టికెట్ లేదని చితకకొట్టారు, ఒకరి మృతి | Panic Incident in done railway station | Sakshi
Sakshi News home page

టికెట్ లేదని చితకకొట్టారు, ఒకరి మృతి

Published Wed, Dec 17 2014 7:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

టికెట్ లేదని చితకకొట్టారు, ఒకరి మృతి

టికెట్ లేదని చితకకొట్టారు, ఒకరి మృతి

కర్నూలు : కర్నూలు జిల్లా డోన్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించారు. డోన్ రైల్వే స్టేషన్‌ జంక్షన్‌లో  దొంగలనే అనుమానంతో... రైలులోని కొందరు ప్రయాణీకులను చితకబాదారు. తన్నుకుంటూ తీసుకెళ్లారు. పోలీసుల దెబ్బల ధాటికి కర్నూలుకి చెందిన గౌడ వెంకటేశ్వర్లు మృతి చెందాడు.

కర్నూలు నుంచి వేరే ఊరికి వెళ్తుండగా....తన భర్తను  అకారణంగా కొట్టి చంపేశారని మృతుడు భార్య కన్నీటి పర్యంతమైంది. పోలీస్‌ డ్రెస్‌లో వచ్చిన ఐదారుగురు చితక్కొట్టి వెళ్లిపోయారని...అందుకే చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement