court judgement
-
భార్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించిన న్యాయస్థానం!
చిక్కడపల్లి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రజని, జి.బాలకృష్ణ దంపతులు బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో నివాసం ఉండేవాడు. బాలకృష్ణ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో 2013 సెప్టెంబర్ 27న రాత్రి తన భార్య రజనిని కత్తితో పొడిచి హత్య చేశాడు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జె.కవిత వాదోపవాదాల అనంతరం బాలకృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరి రామిరెడ్డి వాదనలు వినిపించారు. -
US Elections : ట్రంప్ పోటీ పై కోర్టు సంచలన తీర్పు
వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ ఇచ్చింది. మార్చిలో జరగనున్న కొలరాడో ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్లో పోటీ చేయకుండా ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతు దారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ట్రంప్‌ను డిస్క్వాలిఫై చేస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ గ్రూపు ట్రంప్‌ను డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్‌కు అప్పీల్ చేసుకునే వీలు కల్పిస్తూ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు కొలరాడో కోర్టు వెల్లడించింది. ఈ డిస్క్వాలిఫికేషన్ తీర్పు మార్చి 5న జరగనున్న ప్రైమరీ బ్యాలెట్‌కు మాత్రమే వర్తించనుంది. డిస్క్వాలిఫికేషన్ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ కార్యాలయం తెలిపింది. తీర్పుపై అప్పీల్‌కు జనవరి 4 దాకా కోర్టు అవకాశమిచ్చింది. దేశంలో తిరుగుబాటు చర్యలకు పాల్పడిన వారు రాజ్యాంగ పదవిలో ఉండడానికి వీలు లేదని అమెరికా రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఈ నిబంధన ఆధారంగానే కొలరాడో కోర్టు ట్రంప్‌ను డిస్క్వాలిఫై చేసింది. కొలరాడో కోర్టు తీర్పును ట్రంప్ యూఎస్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నారు. ట్రంప్ ఉంటేనే పోటీలో ఉంటా : వివేక్ రామస్వామి కొలరాడో ప్రైమరీ బ్యాలెట్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీలో ఉంటేనే తాను పోటీ చేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వివేక్ రామస్వామి తెలిపారు. వివేక్ రామస్వామి భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త. ఈయన అమెరికాలో ఫార్మాసుటికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇదీచదవండి..ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ -
జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ సాకేత్ కోర్టు శనివారం శిక్షలు ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈమేరకు జడ్జి రవీంద్రకుమార్ పాండే తీర్పు వెలువరించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పుఇచ్చింది. అయితే క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్(శిక్ష ఎంత) అన్నది తేల్చడానికి శుక్రవారం వరకు కోర్టు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరపు వాదనలు విన్నది. వాదనల అనంతరం నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 2008లో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ టీవీ చానళ్లో పనిచేస్తున్న జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ విధులు ముగించుకుని తెల్లవారు జామున ఇంటికి తిరిగి వెళుతోంది. ఇదే సమయంలో నలుగురు నిందితులు కారును అడ్డగించి ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు అతి జాగ్రత్తగా విచారణ జరిపి సాక్షాధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడేలా చేశారు. ఇదీచదవండి...ఎల్1కు చేరువలో ఆదిత్య : ఇస్రో చైర్మన్ -
ఫేస్‌బుక్‌పై కేసు.. రూ. 41 లక్షలు ఫైన్ - కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆధునిక కాలంలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా యాప్స్‌లో చాలామంది కాలం గడిపేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఖాతాదారుని అకౌంట్‌ని సంస్థలు బ్లాక్ చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకుని సరిపెట్టుకుంటాడు. కానీ అమెరికాకు చెందిన ఒక లాయర్ దీని భిన్నంగా అకౌంట్ బ్లాక్ చేసిన కంపెనీ మీద కేసు వేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలోని జార్జియాకు చెందిన 'జాసన్ క్రాఫోర్డ్' (Jason Crawford) అనే వ్యక్తి తనకు కలిగిన అంతరాయానికి ఫేస్బుక్ కంపెనీకే చెమటలు పట్టించాడు. తన ఫేస్బుక్ అకౌంట్ యాక్సెస్ చేయడం కుదరకపోవడంతో సంస్థ మీద కేసుపెట్టి కోర్టుకి లాగాడు. అంతటితో ఆగకుండా నష్టపరిహారంగా 50 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 41.11 లక్షలు జరిమానా విధిందెలా చేసాడు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) క్రాఫోర్డ్ అందించిన సమాచారం ప్రకారం.. ఒక రోజు ఉదయం ఫేస్బుక్ అకౌంట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది లాక్ అయినట్లు, నన్ను బ్యాన్ చేసినట్లు తెలిసింది. దీనికి కారణం చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని తెలిసింది. అలాంటి తప్పు తాను ఎప్పుడూ చేయలేదని చెప్పాడు. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం సంస్థకు ఫిర్యాదు చేయడానికి చాలా సార్లు ప్రయత్నించానని, అయినా ఎటువంటి ప్రయోజనం లేదని వెల్లడించాడు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) ఫేస్బుక్ అకౌంట్ బ్యాన్ కావడాన్ని జీర్ణించుకోలేని క్రాఫోర్డ్ వృత్తి రీత్యా లాయర్ కావడం వల్ల 2022 ఆగష్టులో కంపెనీ మీద కేసు వేసాడు. అయినప్పటికీ ఫేస్బుక్ నుంచి సరైన సమాధానం లభించలేదు, దీంతో కోర్టు క్రాఫోర్డ్‌కు 50 వేల డాలర్లు చెల్లించాలని మెటాను ఆదేశించింది. అయితే క్రాఫోర్డ్ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే సంస్థ తన అకౌంట్ రీస్టోర్ చేసింది. కానీ జరిమానా చెల్లించలేదు. -
శింబు చుట్టూ కుట్ర జరుగుతోంది
పెరంబూరు: శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని ఆయన తండ్రి, నటుడు, దర్శక నిర్మాత, లక్ష్య డీఎంకే పార్టీ అధ్యక్షుడు టీ.రాజేందర్ అన్నారు. ఆదివారం సేలంకు వెళ్లిన ఈయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయ వనవాసం ముగిసిందని అన్నారు. ఇప్పుడు విముక్తి కలిగిందని అన్నారు. రాజకీయాల్లో తాను ఎంజీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడినని చెప్పారు. ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని వెటకారంగా మాట్లాడారు. రాజకీయ పార్టీని ప్రారంభించడానికి చాలా సహనం అవసరం అని అన్నారు. పోరాటం తరువాత కరుణానిధి డీఎంకే అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు. కరుణానిధి ఉండగా ఎన్నికలను ఎదుర్కోవడం వేరు ఆయన లేని ఇప్పటి డీఎంకే ఎదుర్కొనే ఇప్పటి పరిస్థితులు వేరు అని అన్నారు. చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి అన్నది సాధారణ విషయం కాదని, తల చుట్టూ వేడెక్కించే మంట లాంటిదని పేర్కొన్నారు. తాను రాజకీయవాదినని చెప్పడం కంటే ఆధ్యాత్మిక వాదినని చెప్పుకుంటానన్నారు. తాను ఆధ్యాత్మికంగానే నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఆయన కొడుకు, నటుడు శింబుకు సంబంధించిన కేసులో శనివారం మద్రాసు హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి స్పందిస్తూ శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని టి.రాజేందర్ వ్యాఖ్యానించారు. -
వివాహిత ఆత్మహత్య కేసులో సంచలన తీర్పు
గుత్తి: వివాహిత ఆత్మహత్యకు కారకులైన భర్తకు జీవిత ఖైదు, అత్తమామలకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుత్తి ఏడీజే కోర్టు జడ్జి కమలాదేవి బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి వన్‌టౌన్ ఎస్ఐ యు.వెంకటప్రసాద్, ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది మహేష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు బెంచికొట్టాలకు చెందిన ఎం.కిరణ్‌కుమార్‌కు వికారాబాద్ రైల్వే ఉద్యోగి సుభాష్ కుమార్తె లక్ష్మీరాజ్యంతో 2010లో వివాహం జరిగింది. వరుడికి కట్నకానుకల కింద 15 తులాల బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదు, రూ. లక్ష విలువ చేసే ఇంటి సామగ్రిని అందజేశారు. పెళ్లి జరిగిన యేడాది నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. వీరి వేధింపులను భరించలేక 2016 మార్చి ఐదో తేదీన లక్ష్మీరాజ్యం గుంతకల్లు రైల్వేజంక్షన్‌లోని 5వ ఫ్లాట్‌ఫాంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ పోలీసులు కేసునమోదు చేసుకుని, దర్యాప్తు కోసం అదే ఏడాది ఏప్రిల్ 16న ఒన్‌టౌన్ పోలీసులకు కేసు బదిలీ చేశారు. అప్పటి డీఎస్పీ సీహెచ్.రవికుమార్ కేసును దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన గుత్తి ఆరవ అదనపు కోర్టు నేరం రుజువు కావడంతో కేసులో ఏ1గా ఉన్న భర్త కిరణ్‌కుమార్‌కు జీవితఖైదు, ఏ2, ఏ3లుగా ఉన్న అత్త,మామ రాధాబాయి, గోవిందరాజులుకు ఏడేళ్ల జైలు, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. = అత్త, మామలకు ఏడేళ్ల జైలుశిక్ష = -
స్వరూప దగ్గరికే చిన్నారి తన్విత
-
వాయిదాతో పందేనికి పండుగేనా?
సుప్రీం ఆదేశాలతో పందెగాళ్లకు ఉపశమనం సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి కోడి పందేల విషయంలో తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో మళ్లీ కోళ్లను దువ్వుతున్నారు. గత వారం ఉమ్మిడి హైకోర్లు ఇచ్చిన ఆంక్షలతో సందిగ్ధంలో పడిన పందెం సందడి సుప్రీం ఆదేశాలతో ఊరట చెందుతున్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని నాలుగో అంశంపై స్టే ఇస్తూనే తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో వారం రోజుల్లో వచ్చే సంక్రాంతి గడిచిపోతుందని, ఈలోగా పందేల దందా పూర్తి చేసుకోవచ్చునని పందెంగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవటంపై సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని పందెగాళ్లు స్వాగతిస్తున్నారు. అయితే సుప్రీం జారీ చేసిన రెండు ఆదేశాలతో జిల్లాలో కోడి పందేలను పూర్తి స్థాయిలో అదుపు చేయటంపై పోలీసులకు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవద్దంటే పరోక్షంగా కోడి పందేలకు సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంప్రదాయ ఒరవడిలో జరిగే కోడి పందేలను అడ్డుకోవటం సరికాదని తన పిటిష¯ŒSలో విన్నవించారు. సుప్రీం కూడా ఈ కేసును సంప్రదాయ కోణంలో విచారించి ఆయుధాల కోణంలో అభ్యంతరం చెప్పింది. ఆయుధాల పరంగా అభ్యంతరం, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దన్న ఆదేశం, విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో జిల్లాలోని పందెగాళ్లు ఆ ఉత్తర్వులను తమకు సానుకూలంగా తీసుకుంటుంటే.. జిల్లా పోలీసులు సున్నితంగా ఉన్న ఆ మూడు అంశాలతో పందేలను ఎంత వరకు నిలువరించగలమ ని తర్జన భర్జన పడుతున్నారు. ఇంతటి ఉత్కంఠలో పందెగాళ్లు, పోలీసులు ఇద్దరిలో ఎవరిది విజయమో సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే. ప్రతి సంక్రాంతి పండుగలకు జిల్లాలో కోడి పందేలతో రూ.30 కోట్లు వరకూ చేతులు మారుతున్న క్రమంలో ఈసారి హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాలు, ఉత్తర్వులతో çపండుగ పందేలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. -
లంచగొండి ఉద్యోగులకు జైలుశిక్ష, జరిమానా
విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు రాజమహేంద్రవరం క్రైం : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ కోర్టు జైలు శిక్ష విధించింది. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండల రెవెన్యూ ఆఫీసర్ మైలవరపు వెంకట సుబ్రహ్మణ్యంకు చెందిన కాకినాడ రూరల్‌లోని గృహాలు, ఆయన బంధువుల నివాసాలపై 1993లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడులలో రూ.13, 57,000 లక్షల విలువైన అక్రమ ఆస్తులను ఆయన కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించిన విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ఆలపాటి గిరిధర్ నిందితుడిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.నాలుగు లక్షల జరి మానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. అలాగే మరో కేసులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కాకినాడలోని సాంఘిక సంక్షేమశాఖ సూపరింటెండెంట్ వాసాది భాస్కరరావుకు చెందిన ఇళ్లు, ఆయన బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు 1997 మార్చి 22న దాడులు చేశారు. ఆయన ఆదాయానికి మించి అదనంగా రూ.18,98,000 ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.ఈ కేసును విచారించిన విజయవాడ ఏసీబీ స్పెష¯ŒS కోర్టు జడ్జి ఆలపాటి గిరిధర్ భాస్కరరావును దోషిగా నిర్ధారించారు. ఆయనకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.నాలుగు లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి ఆ తీర్పులో పేర్కొన్నట్టు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. -
హత్యాయత్నం చేసిన యువతికి ఐదేళ్ల జైలు శిక్ష
బంజారాహిల్స్: తాను ప్రేమిస్తున్న యువకుడిని తమ బంధువుల అమ్మాయే పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో ఆమెపై హత్యాయత్నం చేసిన యువతికి న్యాయమూర్తి ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన పల్లకొండ మమత (27)కు వర్దన్నపేట మండలం ఐలోను గ్రామానికి చెందిన పల్లకొండ దివ్యశ్రీ(23) దగ్గరి బంధువు. 2013 మార్చి 9వ తేదీన దివ్యశ్రీకి వరంగల్ వాసి కుమార్(32)తో నిశ్చితార్ధం జరిగింది. అదే ఏడాది జూన్ 13వ తేదీన వీరి పెళ్లిని నిశ్చయించారు. అయితే మమతకు కుమార్‌తో అప్పటికే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో కుమార్, దివ్యశ్రీ పెళ్లిని మమత జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆమె దివ్యశ్రీని అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. కుమార్ ప్రవర్తన మంచిది కాదని.. అతడు మరో అమ్మాయిని ప్రేమించి హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుంటున్నాడని దివ్యశ్రీని నమ్మించింది. కావాలంటే చూపిస్తానంటూ ఆమెను 2013 మే 4వ తేదీన శ్రీకృష్ణానగర్‌లో నివసించే తన సోదరి స్వరూప ఇంటికి తీసుకొచ్చింది. కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. ‘నేను ప్రేమిస్తున్న కుమార్‌ను పెళ్లి చేసుకుంటావా...? అతడిని నీకు దక్కనివ్వను’ అంటూ 9 చోట్ల గాయపరిచింది. దివ్యశ్రీ తన ఫోన్‌తో కుమార్‌కు, తన తండ్రి సారయ్యకు విషయాన్ని తెలిపింది. దీంతో వారు సమీపంలోనే ఉంటున్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి దివ్యశ్రీని ఆసుపత్రికి తరలించారు. దివ్యను చంపేయటం, కుదరకుంటే అందవికారంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్న మమతపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు రుజువు కావడంతో మంగళవారం నిందితురాలు మమతకు న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
సెలైన్‌లోకి విషం ఎక్కించిన భర్తకు....
నరసరావుపేట టౌన్: గుంటూరు జిల్లాలో సెలైన్‌లోకి విషం ఎక్కించి భార్యను చంపిన భర్తకు జీవితఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. బొల్లాపల్లి మండలం కనుమలచెర్వు గ్రామానికి చెందిన రవికుమార్‌కు భార్య విమలమ్మపై అనుమానం ఉండేది. విమలమ్మ వినుకొండలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో 2013 అక్టోబర్ 4వ తేదీన ఆడశిశువుకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల తరువాత ఆస్పత్రికి వెళ్లిన భర్త ఎవరూ గమనించకుండా ఆమెకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్లో ఇంజెక్షన్ ద్వారా పురుగుమందు కలిపాడు. కొద్దిసేపటి తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో గమనించిన వైద్యులు విషప్రయోగం జరిగిందని గుర్తించి విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం విమలమ్మను వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితురాలు న్యాయమూర్తికి మరణవాగ్మూలాన్ని ఇచ్చి అదే నెల 6వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ పోలీసులు కేసునమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిపై అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి నేరం రుజువుకావడంతో జీవిత ఖైదీ విధిస్తూ తీర్పుచెప్పారు. -
కోర్టు తీర్పులను తప్పుపడుతున్న ఆదాల
పొదలకూరు, న్యూస్‌లైన్: రెండు అంశాలకు సంబంధించి రైతులు, బాధితులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వచ్చిన తీర్పులను తప్పుపడుతూ తనపై నిందలు వేస్తున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి తీరుపై కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గసమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కండలేరు ఎత్తిపోతల పథకం పనుల బిల్లుల చెల్లింపునకు సంబంధించి పంటలు పండని రైతులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా ఎత్తిపోతలకు నీరు ఎలా పంపిణీ చేస్తారని, బిల్లుల చెల్లింపు నిలిపేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఏ జలాశయంలోని నీటిని వాడుకోవాలన్నా స్టేట్ లెవల్ ఇరిగేషన్ వాటర్ అడ్వయిజరీ మేనేజ్మెంట్ కమిటీ(శివం కమిటీ) సిఫార్సులు అవసరమని వెల్లడించారు. అలాంటి అనుమతి ఈ తాత్కాలిక ఎత్తిపోతల పథకానికి లేదన్నారు. ఈ పథకాన్ని మార్చిలో ప్రారంభించి ఏప్రిల్ వరకు కొనసాగించారన్నారు. నీటి లిఫ్టింగ్ కోసం వాడిన ట్రాక్టర్లకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూస్తే దిమ్మ తిరిగిపోతుందన్నారు. రూ.20 లక్షలు కూడా ఖర్చుచేయకుండా పనులు పూర్తిచేసి ఏ చెరువు కింద పంటలకు నీరుఇవ్వకుండా ఆరు నెలల తర్వాత ఏకంగా రూ.71 లక్షలకు అనుమతులు తెచ్చారన్నారు. రైతులు పంటలు పండలేదని కోర్టుకు వెళితే తానెలా బాధ్యుడ్ని అవుతానని ప్రశ్నించారు. ఈ ప్రాంతవాసిగా ప్రతిపక్ష నాయకుడిగా వివరాలు వెల్లడించాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నట్టు తెలిపారు. పొదలకూరుకు సమీపంలోని చాటగొట్ల లేఅవుట్లో 110 మంది ముంపు వాసులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు జాబితా తయారు చేస్తే ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా అర్హుల పేర్లను తొలగించి అనర్హుల పేర్లు చేర్పించారన్నారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అనర్హులను గుర్తించమని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే తాను కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినట్టు ఆదాల ప్రచారం చేయడం తగదన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు, స్టేకు తేడా తెలియకుండా ఆయన మూడు మార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. పొదలకూరులో మంత్రి శిలాఫలకాలను ధ్వంసం చేసిన కేసులో ఓ ఎస్సై అవినీతికి పాల్పడి విద్యార్థులను అరెస్ట్ చేస్తే వైఎస్సార్సీపీ ధర్నా చేసిందన్నారు. అదే సమయంలో ఒక చోరీ విషయంలో మరొక బృందం వచ్చి ధర్నా చేయడంతో రెండు ఆందోళనలు కలిసిపోయి గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. దీన్ని సాకుగా తీసుకున్న ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ దొంగలను ప్రోత్సహిస్తోందని విమర్శలకు దిగడం గురివింద సామెతను గుర్తుచేస్తున్నట్టుందన్నారు. తాను ఎలాంటి వ్యక్తినో జిల్లా ప్రజలందరికీ తెలుసునన్నారు. దొంగే దొంగాదొంగా అని అరిచినట్టుగా ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉందన్నారు. కోర్టు తీర్పు ప్రతులను కాకాణి విలేకర్లకు అందజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం బ్రహ్మయ్య, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, డాక్టర్ టి.శ్రీహరి, మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.