చిక్కడపల్లి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రజని, జి.బాలకృష్ణ దంపతులు బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో నివాసం ఉండేవాడు. బాలకృష్ణ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు.
ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో 2013 సెప్టెంబర్ 27న రాత్రి తన భార్య రజనిని కత్తితో పొడిచి హత్య చేశాడు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జె.కవిత వాదోపవాదాల అనంతరం బాలకృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరి రామిరెడ్డి వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment