![Journalist Soumya Vishwanathan Murder Convicts Gets Life Sentence - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/25/jounalist-sowmya.jpg.webp?itok=nJc7K4k1)
ఢిల్లీ: జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ సాకేత్ కోర్టు శనివారం శిక్షలు ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈమేరకు జడ్జి రవీంద్రకుమార్ పాండే తీర్పు వెలువరించారు.
ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పుఇచ్చింది. అయితే క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్(శిక్ష ఎంత) అన్నది తేల్చడానికి శుక్రవారం వరకు కోర్టు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరపు వాదనలు విన్నది. వాదనల అనంతరం నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
2008లో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ టీవీ చానళ్లో పనిచేస్తున్న జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ విధులు ముగించుకుని తెల్లవారు జామున ఇంటికి తిరిగి వెళుతోంది. ఇదే సమయంలో నలుగురు నిందితులు కారును అడ్డగించి ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు అతి జాగ్రత్తగా విచారణ జరిపి సాక్షాధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడేలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment