thirupathamma
-
ఆ తిరుపతమ్మ చనిపోయింది
-
వెలుతురు కోసం దీపం పెడితే...
ఇంట్లో వెలుతురు కోసం ఏర్పాటు చేసుకున్న దీపం.. ఓ వ్యక్తిని సజీవ దహనానికి కారణమైంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుంజా తిరుపతమ్మ(30) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపుడుతోంది. ఈ రోజు ఇంట్లో దీపం అలాగే ఉంచి నిద్ర పోయింది. ప్రమాదవశాత్తు దీపం మంటలు ఎగిసిపడి పై కప్పుకు అంటుకోవడంతో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో తిరుపతమ్మ మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యుశకటం..
-
మృత్యుశకటం..
- బాలికలపైకి దూసుకెళ్లిన లారీ - ముగ్గురు చిన్నారులు మృతి కొలిమిగుండ్ల కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం పాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్న ముగ్గురు బాలికలపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో మణి (12), రాజేశ్వరి (16), తిరుపతమ్మ (14 ) తీవ్ర గాయాలతో మృతి చెందారు. బాలికలను ఢీకొట్టిన లారీ అదే వేగంతో 100 అడుగుల దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. దీంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొలిమిగుండ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
కట్టుకున్నవాడే కడతేర్చాడు..
తల్లిబిడ్డల హత్యకేసులో వీడిన మిస్టరీ నిందితుడి అరెస్టు రేపల్లె: నియోజకవర్గ పరిధిలోని నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో సెప్టెంబర్ 25తేదీన జరిగిన తల్లిబిడ్డల హత్యకేసులో మిస్టరీ వీడింది. హత్య చేసింది కట్టుకున్న వాడేనని పోలీసులు నిర్ధారించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ పెంచలరెడ్డి శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో ఉప్పాల శివరామకృష్ణ అలియాస్ వెంకట కృష్ణ భార్య తిరుపతమ్మ కాపురం ఉంటున్నారు. గత కొంత కాలంగా తిరుపతమ్మ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానం పెనుభూతంగా మారింది. శివరామకృష్ణ ప్రతి రోజు తెనాలిలో తాపీపని చేసి తిరిగి ఇంటికి వస్తుంటాడు. అదేవిధంగా సెప్టెంబర్ 25వతేదీ రాత్రి ఇంటికి వచ్చిన శివరామకృష్ణకు ఆయన భార్య తిరుపతమ్మకు మధ్య వివాహేతర సంబంధంపై వివాదం తలెత్తింది. ఈక్రమంలో భార్య తిరుపతమ్మపై కత్తితో దాడిచేయగా అడ్డం వచ్చిన కుమార్తె నాగశ్రీ, కుమారుడు యశ్వంత్లకు తీవ్రగాయాలై అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. గమనించిన శివరామకృష్ణ కుమార్తె మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న తాడిదిబ్బలో పాతిపెట్టి కుమారుని శవాన్ని పక్కనే ఉన్న కాల్వలో పడవేసి పరాయ్యాడు. కేసును అన్ని కోణాలలో విచారించటం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివరామకృష్ణ శుక్రవారం ఉదయం ఏలేటిపాలెం వీఆర్వో కర్రా రవి వద్ద లొంగిపోయి విషయాన్ని చెప్పి తమ వద్ద లొంగిపోయినట్లు చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని గ్రామస్థుల సమక్షంలో కాల్వలో నుంచి తమకు స్వాధీనం చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. -
మరణంలోనూ ఒక్కటిగా....
భర్త మృతి తట్టుకోలేక భార్య మరణం చందర్లపాడులో విషాదఛాయలు చందర్లపాడు : జీవితంలో కలిసి మెలిసి ఉండటమేకాదు.. చావులోనూ ఒకటయ్యారు ఆ ఆలుమగలు.. పిల్లలను పెంచి పెద్దచేసి వాళ్లను ఓ ఇంటి వాళ్లను చేసిన ఆ దంపతులు ఊహించని రీతిలో మృత్యుడిలోకి చేరుకున్నారు. ముందుగా భర్త మృతిచెందగా ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా కొద్ది గంటల్లోనే తనువుచాలించింది. మండల కేంద్రమైన చందర్లపాడులో మంగళవారం జరిగిన ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు(65) హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య తిరుపతమ్మ(60) అతనికి చేదోడువాదోడుగ ఉంటోంది. వయస్సు మీద పడటంతో కొద్ది నెలల క్రితమే హోటల్‌ను తీసేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుండెపోటుకు గురై మరణించాడు. భర్త తనువుచాలించడంతో భార్య తిరుపతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచింది. వీరిరువురికి బుధవారం కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించారు. -
ఇద్దరు పిల్లలకు నిప్పంటించి.. తానూ..
గంటూరు: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు నిప్పటించి తానూ నిప్పంటించుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరకుపల్లి మండలంలో జరిగింది. మండలంలోని పూలేటివారిపాలెంలో తిరుపతమ్మ అనే మహిళ శుక్రవారం రాత్రి తన తల్లిగారి ఇంటి వద్ద ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది. కుమారుడు హేమంత్‌సాయి(4), కుమార్తె తేజశ్విని(3)పై కిరోసిన్ పోసి నిప్పటించింది. తర్వాత తిరుపతమ్మ తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.