ఏడాది కాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సౌమ్యారెడ్డి
కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనేజేఎల్‌గా ఎంపికై న సుదర్శన్
చేవెళ్ల /మొయినాబాద్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగ సాధన కత్తిమీద సాము లాంటిదే. కానీ పట్టుదలకు శ్రమ తోడైతే సాధించలేనిది ఏదీ లేదని పలువురు నిరూపిస్తున్నారు. మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన గడ్డం సౌమ్యారెడ్డి ఏడాది కాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంది.
గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్‌తో పాటు గత బుధవారం విడుదలైన ఫలితాల్లో గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ంది. 2014లో వివాహం జరిగిన అనంతరం భర్త శ్రీధర్‌రెడ్డితో కలిసి చిలుకూరులో ఉంటూ డిగ్రీ, పీజీ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసింది. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల పోషణను చూసుకుంటూనే పట్టుదలగా చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఉద్యోగం చేస్తూనే..
చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన సుదర్శన్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2018లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన ఆయన.. ప్రస్తుతం గచ్చిబౌలి పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ ఫ్రొఫెసర్ కావాలనే తల లక్ష్యాన్ని మరవలేదు. జాబ్ చేస్తూనే చదువు కొనసాగిస్తూ 2022లో ఉస్మానియా యునివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు. ఈక్రమంలో తెలంగాణ సాహితీవేత్తలు, హృదయ ఘోష, స్వాతంత్య్ర సమరయోధుడు అడ్డూరి అయోధ్య రామయ్య అనే పుస్తకాలు రచనలు చేశాడు.
గెజిటెడ్ అధికారిగా ఎదగాలనే ఆలోచనతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసిన జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాసి, జేఎల్‌గా ఎంపికయ్యాడు. సామాన్య పేద కుటుంబానికి చెందిన తనను తల్లిదండ్రులు జంగమ్మ, పర్మయ్య చాలా కష్టపడి చదివించారని తెలిపాడు. లెక్చరర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని, ప్రొఫెసర్ కావాలనే తన కల సాకారానికి మొదటి అడుగు పడిందని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment