వాజేడు: ఇద్దరే ఇద్దరు పిల్లలున్న గ్రామమది. అయితేనేం.. దారిలేని ఆ గ్రామానికి వైద్య సిబ్బంది గుట్టలెక్కి నడిచి వెళ్లారు. పోలియో చుక్కలు వేసి వచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధి పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి వెళ్లాలంటే మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం. అంతా రాళ్ల దారి. ఈ గ్రామంలో అయిదేళ్లలోపు పిల్లలు ఇద్దరున్నారు.
పల్స్ పోలియోలో భాగంగా ఆ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి వాజేడు పీహెచ్‌సీ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, లఖాన్, ధర్మయ్య ఆదివారం కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు పిల్లలకు పోలియో చుక్కలు వేసి భోజనం చేసి తిరిగి పీహెచ్‌సీకి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment