గంటూరు: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు నిప్పటించి తానూ నిప్పంటించుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరకుపల్లి మండలంలో జరిగింది. మండలంలోని పూలేటివారిపాలెంలో తిరుపతమ్మ అనే మహిళ శుక్రవారం రాత్రి తన తల్లిగారి ఇంటి వద్ద ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది.
కుమారుడు హేమంత్‌సాయి(4), కుమార్తె తేజశ్విని(3)పై కిరోసిన్ పోసి నిప్పటించింది. తర్వాత తిరుపతమ్మ తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
ఇద్దరు పిల్లలకు నిప్పంటించి.. తానూ..
Published Fri, May 8 2015 11:08 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM
Advertisement
Advertisement