మరణంలోనూ ఒక్కటిగా.... | Will gather in death .... | Sakshi
Sakshi News home page

మరణంలోనూ ఒక్కటిగా....

Published Thu, Oct 15 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

మరణంలోనూ ఒక్కటిగా....

మరణంలోనూ ఒక్కటిగా....

భర్త మృతి తట్టుకోలేక భార్య మరణం
 చందర్లపాడులో విషాదఛాయలు

 
చందర్లపాడు : జీవితంలో కలిసి మెలిసి ఉండటమేకాదు.. చావులోనూ ఒకటయ్యారు ఆ ఆలుమగలు.. పిల్లలను పెంచి పెద్దచేసి వాళ్లను ఓ ఇంటి వాళ్లను చేసిన ఆ దంపతులు ఊహించని రీతిలో మృత్యుడిలోకి చేరుకున్నారు. ముందుగా భర్త మృతిచెందగా ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా కొద్ది గంటల్లోనే తనువుచాలించింది. మండల కేంద్రమైన చందర్లపాడులో మంగళవారం జరిగిన ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు(65) హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య తిరుపతమ్మ(60) అతనికి చేదోడువాదోడుగ ఉంటోంది.

వయస్సు మీద పడటంతో కొద్ది నెలల క్రితమే హోటల్‌ను తీసేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుండెపోటుకు గురై మరణించాడు. భర్త తనువుచాలించడంతో భార్య తిరుపతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచింది. వీరిరువురికి బుధవారం కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement