venkateswarlu
-
విద్యార్థులకు ఇంత ద్రోహమా?
సాక్షి, అమరావతి: వైద్య విద్య చదవాలని ఆశించే రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉచిత వైద్యం అందకుండా పేదవర్గాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మరే రాష్ట్ర ప్రభుత్వమూ చేయదని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు వైద్య విద్య, ఉచిత వైద్యం అందకుండా చేయాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల కళాశాలకు 50 సీట్లు ఇస్తామన్న సీట్లను కూడా వద్దని లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతించి, సీట్లు కేటాయించగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై ఆధారపడిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కేంద్రంతో కొట్లాడి కొత్త కళాశాలలు, సీట్లు రాబట్టాల్సింది పోయి.. ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించలేకపోవడం వల్ల విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య ఆశావహులకు తీరని అన్యాయం జరిగిందని డాక్టర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ వర్గాల్లోని మెరిట్ విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి0ది. దీంతో వైద్య విద్య ఆశావహులు, మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్ సీట్లు కన్వినర్ కోటాలోకి కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. మరోవైపు ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తే కన్వినర్ కోటాలో మరిన్ని సీట్లు వస్తాయని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా తీరని నష్టం కలిగించింది. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరు చేసినా, కళాశాల నిర్వహించలేమని ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసి రద్దు చేయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా చేయదు. కేవలం ఏయూ రీజియన్‌లో పాడేరుకు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో 22 సీట్లు మాత్రమే కన్వినర్ కోటాకు, 11 ఓపెన్ కాంపిటీషన్‌కు పోగా 11 సీట్లే రిజర్వేషన్ వర్గాలకు లభిస్తున్నాయి. ఎస్వీ రీజియన్‌లో ఒక్క సీటు కూడా పెరగలేదు. పులివెందులకు 50 సీట్లు తిరస్కరించకపోయి ఉంటే కన్వినర్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు 11, ఓపెన్ కాంపిటీషన్లో 11 సీట్లు అయినా దక్కేవి. వాస్తవానికి కొత్త కళాశాలలు ప్రారంభమై సీట్లు పెరుగుతాయని చాలా మంది మెరిట్ విద్యార్థులు యాజమాన్య కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడేమో కటాఫ్‌లు అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగకుండా కనీసం యాజమాన్య కోటాలో దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించాలి. ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరమవుతుంది కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి వస్తుంది. పేదలు సైతం బోధనాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో రోగులకంటే వైద్య విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. సరిపడా ఫ్యాకల్టీ, రోగులు ఉండరు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెబితే వాటిలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ రోగులు కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే వాటిలో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టే. అదే ప్రైవేట్‌కు కట్టబెడితే డబ్బు పెట్టి పేదలు వైద్యం పొందే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కడుతోంది. ఇంత దారుణం మరే రాష్ట్రంలోనూ ఉండదు. సీఎం చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టి, పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని స్పష్టమవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య కోర్సుల్లో ఫీజులను విచ్చలవిడిగా పెంచారు. డబ్బున్న వారికే వైద్య పట్టా అన్నట్టుగా తయారు చేశారు. 2014–19 మధ్య ప్రైవేట్‌లో యాజమాన్య కోటాలో మెడికల్ పీజీ ఫీజును రూ.5.25 లక్షల నుంచి ఏకంగా రూ.24.20 లక్షలకు పెంచారు. రూ.5.25 లక్షల ఫీజు అంటే బ్యాంక్ లోన్ తీసుకొనో, బయట అప్పులు చేసో పేద, మధ్య తరగతి వైద్యులు పీజీ చేయడానికి సాహసిస్తారు. పీజీలో చేరాక వారికి వచ్చే స్టైఫండ్‌తో అప్పు తీర్చుకోవచ్చనే నమ్మకం ఉంటుంది. ఐదింతలు పెంచే సరికి ఆ అవకాశం కూడా లేక, అంత ఫీజు కట్టలేక చాలా మంది పీజీ చదవలేకపోయారు. అంతే కాదు టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, మెడిసిన్ సీట్లు తెచ్చిన దాఖలాలూ లేవు.ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ఇదే తీరు ఈడబ్ల్యూఎస్ కోటా పైనా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇలానే ఉంది. ఎంబీబీఎస్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ సీట్లు పెంచకుండా కోటా అమలుకు జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. కోర్టులో కేసులు వేస్తే జీవో రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందే గానీ సీట్లు పెంచడానికి కృషి చేస్తామని మాత్రం చెప్పలేదు. అంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కొరత సృష్టించి, ప్రైవేట్ వైద్య కళాశాలలకు డిమాండ్ పెరిగేలా చేస్తున్నారు. -
ముందుబాబులతో చిందులేసిన ఏఎస్ఐపై చర్యలు
ఒంగోలు: విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్సై ఓ గ్రామంలో మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లారు. దీంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల కోసం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది.ఒకవైపు కారులో హోరెత్తుతున్న మూజ్యిక్.. మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందులేస్తున్న మందుబాబు. అయితే వారితో జతకట్టాడు ఓ ఏఎస్సై. తనలోని కళా పోషకుడిని తట్టి నిద్ర లేపాడు. మందుబాబు చిందులకు చేతిలో గ్లాసుతోనే ఈలలేసి గోల చేస్తూ మరింత ఉత్సాహపరిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దీంతో పోలీసులు అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. దీంతో ఆయన విధి నిర్వహణను విస్మరించి.. గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు.కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ఐ ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.… pic.twitter.com/PkTVwJAH6n— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024 -
గుట్టలెక్కి.. పోలియో చుక్కలు వేసి..
వాజేడు: ఇద్దరే ఇద్దరు పిల్లలున్న గ్రామమది. అయితేనేం.. దారిలేని ఆ గ్రామానికి వైద్య సిబ్బంది గుట్టలెక్కి నడిచి వెళ్లారు. పోలియో చుక్కలు వేసి వచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధి పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి వెళ్లాలంటే మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం. అంతా రాళ్ల దారి. ఈ గ్రామంలో అయిదేళ్లలోపు పిల్లలు ఇద్దరున్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి వాజేడు పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, లఖాన్, ధర్మయ్య ఆదివారం కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు పిల్లలకు పోలియో చుక్కలు వేసి భోజనం చేసి తిరిగి పీహెచ్‌సీకి చేరుకున్నారు. -
Hyderabad: గుండెపోటుతో డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు మృతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు. కాగా చంద్రతేజ్ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపరంలో రానిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ లోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం
-
కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా
కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి. కర్నూలు(లీగల్)/పార్వతీపురంటౌన్/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉండేది. 2019 నవంబర్ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను భయపెట్టి మధ్యాహ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదిరోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్నారి ఐరన్ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్చార్జి జడ్జి షేక్‌సికిందర్ బాషా ముద్దాయికి ఒక్కో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నారులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
బత్తాయి..భలే భలే..
సాక్షి, అమరావతి: మోసంబిగా పిలిచే బత్తాయి పండ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. ఏపీలో సాగవుతున్న బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు సైతం ఏపీ నుంచే వెళ్తున్నాయి. కొంతకాలంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి నేపాల్‌కు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు ఇకనుంచి సింగపూర్, మలేషియా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ తదితర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బత్తాయి పండ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జ్యూస్ ఎక్కువగా వచ్చే సాతుగుడి రకం బత్తాయిలను బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ నుంచి విదేశాలకు పంపించనున్నారు. ఏపీలోనే సాగు అధికం బత్తాయి సాగు, దిగుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సాగు విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి సాగవుతుండగా.. రైతులు ఏటా రెండు పంటలు తీస్తున్నారు. 2018–19లో రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలకు విస్తరించింది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు తోట బడుల పేరిట శిక్షణ ఇస్తుండటంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పండే పంటలో 85 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 15 శాతం మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు వెళుతోంది. మొదలైన ఎగుమతులు రాష్ట్రంలో సాగయ్యే బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతోంది. ప్రస్తుతం బత్తాయి కోతలు ప్రారంభం కాగా.. కళ్లాల నుంచే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ మార్కెట్ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని అనంతపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి విదేశాలకు సైతం బత్తాయిల ఎగుమతికి వ్యాపారులు పూనుకోవడంతో ధర కూడా మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ధర బాగుంది ఈసారి బత్తాయి పంట బాగుంది. రికార్డు స్థాయిలోనే దిగుబడి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య పలుకుతోంది. గతంలో ఎప్పుడూ ఈ సమయంలో ఇంత రేటు పలికిన సందర్భాలు లేవు. ఈసారి టన్ను రూ.లక్ష మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
టీడీపీ కార్యాలయం వద్ద ప్రమాదం
మంగళగిరి: గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద శుక్రవారం బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ర్యాలీగా ఇక్కడకి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు మద్యం మత్తులో ఇష్టానుసారంగా బాణసంచా కాల్చారు. దీంతో అక్కడ ఉన్న బాణసంచాకు అంతటికీ నిప్పు రవ్వలు అంటుకుని ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంగళగిరిలోని మార్కండేయ కాలనీకి చెందిన తాడిశెట్టి చెన్నయ్య, తాడిశెట్టి వెంకటేశ్వర్లు, నంబూరుకు చెందిన కారు డ్రైవర్ కొడాలి షణ్ముఖ, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కేసర గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్ సాహెబ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో చెన్నయ్య, వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కార్యాలయం వద్ద ర్యాలీ అదుపుతప్పడం, కార్యకర్తలు మద్యం సేవించి ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
తోరణాలైనా వాడకముందే కడతేర్చాడు
వనపర్తి: పెళ్లిచేసుకున్న రెండు వారాలకే అనుమానంతో భార్యను, అత్తను కడతేర్చాడు ఓ యువకుడు. వనపర్తి జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతి(45)ల కుమార్తె రుక్మిణి(21), ఏపీలోని కర్నూలుకు చెందిన శ్రావణ్ వివాహం ఈ నెల 1వ తేదీన వనపర్తిలో జరిగింది. పెళ్లి అయిన 13 రోజుల వ్యవధిలోనే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి శ్రావణ్ వనపర్తికి వచ్చాడు. రుక్మిణితోపాటు అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కూడా మంగళవారం కర్నూలు నగరంలోని చింతలమునినగర్లో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లీకూతుళ్లపై కూరగాయలు కోసే కత్తితో శ్రావణ్ దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి, రుక్మిణి అక్కడికక్కడే మృతిచెందగా, అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకున్న రెండు వారాలకే భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. -
సీపీఐ సీనియర్ నేత వెంకటేశ్వర్లు కన్నుమూత
దిల్సుఖ్నగర్: సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన ఆర్కేపురం డివిజన్ గ్రీన్‌హిల్స్‌కాలనీలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన వెంకటేశ్వర్లు విద్యార్థి, యువజనోద్యమాల్లో కీలకపాత్రతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కొంతకాలంగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సరళ న్యాయమూర్తిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ తదితరులు సోమవారం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ ఉత్తమ నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. చైత్యన్యపురి కాలనీలోని వీవీనగర్‌లో ఉన్న స్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
చెరువులో ఈతకొడుతూ.. టీఆర్ఎస్ నాయకుడి కన్నుమూత
సాక్షి,ఇల్లెందు (ఖమ్మం): పట్టణంలోని కాకతీయ నగర్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు గండమళ్ల వెంకటేశ్వర్లు(55) చెరువులో ఈత కొడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం మండలంలోని లలితాపురం చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీట మునిగిపోయాడు. గమనించి సహచరులు ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ కాలం ఏఐటీయూసీలో పనిచేసిన ఆయన కార్మిక నాయకుడిగా పట్టణ ప్రజలకు పరిచితుడు. అనంతరం టీఆర్ఎస్లో చేరాడు. మృతదేహాన్ని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్‌నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు. చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే.. -
ఎమ్మెల్సీ సతీమణి కన్నుమూత
జనగామ/హైదరాబాద్: శాసన మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి(62) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీ బోడకుంటి సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి బోడకుంటిని పరామర్శించారు. -
రైతు కూలీగా మారిన జిల్లా కలెక్టర్
సాక్షి, భూపాలపల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడు బిజీగా ఉండే అధికారి రైతు కూలీగా మారి పొలంలో వరినాట్లు వేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఆ అధికారి పేరు వాసం వెంకటేశ్వర్లు. ఈయన భూపాలపల్లి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల సమస్యలే ఎజెండాగా తీసుకొని వాటిని పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. భూ పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపించారు. తాజాగా జిల్లాలోని ఘనపురం మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం వెళుతున్న క్రమంలో దారి మధ్యలో రైతు కూలీగా మారి పొలంలో నాట్లు వేశారు. ఒక జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఎలాంటి బేషజాలకు పోకుండా మాతో కలిసి వరినాట్లు వేయడం తమకెంతో ఆనందం కలిగించదని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
టీఎస్‌టీఏ అధ్యక్షునిగా వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) నూతన కార్యవర్గం సోమవారం కొలువుదీరింది. ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాబోయే నాలుగేళ్ల కాలానికి గానూ టీఎస్‌టీఏ అధికారుల్ని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా టెన్నిస్ సంఘానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు టీఎస్‌టీఏ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జగిత్యాల జిల్లా టెన్నిస్ సంఘానికి చెందిన అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా వి. నారాయణ్ దాస్ (మేడ్చల్ జిల్లా టెన్నిస్ సంఘం), కోశాధికారిగా డి. చంద్రశేఖర్ (రంగారెడ్డి జిల్లా లాన్ టెన్నిస్ సంఘం) నియమితులయ్యారు. కేఆర్ రామన్ (రంగారెడ్డి జిల్లా లాన్‌టెన్నిస్ సంఘం), టి. నరసింగా రెడ్డి (వరంగల్ జిల్లా టెన్నిస్ సంఘం), పుల్లారావు (నల్లగొండ జిల్లా లాన్‌టెన్నిస్ సంఘం), పి. బాల కిషన్ రావు (ఖమ్మం జిల్లా టెన్నిస్ సంఘం) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇతర సభ్యులుగా ఎస్. సతీశ్ రెడ్డి (నాగర్ కర్నూల్), ఎస్. ముకుంద్ రావు (ఆదిలాబాద్), డీఆర్సీ కిరణ్ (మేడ్చల్), జి. యుగంధర్ రెడ్డి (భద్రాద్రి కొత్తగూడెం), సుల్తాన్ ఆసిఫ్ ఇక్బాల్ (మెదక్) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అఖిల భారత టెన్నిస్ సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్ ధూపర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. -
కలెక్టర్ ఔదార్యం
సంగారెడ్డి టౌన్: నిస్సహాయులకు మానవతా దృక్పథంతో చేతనైన సాయం చేసి చేయూతనివ్వాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి కలెక్టర్ సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఎంఎన్ఆర్ ఆస్పత్రి పరిసరాలు, బైపాస్‌రోడ్డు, పోతిరెడ్డిపల్లి ఎక్స్‌రోడ్, బాలాజీ నర్సింగ్ హోం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా, పెరిగిన జుట్టు, అపరిశుభ్రంగా, మతిస్థితిమితం లేని, కుటుంబ సభ్యుల నిరాధరణకు గురైన ఎనిమిది మందిని గుర్తించి వారిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ (మానసిక దివ్యాంగుల వార్డు)కు తరలించారు. అక్కడ జట్టు కత్తిరించి, శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత కలెక్టర్ వారికి కొత్త దుస్తులు, దుప్పట్లను అందజేశారు. అల్పాహారాన్ని తెప్పించి ఇచ్చారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. మళ్లీ రోడ్ల మీదకు రాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మనోహర్‌కు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో నిరాధరణకు గురైన, మతిస్థిమితం లేని వారు ఎవరైనా తారసపడితే వారిని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థలో అప్పగించాలని అన్నారు. వారికి చేయూత నివ్వడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి, సంగారెడ్డి, కంది తహసీల్దారులు విజయ్‌కుమార్, గోవర్థన్ ఉన్నారు. -
దాడి కేసులో యువకుడి అరెస్టు
పామూరు: వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. పట్టణానికి చెందిన గద్దే గోపీని వ్యక్తిగత కలహాలతో గత నెల 7వ తేదీన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా శనివారం దాడికి పాల్పడిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. -
ప్రధానోపాధ్యాయుడికి అరెస్ట్ వారెంట్
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని మైలారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చీటింగ్ కేసుకు సంబంధించి కరీంనగర్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ రావడంలో ఆ పాఠశాలలో అలజడి నెలకొంది. వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడిగా 2009లో మైలారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈయనపై ఒక చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, వాయిదా ప్రకారం కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసిందని పోలీసులు తెలిపారు. ఈనెల 6తో గడువు ముగుస్తుండడంతో సోమవారం ఎస్సై వంశీకృష్ణ పాఠశాలకు వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో లేవపోవడంతో.. మండల ఇన్చార్జి విద్యాధికారి లక్ష్మణ్‌రావును ఎస్సై ఫోన్లో సంప్రదించగా పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై ఎంఈవో విచారణ చేపట్టారు. గత నెల 24 సాయంత్రం నుంచి 27 ఉదయం పూట పాఠశాలకు అధికారికంగా సెలవు తీసుకున్నారని తెలిపారు. సెలవులు ముగిసిన నుంచి తిరిగి పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, గ్రామస్తులు ఎంఈవోకు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాధికారికి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
హైదరాబాద్‌లో టీవీఎస్ నకిలీ పార్ట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉప్పు, పప్పులే కాదండోయ్.. వాహన విడిభాగాల్లోనూ నకిలీలున్నాయ్! అవి కూడా హైదరాబాద్‌లో. ఇటీవల వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ జరిపిన దాడిలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్ రాంకోఠికి చెందిన ఓ ప్రముఖ విక్రయశాలలో రూ.6 లక్షల విలువ చేసే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామని.. సంబంధిత స్టోర్ యజమాని మీద కేసులు కూడా నమోదు చేశామని టీవీఎస్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పార్ట్స్ బిజినెస్) కె.వెంకటేశ్వర్లు గురువారమిక్కడ చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... నకిలీ బ్రేకులు, క్లచ్‌లు.. మూడు నెలలుగా హైదరాబాద్‌తో సహా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, కోయంబత్తూరు నగరాల్లోని 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించాం. వీటిలో రూ.55 లక్షల విలువ చేసే నకిలీ విడిభాగాల్ని గుర్తించాం. బ్రేకులు, చెయిన్, కేబుల్స్, క్లచ్ ప్యాడ్స్ వంటి ఎక్కువ విక్రయాలు జరిగే విడిభాగాలే నకిలీలున్నాయి. ఇవి బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాల్లోని 8 కేంద్రాల్లో తయారవుతున్నాయి. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు సరఫరా అవుతున్నాయి. సంబంధిత తయారీ కేంద్రాలు, యాజమాన్యం మీద కాపీ రైట్స్ చట్టం కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్‌లో మాత్రం తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించలేదు. అయితే దాడులింకా పూర్తవ్వలేదు. ఈ ఏడాదంతా కొనసాగుతాయి. నకిలీ విడిభాగాలను గుర్తించేందుకు, దాడులు చేసేందుకు 12 ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. అవి గుర్తించిన ఉత్పత్తులను కంపెనీ పరిశోధన బృందం పరీక్షించి అవి నకిలీ ఉత్పత్తులేనని తేలాక.. సంబంధిత ప్రాంతాల్లో పోలీసు, ఏజెన్సీలతో కలసి దాడులు చేస్తాం. ఏప్రిల్‌లో హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలు.. హబ్ అండ్ స్పోక్ (హెచ్‌అండ్‌ఎస్) విధానంలో విడిభాగాలను విక్రయించాలని నిర్ణయించాం. ఈ కేంద్రాలేం చేస్తాయంటే.. కంపెనీ నుంచి హబ్‌కు బల్క్‌లో టీవీఎస్ ఉత్పత్తులను పంపిస్తాం. అక్కడి నుంచి 150 కి.మీ. పరిధిలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. ప్రతి హబ్ 2 నెలలకొకసారి ప్రతి రిటైలర్లతో సంప్రతించడం, పర్యవేక్షించడం వంటివి చేయాలి. ఇదంతా టెక్నాలజీతో కలిసి ఉంటుంది. ప్రతి రిటైల్ స్టోర్, ఉత్పత్తులు ట్రాక్ అవుతాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఏడాదిన్నర క్రితం నుంచి తమిళనాడులో 10 హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూషన్లున్నాయి. వీటినే హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభిస్తాం. ఏడాది ముగిసే నాటికి మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ విధానాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాం. విపణిలోకి అదనపు ఫీచర్లతో ఉత్పత్తులు.. ప్రతి విడిభాగం గరిష్ట అమ్మకం ధర (ఎంఆర్పీ) మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే అది నకిలీనా? ఒరిజినలా? అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్‌ను ఒకసారి స్కాన్ చేస్తే రెండోసారి చేసేటప్పుడు గతంలో వినియోగించారని వస్తోంది. అందుకే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న విడిభాగాల్లో అదనపు ఫీచర్లను జోడిస్తున్నాం. ప్రతి ఉత్పత్తి మీద సూక్ష్మ అక్షరాలతో టీవీఎస్ అని ఉంటుంది. ఇది చూసేందుకు రంగుతో ఉంటుంది కానీ, పరీక్ష చేస్తే కంపెనీ పేరు కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను విపణిలోకి ప్రవేశపెడుతున్నాం. -
మంచి పారిశ్రామిక విధానంతో పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పారిశ్రామిక విధానంతోనే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని శాసన మండలి ప్రభు త్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి కేటీఆర్‌కు ప్రశం సలు దక్కుతున్నాయనే కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ మంత్రిగా విఫలమైన షబ్బీర్.. మంత్రి కేటీఆర్‌ను మిస్టర్ ఫెయిల్యూర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గల్ఫ్ బాధితుల కోసం కాంగ్రెస్ హయాంలో చేసిందేమీ లేదని, కేవలం ట్వీటర్లో వచ్చిన ఒక్క ట్వీట్‌కే కేటీఆర్ స్పందించి ఎందరో బాధితులను కాపాడారన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయనే అక్కసుతో కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, నాలుగైదు బతుకమ్మ చీరలు కాల్చి మహిళలు అసంతృప్తిగా ఉన్నారని దుష్ప్రచారం సాగించిందని మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ ప్రభుత్వ పథకాల సమా చారం తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతానంటే కుదరదని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ అన్నారు. -
మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట అష్టలక్ష్మీ దేవాలయ కమాన్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నుంచి కొత్తపేటకు కారులో వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టడంతో ఆయనకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని సీఐను కొత్తపేట ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. -
ఇద్దరు రైతుల బలవన్మరణం
సంతమాగులూరు/పుల్లలచెరువు: ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు, పుల్లలచెరువు మండలాల్లో అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు బాగా పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక మంగళవారం తెల్లవారుజామున పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పుల్లలచెరువు మండలం ఐటీవరంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డి అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు -
ఏసీబీ వలలో హెడ్‌కానిస్టేబుల్
నెల్లూరు: జిల్లాలో పోలీసు శాఖ ఉద్యోగుల అవినీతి బట్టబయలైంది. కిందిస్ధాయి నుంచి అధికారుల వరకూ అవినీతికి పాల్పడుతున్నారు. వైన్ షాపుల నుంచి లంచాలను తీసుకుంటున్న బుచ్చిరెడ్డిపాలెం హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిరెడ్డిపాలెంలో వంశీ, పద్మా వైన్‌షాపుల యజమాని చల్లా వెంకటేశ్వర రెడ్డి పోలీసులు లంచం ఇవ్వమని తనను వేధిస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతికి పాల్పడుతున్న పోలీసులను పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. వెంకటేశ్వరరెడ్డితో అతని భార్య పద్మ వద్ద నుంచి డబ్బులు తీసుకోవాలని పోలీసులకు చెప్పించారు. దీంతో డబ్బును తీసుకోవడానికి బుచ్చిరెడ్డిపాలెం పోలీసుస్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు మద్యం షాపుల యజమాని ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ నిఘా వేసిన ఏసీబీ అధికారులు రూ.26 వేల నగదును తీసుకుంటుండగా వెంకటేశ్వర్లును పట్టుకున్నారు. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు.... లంచం తీసుకుంటూ పట్టుబడిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ విచారించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి నుంచి సీఐ సుబ్బారావు, ఎస్సై సుధాకర్ రెడ్డి, ఏఎస్సైలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ అందరికీ నెలసరి మామూళ్లలో భాగం ఉందని హెడ్ కానిస్టేబుల్ విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. రైటర్‌గా చేరినప్పటి నుంచి తానే నగదు తీసుకెళ్లి అందరికీ పంచుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అంగీకరించారని చెప్పారు. అధికారులు చెబితేనే తాను లంచం తీసుకోవడానికి వచ్చినట్లు కూడా చెప్పారని వివరించారు. మండలంలోని పది దుకాణాలు రూ.13వేల చొప్పున ప్రతి నెలా మామూళ్లు ఇస్తారని విచారణలో వెల్లడైందని ప్రభాకర్ తెలిపారు. విచారణ జరుపుతున్నాం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సేకరించిన మొత్తంలో అధికారుల భాగస్వామ్యం ఉన్నందున విచారణ జరుపుతున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఎస్సైను విచారించేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేరని.. పూర్తి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 25 లక్షలు నష్టపోయాను బుచ్చిరెడ్డిపాలెంలో వంశీ, పద్మ మద్యం దుకాణాలు పెట్టి 25 లక్షలు నష్టపోయామని ఫిర్యాదుదారుడు చల్లా వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. మద్యం దుకాణాల నుంచి ప్రతి నెలా పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, మద్యం డిపో తదితరులందరికీ లంచం ఇవ్వాలని చెప్పారు. అలా తాను రూ.25 లక్షలు నష్టపోయానని వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. పోలీసులు లంచం ఇవ్వాలని వేధిస్తుండడంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించానని వివరించారు. -
ఏసీబీకి చిక్కి.. మనస్తాపంతో ఈఈ ఆత్మహత్య
నిజామాబాద్: అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డానని మనస్తాపానికి గురై ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు శనివారం ఉదయం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఈ సంఘటనతో మనస్తాపం చెందిన ఆయన సాయంత్రం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఈఈని పట్టుకున్నారు. అయితే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఏసీబీ అధికారుల తీరును నిరసిస్తూ ఏసీబీ డీఎస్పీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులు ఆస్పత్రిని ముట్టడించారు. ఏసీబీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
డ్యూటీలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
-
డ్యూటీలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కొత్తపేట: ఉన్నతాధికారి వేధింపులు తాళలేక విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు గురువారం ఉదయం డ్యూటీలో ఉండగానే నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన తోటి పోలీసులు చికిత్స నిమిత్తం కానిస్టేబుల్‌ను జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీఐ శ్రీకాంత్ వేధిపుల వల్లే వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.