Ramadevi
-
మహిళా జెడ్పీటీసీ ఇంటిపై టీడీపీ మూకల దాడి
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య దంపతుల ఇంటిపై టీడీపీ మూకలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం పరిధిలోని జాండ్రపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. దాడి జరగక ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. లక్కిరెడ్డిపల్లె టీడీపీ నేత మదన్మోహన్ సెల్ ద్వారా వాట్సాప్ కాల్ చేసి ‘నిన్ను చంపేస్తాం’ అని బెదిరించాడని మాజీ ఎంపీపీ రెడ్డయ్య ఆరోపించారు. రెండు సుమోలు, మరో మూడు వాహనాలలో 60 మందికి పైగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు మంకీ క్యాపులు పెట్టుకుని మచ్చు కత్తులు, ఇనుప రాడ్లతో తమ ఇంటిపై దాడికి తెగబడ్డారని రమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.తన భర్త రెడ్డయ్య, కుమారుడు రమేష్‌ను కాపాడుకునేందుకు ఇంటి వెనక డోర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తుండగా, ఆడవాళ్లు అని కూడా చూడకుండా తమపై దాడి చేశారని వాపోయారు. తమ కోడలు ఆరు నెలల గర్భిణి అని, ఆమె జోలికి వెళ్లొద్దని ప్రాథేయపడినా వినకుండా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తమ ఇంటి బయట ఉన్న బుల్లెట్ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, మరో బుల్లెట్ వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. అంతలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకోబోగా, జగన్మోహన్ ప్రసాద్ అనే వ్యక్తిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచారన్నారు.ఇంట్లోకి దూరి తలుపులు, కిటికీల అద్దాలు, సామాన్లు, ఫర్నీచర్, టీవీలు, సోఫా సెట్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న రెడ్డయ్య తల్లి లేవలేని స్థితిలో మంచానపడి ఉన్నా కూడా కనికరించలేదని, ఆమెపై కూడా దాడి చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డిలు రమాదేవికి ధైర్యం చెప్పారు. -
మేము బ్రతకాలా.. వద్దా...? కన్నీరు పెట్టుకున్న కందిగోపుల మురళి భార్య
-
భర్త అనుమానం.. పెను‘మంటలై’..
రాయచోటి: భర్త అనుమానానికి తోడు.. వేధింపుల ధాటికి తట్టుకోలేక ఇద్దరు బిడ్డలతో సహా ఓ తల్లి సజీవదహనమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా పది సంవత్సరాల కిందట గాలివీడుకు చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మనోహర్ (8), మన్విత (5) సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్ దేశంలో ఉంటూ భార్య, పిల్లలను రాయచోటి పట్టణం బోస్‌నగర్ తొగటవీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపుతూ జీవనం సాగించేది. రెండు సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా తను నివాసం ఉంటున్న ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్ ద్వారా వేధించేవాడు. వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం ఆరుగంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలు ఇద్దరినీ పట్టుకుని రమాదేవి (34) గ్యాస్‌బండకు నిప్పు అంటించి ఆ మంటల్లో ఆహుతి అయింది. ఇంటిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. అప్పటికే మంటల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు కాలిపోయారు. రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
పరీక్ష వేళ భవిష్యత్తు అంధకారం కావొద్దని..
కాటారం (ములుగు): ఓ విద్యార్థిని భవిష్యత్ అంధ కారం కావొద్దని ఆలోచించా రు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి తనకు దూరమైందనే విషయం తెలి యకూడదని.. చివరి పరీక్ష సజావుగా రాయాలని ఆకాంక్షించారు. సదరు విద్యార్థిని పరీక్ష రాసేలా కృషి చేశారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో గురువారం జరి గిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రొంటాల రమాదేవికి, కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త కరోనా సమ యంలో మృతి చెందాడు. కూతురు సౌమ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతోంది. రమాదేవి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బుధవారం కొడుకును తీసుకుని ద్విచక్ర వాహ నంపై ములుగు ఆస్పత్రికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమాదేవి మృతి చెందగా...కొడుకు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయాన్ని సౌమ్య కుటుంబ సభ్యులు కళాశాలకు తెలియజేశారు. అయితే సౌమ్యకు చివరి పరీక్ష కావడంతో ఆమె భవి ష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల ఆమోదంతో...ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లి మృతి చెందిన విషయం విద్యార్థినికి తెలియకుండా దాచారు. గురువారం పరీక్ష రాసిన సౌమ్య అమ్మ వస్తుందనే సంతోషంతో బయటకు రాగా..అమ్మ కాకుండా బంధువులు వచ్చారు. దీంతో అమ్మకేదో ఆపద వచ్చిందని భావించి ఇంటికి వెళ్లిన సౌమ్య తల్లి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. -
బీజేపీకి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రాజీనామా
భైంసాటౌన్: నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పి.రమాదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనను కాదని, గత ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన రామారావుపటేల్‌కు టికెట్ కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలోని తన నివాసంలో శుక్రవారం పార్టీ మండలాధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమై ఆమె రాజీనామాను ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ... అభ్యర్థుల జాబితా ప్రకటనకు గంట ముందు వరకు ఉన్న పేరును తొలగించి, వేరేవారికి ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ముధోల్ బీఆర్ఎస్ ఇన్చార్జి పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ శుక్రవారం రాత్రి రమాదేవిని ఆమె నివాసంలో కలిశారు. పార్టీలోకి రావాలని ఆహా్వనించగా ఆమె అందుకు అంగీకరించారు. -
ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ
-
భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలో హెడ్ కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్ (51) (హెచ్‌సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్ 1993లో కానిస్టేబుల్‌గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కం అగ్రిమెంట్‌తో పాటు మరో డాక్యుమెంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్‌నోట్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్‌రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్ హాసం, ఎస్బీ సీఐలు అశోక్‌రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్‌బాషా, కడప మేయర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకుడు అప్జల్‌ఖాన్, పులి సునీల్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్‌కుమార్ కడప వచ్చి స్టేషన్లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు. -
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
తోరణాలైనా వాడకముందే కడతేర్చాడు
వనపర్తి: పెళ్లిచేసుకున్న రెండు వారాలకే అనుమానంతో భార్యను, అత్తను కడతేర్చాడు ఓ యువకుడు. వనపర్తి జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతి(45)ల కుమార్తె రుక్మిణి(21), ఏపీలోని కర్నూలుకు చెందిన శ్రావణ్ వివాహం ఈ నెల 1వ తేదీన వనపర్తిలో జరిగింది. పెళ్లి అయిన 13 రోజుల వ్యవధిలోనే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి శ్రావణ్ వనపర్తికి వచ్చాడు. రుక్మిణితోపాటు అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కూడా మంగళవారం కర్నూలు నగరంలోని చింతలమునినగర్లో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లీకూతుళ్లపై కూరగాయలు కోసే కత్తితో శ్రావణ్ దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి, రుక్మిణి అక్కడికక్కడే మృతిచెందగా, అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకున్న రెండు వారాలకే భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. -
వారాహి అమ్మవారి నేపథ్యంతో...
‘సుబ్రహ్మణ్యపురం’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్లో ‘వారాహి’ మూవీ షురూ అయింది. జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ఏడుగురు దేవతామూర్తుల్లో వారాహి అమ్మవారు ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంలో డిఓషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘సంతోష్ ఈ కథ చెప్పగానే చప్పట్లు కొట్టాను. మా కాంబినేషన్లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే చాలా మంచి స్క్రిప్ట్ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ చంద్, సహనిర్మాత: కేఆర్ ప్రదీప్. -
ఒంగోలులో శ్రీకారం చుట్టుకున్న‘సత్యం వధ - ధర్మం చెర’
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యం వధ - ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్నారు. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రమణారెడ్డి-పూజలపై చిత్రీకరించిన ముహర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు క్లాప్ కొట్టగా... రవి శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మార్వెల్ గ్రైనేట్స్ అధినేత సూదనగుంట కోటేశ్వరరావు గౌరవ దర్సకత్వం వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న ‘సత్యం వధ - ధర్మం చెర’ప్రేక్షకులతో ఆలోచింపజేస్తూనే అమితంగా అలరిస్తుందని దర్శకుడు బాబు నిమ్మగడ్డ అన్నారు. స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, బిందు భార్గవి, మమతారెడ్డి, బిందుకృష్ణ, మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, అనంతలక్ష్మి, రమేష్ రాజా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
మాయలేడి: ఇంత పనిచేసిందా?
నంద్యాల: తాను ఏకైక సంతానమని అధికారులకు బురిడీ కొట్టించి కోట్ల రూపాయల విలువైన తల్లి ఆస్తులను విక్రయించిన ఓ మహిళ బండారం నంద్యాలలో వెలుగుచూసింది. టూటౌన్ ఎస్ఐ పీరయ్య తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని కోటావీధికి చెందిన అవుకు రమాదేవి అనే మహిళ తన తల్లి ఎల్ల నర్సమ్మకు తాను ఏకైక సంతానమని, రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందింది. సదరు మహిళ ఈ సర్టిఫికెట్‌ను చూపి తన తల్లికి చెందిన ఆస్తులను ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేసింది. అయితే, నర్సమ్మకు రమాదేవితో పాటు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయాన్ని రమాదేవి దాచి పెట్టి భూములను రిజిస్ట్రేషన్లు చేసిన విషయం తహసీల్దార్‌కు తెలియడంతో గత నవంబర్ నెలలో ఆమెను పిలిపించి విచారించారు. ఈ విచారణలో తనకు ముగ్గురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్న మాట వాస్తవమని ఒప్పకుంటూ, జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రద్దు చేయమని రాత పూర్వకంగా రాసి ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన మాదిరెడ్డి తిరుమలేశ్వరరెడ్డి, చిట్టెపు మద్దిలేటిరెడ్డి, బనగానపల్లెకు చెందిన వెంకట శ్రీనివాస్‌రెడ్డి, ఎస్బీఐ కాలనీకి చెందిన సీతారామిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డిలకు డిసెంబర్ 30వ తేదీన విలువైన ఇళ్ల స్థలాలను రిజి్రస్టేషన్ చేసి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవికుమార్.. రమాదేవి తప్పుడు సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్లు చేస్తుందని ఆమెపై కేసు నమోదు చేయాలని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మాయలేడిపై ఐపీసీ సెక్షన్ 177, 182, 199, 420, 419 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీరయ్య తెలిపారు. -
క్షమాపణ చెప్పిన ఆజంఖాన్
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంపీ ఆజంఖాన్ వెనక్కి తగ్గారు. సోమవారం ఆయన బీజేపీ ఎంపీ రమాదేవికి సభలో క్షమాపణలు చెప్పారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే అలవాటు తనకుందని ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. రమాదేవికి క్షమాపణ చెప్పాలని ఎంపీ ఖాన్‌ను కోరారు. అందుకే వెంటనే ఖాన్ లేచి..‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా. సభా మర్యాదలు నాకు తెలుసు. నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే, క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. అయతే, ఆయన మాటలు తమకు వినిపించక అర్థం కాలేదని, మళ్లీ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. ఖాన్ పక్కనే ఉన్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ లేచి, ఆయన క్షమాపణ చెప్పారని, అందుకు తానే హామీ’ అని తెలిపారు. అయితే, మళ్లీ క్షమాపణ చెప్పాలని ఖాన్‌ను స్పీకర్ కోరారు. దీంతో ఆయన.. రమాదేవి తనకు సోదరి లాంటి వారు. స్పీకర్ మాట కాదని నేనేమీ మాట్లాడలేను. నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే క్షంతవ్యుణ్ని’ అని అన్నారు. అనంతరం ఎంపీ రమాదేవి మాట్లాడుతూ.. ‘ఆజంఖాన్ వ్యాఖ్యలతో యావద్దేశం బాధపడింది. అలాంటి మాటలను వినేందుకు నేను ఈ సభకు రాలేదు’ అని ఆవేదనతో పేర్కొన్నారు. ఆజంఖాన్ సభలోను, వెలుపల కూడా గతంలో పలు మార్లు మహిళలపై అవమానకరంగా మాట్లాడారని, ఆయన పద్ధతులను మార్చుకోవాలని అన్నారు. గురువారం సభలో ట్రిపుల్తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ ఉన్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం
న్యూఢిల్లీ: లోక్‌సభ డెప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఆజం ఖాన్ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు లోక్‌సభ ఇస్తుందని తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితర మహిళా ఎంపీలతోపాటు బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆజం ఖాన్‌ను ఈ లోక్‌సభ నుంచి పూర్తిగా బహిష్కరించేలా ఆయనను ఐదేళ్లపాటు సస్పెండ్ చేయాలని రమాదేవి డిమాండ్ చేశారు. -
క్రీడాకుసుమం రమాదేవి
పశ్చిమగోదావరి, ఏలూరు రూరల్ : ఒకనాడు గల్లీ క్రికెట్ ఆడిన ఓ బాలిక నేడు ఆంధ్ర క్రికెట్ మహిళ జట్టుకు కోచ్‌గా రాణిస్తోంది. అంతే కాదు గ్రామీణ బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్ది జిల్లా జట్టుకు అద్భుత విజయాలు అందిస్తోంది. జెంటిల్మెన్ క్రీడను జెంటిల్‌ఉమెన్ క్రీడగా మార్చేస్తోంది. ఆమె భీమవరం మండలం రాయలం గ్రామస్తులు రాజు, వెంకటలక్ష్మీ కుమార్తె సంపాద రమాదేవి. ప్రాణంగా బావించిన క్రికెట్‌ను జీవనంగా మార్చుకుంది. నేడు జిల్లా బాలికల క్రికెట్ జట్లు సాధిస్తున్న విజయాల వెనక కోచ్ రమాదేవి కృషి దాగి ఉంది. ఆమె వద్ద శిక్షణ పొందుతున్న అనేకమంది జిల్లా బాలికలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. జిల్లా, జోన్, రాష్ట్రస్థాయి పోటీల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్ర జట్టులో సైతం చోటు సాధించారు. జెంటిల్మెన్ క్రీడగా పేరు పొందిన క్రికెట్‌ను జెంటిల్ ఉమెన్ క్రీడగా మార్చేస్తోంది. 2017లో అండర్–19 ఆలిండియా చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్ర జట్టును విజయపథంలో నిలిపి రూ.10 లక్షల నగదు బహుమతిని అందించింది. గత నాలుగేళ్లుగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ దేవరపల్లి, దుద్దుకూరు, ఏలూరు, గూటాల, రామన్నపాలెంలో సుమారు 61 మంది గ్రామీణ బాల బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్దింది. మహిళా కోచ్‌గా ఈమె సాధిస్తున్న విజయాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సైతం గుర్తించి ఇటీవల ఆ«ంధ్ర మహిళల టీ20 జట్టుకు శిక్షకురాలుగా నియమించింది. ఇప్పటికే రమాదేవి ఏసీఎ లెవెల్–1 ఎ గ్రేడ్, ఎన్సీఎ లెవెన్–1లో పాల్గొంది. క్రీడాకారిణిగా విజయాలు చిన్నప్పుడు అన్నయ్యతో కలిసి గల్లి క్రికెట్ ఆడిన రమాదేవి క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ జిల్లాస్థాయి నుంచి ఆంధ్ర జట్టు స్థాయికి ఎదిగింది. అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్ విభాగాల్లో ఆంధ్ర జట్టుకు అనేకసార్లు ప్రాతినిధ్యం వహించింది. జిల్లా సీనియర్ జట్టుకు 13 ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించింది. అండర్–19 రాష్ట్ర జట్టులో 3 ఏళ్లు, సీనియర్ జట్టులో–8 ఏళ్ల పాటు క్రీడాకారిణిగా కొనసాగడం విశేషం. 5 వికెట్లు చొప్పున 9 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీసి అభిమానులను అబ్బురపరిచింది. 700 వికెట్లు, 75కు పైగా హాఫ్‌సెంచరీలు, 4 సెంచరీలు చేసి బాలికల్లో స్ఫూర్తి నింపి ఆటపై మక్కువ కలిగేలా చేసింది. నా శిష్యులనుజాతీయజట్టులో చూడాలి కనీసం 5గురు జిల్లా బాలికలు జాతీయజట్టులో చోటు సాధించేలా కృషి చేయడమే నా జీవిత లక్ష్యం. అందుకోసమే నేను కోచింగ్‌ను వృత్తిగా చేసుకున్నాను. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నా లక్ష్యం నెరవేర్చుకుంటా. క్రికెట్ అంటే కేవలం మగపిల్లలకే కాదు. ఆడపిల్లలు కూడా ఆడేలా పెద్దలు ప్రోత్సహించాలి.– రమాదేవి -
ఆమెకు ముగ్గురు భార్యలు
జమ్మలమడుగు: ఒక అమ్మాయి పురుషుడి అవతారమెత్తి ఏకంగా ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంది. ఈ వింత ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటుకల పాడు గ్రామానికి చెందిన రమాదేవి తమిళ నాడులోని రోహిణి కాటన్ మిల్లులో పనిచేస్తుండేది. అక్కడినుంచి తిరిగి వచ్చి పులివెందులలోని మరో కాటన్‌మిల్లులో చేరింది. ఇక్కడ పరిచయాలు పెంచుకుని అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన 17 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంది. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన మరో యువతిని వివాహం చేసుకుంది. ఈ విషయం అమ్మాయిల తల్లిదండ్రులకు తెలియ డంతో వారు మందలించి అమ్మాయిలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా అదే మిల్లులో పనిచేస్తున్న పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన మౌనిక అనే 18 ఏళ్ల యువతితో ఇటీవల రమాదేవికి పరిచయం ఏర్పడింది. వీరిరువురూ కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రమాదేవి కాటన్‌మిల్లులో పనిచేయడం మానేయడంతో వీరిరువురి మధ్యా ఫోన్ సంభాషణలు జరుగుతుండేవి. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన రమాదేవి అక్కడి నుంచి మౌనికకు ఫోన్ చేసి మాట్లాడింది. నీవులేకుంటే నేను చనిపోతానని మౌనిక చెప్పడంతో రమాదేవి భీమగుండం వెళ్లింది. రమాదేవి ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో మౌనిక తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో డీఎస్పీ కృష్ణన్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో గతంలో తాను ఇద్దరిని వివాహం చేసుకున్నానని.. ఇప్పుడు మౌనికను కూడా వివాహం చేసుకున్నట్లు రమాదేవి వివరించింది. దీంతో పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు గతంలో వివాహం చేసుకున్న అమ్మాయిలను పిలిపించి విచారించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు రమాదేవి చేస్తోందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
'ఇంజనీరింగ్ చదవాలనేది నా బిడ్డ ఆశయం'
-
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మరణ మృదంగం
-
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
నూజివీడు/రేగిడి(రాజాం): కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాకుళం జిల్లా బూరాడ గ్రామానికి చెందిన విద్యార్థిని డబ్బాడ రమాదేవి(16) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బూరాడలో నివసించే డబ్బాడ అప్పల నాయుడు(ట్రాక్టర్ డ్రైవర్), వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె రమాదేవి టెన్త్‌లో 10 జీపీఏతో ట్రిపుల్ఐటీకి ఎంపికైంది. క్యాంపస్‌లోని కే4 బాలికల హాస్టల్లో 69వ నంబర్ గదిలో ఉంటున్న రమాదేవి శనివారం తెల్లవారుజామున గది వెలుపల కారిడార్ పక్కన కిందపడి ఉండటాన్ని మహిళా సెక్యూరిటీ గార్డు గమనించి హాస్టల్ కేర్ టేకర్‌కు, చీఫ్ వార్డెన్‌కు సమాచారం అందించింది. బాలికను క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం విద్యార్థిని మృతిచెందింది. రమాదేవి అస్వస్థతతో మరణించిందా? లేక భవనంపై భాగం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాన్నా.. చదవలేకపోతున్నా.. రమాదేవి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి ఫోన్ చేసి, తాను సెకెండ్ మిడ్ పరీక్షలకు చదువుతున్నానని చెప్పింది. అయితే, ఇంత సమయం వరకు చదివితే ఆరోగ్యం పాడవుతుందని.. ఇక నిద్రించాలని తల్లిదండ్రులు సూచించడంతో ఫోన్ కట్ చేసింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మళ్లీ ఫోన్ చేసింది. తండ్రి అప్పలనాయుడు ఫోన్ ఎత్తగా.. తాను రాత్రి 12 గంటల వరకు చదివిందంతా మరచి పోతున్నానని, ఏమీ గుర్తుండటం లేదని.. తనకు చనిపోవాలనిపిస్తోందని చెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తండ్రి.. ఆమెను ఓదార్చి ఇంట్లోనే ఉన్న పెద్ద కుమార్తె భవానికి ఫోన్ ఇచ్చాడు. తన చెల్లికి ఆమె నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే నూజివీడు వెళ్లి రమాదేవిని ఇంటికి తీసుకొచ్చి కొద్ది రోజుల తర్వాత తిరిగి పంపిద్దామని అనుకున్నారు. ఇంతలోనే ఉదయం 7 గంటలకు ఆమె చనిపోయినట్లు కళాశాల నుంచి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులందరూ షాక్‌కు గురయ్యారు. -
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
-
సోషియల్, బయాలజీ పోస్టులు భర్తీ చేయాలి
అనంతపురం న్యూసిటీ : తమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషియల్, బయాలజీ పోస్టులను భర్తీ చేయాలని శారద మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం రమాదేవి కమిషనర్ చల్లా ఓబులేసును కోరారు. ఈ మేరకు గురువారం కమిషనర్‌కు కలిసిన హెచ్ఎం, అధ్యాపక బృందం ఓ వినతి పత్రం అందజేశారు. అందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. -
మహిళా సెక్యూరిటీ గార్డు అదృశ్యం
అనుమానాస్పద స్థితిలో వివాహిత అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని బ్రాండ్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న కె. రమాదేవి(23) ఈ నెల 6వ తేదీన ఉదయం విధులకు హాజరయింది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా రాత్రి అయినా రాలేదు. దీంతో భర్త కె.శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన చెందిన అన్ని ప్రాంతాలు గాలించారు. ఆమె ఆచూకీ దొరక్కపోవటంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదు
తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి హన్మకొండ : సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) జిల్లా అధ్యక్షురాలు బి.రమాదేవి విమర్శించారు. గురువారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ‘మాటలకు చేతలకు పొంతనలేని కేసీఆర్ రెండేళ్ల పాలన’ పేరిట పుస్తకాన్ని తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సీఎం విధానాలవల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, దళి తులు, సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు లేని, ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు వీరబ్రహ్మాచారి, నల్లె ల రాజయ్య, అనిల్, కళ, బాలరాజు, జనగామ కుమారస్వామి, సదానందం, అమరేందర్, ఉమాదేవి, రాజు, రాకేష్, మదుసూధన్, భా రతి, అనంతుల సురేష్, గద్దల సంజీ వ, భిక్షపతి, మంద సంజీవ పాల్గొన్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్: సనత్‌నగర్‌లో రోడ్డుపక్క నడిచి వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును ఆగంతకులు లాక్కుని పోయారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సనత్‌నగర్‌లోని హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న రమాదేవి(30) మెడలోని రెండు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దోచుకు పోయారు. చెవి కమ్మలు కూడా లాక్కునేందుకు యత్నించటంతో రమాదేవి ప్రతిఘటించింది. పెనుగులాటలో ఆమె చెవికి గాయాలయ్యాయి. ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో రమాదేవి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. -
ఏసీబీ వలలో పులిపాడు వీఆర్వో
ఒంగోలు : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు వీఆర్వో రమాదేవి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ చిక్కారు. నంద్యాలకు చెందిన రవీంద్రారెడ్డి అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో చెరుకూరి రమాదేవిని ఆశ్రయించాడు. పాసు పుస్తకం మంజూరు చేసేందుకు రూ. 6 వేలు డిమాండ్ చేసింది. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం దర్శి గ్రామంలోని వీఆర్వో రమాదేవి స్వగృహంలో రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. -
విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం
విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్‌గాంధీ పూల మార్కెట్ వెనుక బస్తీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రమాదేవి అనే మహిళ సజీవ దహనమైంది. 150 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. మధ్యాహ్నం అందరూ పనులకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇళ్లలోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు శరవేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. 150 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో ఉన్న రమాదేవి అనే మహిళ బయటికి రాలేక మంటల్లో సజీవ దహనమైంది. మంటలను చూయి స్థానికులు పరుగులు తీశారు. 3 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను ఆపేశారు. ఇళ్లలోని అందరూ పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లారు. యితే నిరుపేద కుటుంబాలవారు సర్వశ్వం కోల్పోయారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి అరెస్ట్
విశాఖపట్నం: ఆమెకు 26 ఏళ్లు. చేసేది టీచర్ ఉద్యోగం. చట్టంపై కనీస అవగాహన లేదంటే పోలీసులకే నమ్మకం కుదరలేదు. పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్న ఆమెపై కేసు నమోదైంది. విశాఖపట్టణం సిరీపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన రమాదేవి(26) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనిలో తన వివరాలు పొందుపరిచింది. ఆ వివరాలు నచ్చడంతో విశాఖలోని సిరీపురానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్(29) ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. అలా 2012లో రమాదేవి- శ్రీనివాస్ ల వివాహం జరిగింది. పెళ్లైన మూడు రోజులకే రమాదేవి పుట్టింటికి వెళ్లింది. మళ్లీ అత్తారింటికి రాలేదు. ఏళ్లపాటు ఎదురుచూసి విసిగిపోయిన శ్రీనివాస్.. నేరుగా రమాదేవి సొంతూరు పెద్దాపురం వెళ్లి ఆరా తీయగా.. ఆమెకు గతంలోనే అంటే 2003లోనే మరో వ్యక్తితో పెళ్లైందని, అతనితోనూ పడక విడిపోయిందని తేలింది. దీంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. హిందూ వివాహచట్టం ప్రకారం మొదటి భర్తతో విడాకులు పొందిన తర్వాతే రెండో పెళ్లికి అనుమతి లభిస్తుంది. రెండు సందర్భాల్లోనూ రమాదేవి విడాకుల ఊసెత్తకపోవడాన్ని నేరంగా పరిగణించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. రమాదేవితోపాటు ఆమె తండ్రిని కూడా బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. -
దారుణం.. దయనీయం
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రమాదేవి.. అనాథ వికలాంగురాలు.. ఆపై నిండు గర్భిణి. వికలాంగుల పింఛనుకూ నోచుకోలేదు. ఈమె గత ఏడాది తనకు ఉపాధి కల్పించాలని సూర్యాపేటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరడంతో స్థానికంగా ఉన్న రాజీవ్ విద్యామిషన్ హాస్టల్లో వాచ్‌మెన్‌గా ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగం ఇప్పించారు. ఆ తరువాత హాస్టల్‌ను అక్కడి నుంచి దూరంగా తరలించడంతో ఉపాధి కోల్పోయింది. తనకు లేదా.. తన భర్తకు ఏదైనా బతుకుదెరువు చూపాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆయన చుట్టూ ఉన్నవారు..సెక్యూరిటీ సిబ్బంది అవకాశం ఇవ్వలేదు. దీంతో మంత్రి కేటీఆర్‌ను కలిసి తన సమస్య చెప్పుకుందామని గత వారం రోజులుగా తెలంగాణ సెక్రె టేరియట్ ఎదుట ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ పడిగాపులు కాస్తున్నా..అమాత్యుల దర్శనభాగ్యం దక్కలేదు. గురువారం వర్షంలో తడుస్తున్న ఆమెను గమనించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తన కారులో ఎక్కించుకుని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన కూడా ఈమె సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. చివరకు పిడమర్తి రవి జోక్యం చేసుకుని కేటీఆర్ సార్ లేనందున మరోసారి రావాలని చెప్పి చేతి ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. -ఫొటోలు: అమర్ -
డెంగీతో విద్యార్థిని మృతి
టి. నర్సాపురం: డెంగీ వ్యాధితో విద్యార్థి మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు. గ్రామానికి చెందిన రమాదేవి (16) స్థానిక కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటంతో.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో సరైన వైద్యం అందకపోవడంతోనే బాలిక మృతి చెందిందని.. ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఏపీ సర్కార్ విదానాలపై ఐద్వా ఫైర్
-
జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలంటే...
మీరే పారిశ్రామికవేత్త! ‘ఇంట్లో అందరూ సంపాదన పరులే. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి’ అనుకుంటున్నారా? ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఓ నైపుణ్యం ఉంటుంది. నాలో నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి’ అనుకుంటున్నారా? ఇవేవీ కాదు, ‘డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే మార్గం కాదు. ఉద్యోగాలిచ్చే పరిశ్రమను స్థాపించడం గొప్ప ఆలోచన’ అనుకుంటున్నారా? ఇందులో మీరు ఎలా ఆలోచించినా, మీలో ఏదో చేయాలనే తపన ఉన్నట్టే! మీ ఆలోచనలకు వాస్తవ రూపమివ్వడానికే ఈ ప్రయత్నం. ఈ వారం జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ఏమేం కావాలి? ఎంత ఖర్చవుతుంది? (ధరలు రూపాయల్లో) 1 జ్యూట్ సూయింగ్ మెషీన్ - 12,000 నుంచి 20,000. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇండస్ట్రియల్ మెషీన్ తీసుకోవాలి. అది 20,000 ఉంటుంది. 1 కటింగ్ మెషీన్ - 9,000. చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో కావాలంటే మెషీన్ ఉంటే పని సులువవుతుంది. ఒక మెషీన్‌కు ఒక మనిషి చేత్తో కట్ చేసి అందించగలరు. 1 కటింగ్ టేబుల్ - 12,000. మీది చిన్న గది అయితే టేబుల్ వేయడం కుదరదు. నేల మీద పరచి కత్తిరించుకోవాలి. మరింత ఆకర్షణీయంగా తయారుచేయాలంటే ఎంబ్రాయిడరీ మెషీన్ కూడా తీసుకోవచ్చు. దీని ధర 28,000. 2 ర్యాకులు- ఒక్కొక్కటి 2,500 1 అల్మెరా - 6,000 నుంచి 7,000 ఇతరాలు: 1 కత్తెర - 200 1 పెద్ద స్కేలు - 20 1 టేపు - 5 10 బాబిన్లు, బాబిన్ కేస్లు - 350 మెషీన్ రిపేర్ కోసం స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ సెట్ - 100 2 ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - ఒక్కోటి వంద. (‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...) మ్యాన్‌పవర్: ఇద్దరు కావాలి స్థలం ఎంతుండాలి? ఒక మెషీన్‌తో యూనిట్ పెట్టడానికి కనీసంగా కావల్సిన స్థలం: 12 బై 12 అడుగుల గది. టేబుల్ కూడా అమర్చుకోవాలంటే మరికొంత పెద్దగా ఉండాలి. యాభై వేల రూపాయలు మీ చేతిలో ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణాల సహకారంతో పది లక్షల రూపాయల యూనిట్ పెట్టుకోవచ్చు. శిక్షణ ఎలా? భారత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ‘వందేమాతరం’ పేరుతో కేంద్ర పరిశ్రమల శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘ఎలీప్’ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా 18-45 ఏళ్ల మధ్య వయసు మహిళలు (కనీస విద్యార్హత 5వ తరగతి) శిక్షణ పొందవచ్చు. ఎలాంటివి ఉత్పత్తి చేయొచ్చు? కుషన్ కవర్లు, కర్టెన్లు, సెల్‌ఫోన్ కవర్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, లంచ్ బాక్సుల ఆకారాలను బట్టి వాటిని ఇమిడ్చే బ్యాగులను తయారుచేయవచ్చు. సర్టిఫికెట్ల ఫోల్డర్లు, కూరగాయల సంచుల నుంచి పిక్నిక్కు పనికొచ్చే వెరైటీలు, ఇలా దైనందిన జీవనాన్ని గమనిస్తే ఎన్నో ఆలోచనలొస్తాయి. మార్కెట్ ఎలా? జిల్లా, మండల కేంద్రాలలోని డ్వాక్రా బజార్లలో స్టాల్ అద్దెకు తీసుకుని స్వయంగా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన మార్కెట్ ఏజెన్సీలతో అంగీకారం కుదుర్చుకోవచ్చు. గుళ్ల దగ్గర, కాలనీలోని దుకాణదారులకు ప్రయోగాత్మకంగా కొన్ని పీసులను ప్రదర్శించమని అడగవచ్చు. ఇంకా, ఎలీప్ ‘విపణి’ కార్యక్రమం ద్వారా అమ్మకందార్లను, కొనుగోలుదార్లను అనుసంధానిస్తోంది. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఏలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. యాభై వేల రూపాయలు చేతిలో ఉంటే పదిలక్షల యూనిట్ ప్రారంభించే అవకాశాలు నేడు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. ఎలీప్ ద్వారా శిక్షణ, పరిశ్రమ పెట్టడానికి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్నాం. ఆన్లైన్ మార్కెట్‌కు కూడా తెర తీశాం. జ్యూట్ (జనపనార) పర్యావరణ హితమైనది. దాని వాడకం పెరిగితే పరోక్షంగా రైతులకు ఉపాధి పెరుగుతుంది. - రమాదేవి ఎలీప్(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అధ్యక్షురాలు రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
బైక్‌పై కోతుల దాడి: యువతి మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఓ బైకుపై కోతులు చేసిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్ఐ నారాయణ కథనం ప్రకారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన బొమ్మసాని చంద్రశేఖర్ తన సోదరి రమాదేవితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైందుకు పల్సర్ బైక్‌పై సికింద్రాపూర్‌కు బయలు దేరారు. వీరు డిచ్పల్లి మండలం చంద్రాయన్పల్లి అటవీ శివారు ప్రాంతానికి చేరుకునేటప్పటికి ఓ కోతుల గుంపు రోడ్డు దాటుతోంది. బైకుపై ఎర్ర రంగులో ఉన్న బ్యాగును చూసి ఒక కోతి దానిపై దూకింది. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. వెనుక కూర్చున్న రమాదేవి తలకు తీవ్రగాయాలు కాగా, చంద్రశేఖర్ కుడి చేయి విరిగింది. వీరిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా రమాదేవి మార్గమధ్యలో మృతి చెందింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సోమల: మండలంలోని కరకమంద వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బంధువుల అమ్మాయికి పాప పుట్టడంతో చూడడానికి సోమల మండలం అడుసుపల్లెకు చెందిన పెద్దరెడ్డెప్ప(43), భార్య రమాదేవి(40) గురువార ం ఉదయం సూరయ్యగారిపల్లెకు బైక్‌లో వెళ్లారు. పాప చూసి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి బయలుదేరారు. కొద్ది దూరం రాగానే పుంగనూరు-తిరుపతి రహదారిలోని కరకమంద బస్టాండు వద్దనున్న మలుపులో కర్ణాటక నుంచి వస్తున్న మారుతీ కారు వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పెద్ద రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రమాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళుతున్న మరో కారులో ఆమెను తిరుపతికి తరలించారు. మృతునికి కుమారుడు శ్రీకాంత్ (11), కుమార్తె మైథిలి(8) ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కళ్ల ముందే తమ బంధువు మృతి చెందడంతో సూరయ్యగారిపల్లెలో, గ్రామస్తుడు మృతి చెందడంతో అడుసుపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ‘పాపను చూసొస్తామని చెప్పి అటే వెళ్లిపోయావా నాయనా’ అంటూ కుటుంబ సభ్యులు రోదించడం పలువురిని కలచివేసింది. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మహిళ మృతి
నల్గొండ : ప్రమాదవశాత్తూ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన రమాదేవిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీ నేతల వేధింపులపై వితంతువు ఫిర్యాదు
చిత్రం (గుడ్లవల్లేరు) : రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తనకు ఇష్టమైన నాయకుడికి వేసినందుకు గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామంలో బొప్పా రమాదేవి అనే వితంతువును టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధితురాలు సోమవారం కలెక్టర్, డీపీవోకు సోమవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటేశాననే తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం నుంచే తననరు ఇబ్బందులు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన భర్త మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో చనిపోయారని తెలిపారు. పంచాయతీ పోరంబోకు ఇంటి స్థలం సెంటున్నర తమ కుటుంబానికి మిగిలిందని తెలిపారు. గ్రామంలోనే వేరే ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలానికి చెందిన కరెంట్ బిల్లు, ఇంటిపన్ను రశీదును అడ్డం పెట్టి తన స్థలాన్ని చేజిక్కించుకునేందుకు తెగబడుతున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో ఇదే ఇంటికి సర్పంచ్ లెటర్‌ను కూడా ఇచ్చారని చెప్పారు. తన స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేత ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తన ఇంటి స్థలాన్ని తనకు అప్పగించాలని ఆమె కోరుతున్నారు. -
యువజంట కోసం ముమ్మరంగా గాలింపు
యాసిడ్ దాడి కేసులో దర్యాప్తు వేగవంతం రెండోరోజు పలువురిని విచారించిన పోలీసులు ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ సమీపంలో దంపతులపై యాసిడ్‌తో దాడి చేసి పరారైన యువజంట కోసం పోలీ సు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు నగరంలోని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూడా ఈ కేసును ముమ్మరంగా దర్యాపు చేస్తున్నారు. బైక్‌పై వచ్చిన యువకుడికి 30 ఏళ్లు, యువతికి 25 ఏళ్ల వయస్సు ఉంటుంది. యువతి పంజాబ్ డ్రెస్ ధరించింది. వారు రింగుసర్కిల్ మీదుగా వచ్చి దాడి అనంతరం ఫెర్రి ఆర్టీసీ కాలనీ రోడ్డు మీదుగా ఇసుక రేవు డొంకరోడ్డులోకి వెళ్లి గాజుల పేట మీదుగా కీసరవైపు వెళ్లారని పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలిసింది. వారి ఆచూకీ కోసం కీసర టోల్గేట్ వద్ద వీడియో కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల పుటేజీని సేకరిస్తున్నట్లు సమాచారం. మూడు కోణాల్లో దర్యాప్తు ఈ కేసును పోలీసులు మూడు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దాడిలో గాయపడ్డ జూలూరి హనుమంతరావు మొద టి భార్య కుమారులు కుట్రపన్ని ఉంటారని ప్రధానంగా అనుమానించారు. మరి అంశా లపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హనుమంతరావు రెండో భార్య రమాదేవి, ఆమె తరఫు బంధువుల పాత్ర ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఎవరైనా శుత్రువులు ఉం డి ఉంటారా? అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు. హనుమంతరావు వడ్డీలకు డబ్బు కూడా ఇస్తుంటారు. వడ్డీ వసూళ్ల విషయంలో ఒకరిద్దరితో మనస్పర్థలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలినట్లు తెలిసింది. తమ కుమారులే దాడి చేయించారని ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమారులు వాదిస్తున్నారు. హనుమంతరావు ఇంటిని పోలీసులు బుధవారం కూడా పరిశీలించారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు కుటుంబానికి సంబంధం ఉన్న వారిని కూడా పిలిచి విచారిస్తున్నారు. కోలుకుంటున్న రమాదేవి దాడిలో తీవ్రంగా గాయపడిన రమాదేవి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్పొరేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. హనుమంతరావు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై నమోదైన కేసును ఇబ్రహీంపట్నం సీఐ సీహెచ్ రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిండు గర్భిణిపై అత్యాచారం.. హత్య
నగర శివార్లలో దారుణం హైదరాబాద్: నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతు నులిమి హత్య చేసిన సంఘటన హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకుంది. నిందితుడు ఆమె కన్నబిడ్డ ఎదుటే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన తర్వాత మహిళను హత్యచేసి, ఆమె బిడ్డ కాళ్లకు ఉన్న పట్టీలు, అల్మరాలో దాచిన నగదు తీసుకొని ఉడాయించాడు. గోడదూకి వస్తున్న నిందితుడిని స్థానికులు పట్టుకొని చితకబాదగా, అతడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడని మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ ఎస్.ఎన్. జావీద్ శనివారం తెలిపారు. కర్ణాటకకుచెందిన రమాదేవి (35) నగరానికి వలసవచ్చి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని బుద్వేల్ రైల్వేస్టేషన్ నర్సింగ్ రావు బస్తీలో ఉంటోంది. ఆమె భర్త కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆమె కూలీ పనిచేస్తూ కుమార్తె స్రవంతి(7)ని పోషిస్తోంది. రమాదేవి ప్రస్తుతం 9 నెలల గర్భిణి. వీరు ఉంటున్న ఇంటిపక్కనే ఓ లారీ పార్కింగ్ గ్యారేజ్ ఉంది. శనివారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని వ్యక్తి గ్యారేజ్ గోడ దూకి రమాదేవి ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడాడు. రమాదేవి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనాథగా మారిన స్రవంతిని పోలీసులు బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పోలియో బాధితురాలికి సీఎం అండ!
-
పోలియో బాధితురాలికి సీఎం అండ!
హైదరాబాద్: పోలియో వల్ల రెండు కాళ్లు కోల్పోయిన ఎం.రమాదేవికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు అండగా నిలిచారు. ఆమెకు వెంటనే ఉద్యోగం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. నల్లగొండ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రమాదేవి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. చిన్నప్పుడే రెండు కాళ్లు కోల్పోయానని, భర్త కళ్యాణ్‌కుమార్ కూడా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్నాడని ఆమె వివరించారు. ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు చలించిన సీఎం... వెంటనే ఉద్యోగం కల్పించాలని ఆదేశించారు. -
సీఎం కేసీఆర్ సారూ... మొర వినే దెవరు?
ఈ చిత్రంలోని అభాగ్యురాలిని చూశారా? నడవలేని దీన స్థితిలో ఎంతో కష్టపడి తెలంగాణ సెక్రెటేరియట్‌కు వచ్చిన ఆమె గాధ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. కానీ మన అధికారులకు మాత్రం ఆమె బాధ అర్థం చేసుకునే ఓపిక.. తీరిక లేవు. ఆమె పేరు రమాదేవి. నల్గొండ పట్టణానికి చెందిన ఆమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో నడవలేకపోతోంది. ఆమె భర్త పేరు శ్రావణ్‌కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త శ్రావణ్ కుమార్‌కు కాలు విరిగిపోయింది. అతను మంచాన పడ్డాడు. హైదరాబాద్ : ఇల్లు గడవడం కష్టమైంది. ఏం చేయాలో తోచని ఆమె సీఎం కేసీఆర్‌కు తన దుస్థితిని వివరించి, ఆదుకోవాల్సిందిగా కోరాలని భావించింది. వినతిపత్రంతో సోమవారం తెలంగాణ సచివాలయానికి చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు తన పరిస్థితిని వివరించి...సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఫలితం కనిపించలేదు. ఆమెను లోపలికి పంపించేందుకు వారు నిరాకరించారు. ఎవరిని కదిపించినా ఉపయోగం లేకుండాపోయింది. చాలా సేపు అదే ఆవరణలో నిరీక్షించిన ఆమె చివరకు అటుగా వస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి తన దుస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించగా...‘నాకెందుకు ఇస్తావ్’ అని ప్రశిస్తూ వెళ్లిపోయారు. ‘నా ఇద్దరు పిల్లలు కడుపు నిండా తినగలిగితే అదే చాలు’ అంటున్న ఆమె మాటలు ప్రభుత్వ పెద్దలకు చెప్పే వారే లేకపోయారు. అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయిన ఆ అభాగ్యురాలు నిరాశతో... కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగింది. -
సీఎం సారూ... మొర వినేదెవరు?
ఈ చిత్రంలోని అభాగ్యురాలిని చూశారా? నడవలేని దీన స్థితిలో ఎంతో కష్టపడి తెలంగాణ సెక్రెటేరియట్‌కు వచ్చిన ఆమె గాధ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. కానీ మన అధికారులకు మాత్రం ఆమె బాధ అర్థం చేసుకునే ఓపిక.. తీరిక లేవు. ఆమె పేరు రమాదేవి. నల్గొండ పట్టణానికి చెందిన ఆమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో నడవలేకపోతోంది. ఆమె భర్త పేరు శ్రావణ్‌కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త శ్రావణ్ కుమార్‌కు కాలు విరిగిపోయింది. అతను మంచాన పడ్డాడు. ఇల్లు గడవడం కష్టమైంది. ఏం చేయాలో తోచని ఆమె సీఎం కేసీఆర్‌కు తన దుస్థితిని వివరించి, ఆదుకోవాల్సిందిగా కోరాలని భావించింది. వినతిపత్రంతో సోమవారం తెలంగాణ సచివాలయానికి చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు తన పరిస్థితిని వివరించి...సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఫలితం కనిపించలేదు. ఆమెను లోపలికి పంపించేందుకు వారు నిరాకరించారు. ఎవరిని కదిపించినా ఉపయోగం లేకుండాపోయింది. చాలా సేపు అదే ఆవరణలో నిరీక్షించిన ఆమె చివరకు అటుగా వస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి తన దుస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించగా...‘నాకెందుకు ఇస్తావ్’ అని ప్రశిస్తూ వెళ్లిపోయారు. ‘నా ఇద్దరు పిల్లలు కడుపు నిండా తినగలిగితే అదే చాలు’ అంటున్న ఆమె మాటలు ప్రభుత్వ పెద్దలకు చెప్పే వారే లేకపోయారు. అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయిన ఆ అభాగ్యురాలు నిరాశతో... కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగింది. - ఫొటోలు:రఫీ -
కనెక్షన్.. కలెక్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కాకినాడకు చెందిన పూర్ణచంద్రరావు, రమాదేవి దంపతులు కొద్దిరోజుల క్రితం కర్నూలులోని అశోక్‌నగర్‌లో కొత్త కాపురం పెట్టారు. భర్త కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కొత్తగా కాపురం పెట్టటంతో నిత్యావసరాలతో పాటు గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. పూర్ణచంద్రరావు గ్యాస్ కనెక్షన్ కోసం నగరంలోని ఓ ఏజెన్సీ వద్దకెళ్లారు. గ్యాస్ కనెక్షన్ కావాలి? ఎంత? అని అడిగారు. ఏజెన్సీ యజమాని అప్లికేషన్‌ను పూర్తి చేయించారు. సింగిల్ సిలిండర్ కావాలంటే రూ.5 వేలు, డబుల్ సిలిండర్ అయితే రూ.9 వేలు చెల్లించమని డిమాండ్ చేశాడు. ‘అదేంటి సార్. అంత లేదు కదా?’ అంటే.. ‘మీకు అవసరమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి. వెంటనే కావాలంటే అంతే. మీరు చెప్పిన ధరకు కావాలంటే నెలో.. రెండు నెలలో పడుతుంది. సీరియల్ ప్రకారం సమాచారం ఇస్తాం. అప్పుడు రండి. వెళ్లండి’ అని చెప్పటంతో చేసేది లేక అవసరం కోసం ఏజెన్సీ వారు అడిగినంత ఇచ్చి సిలిండర్లును తీసుకెళ్లారు. ఇలా జిల్లాలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. దోపిడీ ఇలా... జిల్లాలో 51 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి రోజు కొత్త కనెక్షన్ కోసం ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. గ్యాస్ కోసం వచ్చే వారి అవసరాలను గుర్తించి ఏజెన్సీ యజమానులు భారీ మొత్తంలో వసూళ్లు చేస్తూ సామాన్య ప్రజల నుంచి దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం సింగిల్ సిలిండర్ కనెక్షన్ కావాలంటే రూ.2450 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో డిపాజిట్ రూ.1450, గ్యాస్ సిలిండర్ రూ.450, గ్యాస్ పైప్ రూ.150, రెగ్యులేటర్ రూ.250, లైటర్ రూ.50, సర్వీస్ చార్జ్ రూ.100 ఉంటాయి అయితే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఏకంగా రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. అదే డబుల్ సిలిండర్ కావాలంటే రూ.7 వేల నుంచి రూ.9 వేలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే డబుల్ సిలిండర్ కావాల్సి వస్తే అదనంగా రూ.450 చెల్లిస్తే రెండు సిలిండర్లు ఇవ్వాలి. ఏజెన్సీలు అందుకు వ్యతిరేకంగా దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నాయి. మామూళ్ల మత్తులో... కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వెచ్చించి లెసైన్స్ దక్కించుకుంటున్నారు. భారీ మొత్తంలో చెల్లించటంతో ఆ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఏజెన్సీలు నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా వసూళ్లు చేసి దండుకుంటున్నాయి. ఈ దోపిడీపై ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువవుతోంది. ఏజెన్సీ యజమానులు సంబంధిత అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ఇస్తుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అశోక్‌నగర్‌కు చెందిన రమాదేవి, శరీర్‌నగర్‌కు చెందిన రామాంజనేయులు ఏజెన్సీ దోపిడీ గురించి వేరువేరుగా ఇద్దరు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. తాము ఫిర్యాదు చేసిన విషయాన్ని వెంటనే సంబంధిత ఏజెన్సీ వారికి ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారని వారు వెల్లడించారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
భద్రాద్రిలో ‘మద్యం’ రగడ
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభ రసాభాసగా మారింది. పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మద్యం దుకాణాలు వద్దని కొంతమది డిమాండ్ చేయగా, ఏర్పాటు చేయాల్సిందేనని మరి కొందరు పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసు పహారా నడుమ గ్రామసభ నిర్వహించారు. భద్రాచలం పట్టణంలో తొమ్మిది మద్యం దుకాణాల ఏర్పాటుకు సం బంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి లాటరీ పద్ధతి లో గిరిజనులకు కేటాయించారు. కానీ ఈ నెల 21వ తేదీన నిర్వహించిన గ్రామసభలో మద్యం దుకాణాలు వద్దంటూ తీర్మానించారు. ఈ క్రమంలో పీఓ ఆదేశాల మేరకు మరోసారి గ్రామసభ నిర్వహిం చారు. మొదటిసారి నిర్వహించిన గ్రామసభకు కేవ లం 75 మంది హాజరుకాగా, శనివారం నిర్వహిం చిన గ్రామసభకు ఐదువందల మందికిపైగానే హాజరయ్యారు. వ్యతిరేకించిన పలు రాజకీయ పార్టీలు.. పట్టణంలో మద్యం దుకాణాల ఏర్పాటును సీపీఎంతో పాటు, వైఎస్సార్సీపీ, టీడీపీలోని ఓ వర్గం నాయకులు, వివిధ గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్యం దుకాణాలు వద్దంటూ సభావేదిక ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ వెనుక కూర్చున్న వారంతా దుకాణాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టడంతో గ్రామ సభ రసాభాసగా మారింది. చివరకు ఎంపీడీఓ రమాదేవి కల్పించుకుని సభకు వచ్చిన వారంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ పేరు, చిరునామాతో పాటు అభిప్రాయాన్ని చెప్పాలని సూచించారు. దీంతో గ్రామసభకు వచ్చిన వారంతా లైన్లో నిలబడి తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తం 325 మంది గ్రామసభలో అభిప్రాయాలను వెల్లడించగా, ఇందులో 231 మంది మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుకూలంగా, 94 మంది వ్యతిరేకంగా చెప్పారు. ఈ నివేదికను ఐటీడీఏ పీఓకు అందజేస్తామని ఎంపీడీఓ రమాదేవి ప్రకటించారు. హైకోర్టు తీర్పును ధిక్కరిస్తే ఎలా..? భద్రాచలంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించినా, అధికారులు అత్యుత్సాహం చూపుతూ గ్రామసభ ఏర్పాటు చేయడంపై సీపీఎం పట్టణ కార్యదర్శి ఎంబీ నర్సారెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ సెల్ కమిటీ సభ్యులు కడియం రామాచారి, పంచాయతీ వార్డు సభ్యులు బండారు శరత్, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేష్, ఆదివాసీ నాయకులు మడవి నెహ్రూ, కొర్సా చినబాబు దొర, కుంజా రమాదేవి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కుంచాల రాజారామ్‌తో పాటు పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై సర్పంచ్ శ్వేత కల్పించుకొని తప్పు మాది కాదని, ఐటీడీఏ పీఓ, కలెక్టర్దేనన్నారు. గ్రామసభను మళ్లీ నిర్వహించమని వారు ఆదేశించటంతోనే ఇలా చేస్తున్నామని, ఏదైనా ఉంటే వారి తోనే చెప్పుకోవాలని సమాధానం ఇచ్చారు. హైకోర్టు స్టే విధించినట్లు తమకు సమాచారం లేదని ఎంపీడీఓ రమాదేవి, ఎక్సైజ్ సీఐ రాంకిషన్ వెల్లడించారు. దీనిపై ఆయా పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో గ్రామసభలో కోరం సరిపోలేదని, సభను రద్దు చేసినట్లు ఎంపీడీఓ రమాదేవి ప్రకటించారు. కాగా సిండికేట్ వ్యాపారులు తమ దుకాణాలు బంద్ చేసుకుని గ్రామ సభకు ప్రజలను తరలించడం గమనార్హం. -
భారత జట్టు కెప్టెన్‌గా రమాదేవి
ప్రపంచ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌కు జట్ల ఎంపిక జింఖానా, న్యూస్‌లైన్: ప్రపంచ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత్ మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమాదేవి సార థ్యం వ హించనుంది. పురుషుల జట్టుకు గోవిందరాజన్ (పాండిచ్చేరి) నాయకత్వం వహించనున్నాడు. ఈ పోటీలు దక్షిణాఫ్రికాలోని సెదిబెంగ్లో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం భారత టెన్నికాయిట్ సమాఖ్య అధ్యక్షుడు రామమూర్తి, కార్యనిర్వహక అధ్యక్షుడు సితాని జట్లకు కిట్లను అందజేశారు. మేనేజర్లుగా జువెల్ వాస్రా, లక్ష్మీకాంత్, కోచ్‌గా విశ్వనాథం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పురుషుల జట్టు: గోవిందరాజన్ (పాండిచ్చేరి), మరియప్పన్ (కర్ణాటక), సంతోష్ కుమార్ (కేరళ), అన్ను ప్రకాశ్ (కేరళ), సోర్నవేల్ (కర్ణాటక), రాకేష్ (ఆంధ్రప్రదేశ్), జేసుదాస్ (తమిళనాడు). మహిళల జట్టు: రమాదేవి (ఆంధ్రప్రదేశ్), చందన (కేరళ), అమృత (కేరళ), రేణుక (మహారాష్ట్ర), రేవతి (ఆంధ్రప్రదేశ్), కాయత్రి (తమిళనాడు). -
గుప్తనిధుల వేటలో అన్నాచెల్లెళ్ల మృతి
వి. బొంతిరాళ్ల (డోన్‌టౌన్)/శంషాబాద్: రూరల్: ఆ యువతికి భక్తిభావమెక్కువ.. జ్యోతిష్యం కూడా తెలుసు. ఆమె అన్న ఓ ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరికీ ఉన్నట్టుండి ఓ పెద్ద ఆశ కలిగింది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామనుకున్నారు. తలుపుతట్టిన అవకాశాన్ని వదులుకోకుండా గుప్తనిధుల ముఠాతో చేతులు కలిపారు. మూఢనమ్మకాలపై ఉన్న విశ్వాసంతో తమ జీవితాలనే బలి పెట్టారు. నిధుల వేటలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, నాగమ్మ దంపతులకు కుమారుడు నాగరాజు(25), నలుగురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు డిగ్రీ పూర్తి చేసి నగరంలోని కింగ్‌కోఠి కామినేని ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి పెద్ద చెల్లి రమాదేవి(21) పదో తరగతి వరకు చదువుకుంది. ఈమె మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగాంలో ఉన్న సన్చైన్ ప్లాస్టిక్ కంపెనీలో రోజూ కూలీగా పని చేస్త్తోంది. రమాదేవి జ్యోతిష్యం కూడా చెబుతుండేది. ఈక్రమంలో ఆమె పలువురికి పరిచయం అయింది. కర్నూలు జిల్లా డోన్, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గుప్తనిధుల ముఠా సభ్యులు రమాదేవి గురించి విన్నారు. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన కరాటే మాస్టర్ రాధాకృష్ణ వద్ద శిక్షణ తీసుకొని నాగరాజు బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈక్రమంలో వీరిద్దరూ సన్నిహితులయ్యారు. తమ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే గుప్త నిధులు ఉన్నాయని, వాటి రహస్యం రమాదేవితో చెప్పించాలని కొందరు నాగరాజును పట్టుబట్టారు. దొరికే నిధిలో ఒకవంతు భాగాన్ని ఇస్తామని చెప్పడంతో ధనవంతులం అవుతామని అన్నాచెల్లెళ్లు అంగీకరించారు. బుధవారం మధ్యాహ్నం పాల్మాకుల నుంచి ప్రెస్ స్టిక్కర్ ఉన్న కారులో వీరు డోన్‌కు వచ్చారు. కర్నూలు నుంచి జేసీబీని తెచ్చిన ముఠా సభ్యులు వీరిని వెంటబెట్టుకొని బుధవారం అర్ధరాత్రి బొంతిరాళ్ల గ్రామ శివార్లలోని కంది పొలాల్లోకి వెళ్లారు. తమతో తెచ్చుకున్న సామగ్రితో పూజలు చేసి జేసీబీతో నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు ఘటనా స్థలానికి టార్చిలైట్లతో చేరుకొని వారిని చుట్టుముట్టారు. కేకలు వేస్తూ జేసీబీపై రాళ్లురువ్వారు. దీంతో హడలెత్తిపోయిన ముఠాసభ్యులు పరారయ్యేందుకు పరుగులు తీశారు. డ్రైవర్ భయంతో ఇష్టానుసారంగా జేసీబీని తిప్పాడు. దీంతో గట్టుకింద నక్కిఉన్న నాగరాజు, రమాదేవిలకు జేసీబీ తగిలి గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు గంటన్నర పాటు గందరగోళం నెలకొంది. అక్కడే నక్కి ఉన్న కరాటే మాస్టర్ రాధాకృష్ణను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల అదుపులో ముఠా...? హైదరాబాద్‌కు చెందిన సుభాష్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాధాక్రిష్ణన్, లక్ష్మారెడ్డి, డోన్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్, కోయిలకొండ రాజు, నందికొట్కూరుకు చెందిన విజయుడు, ఓర్వకల్లుకు చెందిన జేసీబీ డ్రైవర్ రవికుమార్, రుద్రవరానికి చెందిన కారు డ్రైవర్ సుంకన్న, కొలిమిగుండ్లకు చెందిన హుస్సేన్‌లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. డైరీలో ఏముంది..? మృతి చెందిన రమాదేవి, నాగరాజుల డైరీలో ఏముందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మృతుల వద్ద ఉన్న నగదుతో పాటు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. కాగా నాగరాజు, రమాదేవి హత్యకు గురయ్యారని మృతుల బంధువుల ఆరోపిస్తున్నారు. పాల్మాకులలో విషాదం.. అన్నాచెల్లెళ్ల మృతితో పాల్మాకులలో విషాదం అలుముకుంది. ఈ నెల 25న క్రిస్మస్ పండగ రోజు సెలవు దినం కావడంతో అన్నాచెల్లెల్లు ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం నాగరాజు సెల్‌కు ఫోన్ వచ్చింది. కాసేపటికే అన్నాచెలెళ్లు ఇద్దరు ఇంట్లోంచి బయలు దేరారు. కృష్ణ సారు రోడ్డు మీద ఉన్నాడంటా.. మమ్మల్ని రమ్మన్నాడంటూ చెప్పి వెళ్లిపోయారు. -
నకిలీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆటకట్టు
మరిపెడ, న్యూస్‌లైన్ : ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన నకిలీ పోలీసులను మరిపెడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి నిందితుల వివరాలు వెల్లడించారు. మరిపెడకు చెందిన మచ్చర్ల లింగయ్య, మచ్చర్ల లక్ష్మణ్, మమబూబాబాద్ మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు మురళి, నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన జి. కుమార్‌తో అదే జిల్లా ఆత్మకూరు మండలం దుంపెల్లి గ్రామానికి చెందిన మారోజు రత్నాచారి ముఠాను ఏర్పాటు చేశాడు. వీరిలో లింగయ్య లాండ్రీషాపు నడుపుతుండగా మిగతావారు ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా కురవి మండలం మాదాపురానికి చెందిన భూక్య శ్రీను కొంతకాలంగా హైదరాబాద్‌లో కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమం లో అతడు నాలుగు రోజుల క్రితం గంజారుు విక్రరుుస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిపై హైదరాబాద్‌లో గంజాయి కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఉన్న పరిచయంతో వారి ద్వారా విష యం తెలుసుకున్న రత్నాచారి నిందితుడి కుటుంబం నుంచి డబ్బులు రాబట్టేందుకు పథక రచన చేశాడు. లింగయ్య, లక్ష్మణ్, మురళి, కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోనే కారు అద్దెకు తీసుకుని గురువారం రాత్రి మాదాపురం చేరుకున్నాడు. తాము టాస్క్ ఫోర్స పోలీసులమని నీ భర్తను కేసు నుంచి విడిపిస్తామని శ్రీను భార్యతో నమ్మబలికి ఆమె వద్ద బంగారు చెవిదిద్దులు, కాళ్ల వెండిపట్టీలు తీసుకున్నారు. అదే తండాకు చెందిన ఆంగోతు రాములుతో కూడా నీపై గతంలో ఉన్న కేసులను ఎత్తివేయిస్తామని చెప్పడంతో ఆయన నమ్మలేదు. అయినా బలవంతంగా కారులో ఎక్కించుకుని నల్లగొండ జిల్లా భువనగిరికి తీసుకెళ్లారు. ఎంత బెదిరించినా అతడు తనవద్ద ఒక్కపైసా కూడా లేదని చెప్పడంతో చేయిచేసుకున్నారు. చివరికి రూ.80 వేలు ఇస్తానని తేల్చిచెప్పడంతో అతడిని కొట్టడం ఆపేశారు. అనంతరం భువనగిరి నుంచి సూర్యాపేటకు తీసుకొచ్చారు. రాములు తన అల్లుడైన మరిపెడ మండలం ఉల్లెపల్లి శివారు భూక్యతండాకు చెందిన రామ్మూర్తికి అక్కడి నుంచి ఫోన్ చేసి నకిలీ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఇచ్చాడు. తన మామ రాములును వదిలిపెట్టడానికి ముందు రూ.50 వేలు ఇస్తానని రామ్మూర్తి అంగీకరించాడు. డబ్బులు తీసుకునేందుకు మండలంలోని ఎల్లంపేట స్టేజీ వద్దకు రావాలని చెప్పి, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. శుక్రవారం మధ్యాహ్నం కారు లో నకిలీలు స్టేజీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే మాటువేసి ఉన్న కానిస్టేబుళ్లు రమేష్, రాజు వారిని అనుమానించి లింగయ్య, చారిని పట్టుకోగా మిగతావారు పరారయ్యారు. దొరికిన విచారించి హైదరాబాద్‌లో ఉన్న మురళి, లక్ష్మణ్‌ను కూడా అరెస్టు చేశారు. కుమార్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుల అరెస్ట్‌లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఆమె అభినందించారు. కురవి సీఐ రవీందర్, మరిపెడ ఎస్సై వెంకయ్య, నర్సింహుల పేట ఎస్సై వై. వెంకటప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్,రాజు, కరుణాకర్, వీరరాఘవులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో నకిలీ పోలీసులు ?
మరిపెడ, న్యూస్‌లైన్ : సీఐ, ఎస్సైలమంటూ మండలంలోని పలుగ్రామాల్లో వసూళ్లకు పాల్పడుతున్న కొందరు నకిలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మండలంలోని ఉల్లెపల్లి, విస్సంపల్లి శివారు తండాల్లో సుమా రు ఆరుగురు వ్యక్తులు రెండు రోజులుగా తిరుగుతూ ప్రజలను పోలీసుల పేరిట భయభ్రాంతులకు గురిచే స్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే గతంలో గంజాయి వ్యాపారంతో సంబంధమున్న ఓ వ్యక్తిని బెదిరించినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వచ్చి ఆయనతోపాటు మరో ఇద్దరిని బెదిరించి రూ లక్ష ఇవ్వాలని, లేదంటే పాత కేసుల్లో ఇరికిం చి జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు తెలిసింది. దీంతో వారు రూ 80 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పడంతో నకిలీ పోలీసు లు మరిపెడకు గురువారం రాత్రి చేరుకున్నారు. అనంతరం మాదాపురం, ఉల్లేపల్లి శివారు భూక్యతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులను నకలీలు తీసుకెళ్లి డబ్బుల కోసం వేధించసాగారు. వారి బంధువులకు సమాచారం అందించడంతో వారు నకిలీ పోలీసులను వెంబడించడమేగాక పోలీసులకు సమాచారమిచ్చారు. వారిలో ము గ్గురిని మండలంలోని ఎల్లంపేట స్టేజీ చాకచక్యంగా ప ట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రూరల్‌ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు మరిపెడ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైం రేటును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీ లించారు. పోలీసులందరిని మండలంలోని పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రత ల విషయమై ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశా రు. ఆయన వెంట మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి, కురవి సీఐ రవీందర్, మరిపెడ ఎస్సై వెంకయ్య ఉన్నారు. -
పీఎస్‌లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు
వారసుడు లేడనే నెపంతో ఇల్లాలు రమాదేవిని వేధించడమే కాకుండా పిల్లలతో సహా ఇంటి నుంచి గెంటివేసిన కేసులో ఆమె భర్త సంతోష్ కుమార్‌తోపాటు ఆమె అత్తామామలు గురువారం ఉదయం సరూర్‌నగర్ మహిళ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పుత్రుడిని కనివ్వలేదని రమాదేవిని భర్తతోపాటు, అత్తమామలు తరుచుగా వేధించేవారు. దాంతో ఆమెను పుట్టింటికి పంపేశారు. కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉన్న రమాదేవి బుధవారం దిల్సుఖ్నగర్ పరిధిలోని వికాస్‌నగర్‌లోని మెట్టినింటికి వచ్చింది. ఆమె రాకను ముందుగా గమనించిన ఆమె భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రమాదేవికి మెట్టినింటి ముందు బైఠాయించింది. రమాదేవి ఘటనకు సంబంధించిన కథనం సాక్షి టీవీలో ప్రసారం కావడంతో సరూర్‌నగర్ మహిళ పోలీసులు స్పందించారు. వెంటనే రమాదేవి వద్దకు వచ్చి మహిళా పోలీసులు విషయం తెలుసుకున్నారు. అనంతరం భర్త సంతోష్‌కుమార్, ఆమె అత్తామామలపై సరూర్ నగర్ మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాంతో రమాదేవి అత్తామామలు గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.