వనపర్తి: పెళ్లిచేసుకున్న రెండు వారాలకే అనుమానంతో భార్యను, అత్తను కడతేర్చాడు ఓ యువకుడు. వనపర్తి జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్ కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతి(45)ల కుమార్తె రుక్మిణి(21), ఏపీలోని కర్నూలుకు చెందిన శ్రావణ్ వివాహం ఈ నెల 1వ తేదీన వనపర్తిలో జరిగింది.
పెళ్లి అయిన 13 రోజుల వ్యవధిలోనే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి శ్రావణ్ వనపర్తికి వచ్చాడు. రుక్మిణితోపాటు అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కూడా మంగళవారం కర్నూలు నగరంలోని చింతలమునినగర్‌లో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లీకూతుళ్లపై కూరగాయలు కోసే కత్తితో శ్రావణ్ దాడికి తెగబడ్డాడు.
తీవ్రంగా గాయపడిన జ్యోతి, రుక్మిణి అక్కడికక్కడే మృతిచెందగా, అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకున్న రెండు వారాలకే భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment