రామచంద్రాపురం(పటాన్‌చెరు): యువతులను మా యమాటలతో నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు, బాధితురాలు సోమవారం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ఎదు ట ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి..గుంటూరు జిల్లా, వేటపురి గ్రామానికి చెందిన అడప శివశంకర్ బాబు నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఏడాదిగా అదే కంపెనీలో రామచంద్రాపురం పట్టణానికి చెందిన యువతి ఉద్యోగం చేస్తోంది.
శివశంకర్ బాబుతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. యువతి తల్లిదండ్రుల అంగీకారంతో డిసెంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం శివశంకర్ ఆమె బంగారం, నగదు తీసుకుని వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చింది. శివశంకర్ బాబుపై అనుమానంతో ఆమె అతడి వివరాలను ఆరా తీయగా గతంలో పలువురు యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఈనెల 13న రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఓ బాధితురాలు ఆదర్శ ప్రతిభ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు మాచర్ల ప్రతిభతో కలిసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాయ మాటలతో నమ్మించి రూ.లక్షల కట్నం తీసుకొని వివాహం చేసుకుని యువతుల జీవితాలను నాశనం చేస్తున్న శివశంకర్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు 12 మంది యువతులను వివాహం చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. ప్రస్తుతం శివశంకర్‌బాబు గుంటూరులో ఉంటున్నాడని, కొందరు అధికారులు అతడికి సహకరిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. మహిళా మండలి అధ్యక్షురా లు మాచర్ల ప్రతిభ మాట్లాడుతూ యువతల జీవితాలతో ఆడుకుంటున్న శివ శంకర్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళల వివరాలు సేకరించి వారిని మాయమాటలతో నమ్మించి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని తెలిపారు.
దర్యాప్తు చేస్తున్నాం
మోసం చేసి యువతులను పెళ్లి చేసుకొన్న శివశంకర్‌పై ఈనెల 13న ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో అతడిని అరెస్టు చేస్తాం. అతడిపై ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తెలంగాణలో గచి్చ»ౌలి, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది.
– సంజయ్ కుమార్, ఇన్స్‌పెక్టర్, రామచంద్రాపురం
Comments
Please login to add a commentAdd a comment