నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానవ సంబంధాలు మంట కలిపేలా ఓ వృద్ధుడు సొంత మనవరాలి(కూతురి కూతురు)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు సొంత మనవరాలిపై అత్యాచారం చేశాడు.
దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా ఇతను మన వరాళ్లతో తప్పుగా ప్రవర్తించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.