తల్లి మృతి విషయం దాచి విద్యార్థినితో పరీక్ష రాయించిన ఉపాధ్యాయులు
కరోనా సమయంలోనే తండ్రిని కోల్పోయిన విద్యార్థిని సౌమ్య
బుధవారం రోడ్డు ప్రమాదంలో తల్లిని కూడా...
కాటారం (ములుగు): ఓ విద్యార్థిని భవిష్యత్ అంధ కారం కావొద్దని ఆలోచించా రు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి తనకు దూరమైందనే విషయం తెలి యకూడదని.. చివరి పరీక్ష సజావుగా రాయాలని ఆకాంక్షించారు. సదరు విద్యార్థిని పరీక్ష రాసేలా కృషి చేశారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో గురువారం జరి గిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రొంటాల రమాదేవికి, కూతురు, కుమారుడు ఉన్నారు.
భర్త కరోనా సమ యంలో మృతి చెందాడు. కూతురు సౌమ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. రమాదేవి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బుధవారం కొడుకును తీసుకుని ద్విచక్ర వాహ నంపై ములుగు ఆస్పత్రికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమాదేవి మృతి చెందగా...కొడుకు తీవ్ర గాయాల పాలయ్యాడు.
ఈ విషయాన్ని సౌమ్య కుటుంబ సభ్యులు కళాశాలకు తెలియజేశారు. అయితే సౌమ్యకు చివరి పరీక్ష కావడంతో ఆమె భవి ష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల ఆమోదంతో...ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లి మృతి చెందిన విషయం విద్యార్థినికి తెలియకుండా దాచారు. గురువారం పరీక్ష రాసిన సౌమ్య అమ్మ వస్తుందనే సంతోషంతో బయటకు రాగా..అమ్మ కాకుండా బంధువులు వచ్చారు. దీంతో అమ్మకేదో ఆపద వచ్చిందని భావించి ఇంటికి వెళ్లిన సౌమ్య తల్లి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment