
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు: మహిళలను మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని గుంటూరు దిశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ మ్యారేజ్ మహిళలే అతని టార్గెట్.. షాదీ డాట్ కామ్ ద్వారా తాను ఆర్మీ కమాండర్ అంటూ పరిచయం చేసుకుంటూ సుదర్శన్‌రావు అనే వ్యక్తి మహిళలను పెళ్లి పేరుతో మోసగిస్తున్నాడు. సుదర్శన్‌రావుపై గుంటూరు దిశ పోలీస్ స్టేషన్‌లో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయపడ్డాయి. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి షాదీ డాట్ కాంలో అప్లై చేసుకున్న వారిని సుదర్శన్‌రావు టార్గెట్ చేశాడు. 30 మంది మహిళలను మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: పంజాగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం.. 20 మంది అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment