ముందుబాబులతో చిందులేసిన ఏఎస్‌ఐపై చర్యలు | ASI dance with drunkards At Ongole | Sakshi
Sakshi News home page

ముందుబాబులతో చిందులేసిన ఏఎస్‌ఐపై చర్యలు

Published Tue, Jul 2 2024 9:37 AM | Last Updated on Tue, Jul 2 2024 11:33 AM

ASI dance with drunkards At Ongole

ఒంగోలు: విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్సై ఓ గ్రామంలో మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లారు. దీంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల కోసం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది.

ఒకవైపు కారులో హోరెత్తుతున్న మూజ్యిక్‌.. మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందులేస్తున్న మందుబాబు. అయితే వారితో జతకట్టాడు ఓ ఏఎస్సై. తనలోని కళా పోషకుడిని తట్టి నిద్ర లేపాడు. మందుబాబు చిందులకు చేతిలో గ్లాసుతోనే ఈలలేసి గోల చేస్తూ మరింత ఉత్సాహపరిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 

వివరాలు.. ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దీంతో పోలీసులు అక్కడ పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. దీంతో ఆయన విధి నిర్వహణను విస్మరించి.. గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement