వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ ఇచ్చింది. మార్చిలో జరగనున్న కొలరాడో ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్‌లో పోటీ చేయకుండా ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతు దారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ట్రంప్‌ను డిస్‌క్వాలిఫై చేస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ గ్రూపు ట్రంప్‌ను డిస్‌క్వాలిఫై చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
ట్రంప్‌కు అప్పీల్ చేసుకునే వీలు కల్పిస్తూ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు కొలరాడో కోర్టు వెల్లడించింది. ఈ డిస్‌క్వాలిఫికేషన్ తీర్పు మార్చి 5న జరగనున్న ప్రైమరీ బ్యాలెట్‌కు మాత్రమే వర్తించనుంది. డిస్‌క్వాలిఫికేషన్ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ కార్యాలయం తెలిపింది. తీర్పుపై అప్పీల్‌కు జనవరి 4 దాకా కోర్టు అవకాశమిచ్చింది.
దేశంలో తిరుగుబాటు చర్యలకు పాల్పడిన వారు రాజ్యాంగ పదవిలో ఉండడానికి వీలు లేదని అమెరికా రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఈ నిబంధన ఆధారంగానే కొలరాడో కోర్టు ట్రంప్‌ను డిస్‌క్వాలిఫై చేసింది. కొలరాడో కోర్టు తీర్పును ట్రంప్ యూఎస్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నారు.
ట్రంప్ ఉంటేనే పోటీలో ఉంటా : వివేక్ రామస్వామి
కొలరాడో ప్రైమరీ బ్యాలెట్‌లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీలో ఉంటేనే తాను పోటీ చేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వివేక్ రామస్వామి తెలిపారు. వివేక్ రామస్వామి భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త. ఈయన అమెరికాలో ఫార్మాసుటికల్ వ్యాపారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment