాధానపడే వరకు సహనంగా వివరించాం. సవాళ్లకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు పోవడమే సక్సెస్‌కు దారి తీస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మా నాన్నను కోల్పోవడమే నన్ను ఈ రంగం వైపు నడిపించింది. ప్రతి విజయంలో మా అమ్మానాన్న కనిపిస్తున్నారు’’ అని వివరించారు సౌమ్య. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి
30 వేలు, 40 వేల ఓట్లతో ఓడిపోవడం వేరు. రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినప్పుడు అందరితో పాటు ఓటమి పాలైతే పెద్ద బాధ ఉండదు. కానీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్రమంతా హస్తం పవనాలు వీచాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి 160 ఓట్లతో గెలిచి హమ్మయ్య అనుకున్నారు. కానీ బీజేపీ డిమాండ్‌తో పదే పదే రీకౌంటింగ్ జరిపి చివరకు 16 ఓట్లతో ప్రత్యర్తిని గెలుపు వరించింది. బెంగళూరు జయనగర నియోజకవర్గంలో అతి స్వల్ప ఓట్లు అభ్యర్థుల రాతను తారుమారు చేశాయి. బెంగళూరు: ఐటీ సిటీలో జయనగర నియోజకవర్గంలో నాటకీయ పరిణామాల మధ్య విజేత మారిపోయారు. తొలుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో సంబరాలు మిన్నంటాయి. అంతలోనే బీజేపీ నాయకులు పట్టుబట్టి రీకౌంటింగ్ చేయించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి సీకే.రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ ఏకధాటిగా హైడ్రామా టెన్షన్ పుట్టించింది. పోటాపోటీగా రౌండ్లు జయనగర ఎస్‌ఎస్‌ఎంఆర్‌వీ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ఆరంభమైంది. ప్రతి రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సౌమ్యారెడ్డి 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ప్రకటించగానే ఆమెతో పాటు కార్యకర్తల సంతోషానికి హద్దుల్లేవు. కానీ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి రామూర్తి డిమాండ్ చేయడంతో మళ్లీ రీకౌంటింగ్ ప్రారంభించారు. చదవండి: ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ? గెలుపు ప్రకటన జిల్లా ఎన్నికల అధికారి తుషార్ గిరినాథ్ రీకౌంటింగ్ చేసిన విధానం గురించి నేతలకు వివరించి, సీకే రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. బీజేపీకి 57,797 ఓట్లు, కాంగ్రెస్‌కు 57,781 ఓట్లు వచ్చాయని తెలిపారు. కార్యకర్తల ధర్నా దీంతో కాంగ్రెస్ నేతలు గత్యంతరం లేక ఇంటి ముఖం పట్టారు. గెలుపు దక్కి మళ్లీ ఓటమి పాలు కావడంతో సౌమ్యారెడ్డి విలపించారు. 16 ఓట్ల మెజారిటీతో సీకే రామూర్తి గెలుపు సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌంటింగ్‌లో గోల్మాల్ జరిగిందంటూ అర్దగంటకు పైగా ధర్నాకు దిగారు. కాగా, ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని సౌమ్యారెడ్డి నిర్ణయించారు. పదేపదే ఓట్ల లెక్కింపు మొదటిసారి నిర్వహించిన రీకౌంటింగ్‌ను ఇద్దరు అభ్యర్థులు ఒప్పుకోలేదు. దీంతో వరుసగా మూడుసార్లు రీకౌంటింగ్ చేశారు. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఎంపీ డీకే.సురేశ్, కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్, ఇక బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎంపీ తేజస్విసూర్య మకాం పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
Football: అదరగొట్టిన సౌమ్య గుగులోత్.. భారత్ శుభారంభం
Women's Olympic Football Tournament Paris 2024- Asian Qualifiers బిష్కెక్: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రౌండ్–1లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘జి’లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ విశేషంగా రాణించింది. నిజామాబాద్ బిడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ మ్యాచ్‌లో ఒక గోల్ చేయడంతోపాటు సహచరిణి అంజు తమాంగ్ రెండు గోల్స్ చేయడంలో సహాయం చేసింది. భారత జట్టుకు అంజు తమాంగ్ (6వ, 42వ ని.లో) రెండు గోల్స్ అందించగా... సౌమ్య గుగులోత్ (45+3వ ని.లో), షిల్కీ దేవి (61వ ని.లో), రేణు (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించి పెట్టారు. శుక్రవారం కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుతోనే భారత్ రెండో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘జి’లోని మూడో జట్టు తుర్క్మెనిస్తాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్ అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు -
World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ
కోయంబత్తూరులో కోడి పలావు, అమృత్‌సర్‌లో కుల్చా, లక్నోలో కబాబులు.. ఉడిపిలో ఇడ్లీ... కొత్త ప్రాంతాలు చూస్తూ అక్కడ దొరికే తిండిని రుచి చూస్తూ జీవితం గడిచిపోతుంటే ఎలా ఉంటుంది? సౌమ్య జీవితంలానే ఉంటుంది. ఐటిలో పని చేసే సౌమ్య ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ ట్రావెల్ రైటర్ అయ్యింది. భర్త విషుతో కలిసి ‘రోడ్ టు టేస్ట్’ అనే వ్లోగ్‌ని నడుపుతుంది ఆమె. నెలలో ఒక్క కొత్త ప్రాంతాన్నైనా రోడ్డు మార్గంలో చూసి అక్కడి తిండి తినాలన్నది సౌమ్య లక్ష్యం. ఇవాళ ‘వరల్డ్ టూరిజం డే’. లోకం చాలా విశాలమైనది. రుచులు లెక్కలేనివి. తిరుగుతూ తినే అనుభూతి ఈ సెలవుల్లో ట్రై చేయండి. ఊరికే శాంపిల్‌కి సౌమ్య తన భర్త విషుతో వేసిన ఒక ట్రిప్‌ను తెలుసుకుందాం. దాని పేరు ‘దక్షిణ భారతదేశంలో మంచి బిర్యానీని కనుగొనుట’. అంతే. కారు వేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు. ముందు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ‘షాబాద్’ లో బిర్యానీ టేస్ట్ చూశారు. ‘షా గౌస్’నూ వదల్లేదు. అక్కణ్ణుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడి అలీబాబా కేఫ్‌లో ఫేమస్ ‘భత్కలీ బిర్యానీ’ తిన్నారు. ఆ తర్వాత అక్కడే ‘చిచాబాస్ తాజ్’ అనే రెస్టరెంట్లో దొరికే బిర్యానీ తిన్నారు. కీమా బిర్యానీ టేస్ట్ చూశారు. నాగార్జున రెస్టరెంట్లో దొరికే ‘తర్కారీ బిర్యానీ’ (వెజ్ బిర్యానీ) లాగించారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి దారిలో ‘అంబూర్’లో ఆగి అంబూర్ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చెన్నైలో మెరినా బీచ్‌లో సేద తీరి చెన్నైలో దొరికే ‘షాదీ బిర్యానీ’ తిన్నారు. చెన్నైలోని ఫేమస్ ‘చార్మినార్ బిర్యానీ సెంటర్’ అనే చిన్న షాపులోని బిర్యానీ వంకాయ కూరతో తిన్నారు. కల్యాణ్ భవన్లో దొరికే బిర్యానీ వంతు తర్వాత. అక్కడి నుంచి కోయంబత్తూరు బయలుదేరి మధ్యలో మహాబలిపురంలో ఒక బిర్యానీ టేస్ట్ చూశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో దిండిగుల్ మటన్ బిర్యానీకి లొట్టలు వేశారు. చివరకు ఈ ప్రయాణం కేరళలోని కాలిట్లో దొరికే మలబార్ బిర్యానీతో ముగిసింది. ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూచుని ఉంటే ఇన్ని ఊళ్ల మీదుగా ఇన్ని బిర్యానీలు తినే వీలు ఉండేదా? అసలు లోకం తెలిసేదా? ఇన్ని రుచులతో ఇన్ని స్థలాలు ఉన్నాయని ఇందరు మనుషులు వీటిని సిద్ధం చేస్తున్నారని ఎలా తెలియాలి? ప్రయాణాలు చేయాలి. సౌమ్య తన భర్త విషుతో కలిసి చేసే పని అదే. అందుకే ఆమె తన వ్లోగ్కు ‘రోడ్ టు టేస్ట్’ అని పెట్టింది. 2015లో పెళ్లి– ప్రయాణం సౌమ్య, విషులు తమ సొంత ఊళ్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచమే వారి ఊరు. మొత్తం మీద ఇద్దరూ టీనేజ్ వయసు నుంచి సోలో ట్రావెలర్లుగా ఉన్నారు. కాని విషు పని చేసే ఐ.టి కంపెనీలోనే సౌమ్య కూడా చేరడంతో కథ ఒక దారిన పడింది. ‘మన టేస్ట్ ఒకటే’ అని ఇద్దరూ గ్రహించారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘జీవితం అంటే తిరగడమే’ అనేది వీరి పెళ్లికి ట్యాగ్‌లైన్. 2016లో ‘రోడ్ టు టేస్ట్’ వ్లోగ్ మొదలెట్టారు. ఇన్‌స్టాలో కూడా తమ అనుభవాలు, ఫోటోలు పెడతారు. సోషల్ మీడియాలో ఈ జంట చాలా పాపులర్ అయ్యింది. రోడ్డు మార్గం గుండా తిరుగుతూ కొత్త ప్రాంతాల విశేషాలతో పాటు అక్కడి ఆహారం గురించి తెలియ చేస్తారు. కంటికి, కడుపుకి వీరిచ్చే విందు అందరికీ నచ్చింది. ఇప్పటికి వీరు కలిసి 30 దేశాల్లో 100 నగరాలు చూశారు. ఇన్ని మనం చూడకపోయినా మన దేశంలోనే 30 టూరిస్ట్ ప్లేస్‌లు చూడగలిగితే చాలు. డబ్బులూ వస్తాయి ఒక రంగంలో మనం ఫేమస్ అయితే డబ్బులూ వస్తాయి. సౌమ్య కూడా డబ్బు సంపాదిస్తోంది. అనేక ప్రాడక్ట్‌లను ప్రమోట్ చేయమని కంపెనీలు డబ్బులిస్తాయి. ఉదాహరణకు ‘మిల్టన్’ వారు ఒక ట్రిప్‌కు స్పాన్సర్ చేస్తారు. ఆ విశేషాలు రాసేప్పుడు సౌమ్య మిల్టన్ ఉత్పత్తి ఏదైనా తన ప్రయాణంలో ఉన్నట్టు చూపుతుంది. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే పోస్టర్ ఇచ్చి హిమాలయ బేస్ క్యాంప్‌కు వెళ్లమంటే వెళ్లి అక్కడ దానిని చూపుతూ ఫొటో దిగుతారు. ప్లస్ ప్రయాణ వివరాలు రాస్తారు. అంటే ఉభయతారకం అన్నమాట. భ్రమణ కాంక్ష స్త్రీలైనా పురుషులైనా తిరగాలి. సౌమ్య, విషులకు ఉండే ఆర్థిక శక్తి, ఇంగ్లిష్ ప్రావీణ్యం మనకు లేకపోవచ్చు. కాని పొదుపుగా తక్కువ ఖర్చులో చేసే విహారాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు, తెలంగాణలో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు కనీసం చూసి ఉండాలి. ఆ తర్వాత సౌత్‌లోని ఒక్కో రాష్ట్రం చూడాలి. తర్వాత నార్త్. తర్వాత ఈశాన్యం. తిరుగుతూ ఉంటే ఈ లోకం ఇంత పెద్దది... చిన్న మనసుతో బతక్కూడదు అనిపిస్తుంది. అది చాలదూ? -
‘గేమ్’ చేంజర్: స్థానిక భాషల్లో కంటెంట్.. సూపర్ హిట్! సౌమ్య విజయ రహస్యం ఇదే!
మనస్తత్వశాస్త్రంలోని ఒక మంచిమాట... ‘నువ్వు సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తే... సమస్యలు మాత్రమే కనిపిస్తాయి. పరిష్కారాల గురించి ఆలోచిస్తే... ఎన్నో పరిష్కారాలు నిన్ను వెదుక్కుంటూ వస్తాయి’.. మనస్తత్వశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న సౌమ్యసింగ్ రాథోడ్ సమస్యల కంటే ఎక్కువగా పరిష్కారాల గురించి ఆలోచించింది. అందుకే గేమింగ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా దేశంలోని మహిళా సంపన్నుల జాబితా (హురున్ పవర్–లీడింగ్ వెల్దీ ఉమెన్ 2021)లో చోటు సాధించింది... ‘ది యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్’లో మనస్తత్వశాస్త్రం చదువుకున్న సౌమ్య సింగ్ రాథోడ్ ఆ తరువాత ‘జో రూమ్స్’ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఉద్యోగంలోనే ఉండి ఉంటే ఏం జరిగేదో తెలియదుగానీ, ఆ ఉద్యోగాన్ని వదిలి కొత్త అడుగు వేయడం ఆమె జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పింది. భారత్ గేమింగ్ ఆన్లైన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసేలా చేసింది. నాలుగు సంవత్సరాల క్రితం... పవన్ నందాతో కలిసి దిల్లీ కేంద్రంగా ‘విన్ జో’ పేరుతో సోషల్ గేమింగ్ యాప్ మొదలుపెట్టినప్పుడు విజయాల కంటే సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతో ఉత్సాహంతో మొదలైన గేమింగ్ యాప్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. ఆ సమయంలో చిన్నపాటి పరిశోధన మొదలుపెట్టింది సౌమ్య. ఏ వయసు వాళ్లు ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారు? ఏ జానర్‌ను ఇష్టపడుతున్నారు? పట్టణవర్గాల వారు మాత్రమే ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? ... ఇలా కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకొని సమాధానాలు తెలుసుకుంది. ‘యూజర్స్ లో 80 శాతం నాన్–ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారు’ అనే వాస్తవం తెలుసుకున్నాక స్థానిక భాషల్లో కంటెంట్‌ను తీసుకువచ్చింది. ఇది బాగా హిట్ అయింది. ఒకప్పుడు ‘యువతరం ఈ జానర్ మాత్రమే ఇష్టపడుతుంది’ అనే సూత్రీకరణ ఉండేది. అయితే ఇది తప్పు అని, ఎప్పటికప్పుడూ కొత్త జానర్స్‌ని ఇష్టపడుతున్నారని తన అధ్యయనంలో తెలుసుకుంది. ‘క్విక్ ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంతో రకరకాల జానర్స్‌లో యూత్‌ను ఆకట్టుకునే గేమ్స్ రూపొందించింది. స్మార్ట్‌ఫోన్ అనేది సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాక ‘విన్ జో’ జోరు పెరిగింది. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా అని ‘లాభాలే ప్రధానం’ అనుకోలేదు సౌమ్య. ‘రెస్పాన్సిబిలిటీ గేమింగ్’కు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ప్లాట్ఫామ్లో రకరకాల చెక్ పాయింట్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు గంటల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ప్లేయర్‌ను హెచ్చరిస్తారు. ప్లేయర్ వరుసగా గేమ్స్ లాస్ అవుతుంటే, తిరిగి ఆడడానికి అనుమతించకుండా ఉచిత ట్యూటోరియల్స్‌లో అవకాశం కల్పిస్తారు. విన్ జో’ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు 25,000 మంది మైక్రో–ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి పనిచేసింది విన్ జో. ఇప్పుడు వారి సంఖ్య లక్షకు చేరింది. ఈ సంఖ్య రాబోయే సంవత్సర కాలంలో రెట్టింపు చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘మన విజయానికి సామాజిక బాధ్యత తోడుకావాలి’ అని నమ్మడమే కాదు ఆచరించి చూపిస్తోంది సౌమ్య సింగ్ రాథోడ్. చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్ వద్దనుకుని.. -
భర్తతో వీడియో కాల్.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్
గాజా సిటీ : ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య వైషమ్యాలు అక్కడ రక్తపుటేరులు పారిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య జరిగిన దాడుల్లో 28 పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 16 మంది ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే మరణించిన వారిలో కేరళకు చెందిన మహిళ సౌమ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందిన ఎంఎస్ సౌమ్య ఏడేళ్లుగా ఇజ్రాయెల్ అష్కెలోన్ నగరంలో పని మనిషిగా చేస్తోంది. తాజాగా పాలస్తీనా జరిపిన రాకెట్ దాడిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అష్కెలోన్ నగరంలో తన నివాసంలో ఉన్న సౌమ్య మంగళవారం సాయంత్రం భర్త సంతోశ్‌తో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా వదిలిన రాకెట్ ఆమె ఇంట్లో పడి పేలింది. ఒక్కసారిగా పేలడంతో ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. "వీడియో కాల్ సమయంలో నా తమ్ముడు భారీ శబ్ధం విన్నాడు. అకస్మాత్తుగా సౌమ్య ఫోన్ డిస్ కనెక్ట్ అయ్యింది. దీంతో భయాందోళనకు గురైన మేం సౌమ్య స్నేహితులకు ఫోన్ చేశాం. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది అని వారు చెప్పారు’ అని సౌమ్య బావ సాజీ స్థానిక మీడియాతో తెలిపారు. -
ఆరిపోయిన దీపం.. శవమైన సౌమ్య
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ ఇంటి దీపం ఆరిపోయింది.. హాయిగా నవ్వుకుంటూ.. నవ్వి స్తూ నట్టింట్లో తిరుగాడిన ఆ చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామంలో ఉదయం అదృశ్యమైన చిన్నారి మృతదేహం బుధవారం తన ఇంటికి సుమారు 2కి.మీ దూరంలో ఉన్న నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో లభ్యమైంది. ఈ సందర్భంగా ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో సంతానమైన మాల సౌమ్య(2) మంగళవారం ఉదయం ఇంటి ఎదుట ఆడుకుంటుండగానే అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, గ్రా మస్తులందరు గ్రామంలో గాలించినప్పటికి ఎలాంటి ఆచూ కీ లభ్యం కాలేదన్నారు. దీంతో వారు మధ్యాహ్నం చిన్నారి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌లతో కలిసి బృందాలుగా ఏర్పడి గ్రామంలో గాలించామన్నారు. చివరికి కామారెడ్డి నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా అది గ్రామ శివారులో కొంతదూరం వెళ్లి ఆగి పోయిందన్నారు. రాత్రి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో వెనుదిరిగామని, బుధవారం ఉదయం గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో చిన్నారి సౌమ్య మృతదేహం తేలడంతో గ్రామస్తులు తమకు సమాచారం అందించారన్నారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కిష్ట య్య, స్వరూప దంపతులకు ముగ్గు రు సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఒక బాలుడు ఉన్నారు. బ్యాక్‌వాటర్ వరకు వెళ్లడం సాధ్యమేనా..? ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామంలో రెండేళ్ళ చిన్నారి సౌమ్య మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా అదృశ్యమై నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో మృతదేహమై తేలడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి 2కి.మీ దూరంలో ఉండే నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ వరకు రెండేళ్ల చిన్నారి ఎలా నడవగలుగుతుందనే సందేహం ప్రతిఒక్కరిలో కలుగుతోంది. మరో వైపు చిన్నారి మంగళవారం తప్పిపోయి ఉండి నీళ్లలో పడి ఉంటే నీటిలో శవం ఉబ్బి ఉండాల్సి ఉండేది. కాని చిన్నారి నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో కొద్ది గంటల క్రితమే పడినట్లు ఆనవాళ్ళు కనిపించాయని స్థానికులు పేర్కొన్నారు. చిన్నారి కుటుంబానికి ఎవరైనా హాని కలిగించాలనే ఉద్దేశంతో జరిగిందా లేదా కావాలనే చిన్నారిని హత్యచేసి బ్యాక్ వాటర్‌లో పడేశారా అనే సందేహాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు త్వరగా చిన్నారి మృతి కేసు ను ఛేదించి హంతకులకు శిక్ష పడేలా చర్యలను తీసుకోవాల ని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రేమోన్మాదం
మహబూబ్‌నగర్ క్రైం: ప్రేమను నిరాకరించడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. బ్లేడ్‌తో యువతి గొంతు కోయడమే కాకుండా తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘట న చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం బాదేపల్లికి చెందిన అనుదీప్ స్విట్స్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు చెందిన సౌమ్య(18) కూడా చదువుతోంది. ఇద్దరూ క్లాస్మేట్స్ కావడంతో ఏడాదిగా తనను ప్రేమించాలంటూ అనుదీప్ ఆమెపై ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరిస్తూ వస్తుంది. ఇటీవల వేధింపులు తీవ్రం కావడంతో యువతిని ఆమె తల్లిదండ్రులు కళాశాల మాన్పించారు. దీంతో ఆగ్రహించిన అనుదీప్.. సోమవారం రాత్రి సౌమ్య ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని ఇంట్లో చొరబడ్డాడు. అక్కడ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనుదీప్ తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్‌తో ఆమె గొంతు, తల భాగంలో కోశాడు. భయాందోళనతో ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు అనుదీప్‌ను బంధించారు. అయితే అనుదీప్ కుర్చీలపై దుస్తులు వేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో అతనికి గాయాలయ్యాయి. అలాగే.. బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు గాయపడిన అనుదీప్‌ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్యతో ఎస్పీ రెమారాజేశ్వరి, డీఎస్పీ భాస్కర్ మాట్లాడారు. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
మహిళా డాక్టర్‌పై యనమల కక్ష సాధింపు
-
ప్రభుత్వ వైద్యురాలిపై ఆర్థికమంత్రి కక్షసాధింపు
-
ఆరణిలో యువతి ఆత్మహత్య..మేనమామ కూడా..
తిరువణ్ణామలై: ఆరణిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా ఈబీనగర్కు చెందిన వేలు, రేణుకల కుమార్తె సౌమ్య(17). వేలు అనారోగ్యంతో మృతి చెందాడు. సౌమ్య పదో తరగతి పూర్తి చేసింది. మూడు సంవత్సరాలుగా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సౌమ్య శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లి రేణుక, బంధువులు కలిసి సౌమ్య మృతి విషయాన్ని పోలీసులకు తెలపలేదు. ఇదిలా ఉండగా ఆరణిలో ఉన్న సౌమ్య పెద్దమ్మ గౌరీకి రాత్రి 8 గంటలకు ఈ విషయం తెలిసింది. ఆమో వెంటనే అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరైంది. అప్పుడు సౌమ్య మృతిలో అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన సౌమ్య బంధువులు ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. సౌమ్య మృతిలో అనుమానం ఉందని వీటిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు చేసేది లేక విచారణ చేపట్టారు. ప్రియుడు ఆత్మహత్యాయత్నం.. సౌమ్య మేనమామ, ప్రియుడుడైన నెసొలి గ్రామానికి చెందిన రగురామన్ సౌమ్య ఆత్మహత్య విషయం తెలిసింది. దీంతో అతను ఇంట్లోనే ఉరేసుకోవడానికి యత్నించాడు. ఇది గమనించిన అతని బంధువులు, కుటుంబీకులు రగురామన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
జయనగరలో జై ఎవరికి?
జయనగర: బీజేపీని అధికారం నుంచి దూరం పెట్టడంలో సఫలమైన కాంగ్రెస్, జేడీయస్ పార్టీలు తమ పొత్తును జయనగర, రాజరాజేశ్వరినగర నియోజకవర్గ ఎన్నికల్లో కొనసాగించే యత్నాల్లో ఉన్నాయి. రాజరాజేశ్వరినగర నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ 28వ తేదీ జరగనుండగా 31వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జయనగర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థిగా కాళేగౌడ పోటీ చేస్తున్నారు. ఈయన జయనగర నియోజకవర్గానికి సుపరిచితుడు కాగా ఒక్కలిగ ఓట్లనే నమ్ముకున్నారు. కానీ కాంగ్రెస్– జేడీఎస్ కూటమికి అధికారం దక్కడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. జయనగరలో సౌమ్యారెడ్డికి జేడీఎస్ మద్దతునిస్తుందని, ప్రతిగా రాజరాజేశ్వరినగరలో జేడీయస్ అభ్యర్థి రామచంద్రకు కాంగ్రెస్ మద్దతునిచ్చే విధంగా ఇరుపార్టీలు చర్చలు జరిగినట్లు తెలిసింది. జయనగరను కాంగ్రెస్‌కు వదిలిపెట్టి ఆర్ఆర్.నగరను తమకు ఇవ్వాలని జేడీఎస్ ఆలోచిస్తోంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఒక్కలిగ ఓటర్లు ఉండటంతో హెచ్డీ.రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ రాజరాజేశ్వరినగర నుంచి పోటీచేయాలని ప్రయత్నించారు. కానీ కుటుంబ రాజకీయాలు కొనసాగిస్తున్నారనే అపకీర్తి వస్తుందనే కారణంతో ప్రజ్వల్‌కు తాత, దళపతి దేవేగౌడ అవకాశం ఇవ్వలేదు. చివరిక్షణంలో బీజేపీ నుంచి జేడీఎస్ చేరి టికెట్ పొందిన రామచంద్ర ఒక్కలిగ వర్గీయుడే. ఆయనకు మద్దతు ఇవ్వాలని జేడీఎస్ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఆర్ఆర్ నగరలో కాంగ్రెస్ తప్పుకునేనా? రాజరాజేశ్వరినగరలో కాంగ్రెస్ అభ్యర్థిగా మునిరత్న పోటీ చేస్తుండగా, జేడీయస్ అభ్యర్ధి రామచంద్రకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ మునిరత్న పోటీ నుంచి తప్పుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే నామినేషన్ వెనక్కితీసుకోవడానికి చివరితేదీ ముగిసింది. ఆయన పేరు, పార్టీ చిహ్నం ఈవీఎంపై ముద్రితమౌతుంది. ఈ సాంకేతిక సమస్యతో జేడీయస్ అభ్యర్థికి మద్దతునివ్వాలా వద్దా అనేది కాంగ్రెస్ ఆలోచిస్తోంది. పోటీ నుంచి తప్పుకునేలా ప్రకటన చేయాలని పార్టీ నేతలు మునిరత్నకు నచ్చజెప్పగలరా? అనేది కూడా అనుమానమే. పొత్తుపై ఇంకా మాట్లాడలేదు: పరమేశ్వర్జయనగర, రాజరాజేశ్వరినగరల్లో జేడీయస్తో పొత్తులేదని ఇప్పటికే తమ అభ్యర్థి బరిలో ఉన్నారని, ఒకవేళ పొత్తు కుదిరితే రెండు పార్టీల సీనియర్ నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. జయనగర బీజేపీ అభ్యర్థిగా ప్రహ్లాద్ జయనగర: జయనగర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ సోదరుడు బీఎన్.ప్రహ్లాద్బాబుకు బీజేపీ టికెట్ కేటాయించింది. తద్వారా సానుభూతి కలిసివస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సుపరిచితులు. ప్రహ్లాద్బాబు ఎంపికపై జయనగర బీజేపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. జయనగరలో కాంగ్రెస్ నుంచి సౌమ్యారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా రవికృష్ణారెడ్డి పోటీ చే స్తున్నారు. జూన్ 11 న పోలింగ్ నిర్వహించనుండగా 16 న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
దారుణానికి ఒడిగట్టింది ఓ లెక్చరర్..
కటక్, ఒడిశా : వివాహ బహుమతిలో బాంబు పెట్టి వరుడి ప్రాణాలను బలిగొన్న కేసులో ఒడిశా పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న బొలన్‌గిరిలో సౌమ్య శేఖర్ సాహూకి రీమా అనే యువతితో వివాహం జరిగింది. వరుడు శేఖర్ సాహూ తల్లి సంజుక్త స్థానిక జ్యోతి బికాశ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కుమారుడి వివాహానికి కొద్దిరోజుల ముందు ఆమెకు ప్రమోషన్ లభించడంతో ప్రిన్సిపాల్ అయ్యారు. దీన్ని ఓర్వలేని ఆమె సహోధ్యాపకుడు పున్‌జీలాల్ మెహర్ ఎలాగైనా సంజుక్త కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకున్నారు. ఈ లోగా తనయుడి వివాహానికి సంజుక్త.. మెహర్‌ను కూడా ఆహ్వానించారు. ఇదే అదునుగా తీసుకున్న మెహర్ వివాహం జరిగిన ఐదో రోజున నవ దంపతులకు బహుమతిని పంపారు. అందులో బాంబు ఉందని తెలీని శేఖర్ సాహూ తన నానమ్మతో కలసి తెరిచాడు. దీంతో బాంబు విస్ఫోటనం చెందడంతో ఇరువురు తీవ్రగాయాలపాలయ్యారు. వారికి చేరువలో ఉన్న వధువు రీమాకు కూడా గాయాలు అయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుడు, అతడి నాయనమ్మ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. వధువు శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు మెహర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతునట్లు పోలీసులు తెలిపారు. -
భర్త స్నేహితుడే హతమార్చాడు
సనత్‌నగర్: ఎర్రగడ్డ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన సౌమ్య హత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలు సౌమ్య భర్త నాగభూషణం స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు. నందనగర్, సూరజ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్, 104 ప్లాట్‌లో నివసించే మెట్రో ఎల్ అండ్ టీ సివిల్ ఇంజనీర్ అయిన నాగభూషణం భార్య సౌమ్య సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. కత్తితో పొడిచిన దుండగుడు ఆమెపై నూనె పోసి నిప్పటించి గది బయట గడియపెట్టి పరారయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎస్ఆర్నగర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్ టీం బృందాలు నాగభూషణం స్నేహితుడు, అతని సహోద్యోగి అనంతపురంకు చెందిన ప్రకాష్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాగభూషణం మెట్రోలో చేరకముందు అస్సోంలో నాలుగేళ్ల పాటు పనిచేశాడు. ఈ సమయంలో ప్రకాష్ పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ తరుచూ నాగభూషణం ఇంటికి వచ్చిపోతుండేవాడు. హత్య జరిగిన రోజు కూడా నాగభూషణం, ప్రకాష్ కలిసి మద్యం సేవించడమేగాక కలిసి భోంచేశారు. అనంతరం ఇద్దరూ బయటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చిన ప్రకాష్ సౌమ్యను హత్య చేసి పరారయ్యాడు. అయితే హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
శీలాపనిందలు
లేని నిందల్ని నీలాపనిందలు అంటారు. శీలం ఉన్నా లేదని అంటే? అది శీలాపనిందే అవుతుంది. మహిళపై దాడికి గొడ్డళ్లు, కొడవళ్లు అక్కర్లేదు. శీలం మీద ఇంత బురద చల్లితే చాలు.. తను చచ్చిపోతుందనుకుంటారు. ఊహు.. మేం ఒప్పుకోం. మా చెల్లి తామరాకు. తనకు ఏ బురదా అంటుకోదు. ఈ కేస్ స్టడీ చదవండి. మగాడి నీచత్వం, స్త్రీ ఔన్నత్యం తెలుస్తుంది. ‘ఈమె డాక్టర్ సౌమ్య. గుడ్ రీసెర్చర్ ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్. పోస్ట్ లంచ్ సెషన్లో ప్రజంటేషన్ ఇస్తారు’ మిస్టర్ మీనన్‌కి నన్ను పరిచయం చేశారు మా డైరెక్టర్. మీనన్ చిరునవ్వుతో గ్రీట్ చేశారు. ‘విమెన్ ఎంపవర్మెంట్ మీద మీ పేపర్ చదివాను. ఎ గుడ్ ఐ – ఓపెనర్’ అన్నారు మీనన్. చాయ్ తాగుతూ ఆ సబ్జెక్టు గురించి పది నిమిషాలు మాట్లాడుకున్నాం. దూరం నుంచి రెండు కళ్లు నా వైపు పదేపదే పరిశీలనగా చూస్తున్నాయి. బహుశా ఇప్పుడు ‘అతడు’ మరో ‘కుట్రకథ’ అల్లుతూ ఉంటాడనుకుంటాను. గిట్టని స్త్రీల ‘క్యారెక్టర్’తో అడుకోవడం.. రాజకీయం చేయడం.. రకరకాల కథలల్లడం అతడి అలవాటు. ఉద్యోగ జీవితంలో పైకి రావడానికి వీటినే నమ్ముకున్నాడు అతడు. ఇక్కడ ‘అతడు’ అంటే అతడొక్కడే కాదు సుమా!‘అతడు’ లాంటి ఇంకొందరి గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును బాగా చేశానని ప్రశంసించారు మా డైరెక్టర్. కొత్త ప్రాజెక్టుల గురించి అరగంటసేపు చర్చించారు. చాలా సంతోషంగా అనిపించింది. అది నా కష్టానికి లభించిన గుర్తింపు. ఆ లెవిల్‌కి రాలేకపోయాడు ‘అతడు’. సంస్థలో తనకు ప్రాధాన్యత లేకపోవడం భరించలేకపోయాడు. ఒక ఉద్యోగినిగా నన్ను ‘చంపేసేందుకు’ పావులు కదిపాడు. ‘క్యారెక్టర్’పై కథలల్లాడు. ఆమె ఉద్యోగం చేయదు.. ఆవిడగారి కోసం ఎవరెవరో వచ్చిపోతుంటారు.. డైరెక్టర్‌కు ఆమె చాలా స్పెషల్.. ఇట్లాంటి మాటలు అనేకంగా ప్రచారంలో పెట్టాడు అతడు. మొదట్లో నేనెంత భయపడిపోయానంటే – సీటులో నుంచి కదల బుద్ధయ్యేది కాదు. నా చుట్టూ ఉన్న వాళ్లని తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాను. డైరెక్టర్ సార్ దగ్గరకి వెళ్లడం బాగా తగ్గించేశాను. నాది వైబ్రెంట్ పర్సనాలిటీ అని ఎక్కడైతే కితాబులు అందుకున్నానో అక్కడే నాలోకి నేను ముడుచుకుపోయాను. తట్టుకోలేక ఏడుస్తూ అమ్మకు అన్నీ చెప్పేశాను. ‘ఎవడు ఎంత చెత్త వాగినా పట్టించుకోవద్దు. పని చేసుకుంటూ పో’ అని సలహా ఇచ్చింది మా అమ్మ. నా వల్ల కాలేదు. కావడం లేదు. తరచూ మనసంతా ఒత్తిడి. ఎడతెరిపి లేని ఆలోచనలు. ‘అమ్మ కూడా ఈ విషప్రచారం నమ్మేస్తే..’ అనే ఆలోచన వచ్చినప్పుడు మరింత దుఃఖం. ‘సౌమ్య హజ్బెండ్ నిన్న ఇక్కడికొచ్చాడు. చాలా పెద్ద హోదాలో ఉన్నాట్ట’ ‘మరెందుకో ఈవిడగారికి ఉద్యోగాలు... హాయిగా ఇంటిపట్టున ఉండొచ్చు కదా’ ‘వాళ్ల రిలేషన్షిప్ లీగలా? ఇల్లీగలా?’ ‘ఆ పైవాడికే తెలియాలి. అతడే భర్తని ఆమె చెప్పుకుంటూ ఉంటది’ ఇలాంటి సంభాషణలకు నారు పోసి నీరు పెట్టింది ‘అతడే’. లేడీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు కుతకుతలాడిపోతుంటారు. మరి వాళ్లు కూడా ‘అతడి’ బాధితులే. నేను రకరకాల ఆలోచనలతో కుంగిపోవడం గమనించాక – లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీకి ఫిర్యాదు చేయమన్నారు నా హజ్బెండ్. ఈలోపే ఇంకో ఘోరం. ప్రమోషన్ లిస్ట్‌లో నా పేరు లేకుండా బోయింది. మనసంతా దిగులు కమ్మేసింది. ఎన్నో మెచ్చుగోళ్లు.. 30 – 40 పబ్లికేషన్లు.. మంచి మంచి లెక్చర్లు.. ఛాలెంజింగ్ ప్రాజెక్టులు.. ఇవేమీ అక్కరకు రాలేదు. ఇలాంటి అకడమిక్ రికార్డ్ లేనప్పటికీ ప్రమోషన్ కొట్టేశాడు ‘అతడు’. మీకు ఉద్యోగాలెందుకు? జీతాలెందుకు? అని నా ఎదుటికొచ్చి ప్రశ్నిస్తున్నాడంటే అతడికి ఎంత దురహంకారం? మనిషిగా, ఒక పౌరురాలిగా నా హక్కుల్ని నిరాకరిస్తున్నాడు ఆ సెక్సిస్ట్. నన్ను సర్పాస్ చేయమని నా మగ సబార్డినేట్లను పురిగొల్పుతున్నాడు. కొత్తగా వచ్చిన డైరెక్టర్ ‘నా జేబులోనే ఉన్నాడు’ అని ఒకటే ప్రేలాపనలు. ఓ వైపు ఆఫీసులో నా ప్రతిపత్తిని దిగజార్చే కుట్రలు. మరోవైపు నా గురించి ఇంటా బయటా ఏమనుకుంటున్నారోననే భయాలు. ఆలోచనలతో అలసిపోయేదాన్ని. యాంగ్జయిటీ తీవ్రమైనప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. భరించలేనంత బ్లీడింగ్. షాక్‌కు గురై ఆసుపత్రిలో చేరిన సందర్భాలున్నాయి. అబార్షన్లు కూడా అయ్యాయి. డాక్టర్ ఇచ్చిన మందులు వాడకపోతే పని చేయలేను. మందులు మింగితేనే నిద్ర. ఇలాంటి పరిస్థితుల్లోనే – ఇంటెర్నల్ కంప్లయింట్స్ కమిటీ (ఐసీసీ) చైర్పర్సన్ అపాయింట్మెంట్ కోరాను. నెలరోజులు గడిచినా నాకు టైమ్ ఇవ్వలేదు. అకడమిక్ రంగంలో నాకున్న పరిచయాల ద్వారా ఒకలాంటి ఒత్తిడి తెస్తే గానీ ఆమె నా కంప్లయింట్ స్వీకరించలేదు. కానీ ఆమె నా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకురమ్మన్నారు. తట్టుకోలేకపోయాను. దుఃఖాన్ని దిగమింగుకుంటూ బయటకొచ్చాను. నాది చట్టబద్ధ వివాహం. పేరెంట్సే చేశారు. అయినా, పెళ్లికీ – కేసుకీ సంబంధమేంటి? చట్టం రిలేషన్షిప్స్ని స్క్రూటినీ చేయమందా? ఇదెక్కడి న్యాయం? మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చాను ఐసీసీ చైర్‌పర్సన్‌కి. పదుల సంఖ్యలో అమ్మాయిల్ని విచారించారు. అందరూ ‘అతడి’కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవారే. వారంతా ‘అతడి’ బాధితులే. కమిటీ అతణ్ణి దోషిగా నిర్ధారించింది. ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయం అమలు కాలేదు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని విరగబడి నవ్వుతున్నాడు ‘అతడు’. ఆఫీసు వాతావరణం నానాటికీ శత్రుపూరితంగా తయారవుతోంది నాకు. విమెన్స్ కమీషన్‌కు మొర పెట్టుకున్నాను. కేంద్రంలోని మూడు మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశాను. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి నేను? మనఃశరీరాలను మెలిపెట్టే ఈ వేదన నుంచి నాకు విముక్తి ఎప్పుడు? (సౌమ్య కేస్ స్టడీ) – వి.ఉదయలక్ష్మి ఐసీసీ తీర్మానాలకు కట్టుబడాల్సిందే.. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం – అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) చేసిన రికమండేషన్లను సంస్థల యాజమాన్యాలు తప్పకుండా అమలు చేయాలి. కానీ సౌమ్య కేసులో అలా జరగలేదు. ఒకవేళ ఐసీసీ సిఫారసుల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టయితే సంస్థ మళ్లీ విచారణ జరిపించవచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థల్లో మాదిరిగా ఎథిక్స్ కమిటీ వేసి, కేసును పరిశీలనకు పెట్టొచ్చు. ఇలాంటి కేసుల్లో యాజమాన్యాల వైపు నుంచి న్యాయం జరగనప్పుడు లేదా ఐసీసీ రికమండేషన్లపై అసంతృప్తి ఉన్నప్పుడు.. న్యాయవ్యవస్థను ఆశ్రయించాలంటోంది చట్టం. కానీ, ఐసీసీ విచారించిన కేసును మళ్లీ కోర్టు ముందుకు తోయడమంటే.. చట్టంలో లోపమున్నట్టే. అసలు సున్నితమైన ఇలాంటి అంశాల్లో కోర్టులకు వెళ్లేందుకు దాదాపు ఎవ్వరూ ఇష్టపడరు కూడా. ఈ నేపథ్యం నుంచే చట్టం రూపుదిద్దుకుంది. చట్టం ఐసీసీల ఏర్పాటును తప్పనిసరి చేసింది. మినీ కోర్టుల్లాంటి ఐసీసీల సిఫారసుల విషయంలో సంస్థలు సెన్సిటివ్‌గా ఉండాలి. ఆ సెన్సిటివిటీ లోపించడం వల్లే సౌమ్య కేసులో జాప్యం జరుగుతున్నట్టు అగుపిస్తోంది. ఈ జాప్యాన్ని నివారించేగలిగే / పరిస్థితిని చక్కదిద్దగలిగే మెకానిజమ్ ఏర్పాటు కావాల్సిన అవసరముంది. చట్టంలో లోపాల్ని సవరించాల్సి వుంది. – బి. గిరిజ, తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్, ‘సఖి’ ప్రశ్నించే ఫోరమ్స్ పెంచుకుందాం వేధింపులు సహా స్త్రీలు ఎదుర్కొనే రకరకాల హింసల్నీ, వాళ్ల హక్కుల్నీ హేళన చేసే వాతావరణం మన చుట్టూ అలముకుంది. (సౌమ్య కేసులో ఇదే జరిగింది.) సీరియల్స్‌లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కుటుంబ హింస, రేప్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. కానీ వాటిని ఎలా డీల్ చేయాలనేదానిపై ఒక సైంటిఫిక్ – థియరిటికల్ యాటిట్యూడ్ లేదు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలితో – ఎక్కువ మాట్లాడితే నువ్వే వేధిస్తున్నట్టు కేసు పెడతానంటాడు పోలీసు. మరోవైపు, నెగిటివ్ క్యారెక్టర్ కుటుంబ హింస జరగకపోయినా జరిగినట్టు కేసు పెట్టించగలుగుతుంది. ఈ సీరియల్స్ ప్రకారం.. కోడళ్లందరూ అత్తలను హింసిస్తారు. కానీ తమను అత్తలే హింసిస్తున్నట్టు కేసులు పెడతారు. పోలీసులు వాటిని స్వీకరిస్తారు. ఈ తరహా ఇమేజస్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దాదాపు అన్ని సీరియల్స్ ఇలాంటి తప్పుడు భావనలే వ్యాప్తి చేస్తున్నాయి. ఇలాంటి ధోరణుల్ని ప్రశ్నించే ఫోరమ్స్ మరిన్ని ఏర్పడాలి. ‘హింస’మీద డిబేట్ జరగాలి. – కె. సజయ, సామాజిక కార్యకర్త కౌన్సెలింగ్ అవసరం సౌమ్యలో యాంగ్జయిటీ, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే కౌన్సిలింగ్‌కు సిద్ధపడాలి. అవసరాన్ని బట్టి మందులూ వాడాలి. ఆమెను బలహీనపరచే ఆలోచనల్ని కౌంటర్ చేయాలంటే ఒక సిస్టమాటిక్ – సైంటిఫిక్ అండ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అవసరం. సైకాలజిస్టును కలసినట్టయితే – బాధితురాలికి బాధల నుంచి, ఆమెను వ్యాకులపరిచే ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తారు. కుటుంబ సభ్యులు ఆమె సమస్యల పట్ల సహానుభూతితో స్పందించడం, ‘నీకు మేమున్నాం’ అనే భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. – డాక్టర్ సి.వీరేందర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
అంతర్జాతీయ వేదికపై ట్రిపుల్ఐటీ విద్యార్థిని
రాయదుర్గం: బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ విద్యార్థిని సౌమ్య రావత్ పరిశోధనాత్మక పత్ర సమర్పణ చేశారు. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన 24వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీమీడియా మోడలింగ్ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘ఫైండ్ మీ ఏ స్కై: ఏ డేటా డ్రివెన్ మెథడ్ ఫర్ కలర్ కన్సిస్టెడ్ స్కై సెర్చ్ అండ్ రీప్లేస్మెంట్’ అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకుకున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థినికి ఈ అవకాశం రావడం విశేషమని అధ్యాపకులు అభినందించారు.