Pulse Polio
-
గుట్టలెక్కి.. పోలియో చుక్కలు వేసి..
వాజేడు: ఇద్దరే ఇద్దరు పిల్లలున్న గ్రామమది. అయితేనేం.. దారిలేని ఆ గ్రామానికి వైద్య సిబ్బంది గుట్టలెక్కి నడిచి వెళ్లారు. పోలియో చుక్కలు వేసి వచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధి పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి వెళ్లాలంటే మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం. అంతా రాళ్ల దారి. ఈ గ్రామంలో అయిదేళ్లలోపు పిల్లలు ఇద్దరున్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి వాజేడు పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, లఖాన్, ధర్మయ్య ఆదివారం కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు పిల్లలకు పోలియో చుక్కలు వేసి భోజనం చేసి తిరిగి పీహెచ్‌సీకి చేరుకున్నారు. -
దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం (ఫొటోలు)
-
పిల్లల భవిష్యత్ కోసం.. 2 పోలియో చుక్కలు
కవాడిగూడ (హైదరాబాద్): ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో రాకుండా తల్లిదండ్రులు 2 పోలియో చుక్కలు వేయించాలని వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పిల్లల బంగారు భవి ష్యత్ కోసం పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొ నాలని సూచించారు. ఆదివారం ఆయన ఇందిరా పార్కులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. రాష్ట్రంలో పల్స్‌పోలియో కోసం 23 వేల సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ కార్యక్రమంలో తెలంగాణ ముందుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, డీఎంహెచ్‌వో వెంకటి, జిల్లా వైద్యాధికారులు డాక్టర్ సుధీర్, శ్రీకళ తది తరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 37,28,334 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అర్హులైన పిల్లల్లో 97.3% మందికి పోలియో చుక్కలు వేశామని పేర్కొంది. -
తెలంగాణలో 27న పల్స్ పోలియో: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 27న (ఆదివారం) పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 0–5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడిం చారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తర్వాత రెండు రోజులపాటు (సోమవారం, మంగళవారం) సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవరైనా వేసుకోనివారు ఉంటే గుర్తించి పోలియో చుక్కలు వేస్తారన్నారు. మొత్తం 38 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని వైద్యా రోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ సెం టర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టు లు, పర్యాటకప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
పోలియోరహిత దేశం అందరి లక్ష్యం కావాలి
సాక్షి, అమరావతి: పోలియో రహిత దేశమే అందరి లక్ష్యం కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గవర్నర్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 52.72 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వాల కృషితో 2011 నుంచి దేశంలో పోలియో కేసు నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, రాష్ట్ర రోగనిరోధక అధికారి దేవి తదితరులు పాల్గొన్నారు. చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో సీఎం నివాసానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం జగన్
-
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు చుక్కల మందు వేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని, పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల వేసేందుకు కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని హుబ్లీలో చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు. -
‘అందుకే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు’
విశాఖ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా సేవ చేయడమంటే దేవుడు సేవగా భావించాలని అవంతి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని, విశాఖకు మహర్దశ పట్టబోతుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తోందన్నారు. అందుకే వైఎస్సార్ తనయుడిగా మళ్లీ ఆరోగ్యశ్రీని ప్రారంభించారన్నారు. విశాఖ నగరం 12 డివిజిన్ ఎన్జీవో కాలనీలోని జీవిఎంసీ ప్రైమరీ పాఠశాలలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎంపి ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్ వినయ్ చంద్, ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి కెకె రాజులతో కలిసి ప్రారంభించిన అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 5 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పుట్టిన ప్రతీబిడ్డకు పోలియో చుక్కలు వేయించి వారికి అంగవైకల్యం రాకుండా నివారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు. వైఎస్సార్ కంటివెలుగు ద్వారా జిల్లాలో 13 వేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు పంపిణీ చేశామన్నారు. కేజీహెచ్‌ను సూపర్ స్పెషాలిటీ గా అభివృద్ధి చేస్తామని...త్వరలోనే పాడేరులో వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. -
నేడు పల్స్ పోలియో
సాక్షి, అమరావతి/ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని కుటుంబ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. రాష్ట్రంలో ఐదేళ్ల వయసులోపు చిన్నారులు 52.27 లక్షల మంది ఉన్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. వీళ్లందరికీ విధిగా పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల మందు బూత్‌లలో అందుబాటులో ఉంటుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ ఆదివారం ఎవరైనా చిన్నారులకు వేయించలేని పరిస్థితి ఉంటే ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే 65.75 లక్షల డోస్‌ల పోలియో చుక్కల మందు రాష్ట్రానికి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 2008 జూలైలో పశ్చిమగోదావరి జిల్లాలో పోలియో కేసు నమోదైందని, తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కుటుంబ సంక్షేమ శాఖ ధృవీకరించింది. ప్రతి కాలనీలో, ప్రతి గ్రామంలోనూ పల్స్ పోలియో బూత్ ఉంటుందని, తల్లిదండ్రులు తమ బిడ్డలకు చుక్కలు వేయించడం మరచిపోవద్దని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన, పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. -
చెరగని సిరా.. చెదరని ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: మీ వేలికి ఉన్న సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్టుగా... ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలకభూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరా చుక్క తయారీకి గ్రేటర్ హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాలతోపాటు మన దేశంలోని 29 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు రాష్ట్ర రాజధాని నగరం నుంచే సిరా చుక్క ఎగుమతి చేస్తుండటం విశేషం. నగరం కేంద్రంగా మూడు దశాబ్దాలకుపైగా ఈ మహాక్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న సంస్థ రాయుడు లేబొరేటరీస్ కావడం విశేషం. వేలిపై సిరా చుక్క.. ఓటుకు చిహ్నం.. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. అందుకే, మన దేశంతోపాటు చాలా దేశాలు ఎన్నికలవేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. 100 దేశాలకు హైదరాబాద్ నుంచే ఎగుమతి... భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్(ఎంపీవీఎల్) ఒకటికాగా.. హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రాయుడు లేబొరేటరీస్ మరొకటి కావడం విశేషం. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌తోపాటు రాయుడు లెబొరేటరీస్ తయారు చేస్తున్న సిరాను ఎక్కువగా వినియోగిస్తోంది. ’ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు చెరగని సిరా(ఇండెలిబుల్ ఇంక్)ను సరఫరా చేస్తున్నాం. ఇండియా, శ్రీలంకతోపాటు దక్షిణాఫ్రికా, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, మొజాంబిక్, రువాండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు మా వినియోగదారులుగా ఉన్నాయి’ అని రాయుడు లేబొరేటరీస్ సీఈవో శశాంక్ రాయుడు ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారని చెప్పారు. 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలిబుల్ ఇంక్‌ను తయారు చేస్తోందన్నారు. మొదట్లో సిరాను చిన్న(5 మి.లీ) బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లమని, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చామన్నారు. ఒక మార్కర్ లేదా ఒక ఇంకు సీసా 500 మంది ఓటర్ల వేళ్లకు సరిపోతుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికతను తొలుత ప్రవేశపెట్టింది తమ రాయుడు లేబొరేటరీనేనని ఆయన వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమంలోనూ.. పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలుపై సిరా చుక్క పెడుతుంటారు. డబ్ల్యూహెచ్‌వో కూడా ఇండెలిబుల్ ఇంక్ కోసం రాయుడు లేబొరేటరీస్ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పం దం చేసుకుంది. ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండటం విశేషం. ఇక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గుర్తింపు, యూనిసెఫ్‌తోపాటు, ఐఎస్వో 9001:2015, ఐఎస్వో 14001:2015, డబ్లు్యహెచ్‌వో–జీఎంపీ తదితర ధ్రువీకరణలను రాయుడు సంస్థ సాధించింది. అభివృద్ధి చెందిన జర్మ నీ తదితర దేశాలకు అల్ట్రా వయొలెట్ ఇంక్‌ను కూడా ఈ సంస్థ సరఫరా చేస్తోంది. అల్ట్రా వయొలెట్ సిరా అంటే.. ఈ సిరాచుక్క వేలిపై పెడితే కనిపించదు. కానీ ఓటరు వేలును అతినీలలోహిత కాంతి కింద పెట్టినప్పుడు దర్శనమిస్తుంది. అప్పుడు బోగస్ ఓటరును పసిగట్టే వీలుంటుంది. ఈ సిరా చుక్క ఈజీగా చెరిగిపోదు.. ఎన్నికల్లో వాడే సిరాను సెమి పర్మనెంట్ ఇంక్గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజులపాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతోపాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజులపాటు చెదిరిపోకుండా ఉంటుందని శశాంక్ తెలిపారు. నాణ్యత, మన్నిక మా చిరునామా నాణ్యత, మన్నికతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడమే మా లేబొరేటరీ ధ్యేయం. మూడున్నర దశాబ్దాల క్రితం కృష్ణా–గోదావరి ప్రింటింగ్ ఇంక్ పేరుతో మా సంస్థను స్థాపించాం. 1995లో సంస్థ పేరును రాయుడు లేబొరేటరీస్గా మార్చాం. ఎన్నికల సిరాతోపాటు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి సర్జికల్ మార్కర్లు, వాటర్ ఎరేజర్లు, ఇతర ఇంక్‌లను తయారు చేస్తున్నాం. మా ల్యాబ్‌లో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. ఏటా రూ.20 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాం. –శశాంక్ వి.రాయుడు, సీఈవో, రాయుడు లేబొరేటరీస్ -
నేడు పల్స్‌పోలియో
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేడు (ఆదివారం) పల్స్‌పోలియో చుక్కల మందు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 50.90 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నట్టు ప్రజారోగ్యశాఖ అంచనా వేసింది. వీళ్లందరికీ పల్స్‌పోలియో చుక్కలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా చుక్కల మందు వేయనున్నట్టు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 37,538 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. లక్షన్నర మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించిన సెంటర్లలో చుక్కలు వేస్తారు. మళ్లీ మార్చి 11న పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ పోలియో రహిత దేశంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
28న పల్స్ పోలియో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్స్ పోలియో నిర్వహణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి దశలో జనవరి 28న, రెండో దశలో మార్చి 11న పల్స్ పోలియో రోజును నిర్వహించనుంది. ప్రతి ఒక్క చిన్నారికి పోలియో నిర్మూలన వ్యాక్సిన్ వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి దశలో జనవరి 28 నుంచి జనవరి 30 వరకు, రెండో దశలో మార్చి 11 నుంచి మార్చి 14 వరకు వ్యాక్సిన్ వేస్తారు. రెండు దశల్లో సామూహిక వ్యాక్సిన్ నిర్వహణతోపాటు ఇంటింటికీ వెళ్లడం, స్కూళ్లు, ఇతర జనసమీకరణ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండేవారి పిల్లలకు, భిక్షాటన చేసే వారి పిల్లలకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. -
28న పల్స్ పోలియో
ఆదిలాబాద్‌అర్బన్: ఈ నెల 28న పల్స్ పోలియో నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేయాలన్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 70,895 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నట్లు అంచనా వేశామన్నారు. 80 పట్టణ, 316 గ్రామాల్లో, 443 గిరిజన ప్రాంతాల్లో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 113 మోబైల్, 17 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా పోలియో చుక్కలు వేస్తామని అన్నారు. 3356 మంది టీం సభ్యులతో, 92 మంది సూపర్వైజర్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజీవ్ రాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలి
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, కన్నుల పండువగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే వేడుకలు వినూత్నంగా జరుపుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజైనందున రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలన్నారు. పోలీసు పరేడ్‌గ్రౌండ్‌ను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. నగరమంతా పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గణతంత్ర వేడుకల్లో అధికారులు తమతమ శాఖల çశకటాలను, స్టాళ్లను ఏర్పాటు చేయాలని, ఇందుకు డీఆర్డీవో బాధ్యత వహించాలన్నారు. గ్రౌండ్, స్టేజీ వద్ద పూలతో అలంకరించాలని ఉద్యానశాఖ అధికారులతో పేర్కొన్నారు. పాఠశాలల విద్యార్థులచేత 45 నిమిషాలకు మించకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈవోను ఆదేశించారు. ఆయా శాఖల్లోని ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు అవార్డులు అందజేయడానికి ప్రతిపాదన జాబితాను ఈనెల 22లోగా అందజేయాలన్నారు. సమావేశంలో జేసీ రవీందర్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రసాద్, డీఆర్డీవో వినోద్‌కుమార్, అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పల్స్‌పోలియోపై ప్రచారం చేయండి.. ఈనెల 28న, మార్చి 11న జరిగే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో పల్స్‌పోలియోపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 0–5 వయస్సు గల 2,16,832 మంది పిల్లలకు పోలియోచుక్కలు వేసేందుకు అంచనా వేశామని, ఇందుకోసం 1021 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4150 మంది సిబ్బందిని నియమించామన్నారు. పల్స్‌పోలియో నిర్వహించే తేదీలను గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. అదేవిధంగా విద్యాశాఖ, ఇంటర్, ఐసీడీఎస్ శాఖల సమన్వయంతో జిల్లాలో 1–19 వయస్సుగల పిల్లలందరికి నట్టల నివారణ మందులను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 4,49,554 మంది పిల్లలకు ఈ నట్టల నివారణ మందులను పంపిణీ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఎంహెచ్‌వో డా.వెంకట్ తెలిపారు. ఓటర్ దినోత్సవాన్ని.. ఈనెల 25న జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవంలో అందరిని భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ల దినోత్సవంపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఎన్నికల సంఘం 2011 నుంచి ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోందని, ఒక్కో సంవత్సరం ఒక్కో అంశంతో ఈ దినోత్సవం జరుపుతారన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, రంగవల్లుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయాలన్నారు. ఈనెల 25న కలెక్టరేట్ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు 2కె రన్ ఉంటుందని తెలిపారు. సెలవుకు అనుమతి తప్పనిసరి.. జిల్లా అధికారులు సెలవులో వెళ్లిన సందర్భంలో దరఖాస్తు లేదా మెసెజ్ పంపి పంపకూడదని, తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కింది స్థాయి సిబ్బందికి చెప్పి సెలవుపై వెళ్లడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలోనూ సూచించానన్నారు. ప్రజల విన్నపాలను సత్వరం పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు రాష్ట్ర స్థాయికి పంపించి పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమష్టిగా ముందుకు వెళ్లాలని సూచించారు. -
100.8 శాతం పల్స్‌పోలియో
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా 100.8 శాతం పల్స్‌పోలియో నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ మూడ్రోజులుగా పోలియో చుక్కలు వేశామన్నారు. మొత్తం 4,50,545 మందికి చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4,53,945 మందికి వేసినట్లు చెప్పారు. -
నేడు పల్స్‌పోలియో
ఏలూరు అర్బన్: పోలియోరహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కె. కోటేశ్వరి అన్నారు. శనివారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో అప్పుడే పుట్టిన çపసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించినా సరిహద్దు దేశాల్లో పోలియో వ్యాధి కేసులు న మోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా సంచార జాతులు, వలస కార్మికుల, ఇంటీరియర్ ప్రాంతాల చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు గాను ప్రత్యేక మొబైల్ టీములను ఏర్పాటు చేశామని అదే క్రమంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని రద్దీ కూడళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్యశాలలు, రైల్వే, ఆర్టీసీ బస్టాండ్‌ల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం, మంగళవారం రెండురోజుల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు అందని చిన్నారులను గుర్తించి అందిస్తారని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా అర్హులైన చిన్నారులను గుర్తించామని వారందరికీ అవసరమైన డోసులను సిద్ధం చేశామని తెలిపారు. ప్రజలు తమ చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అడిషనల్ డీఎంహెచ్ఓ పి.ఉమాదేవి, డీఐఓ ఎం.మోహనకృష్ణ పాల్గొన్నారు. -
2నుంచి రెండో విడత పల్స్‌పోలియో
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ 2వ తేదీ నుంచి రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. సోమవారం జిల్లా స్థాయి టాస్క్ పోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా చుక్కలు వేయించాలన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విధ్యా శాఖలతో పాటు పొదుపు మహిళలు, ఎంపీడీఓలు సహరించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బందితోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పొదుపు సంఘాల మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ఇతర జనరద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మురికి వాడలు, చెంచుగూడెంలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెండో తేదీన బూత్ స్థాయిలో చుక్కలు వేయాలని, 3 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లాలన్నారు. పోలియో మహమ్మారి బారిన పడి ఎంతో మంది కాళ్లు, చేతులు లేక నరకం అనుభవిస్తున్నారని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, డీఎంహెచ్ఓ మీనాక్షిమహదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
2న పల్స్‌పోలియో
అనంతపురం మెడికల్ : పక్కా ప్రణాళిక రూపొందించుకుని ఏప్రిల్ 2న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిలా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ వెంకటరమణ సూచించారు. శనివారం పల్స్ పోలియోకు సంబంధించి వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పీపీ యూనిట్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులకు ఆయన సూచనలు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. వేసవి నేపథ్యంలో వ్యాక్సిన్ శీతలీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 7 నుంచి 14 వరకు డీపీటీ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆస్పత్రులతో పాటు ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ కర్నూలు విభాగం సర్వెలైన్స్ వైద్యాధికారి పవన్‌కుమార్ వైద్యులకు పలు సూచనలు చేశారు. పోలియో కార్యక్రమం నిర్వహణ, నివేదికలు పంపే తీరును వివరించారు. కార్యక్రమంలో డీటీసీఓ సుధీర్‌బాబు, డీఐఓ పురుషోత్తం, డీపీఎంఓ అనిల్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్, డెమో హరిలీలాకుమార్, ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ఆల్బెండజోల్
- జాయింట్ కలెక్టర్ హరికిరణ్ - పద్దెనిమిదేళ్ల వారందరినీ కవర్ చేయాలని ఆదేశం - రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కర్నూలు(హాస్పిటల్): పల్స్‌పోలియో తరహాలో ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లలోపు వారందరూ నులిపురుగుల నివారణ మాత్రలు మింగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఒకటి నుంచి 18 ఏళ్లలోపు వారు 7,90,000 మంది ఉన్నట్లు గుర్తించామని జేసీ తెలిపారు. ఈ నెల 10వతేదీన నులిపురుగుల నివారణ దినోత్సవం వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలన్నారు. పాఠశాలల, కళాశాలల విద్యార్థులెవరూ ఆ రోజు గైర్హాజరు కాకుండా హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, 3 నుంచి 18 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర చొప్పున ఇవ్వాలన్నారు. 9వ తేదిలోగా అన్ని విద్యాలయాలకు నులిపురుగుల నివారణ మాత్రలను చేరవేయాలని ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ హేమలతను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలన్నారు. మాత్రలు మింగిన విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకుంటే ప్రథమ చికిత్స అందించేందుకు 108, 102 వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లేనిపక్షంలో జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ (ఫోన్ నెం.277305, 277309), డివిజన్ స్థాయిలో డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మీనాక్షిమహదేవ్‌ను ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన అర్బన్‌హెల్త్ సెంటర్ సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ, డెమో ఎర్రంరెడ్డి, డీఐఓ వెంకటరమణ పాల్గొన్నారు. -
100.4 శాతం పల్స్‌పోలియో
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా మూడ్రోజుల్లో 100.4 శాతం పల్స్‌పోలియో నమోదైనట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. మొత్తం 4,50,545 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4,52,334 మందికి వేశామన్నారు. 19,013 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసినట్లు తెలిపారు. -
96.2 శాతం ‘పల్స్ పోలియో’
అనంతపురం : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో విజయవంతంగా సాగినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. 0–5 ఏళ్లలోపు చిన్నారులు 4,50,545 మందికి పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 3617 పోలియో బూత్‌లలో మొదటి రోజు 4,33,321 (96.2 శాతం) మంది పిల్లలకు చుక్కలు వేశామన్నారు. ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసే కార్యక్రమాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహిస్తామని తెలిపారు. -
నేడు పల్స్‌పోలియో
–2,771 కేంద్రాల ఏర్పాటు –ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు కర్నూలు(హాస్పిటల్): పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం కర్నూలులో ప్రారంభమవుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డీఐవో) డాక్టర్ వెంకటరమణ చెప్పారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నార. ఈ కార్యక్రమంలో 29వ తేదిన పల్స్‌పోలియో బూత్‌లలో , 30, 31, ఫిబ్రవరి 1వతేదీల్లో ఇంటింటికి తిరిగి సిబ్బంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 5,31,684 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరికి 6,20,000 డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాలో 2,771 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు ట్రాన్సిట్ బూత్‌లు 95, మొబైల్ బూత్‌లు 98 నియమించినట్లు తెలిపారు. ఈ మేరకు 11, 084 మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. వీరితో పాటు 277 మంది సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తారన్నారు. జిల్లాలో పనిచేసే కార్మికులు 5,236 మంది ఉండగా, అక్కడ ఉండే 1,358 మంది చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అన్ని రైల్వే, బస్స్టేషన్లు, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, సంతలు, జాతరలు, ప్రయాణాలలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 98 బృందాలు నియమించినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు, జిల్లా మలేరియా నియంత్రణాధికారి జె.డేవిడ్‌రాజు, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ హేమలత, డెమో ఎర్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండు చుక్కలు.. మర్చిపోవద్దు!
– నేడు జిల్లా వ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ – 30, 31 తేదీల్లో ఇంటింటి సందర్శన జిల్లా జనాభా : 42,99,541 లక్ష్యం (0–5 ఏళ్లలోపు పిల్లలు) : 4,50,545 మంది గ్రామీణ ప్రాంతాల్లోని పల్స్ పోలియో బూత్‌లు : 3195 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బూత్‌లు : 422 పల్స్ పోలియోలో పాల్గొనే సిబ్బంది : 14,684 రూట్ సూపర్వైజర్లు : 376 మొబైల్ బృందాలు : 96 హై రిస్క్ ప్రాంతాలు : 267 సరఫరా చేసిన వ్యాక్సిన్లు : 5,90,000 బూత్‌లలో చుక్కలు వేసే తేదీ : జనవరి 29 ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసే కార్యక్రమం : జనవరి 30, జనవరి 31 అనంతపురం మెడికల్ : నేటి బాలలే రేపటి పౌరులు. ఆ పిల్లలు భవిష్యత్‌లో ఆరోగ్యంగా ఉండేందుకు వారికి పలు రకాల వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ నిర్వహించనున్నారు. ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’ నినాదంతో వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. పిల్లలు అంగ వైకల్యం, అనారోగ్యం లేకుండా పెరిగేందుకు, పుట్టిన నాటి నుంచి ఆరోగ్య శాఖ నిర్ణయించిన సమయంలో వ్యాక్సిన్లు ఇప్పిస్తూ ఉండాలంటున్నారు వైద్యులు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల వ్యాక్సిన్లను ఉచితంగా అందజేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో నిర్దేశించిన వ్యాక్సిన్లు ఉచితంగా వేస్తున్నారు. పిల్లలు పుట్టగానే ఆయా ఆస్పత్రులలో పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల వివరాలతో కూడిన చార్టును తల్లిదండ్రులకు అందజేస్తారు. చార్టు ఆధారంగా వాక్సిన్లు ఇప్పిస్తే పిల్లలను పలు రకాల వ్యాధుల బారినుంచి కాపాడిన వారవుతారు. పోలియో వ్యాక్సిన్‌తోనే ‘జీవితం’ ప్రారంభం : పిల్లలు పుట్టగానే వారికి పోలియో వ్యాధి నివారణ వ్యాక్సిన్ ఇవ్వడంతో పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. – పిల్లలు పుట్టిన వెంటనే ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ను (ఓపీవీ) జీరో డోస్ ఇస్తారు. ఈ వ్యాక్సిన్‌ను పిల్లలకు అంగ వైకల్యం రాకుండా ఉండేందుకు వేస్తారు. – 24 గంటలలోపు హెపటైటిస్ బీ జీరో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పిల్లలకు పచ్చ కామెర్ల వ్యాధి రాదు. బీసీజీ వ్యాక్సిన్ సైతం వేయించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ క్షయ వ్యాధి నివారణకు పని చేస్తుంది. – ఆరు వారాలకు, పది వారాలకు, 14 వారాలకు పలు రకాల వ్యాక్సిన్లు ఇప్పించాల్సి ఉంటుంది. ఆరు, పది, 14 వారాలు నిండిన పిల్లలకు ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ వ్యాక్సిన్లను వేస్తారు. ఈ వ్యాక్సిన్లు పుట్టిన వెంటనే ఇచ్చినప్పటికీ ఆయా వారాల్లో సైతం ఇవ్వాలి. అదనంగా ఇచ్చే డీపీటీ వ్యాక్సిన్ కంటి వాపు, గోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాధుల నివారణకు పని చేస్తుంది. – తొమ్మిది నెలలు నిండిన తర్వాత 12 నెలల్లోపు మీజిల్స్ వ్యాక్సిన్, విటమిన్ ఏ ద్రావణం ఇప్పించాలి. మీజిల్స్ వ్యాక్సిన్ తట్టువ్యాధి నివారణకు పని చేస్తుంది. విటమిన్–ఎ ద్రావణం ఇవ్వడంతో అంధత్వ నివారణ, రే చీకటిని నివారించవచ్చు. – పదో నెలలో జేఈ వ్యాక్సిన్ మొదటి డోస్ ఇప్పించాలి. ఇది మెదడు వాపు నివారణకు పని చేస్తుంది. – 16 నెలలు నిండినప్పటి నుంచి 24 నెలల మధ్య డీపీటీ, ఓపీవీ వ్యాక్సిన్లను బూస్టర్ డోస్‌లు ఇప్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు మీజిల్స్ రెండో డోస్‌ను సైతం ఇప్పించాలి. – ఐదేళ్ల నుంచి ఆరేళ్ల మ«ధ్య వయసులో డీపీటీ 5 ఇయర్స్ డోస్‌ను ఇప్పించాలి. – పిల్లలకు పదేళ్లు నిండిన తర్వాత టీటీ మొదటి డోస్‌ను, 16వ సంవత్సరంలో టీటీ మరో డోస్‌ను ఇప్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయద్దు పల్స్‌పోలియో కోసం పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. వ్యాక్సిన్‌ను అన్ని ఆస్పత్రులకు పంపిణీ చేశాం. 0–5 ఏళ్లలోపు చిన్నారులందరికీ చుక్కలు వేయించండి. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయద్దు. - డాక్టర్ పురుషోత్తం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఉదయం 7 నుంచి ప్రారంభం పల్స్‌పోలియోను ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తాం. సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది. 200 నుంచి 250 చిన్నారులున్న ప్రాంతాల్లో పోలియో బూత్‌లను ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా మొబైల్ బృందాలు పని చేస్తాయి. అంతా కలిసికట్టుగా పని చేసి చుక్కలు వేయించాలి. 30, 31వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి చుక్కలు వేస్తారు. - డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం
కర్నూలు(హాస్పిటల్): పక్కా ప్రణాళికతో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. మండల అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 29న అన్ని పీహెచ్‌సీలు, హెల్త్ సెంటర్లలో, పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ బూత్‌లలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ నెల 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో ఇంటింటికి తిరిగి కేంద్రాలకు రాని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్, డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రనాథ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రేపే ‘పల్స్ పోలియో’
అనంతపురం మెడికల్ : రెండు చుక్కలు మీ చిన్నారుల జీవితాన్ని పోలియో బారిన పడకుండా చేస్తాయి. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాయి. ఆదివారం ‘పల్స్ పోలియో’ నిర్వహించనున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శనివారం అనంతపురంలోని అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. జిల్లాలో 4,50,545 మంది 0–5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను 5,90,000 వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. విజయవంతం చేయండి జిల్లా వ్యాప్తంగా ఈనెల 29న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. అందరూ సమష్టిగా పని చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30, 31వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు ఇప్పటికే వ్యాక్సిన్లు అందజేశామన్నారు. అనంతపురంలోని కోర్టు రోడ్డులో ఉన్న నెహ్రూ నగరపాలకోన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా శనివారం అనంతపురంలో ర్యాలీ చేపడతామన్నారు. అనంతరం పల్స్‌పోలియోకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. -
ఈ నెల 29న పల్స్‌పోలియో
హైదరాబాద్: జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో టీకాలు వేయనున్నారు. నగరంలో 3200 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాక్సినేషన్ కోసం 1200 మంది ఏఎన్ఎంలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులను ఎంపిక చేశారు. తొలి రోజు కేవలం ఎంపిక చేసిన బూతుల్లోనే కాకుండా బస్టాండ్లు, రైల్వే స్టే షన్లు, విమానాశ్రయాలు, దేవాలయాలు, పార్కులు, ఇతర రద్దీ ప్రదేశాల్లోనూ పోలియో వాక్సిన్ వేయనున్నారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు డోర్ టు డోర్ తిరిగి పోలియో వాక్సిన్ వేయించుకోని చిన్నారులను గుర్తించి వారికి చుక్కల మందు వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. -
అంతా మా ఇష్టం!
అవసరానికి మించి పోలియో వ్యాక్సిన్ కొనుగోలు ఈ నెల 25తో ముగియనున్న వ్యాక్సిన్ గడువు గ్రేటర్లో మూడో విడత పల్స్‌పోలియో? ఇప్పుడెలా సాధ్యమంటున్న వైద్య నిపుణులు సిటీబ్యూరో: డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం వ్యాపారసూత్రం.. ఎంత అవసరమో అంత కొనడం ఓ పద్ధతి.. అయితే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అవసరం లేకపోయినా 27వేల డోసుల పోలియో వ్యాక్సిన్‌ను అధికారులు కొనుగోలు చేసి వృథా చేశారు. ఈ ఒక్క ఉదంతం చాలు అధికారులకు పాలనపై ఎంతశ్రద్ధ ఉందో. అవసరం లేకపోయినా వాక్సిన్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత దాన్ని గుట్టుచప్పుడు కాకుండా వదిలించుకునేందుకు పథకం పన్నడం మామూలైపోయింది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 27 వేల డోసుల పోలియో వాక్సిన్ మిగిలిపోయింది. ఈ విషయం గమనిస్తే చుక్కల మందు వేసే కార ్యక్రమం ఎంత శ్రద్ధగా జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకో వచ్చు. ఒక్కోడోసుకు రూ.110 ఖర్చవుతుంది. అంటే రూ. 29.70 లక్షల విలువైన వ్యాక్సిన్ మిగిలిపోతుందన్నమాట. ఈ నెల 25లోగా దీన్ని వినియోగించపోతే వ్యాక్సిన్ మొత్తం పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐదేళ్లలోపు చిన్నారులు 9.9 లక్షల మంది ఉండగా, వీరిలో హైదరాబాద్ జిల్లాలో 5.84 లక్షల మంది, రంగారెడ్డి అర్బన్‌లో 4.95 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఏటా రెండుసార్లు పిల్లలకు వాక్సిన్ వేస్తారు. తొలివిడత కార్యక్రమంలో భాగంగా జనవరి 17 నుంచి 20 వరకు, రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 20-23 వరకు పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కానీ పిల్లల నిష్పత్తికి మించి వాక్సిన్ కొనుగోలు చేయడమే కాకుండా మిగిలిన దాన్ని వదిలించుకునేందుకు హైదరాబాద్ జిల్లాలో మూడోసారి పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహించాలని అధికారులు చూస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యూపీహెచ్సీల కేటాయింపులోనూ.. హైదరాబాద్ జిల్లాలో 85 యూపీహెచ్‌సీలు ఉండగా ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 40-55 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్కో మెడికల్ ఆఫీసర్‌కు ఒక యూపీహెచ్సీ కేటాయించాలి. కానీ జిల్లాలో ఒక్కో అధికారికి రెండు మూడు కేంద్రాలు కేటాయించడం వివాదాస్పదమైంది. అంతేకాదు పోలియో కార్యక్రమ ప్రచారం కోసం ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు నుంచి ఐదు ఆటోలు ఏర్పాటు చేసి వీటికి మైక్‌లు అమర్చి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఏ రోజు వేస్తున్నారు? ఎక్కడ వేస్తున్నారో వివరించాలి. ఇందు కోసం ఒక్కో వాహనానికి రోజు కు రూ.1200 చొప్పున అద్దె చెల్లిస్తుంది. కొంత మంది మెడికల్ ఆఫీసర్లు ప్రచార వాహనాలు ఏర్పాటు చేయకుండానే బిల్లులు బొక్కేశారు. అంతేకాదు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ స్టూడెంట్స్‌కు నిర్దేశించిన దానికంటే అతితక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడెలా సాధ్యం పిల్లల నిష్పత్తికి తగిన మోతాదులో వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉండగా, అధికారులు పిల్లల సంఖ్య కంటే ఎక్కువ వ్యాక్సిన్ కొనుగోలు చేశారు. దీంతో హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోనూ వ్యాక్సిన్ భారీగా మిగిలిపోయింది. మిగిలిన వాక్సిన్లతో పోలిస్తే పోలి యోవాక్సిన్ హీట్సెన్సీవ్ మెడిసిన్. మైనస్ 15-25 డిగ్రీల వ ద్ధ భద్రపరచాల్సి ఉంది. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. మిగిలిన వాక్సిన్ను వదిలించుకునేందుకు ఇలాంటి పరిస్థితుల్లో మూడో విడత వాక్సినేషన్ చేపట్టాలనుకోవడం ఎంత వరకు సమంజసమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమ నిబంధనల ప్రకారం ఏటా రెండు సార్లు మాత్రమే వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలి. కానీ హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడోసారి వాక్సినేషన్ చేపట్టాలను కోవడమంటే మిగిలిన వాక్సిన్ను వదిలించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమేనని పలువురు సీనియర్ వైద్యులు స్పష్టం చేస్తునా ్నరు. -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
సాక్షి నిఘా * చల్లదనంలో ఉంచాల్సిన పోలియో వ్యాక్సిన్ కిట్లు గ్రామాల్లోనే.. * ఆ వ్యాక్సిన్ వేస్తే ..వికటించే ప్రమాదమంటున్న ఆరోగ్య సిబ్బంది * రవాణా ఖర్చులు మింగుతున్న వైనం * కొరవడిన అధికారుల పర్యవేక్షణ తిప్పర్తి: పోలియో రహిత సమాజ స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు పర్యాయాలు పల్స్‌పోలియో చుక్కలు వేసే విధంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంతో చిన్నారులకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. ఎప్పుడు చల్లదనంలో ఉండాల్సిన వ్యాక్సిన్లను (కిట్) ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ, ఆశ వర్కర్ల వద్దనే ఉంచుతున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రతి రోజు పీహెచ్సీ నుంచి కిట్లను తీసుకొని వాహనాల ద్వారా ఆయా గ్రామాలకు పంపిణీ చేయాలి. మొదటి రోజునే ఆ కిట్లను ఇచ్చేసి 3వ రోజు తిరిగి వాటిని తెస్తున్నారు. దీంతో ‘‘వ్యాక్సిన్’’ వికటించే అవకాశం ఉంటుందని కొంతమంది ఆరోగ్య సిబ్బంది అంటున్నారు. కిట్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను మింగేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ కూలింగ్ ఇలా... పోలియో చుక్కల వ్యాక్సిన్‌ను ఎప్పుడు చల్లని ప్రదేశంలో భద్రపరచాలి. వ్యాక్సిన్ ఫ్రీజ్‌లో ఉంచి బయటకు తీసుకెళ్లెటప్పుడు కిట్ (డబ్బ)లో నాలుగు ఐస్ప్యాడ్ల నడుమ వ్యాక్సిన్ ఉంచి మరో ఐస్గడ్డల ప్యాకెట్లను రెండింటిని వేస్తారు. ఇలా ఐస్ ప్యాడ్స్లు ఢీ ఫ్రీజ్‌లో -2, -8 సెంటి డిగ్రీల చల్లదనంలో కూల్ అయిన తర్వాత కిట్‌లో ఉంచుతారు. దీంతో 8 గంటల వరకు ఈ చల్లదనం ఉంటుంది. పోలియో చుక్కలు వేసిన అనంతరం కిట్స్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ఢీ ఫ్రీజ్‌లో ఐస్ ప్యాడ్లను, వ్యాక్సిన్లను కూలింగ్ పెట్టి మరునాడు ఆయా గ్రామాలకు సరఫరా చేయాలి. ఇలా 3 రోజుల పాటు ఈ పోలియో చుక్కల వ్యాక్సిన్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూలింగ్ పెట్టాలి. చల్లదనం లేకుంటే.. పోలియో వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ చేసేంత వరకు చల్లదనంలోనే ఉంటుంది. అయితే సరైన చల్లదనం లేనప్పుడు స్టేజీల వారీగా వి.వి.ఎం. శాతం పడిపోతుంది. అందులో 1వ, 2వ స్టేజీల వరకు పోలియో చుక్కలను చిన్నారులకు వేసుకోవచ్చు. తర్వాత స్టేజీలో ఆ చుక్కలు వేసిన పనిచేయకపోవడం, వికటించే అవకాశం ఉంటుంది. రవాణా ఖర్చులు నొక్కేసేందుకే ? పోలియో చుక్కల కార్యక్రమం 3 రోజులు మండల కేంద్రంలోని పీహెచ్సీ నుంచి కిట్లను ఆయా గ్రామాలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలోనే నిధులు వస్తాయని వాటిని కాజేసేందుకే ఇలా ఒక్క రోజు మాత్రమే కిట్స్ సరఫరా చేసి ఆయా గ్రామాలలోని అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బందికి కిట్స్ ఇస్తున్నారు. దీంతో మొదటి రోజు - 2, -8 డిగ్రీల చల్లదనంతో ఇచ్చిన ఐస్ప్యాడ్లు కరిగి నీరుగా మారి కూలింగ్ శాతం తక్కువ అవుతుంది. ఇలా కిట్లను తమవద్దనే ఉంచుకునేందుకు కొంత మంది అంగన్వాడీ వర్కర్లు సంసిద్ధత వ్యక్త చేస్తున్నా పట్టించుకోకుండా వైద్యాధికారులు, సిబ్బంది అలాగే వదిలేసి వెళుతున్నారు. దీంతో ‘‘వ్యాక్సిన్’లో వి.వి.ఎం. (వ్యాక్సిన్, వైల్, మానిటర్) శాతం తక్కువై ఆ చుక్కలు వేసినా ఉపయోగం ఉండకపోవడంతో పాటు వికటించే అవకాశం ఉంటుంది. ఓ ఉద్యోగి కనుసన్నల్లోనే.. మండల కేంద్రంలో పనిచేసే ఓ సూపర్వైజర్ ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొత్తం 50 పోలియో చుక్కల బూత్‌లు ఉండగా వాటిని 5 రూట్లుగా విభజించి సూపర్వైజర్లు ప్రతి రోజు ఆయా బూత్‌లకు వ్యాక్సిన్ కిట్లను తీసుకువెళ్లాలి. కానీ రవాణా ఖర్చులను నొక్కేసేందుకు ఓ సూపర్వైజర్ ఒక్క రోజు కిట్లను ఇచ్చేసి చివరి రోజు తెచ్చుకునేలా రెండు ఆటోలను మాట్లాడినట్లు తెలిసింది. అయితే పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా జిల్లా మొత్తంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కొంతమంది అంగన్వాడీలు, ఆరోగ్య సిబ్బంది అంటున్నారు. -
పల్స్ పోలియో సక్సెస్
జిల్లాలో 95.01 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు ఎంజీఎం : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. 95.01 శాతం మంది చిన్నారులకు చుక్కల మందులు వేరుుంచారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వాకాటి కరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. పోలియో వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు విధిగా పోలి యో చుక్కలు వేరుుంచాలని సూచించారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్పారు. నగరంతో పాటు జిల్లాలోని 51 మం డలాల్లో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరి యా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు, 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ లు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.జిల్లాలోని ఐదేళ్లలోపు4,52,019 మం దికి పోలియో చుక్కలు వేసేందుకు 34,110 వాయిల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16,066 మంది సిబ్బందిని నియమించామని, 1384 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో రీజినల్ డెరైక్టర్ నాగేశ్వర్రావు, వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు, మున్సిపల్ ఉపకమిషనర్ షామిద్ మసూద్, డీఐఓ హరీశ్‌రాజు, ఎంహెచ్ఓ జయప్రకాశ్, అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, ఎస్ఎంఓ కిరణ్, రెడ్‌క్రాస్ చైర్మన్ రవీందర్రావు, డీపీహెచ్ఎన్ఓ వెంకటమ్మ పాల్గొన్నారు. 95.01 శాతం నమోదు.. జిల్లా వ్యాప్తంగా 4,05,219 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు ఏర్పాట్లు చేయగా 3,85, 282 మందికి వేసినట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఐఓ హరీశ్‌రాజు తెలిపారు. మొత్తంగా 95.01 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశామన్నారు. పోలియోరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : ఆర్డీ రెండు చుక్కల పోలియో మందుతో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డెరైక్టర్ నాగేశ్వర్రావు అన్నారు. ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వరంగల్‌ను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయూలని కోరారు. -
నడిరోడ్డుపైనే పల్స్‌పోలియో కార్యక్రమం
కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులకు నడి రోడ్డుపైనే పోలియో వ్యాక్సిన్లు వేయాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నారులకు పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట్ ప్రాంతంలో ఓ నాలుగు స్కూళ్లలో చిన్నారులకు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. పోలియో నిర్వహించాల్సిన స్కూళ్లు తాళాలు వేసి దర్శనమిచ్చాయి. తమకు ముందుస్తు సమాచారం లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఎవరి నిర్లక్ష్యమైతేనేమి చిన్నారులకు తాళాలు వేసి ఉన్న స్కూళ్ల ముందు ఎండలోనే వ్యాక్సిన్లు వేయాల్సి వచ్చింది. -
ఇంద్రధనస్సుతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం
బళ్లారి అర్బన్ :జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం కల్గించే రెండవ రౌండ్ చుక్కల మందు కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ సలావుద్దీన్ ప్రారంభించారు. శుక్రవారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో జిల్లా ఆరోగ్య, కుటుంబ కల్యాణ శాఖ ఆధ్వర్యంలో రెండవ రౌండ్ ఇంద్రధనస్సు విశేష కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరు పోలియో చుక్కలను తప్పని సరిగా వేయించాలన్నారు. ప్రతి ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పోలియో చుక్కలను వేయించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలు రాకుండా చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏడు తాలూకాలలో నాలుగు రౌండ్ల చొప్పున ప్రతి నెల ఏడు రోజుల పాటు నిర్వహిస్తారని తెలిపారు. పుట్టిన రెండు సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారికి ఏడు రకాల రోగాల నివారణకు, గర్భిణీ లు మొదటి నుంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లి పాలను పట్టించడంతో వారు ఆరోగ్యం ఉంటారని తెలిపారు. జిల్లాలో మొత్తం 1269 ప్రాంతాలలో గుర్తించి అందులో 7048 పిల్లలకు, 896 మంది గర్భిణీలకు ఈ చుక్కలను వేసినట్లు తెలిపారు. ఇందులో 530 చుక్కల కేంద్రాలను, 75 సంచార గ్రూపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ ఖాజీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 284 మంది సిబ్బంది, సూపర్వైజర్లు, తాలూకాలోని ఒక నోడల్ అధికారి పాల్గొనారని తెలిపారు. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలో, ఇంటింటికి వెళ్లి ఈ చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాలలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో ఈ చుక్కల కార్యక్రమాన్ని చే పట్టారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఇంద్రాణి, డీహెచ్ఓ రమేష్‌బాబు, జిల్లా శస్త్రచికిత్స వైద్యులు ఎన్.బసరెడ్డి, తాలూకా ఆరోగ్యాధికారి వీరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ..కమిటీలతో పాలన చేసుకో!
శ్రీరంగరాజపురం: సీఎం నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేల వ్యవస్థను తొల గించి కమిటీలతో పాలన చేస్తే బా గుంటుందని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన తయ్యూరులో పల్స్‌పోలియో కార్యక్రమానికి వచ్చారు. ఎంపీడీవో, తహశీల్దార్ హాజరుకాకపోవడంపై మండిపడ్డా రు. పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొనకుండానే ప్రజా సమస్యలు విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు పాలన అధ్వానంగా తయారైందన్నారు. వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను పూర్తిగా విస్మరిస్తున్నారని, అధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారని, కేవలం జన్మభూమి కమిటీలతో పాల న సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అనంతరం ఆ యన దిగువ ముదికుప్పంలో పెద్దసుబ్బారెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్నారు. కొత్తపల్లెమిట్టలో గిరిజమ్మ తండ్రి దొరస్వామిరెడ్డి శనివారం రాత్రి మరణించిన విషయం తెలుసుకుని పూల మాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ఎంపీపీ మోహన్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఆనందరెడ్డి, జెడ్పీటీసి విజయ్‌కుమార్, తయ్యూరు సర్పంచ్ బాబు, పార్టీ మండలాధ్యక్షుడు అనంతరెడ్డి, నాయకులు కుప్ప య్య, కాళప్ప, ఆంజి, ఏసు, అల్లిముత్తు తదితరులు పాల్గొన్నారు. -
పల్స్‌పోలియో విజయవంతం
కోనరావుపేట : పోలియో మహమ్మారి నామరూపాలు లేకుండా చేయడానికి ఏర్పాటుచేసిన రెండవ విడత పోలియో ఆదివారం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రెండు చుక్కలు వేయడంతో ఈ మహమ్మారిని పారద్రోలడానికి అధికారులంతా కలసికట్టుగా ముందడుగు వేశారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ లక్ష్మి ప్రారంభించారు. ఆదివారం ఉదయం రెండేళ్ల బాబుకు పోలియో చుక్కలు వేసిన ఆమె అందరు కలిసి పోరాడి పోలియోను రూపుమాపాలన్నారు. -
నేటి నుంచి రెండో విడత పల్స్‌పోలియో
నెల్లూరు (అర్బన్): జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్న ట్లు కడప ఆర్డీ, పల్స్‌పోలియో జిల్లా పరిశీ లకుడు దశరథరామయ్య తెలిపారు. డీఎం హెచ్ఓ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 3,29,304 మంది ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 3042 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ఏరియాల్లో పోలియో చుక్కలు వేసేందుకు 88 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బఫర్ స్టాక్ పాయిం ట్స్‌ను కావలి, వింజమూరు, ఉదయగిరి, ఆత్మకూరు, పొదలకూరు, గూడూరు, నాయుడుపేట, కోట, వెంకటగిరి, సూళ్లూరుపేట, బుచ్చి, కొడవలూరు ప్రాంతాల్లో పెట్టామన్నారు. 12,152 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. వీరిలో ఆశా వాలంటీర్లు-1966, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు- 3682, పారా మెడికల్ స్టాఫ్- 896, ఐకేపీ మెంబర్స్-3050, ఉపాధ్యాయులు- 2044, నర్సింగ్ స్టూడెంట్స్- 514 మంది ఉన్నారన్నారు. 27 మంది ప్రొగ్రామ్ ఆఫీసర్స్‌ను, డిప్యూటీ డీఎంహెచ్ఓలను నియమించామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భారతీరెడ్డి మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని కోరారు. పొరబాట్లు జరగకుండా చూడండి: పల్స్‌పోలియో కార్యక్రమంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పొరబాట్లు జరగకుండా చూడాలని దశరథరామయ్య అన్నారు. మొదటి విడత జరిగినప్పుడు కొన్ని చోట్ల ఎండలో వైల్ బాక్సులు పెట్టుకొని పోలియో చుక్కలు వేశారని, ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. గర్భిణులకు ఎస్కార్ట్ మాతా శిశు మరణాలు తగ్గించేందుకు గర్భిణులకు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైరిస్క్ ఏరియాల్లో దీనికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి గర్భిణి వివరాలు తీసుకుని ఆమెకు డెలివరీ అయ్యేంత వరకు ఒక ఏఎన్ఎంను ఎస్కార్ట్‌గా నియమిస్తామన్నారు. జిల్లాలో స్వైన్‌ఫ్లూ అదుపులో ఉందని, అయినా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. -
పోలియో చుక్కలు వికటించడం వల్లే...
గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మూల జంబం గ్రామానికి చెందిన 15 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. గత ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా మూలజంబం గ్రామానికి చెందిన పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించారు. ఆ రోజు నుంచి పిల్లలు వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న తమ పిల్లలకు కేవలం పోలియో చుక్కలు వేయించడం వల్లనే అనారోగ్యం పాలయ్యారని అక్కడి స్థానికులు వాపోతున్నారు. -
చుక్కల మందుకు చక్కని స్పందన
విజయనగరం ఆరోగ్యం: పల్స్‌పోలియో కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది. కార్యక్రమంలో భాగంగా తొలిరోజే లక్ష్యానికి చేరువగా 98.22శాతం మందికి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలు 2,42, 416 మందికి పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 2,38,101మంది పిల్లలకు వేశారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1600 బూత్‌లలో పోలియో చుక్కలు వేసేందుకు గాను 3200 టీమ్‌లను ఏర్పాటు చేశారు. 160 మంది ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌లు పిల్లలకు పోలియో చుక్కలు వేసారు. డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి విజయనగరంపట్టణం, రామతీర్థం, నెలిమర్లలో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదనపు వైద్యారోగ్యశాఖాధికారి సి.పద్మజ పోలిపల్లి,మెంటాడ, తెట్టంగి, తెర్లాంలలో పర్యవేక్షించారు. డీటీసీఓ రామారావు సాలూరు నియోజకవర్గం పరిధిలో పర్యవేక్షించారు. గరివిడి, చీపురుపల్లిలలో మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ పర్యవేక్షించారు. పార్వతీపురం, నీలకంఠాపురం, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ భాస్కర్‌రావు, గజపతినగరం నియోజకవర్గం పరిధిలో జైబార్ కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. -
93.05 శాతం పల్స్‌పోలియో నమోదు
నెల్లూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 93.05 శాతం పల్స్‌పోలియో నమోదైంది. 3,06,238 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో 3,29,112 మంది ఐదేళ్ల లోపు పిల్లలున్నట్లు గుర్తించారు. అర్బన్ పరిధిలో 487, గ్రామీణ ప్రాంతాల్లో 2,551 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 88 మొబైల్ బూత్‌లు అందుబాటులో ఉంచారు. 308 మంది రూట్ సూపర్వైజర్లు, 27 మంది ఉన్నతాధికారులు, 1966 మంది ఆశ వలంటీర్లు, 3,682 మంది ఐసీడీఎస్ సిబ్బంది, 896 మంది పారామెడికల్ స్టాఫ్, 3,050 మంది ఐకేపీ సభ్యులు, 2,044 మంది ఉపాధ్యాయులు, 514 మంది నర్సింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. సిబ్బంది ముమ్మరంగా పాల్గొని చుక్కలు వేయాలని డీఎంహెచ్‌వో భారతిరెడ్డి ఆదేశాలిచ్చారు. పోలియో కేంద్రాల్లో వసతుల కరువు.. పోలింగ్ కేంద్రాల్లో వసతుల గురించి అధికారులు పట్టించుకోలేదు. చుక్కల మందుకు ఎండ తగలకూడదని తెలిసినా షామియానాలు ఏర్పాటు చేయలేదు. కొందరు ఎండలోనే ఉండి చుక్కలు వేయాల్సి వచ్చింది. సిబ్బంది, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పలేదు. నెల్లూరు నగరంలో చుక్కలు వేసేందుకు అధికారులు నర్సింగ్ విద్యార్థులను ఉపయోగించుకున్నారు. చాలా మంది విద్యార్థులకు కార్పొరేషన్ అధికారులు భోజనాలు అందజేస్తారని అధికారులు చెప్పినా ఆచరణలో అమలుకాలేదు. విద్యార్థులే సొంత డబ్బులతో భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర పరిశీలకుడి ఆగ్రహం.. పోలియో చుక్కల కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకుడిగా దశరధరామయ్యను ప్రభుత్వం నియమించింది. ఈయన గూడురు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. అరకొర వసతులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బజారువీదిలోని గాంధీబొమ్మ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ఏఎన్ఎంలు ఎవరూ లేకుండా కేవలం అంగన్వాడీ కార్యకర్త, ఆయాలు మాత్రమే ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలియో చుక్కల మందుకు ఎండ వేడి తగలకూడదని, సిబ్బంది కూడా ఎండలోనే ఉంటూ పనిచేస్తున్నారని ఈ కేంద్రం వద్ద షామియానాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కేంద్రాన్ని నీడ ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈదూరు సుధాకర్ గూడూరులోని పెద్దపరిగ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన డబ్బులు డ్రా చేయకపోవడం, ఏర్పాట్లు బాగోలేకపోవడంతో ఆగ్రహించిన ఆయన యూడీసీ క్లర్క్‌కు మెమో అందజేశారు. -
పోలియో చుక్కలు వేసిన క్రికెటర్ లక్ష్మణ్
అమరావతి : ప్రముఖ అమరారామ కేంద్రమైన అమరావతిలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కలమందు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలబాలికలు భవిష్యత్‌లో వికలాంగులు కాకుండా పోలియోను నిర్మూలించటానికి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయించడం భాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అంతేకాక, పోలియో వ్యాధిని దేశంలోని ప్రజలందరూ కలసి కట్టుగా పారదోలాలన్నారు. డాక్టర్ శ్రీధర్‌చంద్, డాక్టర్ ప్రసాదనాయక్, డాక్టర్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
'పల్స్‌పోలియో' విజయవంతానికి ఏర్పాట్లు
రిమ్స్‌క్యాంపస్: జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి కూడా చుక్కలు వేస్తారని చెప్పారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణపై శనివారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 27,48,177 మంది జనాభా ఉన్నారని, వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,42,897 మంది ఉన్నట్టు చెప్పారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ప్రాంతంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1606 కేంద్రాలు, సంచార కేంద్రాలపై శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. పోలియో వ్యాక్సిన్, బ్యానర్ల పంపిణీ 95 శాతం పూర్తయ్యిందన్నారు. హై రిస్క్ ఏరియాను కూడా కవర్ చేసినట్టు చెప్పారు. పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ : 08942-229945 నంబరులో వైద్యశాఖాధికారిని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారుల సెల్ : 9963994336, 9963994337 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లాలో పోలియో సమస్యాత్మాక ప్రాంతాల్లో 5,739 మంది బాలబాలికలను గుర్తించినట్టు చెప్పారు. వారికి చుక్కలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాఖ ప్రాంతీయ సంచాలకులు గోపాలకృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, ఏడీఎం సీహెచ్ శారద, తదితరులు పాల్గొన్నారు. -
నేడు పల్స్‌పోలియో
ఏర్పాట్లు పూర్తి 11 వేల మంది సిబ్బంది నియామకం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణికోటీశ్వరి చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటల నుంచి పోలియో చుక్కలను పిల్లలకు వేయనున్నారు. ఇందు కోసం 11,616 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఐదేళ్లలోపు వయస్సుగల 4,77,721 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మే రకు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ కె.కోటీశ్వరి ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2017 నాటికి పోలియో లేని దేశంగా భారత్ అవతరించడానికి ప్రభుత్వాలు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో ఆది వారం సామూహికంగా పిల్లలకు పోలియో చుక్కల్ని వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 2,854 పల్స్ పోలియో బూత్‌లు, వంద సంచార బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు పోలియో చుక్కలు వేయించుకోవడానికి అనువుగా రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో సైతం సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఇక జిల్లాలో 394 హైరిస్క్ ప్రాంతాల్లో 2,850 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యం గా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 18వ తేదీన పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లల్ని గుర్తించి 19, 20 తేదీల్లో పోలియో చుక్కలు వేస్తామన్నారు. జ్వరం, దగ్గు లాంటి ఇబ్బందులున్న పిల్లలు, ముందు రోజు పోలి యో చుక్కలు వేయించుకున్న పిల్లలు సైతం ఆదివారం తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందును వేయించుకోవాలన్నారు. తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, బోయకొండ ఆలయాలకు వచ్చే భక్తుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి సైతం ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాకు 6 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు వరసుందరం, వెంకటప్రసాద్, టి.సురేఖ, టి.మునిరత్నం, దోసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు 'అవాక్కయ్యారు'
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లిలో పల్స్ పోలియో ప్లెక్సీల పంపకంలో అధికారులు అవాక్కయ్యారు. ప్లెక్సీలు తెలంగాణ ప్రభుత్వం పేరుతో రావటంతో కాసేపు కలకలం రేగింది. అధికారులు వెంటనే జిల్లా కలెక్టరుకు సమాచారం ఇచ్చారు. దీనిపై జిల్లా కలెక్టరు స్పందిస్తూ.. తప్పులు దొర్లటం సహజమేనని, ఈ సంఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ప్లెక్సీలు కనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందనే అవకాశం ఉంది. అయితే ఏపీలో తెలంగాణ ప్రభుత్వం పేరుతో హోర్డింగులు రావటంపై విమర్శలు వస్తున్నాయి -
పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో పల్స్‌పోలియో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా కర్నూలు గుర్తింపు పొందిందన్నారు. ఇకపై కూడా పోలియో మహమ్మారి దరి చేరకుండా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు 5.07 లక్షల మందిని గుర్తించామని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2,167, అర్బన్ ప్రాంతాల్లో 473 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్లలోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణంలోని చిన్నారులను గుర్తించి చుక్కలు వేయించాలన్నారు. మురికి వాడలు, చెంచుగూడేలు, గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. 18న పల్స్‌పోలియో కార్యక్రమం ఉంటుందని, 17వ తేదీన ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు. 19, 20వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి చుక్కలు వేయాలన్నారు. పల్స్‌పోలియో సందర్భంగా 18న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి నోడల్ అధికారి తమ మండలంలో ఎంపిక చేసుకున్న గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్ యార్డులకు తరలించే ప్రక్రియను చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపైనా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన పింఛన్ల పంపిణీని సమీక్షించారు. ఏజేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు, డీఎంహెచ్ఓ డాక్టర్ నిరుపమ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
దూరంగా... భారంగా...
⇒ పల్స్‌పోలియోపై వైద్యుల నిరాసక్తత ⇒ ఆరు నెలలుగా అంధకారంలో ఆరోగ్య కేంద్రాలు ⇒ పని చేయని ఫ్రిజ్‌లు ⇒ వ్యాక్సిన్ నిల్వకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: జాతీయ పల్స్‌పోలియో కార్యక్ర మంపై వివిధ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఇది తమకు భారమవుతుందని భావిస్తూ...దూరంగా ఉంటున్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో వ్యాక్సిన్ నిల్వ చేసే ఫ్రిజ్‌లు పని చేయడం లేదు. వారం రోజుల ముందు సరఫరా చేసే వ్యాక్సిన్‌ను బయట పెడితే పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆరు నెలలవుతున్నా... ఇంతవరకూ పునరుద్ధరించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు నెలలుగా అంతే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి పరిధిలోనే 85 ఉన్నా యి. ఇందులో 40కి పైగా ఆరోగ్య కేంద్రాల భవనాలు జీహెచ్ఎంసీకి చెందినవి. వీటిలో మాదన్నపేట్, గగన్‌మహల్, డీబీఆర్ మిల్స్, చింతల్‌బస్తీ, అఫ్జల్‌సాగర్, శాంతినగర్, ఆగపురా, కార్వాన్ -2, పానిపురా, పురాణాపూల్-2, మహరాజ్‌గంజ్, దూద్‌బౌలి, భోలక్‌పూర్, మెట్టుగూడ, బోయగూడ, శ్రీరాంనగర్, వినాయక్‌నగర్, తారా మైదాన్ (జూపార్క్ ఎదురుగా), కుమ్మరివాడి, తీగల్కుంట, చందలాల్ బారాదరి ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 2013 మార్చి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో డిస్కం అధికారులు ఇటీవల ఈ ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వైద్యులు లేకపోవడంతో... ఇదిలా ఉంటే నగరంలోని పంజాషా-1, యాకుత్‌పుర-2, మెట్టుగూడ, మలక్‌పేట్, ఆగపురా, గగన్‌మహల్, నిలోఫర్ యూనిట్ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో రోగులకు నర్సులే పెద్ద దిక్కవుతున్నారు. ఈ నెల 18న ప్రారంభం కానున్న పల్స్‌పోలియోలో పాల్గొనేందుకు జిల్లాలో సరిపడే స్థాయిలో వైద్యాధికారులు లేకపోవడమే కాక... ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వ్యాక్సిన్ నిల్వకు ఆస్పత్రుల్లో వసతులూ కరువవుతున్నాయి. దీంతో నిర్వహణ బాధ్యతలకు ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది జంకుతున్నారు. -
5 వ్యాధులకు ఒకటే విరుగుడు
* చిన్నారుల కోసం సరికొత్త టీకా * ‘పెంటావాలెంట్’ వ్యాక్సిన్‌కు రూపకల్పన * అక్టోబరు నుంచి అమలుకు ఆరోగ్యశాఖ కృషి రాయవరం : చిన్నారుల కోసం ఆరోగ్య శాఖ సరికొత్త వ్యాక్సిన్‌కు రూపకల్పన చేసింది. ఐదు వ్యాధులకు కలిపి ఒకటే టీకాను అక్టోబరు నుంచి ప్రవేశపెట్టనుంది. దీనిపేరు పెంటావాలెంట్ వ్యాక్సిన్. ఇప్పటికే వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శిశుమరణాలను తగ్గించేందుకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్లు వచ్చే వరకు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా ప్రణాళికాబద్ధంగా వివిధ రకాల టీకాలను అందజేస్తోంది. బీసీజీ, డీపీటీ, పల్స్‌పోలియో, విటమిన్ ‘ఏ’, హెపటైటిస్-బి, హెచ్ ఇన్ఫ్లుయంజాబి వంటి వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది చిన్నారులకు వేస్తున్నారు. వీటిని ఐదేళ్లు వచ్చేవరకు ప్రణాళికాబద్ధంగా తగిన మోతాదు ప్రకారం వేసేందుకు మాతాశిశు సంరక్షణ కార్డులు కూడా జారీ చేస్తున్నారు. ఇది కాకుండా తొమ్మిదో నెలలో మీజిల్స్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏయే వ్యాధులకు ఏ టీకా అంటే ఇప్పటి వరకు క్షయ వ్యాధికి బీసీజీ, కోరింతదగ్గు, ధనుర్వాతం, ఫెర్టిజిస్కు డీపీటీ, రేచీకటికి విటమిన్ ఏ, కామెర్లకు హెపటైటిస్-బి, మెదడువాపునకు హెచ్ ఇన్ఫ్లుయంజాబి, పొంగు, తట్టుకు మీజిల్స్ వ్యాక్సిన్లను వేస్తున్నారు. అయితే ఇన్ని రకాల వ్యాక్సిన్లు కాకుండా ఇప్పుడు ఐదు వ్యాధులకు కలిపి ఒకే వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యోచిస్తున్నారు. కొత్త వ్యాక్సిన్ ఈ వ్యాధుల నివారణకు.. ఇప్పటి వరకు మూడు వ్యాధులకు డీపీటీ ఇస్తున్నారు. ఈ మూడు వ్యాధులకు మరో రెండు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా సరికొత్త టీకాను రూపొందించారు. కోరింత దగ్గు, ధనుర్వాతం, ఫెర్టిజిస్, కామెర్లు, మెదడు వాపు సోకకుండా కొత్త వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. అంటే ఇప్పటివరకు ఇస్తున్న హెపటైటిస్-బి, హెచ్ ఇన్ఫ్లుయాంజాబి, డీపీటీ వ్యాక్సిన్లకు బదులుగా ఒకటే వ్యాక్సిన్ ‘పెంటావాలెంట్’ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త వ్యాక్సిన్‌ను బిడ్డ పుట్టిన నెలన్నరకు ఓ డోసు, రెండున్నర నెలలకు మరో మోతాదు, మూడున్నర నెలలకు మరో డోసును ఇస్తారు. టీకా వల్ల ప్రయోజనాలివి వయసుకు తగిన బరువు లేకపోవడం, వాంతులు, విరేచనాలతో బాధపడడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి ఈ వాక్సిన్ రక్షణగా నిలుస్తుంది. కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు బయట మందుల షాపుల్లో వాక్సిన్లు లభ్యమవుతున్నా ధర అధికంగా ఉంటుంది. శిశు మరణాలు తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ వాక్సిన్ను ప్రవేశపెడుతున్నట్టు సమాచారం. 79,777 మందికి వాక్సినేషన్ అక్టోబరు నుంచి కొత్తగా అందజేసే పెంటావాలెంట్ వాక్సిన్ను జిల్లాలో 79,777 మందికి అందజేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా. జిల్లాలో ఉన్న 119 పీహెచ్‌సీల పరిధిలోని 890 సబ్సెంటర్లలో చిన్నారులకు ఈ వ్యాధి నిరోధక టీకాను అందజేస్తారు. -
‘ఆశ’ నిరాశే
జోగిపేట: గ్రామీణ ప్రాంత పేద ప్రజలు జ్వరం, ఇతర ఏ అ నారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే ఆశా వర్కర్లనే ఆశ్రయిస్తారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించి ఉచితంగా మందులు ఇవ్వడం, గర్భిణులను విధిగా పీహెచ్‌సీకి తీసుకువెళ్లడం, పుట్టిన బిడ్డలకు టీకా లు, వ్యాక్సిన్లు వేయించడం, క్షయ, కుష్టు, బోద వ్యాధి గ్ర స్తులను గుర్తించడం వీరి ప్రధాన బాధ్యతలు, మహిళల ను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఒప్పించడం కూడా వీ రి విధే. ఎన్నికల విధులు, జనాభా లెక్కల సేకరణ పల్స్‌పోలియో, గ్రామాల్లో వ్యాధులు ప్రబలినప్పుడు ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు కూడా ఆశా కార్యకర్తలు సేవలను అందిస్తారు. పల్స్‌పోలియో, 104 శిబిరాలు, పీహెచ్‌సీల్లోనూ వీరితో పనులు చేయిస్తున్నారు. ఇచ్చేది బెత్తెడు..చాకిరి మూరెడు పల్స్‌పోలియోలో ఏఎన్ఎం అంగన్వాడీలకు సహకరిం చినందుకు ఒక్కొక్క ఆశ కార్యకర్తకు రూ.225, పదినెలల పాటు బాలింతలకు ఆరోగ్య బాధ్యతలను చూసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తే కేవలం రూ.150 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. కాన్పుకు రూ.300 ఇమ్యూనైజేషన్‌కు ఒక్కో డోస్‌కు రూ.20, క్షయ రోగికి ఆరు నెలల వరకు వైద్య సేవలు చేస్తే కేవలం రూ.250. అయితే లా ఇచ్చే గౌరవ వేతనం వారికి సరిపోవడంలేదు. రెండేళ్లుగా యూనిఫాం ఇవ్వడంలేదు. ప్రభుత్వం రెండు చీరలకు రూ.500 నుంచి రూ.600 కేటాయిస్తుంటే అధికారులు రూ.250 నుంచి రూ.300లే ఖర్చు చేస్తున్నారు. ప్రజలకు స్థానికంగా ఉంటూ ఇంతగా సేవలను అందిస్తున్నా పనికి తగ్గ వేతనం లభించడంలేదని నిరాశ చెందుతున్నారు. వచ్చే గౌరవ వేతనం తమకు సరిపోవడంలేదని గోడు వెల్లగక్కుతున్నారు. ఇచ్చే గౌరవ వేతనం కూడా మూడు నెలలకోసారి ఇవ్వడంతో పూట గడవడంలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఆశవర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు ఇక్క ప్రభుత్వం ఎందుకు ఇవ్వదని కార్యకర్తలు అడుగుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకు రూ.2వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు ప్రతిపాదనలు జరుగగా వాటిని తదానంతరం వచ్చిన పాలకులు తుంగలో తొక్కారని ఆశవర్కర్లు ఆరోపిస్తున్నారు. 104 శిబిరాల సేవలు కుష్టు రోగులకు సంబంధించిన పారితోషికాలను రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని సమాచారం. -
కొనసాగుతున్న పల్స్ పోలియో
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారుల కోసం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఆదివారం నిర్దేశిత కేంద్రాలలో పోలియో చుక్కలు వేసిన సిబ్బంది సోమవారం ఇంటింటా సర్వే నిర్వహించి మిగిలిన వారికి చుక్కల మందు వేశారు. మంగళవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి. పద్మావతి సిబ్బందిని ఆదేశించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె కొనసాగిస్తుండడంతో ఆశ కార్యకర్తలు, విద్యార్థినులతో దీనిని నిర్వహిస్తున్నారు. అయితే అంగన్వాడీల సమ్మెతో పల్స్‌పోలియో నిర్వహణ వైద్య, ఆరోగ్య శాఖకు ఇబ్బందులు కలిగించింది. కొన్ని ప్రాంతాల్లో చుక్కల మందు వృథా అయిందని తెలిసింది. కొందరు సిబ్బంది ఇంటింటికీ తిరగడంలేదని, ఫలితంగా చుక్కల మందు వ్యర్థమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ మూడు రోజుల్లో జిల్లాలోని 5,71,216 మందికి ఏడు లక్షల డోసులను అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. -
చక్కని జీవితానికి రెండు చుక్కలు
సాక్షి, నల్లగొండ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 3,69,905 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 3,44,950 మంది చిన్నారులకు మొదటి రోజు చుక్కలు వేశారు. అంటే 93.25 శాతం మంది పిల్లలకు చుక్కలు అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు సమ్మెలో కొనసాగుతున్నా ఇంతటి భారీ స్థాయిలో చుక్కలు వేయడం విశేషం. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయనున్నారు. తద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 11,884 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారుల చక్కని జీవితానికి తోడ్పాటునందించారు. పోలియో రహిత సమాజం స్థాపిద్దాం నల్లగొండ టౌన్ : పోలియో రహిత సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలో నిర్వహించిన రెండవ విడత పోలియో చుక్కల కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 5సంవత్సరాలలోపు పిల్లల వరకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఆమోస్, డీఐఓ ఏబీ నరేంద్ర, డెమో తిరుపతయ్య , ఆస్పత్రి సూపరింటెండెంట్ హరినాథ్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియో 92.41శాతం
కడపసిటీ, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 92.41శాతం మందికి పోలియో చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలు 3,17,452 మంది ఉన్నారు. వీరిలో 2,93,358 మందికి చుక్కలు వేశారు. మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో 100.01 శాతం లక్ష్యాలను చేరుకున్నారు. రెండవ విడత మొదటి రోజు 92.41శాతం మందికి పోలియో చుక్కలు వేశారు. నేడు ఇంటింటికి.. : జిల్లాలోని ప్రతి గృహానికి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం సోమవారం చేపడుతున్నారు. వందశాతం పల్స్‌పోలియో నిర్వహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. -
‘పల్స్’ సక్సెస్
సాక్షి, చెన్నై : రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం రాష్ట్రంలో విజయవంతం అయింది. రాష్ర్ట వ్యాప్తంగా 70 లక్షల మంది పిల్లలకు చుక్కల మందు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలకు చుక్కల మందు వేయించుకెళ్లారు. రాజ్ భవన్లో పిల్లలకు గవర్నర్ రోశయ్య చుక్కల మందు వేశారు. పోలియోను తరిమి కొట్టడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. పోలియో బారిన పిల్లలు పడకుండా ప్రతి ఏటా చుక్కలను వేయిస్తూ వస్తున్నారు. తొలి విడతగా జనవరిలోను, మలి విడతగా ఫిబ్రవరిలోను చుక్కలు వేస్తున్నారు. ఆదిశగా తొలి విడత కార్యక్రమాన్ని రాష్ర్టంలో గత నెల విజయవంతం చేశారు. మలి విడతగా ఆదివారం పిల్లలకు చుక్కలు వేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్ వాడీ కేంద్రాలతో పాటుగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వినోద కేంద్రాలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ప్రభుత్వం శిబిరాల్ని ఏర్పాటు చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా 43,550 శిబిరాలను ఏర్పాటు చేశారు. 7.39 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి శిబిరంలోను నలుగురు సిబ్బందిని నియమించారు. సంచారవాసులు, కార్మికుల పిల్లలు, ప్రయాణాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా 1,652 మొబైల్ శిబిరాలు, మరో వెయ్యి బృందాల్ని ఏర్పాటు చేశారు. వీరంతా ఆయా ప్రాంతాల్లోకి ఇంటింటా వెళ్లి చుక్కలు వేశారు. పల్స్ పోలియో విజయవంతానికి రెండు లక్షల మంది సిబ్బంది విధుల్లో నిమగ్నం అయ్యారు. విజయవంతం: తొలి విడత పల్స్ పోలియోలో బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రులు, మలి విడతకు డుమ్మా కొట్టారు. ఇందుకు కారణం తమ అధినేత్రి జయలలిత పుట్టినరోజు ఏర్పాట్లలో బిజీగా ఉండటమే. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులే నేతృత్వం వహించారు. రాజ్ భవన్లో పిల్లలకు గవర్నర్ రోశయ్య చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెన్నైలో 1,325 శిబిరాలు ఏర్పాటు చేయగా, ఐదు లక్షలకు పైగా పిల్లలకు చుక్కల మందు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది పిల్లకు చుక్కలు వేసినట్టుగా ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలు, మెరీనా బీచ్, కోయంబేడు బస్టాండ్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలకు చుక్కలు వేయించుకెళ్లారు. ఎవరైనా పిల్లలకు చుక్కలు వేయించని పక్షంలో సోమ, మంగళవారాల్లో ఇళ్ల వద్దకే వెళ్లి పోలియో డ్రాప్స్ వేయడానికి ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. -
పల్స్ పోలియో పాట్లు
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో నిర్వహణలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పాట్లు తప్పలేదు. మొత్తంమీద 80 శాతం పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. మిగిలిన 20 శాతం మందికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి వేస్తామని అధికారులు చెప్పారు. చివరి నిమిషం వరకూ అంగన్వాడీలు పల్స్ పోలియో విధులు బహిష్కరిస్తున్నట్టు తెలియకపోవడంతో ఒడిదుడుకులు ఎదురైనట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహణకు విద్యార్థినులను వినియోగించారు. అయితే వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలోని 5,17,216 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 3,250 కేంద్రాలను, మరో 112 మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం 7,158 మంది ఆరోగ్య సిబ్బంది, 4,050 మంది అంగన్వాడీలు, 4,289 మంది ఆశ కార్యకర్తలు, ఆరు వేల మంది ఇతర వలంటీర్లను నియమించారు. అయితే సమ్మెలో ఉన్న అంగన్వాడీలు పల్స్ పోలియో విధులను బహిష్కరించడంతో వారి స్థానంలో విద్యార్థినులు, డ్వామా, ఇందిరా క్రాంతి పథం సిబ్బందిని రంగంలోకి దింపారు. పల్స్‌పోలియో నిర్వహణలో అంగన్వాడీలు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో ఆశ కార్యకర్తల సహకారంతో విద్యార్థినులు, డ్వామా, ఐకేపీ సిబ్బందిని ఇంటింటికీ పంపి మిగిలి ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. అవగాహన పెంచుకోవాలి పోలియో వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు సూచించారు. కాకినాడ డెయిరీ ఫారమ్ సెంటర్లోని రాజీవ్ గృహకల్పలో ఆదివారం ఉదయం ఆయన లాంఛనంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యంలో పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధిని తరిమికొట్టడమే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు లేనందున ప్రతి తల్లీ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి. పద్మావతి, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. పవన్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ రవికుమార్ పాల్గొన్నారు. -
చుక్కల మందుకు అంతా సిద్ధం
నేటి నుంచి రెండో విడత పల్స్‌పోలియో మూడు రోజుల పాటు.. 3,31,580 మంది చిన్నారులకు చుక్కలు వేయడం లక్ష్యం జేసీ వెంకటేశ్వర్రావు వెల్లడి నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. శనివా రం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. మూడు రోజుల పాటు వైద్య సిబ్బంది పోలియో చుక్కలను వే స్తారని తెలిపారు. 3,31,580 మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందును వేయడం లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేసేందుకు పట్టణ ప్రాంతాల్లో 247 బూత్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో 1386 బూత్‌లు, ట్రాన్సిట్ బూత్‌లు 77, మొబైల్ బూత్‌లు 1760 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 171 మంది సూపర్వైజర్లు, 7380 మంది వైద్యసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పారు. వైద్యాధికారులు, సూపర్వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. వలస వచ్చిన కుటుంబాలు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో, మారుమూల తండాల్లో, మురికివాడల్లో నివసించే పిల్లలకు పోలియో చుక్కల మందు వేయనున్నట్లు జేసీ పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నగరంలో ర్యాలీ పల్స్‌పోలియో కార్యక్రమం పురస్కరించుకొని శనివారం ఉదయం నగరంలో ర్యాలీ నిర్వహిచారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోవింద్‌వాగ్‌మోరే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి విజయ్‌కుమార్, నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పల్స్ పోలియో ఏర్పాట్లపై సమీక్ష
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి అధికారులు, క్షేత్ర సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జా యింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. జేసీ క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమం సమన్వయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఎక్కువ బాధ్యత వహించాలని తెలిపారు. హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ఇంటింటా తిరిగి పోలి యో చుక్కలు వేయాలని ఆదేశించారు. అంతకు ముందు డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామలదేవి పోలియో చుక్కల కార్యక్రమ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లను జేసీకి వివరించారు. జిల్లాలో అయిదేళ్లలోపు 4,26,213 మంది చిన్నారులను గుర్తించామని తెలిపారు. 14,486 మంది వేక్సినేటర్లు, 367 మంది సూపర్వైజర్లు, 102 మొబైల్ టీమ్ లు ఈ కార్యక్రమంలో పనిచేస్తున్నారని తెలిపారు. 23న ఆదివారం కావడంతో ఆ రోజు పాఠశాలలను తెరిచి ఉంచాలని కోరామని, ఉపాధ్యాయుల సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు. రైల్వేస్టేషన్లు, బస్కాంప్లెక్సులు, జిల్లాలో ఆ రోజు జరిగే జాతర, సంతల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఈఓ లింగేశ్వరరెడ్డి, జీవీఎంసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీమోహన్, వైద్య ఆరోగ్య శాఖ ఆర్డీ డాక్టర్ సోమరాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వసుంధర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి, ఆర్టీసీ అధికారి కె.వి.వి.ప్రసాద్ పాల్గొన్నారు. విదేశాలకు వెళ్లి వచ్చేవారికి ప్రత్యేక వ్యాక్సీన్లు విశాఖపట్నం : విదేశాలకు తరచుగా రాకపోకలు సాగించే ప్రయాణికుల పిల్లలకు ప్రత్యేక పోలియో వ్యాక్సీన్‌ను తప్పని సరిగా వేయించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా, సోమాలియా, కెన్యా, సిరియా, ఇథియోపియా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించారు. పెదవాల్తేరులోని పోలమాంబ గుడి ఎదురుగా ఉన్న జిల్లా కోల్డ్ ఛైన్ కాంప్లెక్స్‌లో ఈ కేంద్రం ఉంటుందన్నారు. -
పల్స్ పోలియో విజయవంతం
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, చిన్నారులకు నూరు శాతం పోలియో చుక్కలు అందించినట్టు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్, జిల్లా నోడల్ అధికారి లోక్‌నాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పల్స్‌పోలియో, ఆస్పత్రుల అభివృద్ధి వైద్యులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌నాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తాను మూడు రోజులుగా విస్తృతంగా పర్యటించి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించానన్నారు. జిల్లాలోని 4.26 లక్షల మందికి పైగా ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు అందించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2563 పల్స్‌పోలియో కేంద్రాలతో పాటు వంద మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదివారం 95 శాతం పోలియో చుక్కలు పూర్తి చేశామని, సోమ, మంగళవారాల్లో మిగతా శాతాన్ని ఇంటింటికి తిరిగి పూర్తిచేశామన్నారు. ఇందుకు 10,900 మంది సిబ్బందిని వినియోగించుకున్నామన్నారు. గుంటూరు నగరంలో బుధవారం కూడా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి నిర్వహిస్తామన్నారు. గుంటూరు నగరంలో నేడు కూడా పల్స్‌పోలియో... కార్పొరేషన్ పరిధిలో పూర్తి స్థాయిలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు మరొక రోజు అదనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని వివిధ వైద్యశాలల అభివృద్ధితో పాటు ఆయా వైద్యశాలలో సేవల వినియోగంపై మాచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల క్లస్టర్ ఏరియా అధికారి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఈఎస్ఐ వైద్యుడు కె.రామకోటయ్యలను అడిగి తెలుసుకున్నారు. -
95 శాతం పల్స్‌పోలియో నమోదు
చింతలపూడి, న్యూస్‌లైన్ : పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఒక్కరోజులోనే 94.85 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు డీఎంహెచ్‌వో టి.శకుంతల వెల్లడించారు. ఆదివారం చింతలపూడిలోని పలు పోలియో కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 3,84,386 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా ఇప్పటికే 3,64,669 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు చెప్పారు. 2,941 రూట్లలో 290 మంది సూపర్ వైజర్లు, 12,222 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. సోమ మంగళ వారాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి కేంద్రాలకు రాని పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేసి నూరుశాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతున్నట్లు డీఎంహెచ్‌వో చెప్పారు. త్వరలో డాక్టర్ పోస్టులు భర్తీ రెండు నెలల్లో జిల్లాలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. జిల్లాలో 152 డాక్టర్ పోస్టులకు 65 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఇటీవల కలెక్టర్ 19 పోస్టులు భర్తీ చేయగా వారిలో కేవలం 5 గురు మాత్రమే విధుల్లో చేరారని, విధుల్లో చేరని డాక్టర్లను కలెక్టర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని తెలిపారు. ఆరు నెలల్లో యర్రగుంటపల్లి పీహెచ్సీ భవనం పూర్తి అవుతుందన్నారు. మార్టేరు తుందుర్రు, దొమ్మేరు భవనాలు పూర్తి కావచ్చాయని చెప్పారు. గుడివాడలంక, జీలుగుమిల్లి, సిధ్ధాంతం, కామయ్యపాలెం పీహెచ్సీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఆమె వెంట రాఘవాపురం పీహెచ్సీ వైద్యాధికారి డా.డీఎల్ సురేష్, హెల్త్ సూపర్వైజర్ ఎస్కే అబ్రార్ హుస్సేన్, ఎంపీహెచ్‌ఈవో వెంకన్నబాబు పాల్గొన్నారు. పోలియో మహమ్మారిని తరిమికొడదాం : కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమికొడదామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక వన్‌టౌన్ ఆముదాల అప్పలస్వామి కాలనీలోని అర్బన్ ెహ ల్త్ సెంటర్లో కలెక్టర్ చిన్నారులకు చుక్కల మందు వేసి పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగా ఎందరో చిన్నారులు పోలియో బారిన పడి విలువైన తమ జీవితాలను కోల్పోతున్నారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.టి.శకుంతల, నగరపాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు, ఎంహెచ్వో డా.కె.సురేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
పల్స్‌పోలియో కేంద్రం మార్పుపై వివాదం
పాలవలస (సరుబుజ్జిలి), న్యూస్‌లైన్ : పల్స్‌పోలియో కేంద్రం మార్పు వివాదాస్ప దమైంది. చివరకు అధికారులు గతంలో నిర్వహించిన చోటే తిరిగి ఏర్పాటు చేసి పిల్లలకు చుక్కల మందు వేయడంతో వివాదం ముగింది. దీనికి దారితీసిన కారణాలిలా ఉన్నాయి. పాలవలస కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆలవరణలో కొన్నెళ్లుగా పల్స్‌పోలి యో కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేసేవారు. అయితే ఆదివారం నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఈసారి సుమారు కిలోమీటరున్నర దూరంలోగల పాలవలస గ్రామానికి తరలించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేశారు. దీన్ని గ్రహించిన కాలనీ వాసులు వైద్య సిబ్బందిని అడ్డుకున్నారు. కేంద్రం ఎందుకు మార్పు చేశారని నిలదీశారు. దీంతో సిబ్బందికి, కాలనీ వాసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చేసుకుంది. పిల్లలను తీసుకొని దూరంగా ఉన్న పాలవలస గ్రామానికి ఎలా వెళ్లగలమని మహిళలు వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. ఈలోగా సీనియర్ డాక్టర్ బి.వి.ఎస్.ప్రకాశరావు అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. కాలనీలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు చుక్కల మందు వేయడంతో ప్రజలు శాంతించారు. -
97.2 శాతం మందికి పోలియో వ్యాక్సిన్
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యంలో 97.2 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్ వేశామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.గీతాంజలి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జగన్నాథరావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 2,40,823 మంది ఉండగా వీరిలో 2,34,111 మందికి పోలియో మందు వేశారని వివరించారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న మాఫింగ్ కార్యక్రమంలో మిగిలినవారికి వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి పిల్లలకు వ్యాక్సిన్ వేసి లక్ష్యం సాధించటానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అప్రమత్తత అవసరం : కలెక్టర్ సౌరభ్‌గౌర్ దేశంలో పోలియో మహమ్మారిని ఇప్పటికే నిర్మూలించగలిగామని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని సంతోషిమాత ఆలయం వద్ద చిన్నారులకు పోలియో మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించటం ద్వారా వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని అన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహనతోనే పోలియో నిర్మూలన సాధ్యమైందని చెప్పారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కూడా ఇదే చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ జిల్లాను ఆదర్శప్రాయంగా నిలబెట్టాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 1606 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశామన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.గీతాంజలి మాట్లాడుతూ జిల్లాలోని 2,40,823 మంది చిన్నారులకు 7,712 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేయిస్తున్నామని చెప్పారు. ఆదివారం వ్యాక్సిన్ వేసుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సామాజిక కార్యకర్త మంత్రి వెంకటస్వామి పల్స్‌పోలియోపై రూపొందించిన కోటు ధరించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.జగన్నాథరావు, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యురాలు ఆర్.సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
‘పల్స్’ సక్సెస్
సాక్షి, చెన్నై: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతం అయింది. 70లక్షల మంది పిల్లలకు ఆదివారం చుక్కల మందు వేశారు. మంత్రులు తమ జిల్లాల్లో పిల్లలకు చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. ప్రతి ఏటా పోలియో చుక్కల్ని వేస్తున్నారు. తొలి విడతగా జనవరిలోను, మలి విడతగా ఫిబ్రవరిలోను చుక్కల మందు వేస్తున్నారు. ఆ దిశగా తొలి విడత కార్యక్రమాన్ని రాష్ర్టంలో విజయవంతం చేయడం లక్ష్యంగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటుగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వినోద కేంద్రాలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో శిబిరాల్ని ఏర్పాటు చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా 43,501 శిబిరాల్ని ఏర్పాటు చేశారు. 70.39 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి శిబిరంలోను నలుగురు సిబ్బందిని నియమించారు. సంచార వాసులు, కార్మికుల పిల్లలు, ప్రయాణాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా మొైబె ల్ శిబిరాలని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,652 మొబైల్ శిబిరాలను, మరో వెయ్యి బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో, ఇంటింటా వెళ్లి చుక్కలు వేశారు. పల్స్ పోలియో విజయవంతానికి రెండు లక్షల మంది సిబ్బంది విధుల్లో నిమగ్నం అయ్యారు. విజయవంతం: తొలి విడత పల్స్ పోలియోను ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు ప్రారంభించారు. తాంబరంలో మంత్రి టీకేఎం చిన్నయ్య, తిరువణ్ణామలైలో ఎం సుబ్రమణ్యం, ధర్మపురిలో మంత్రి పళనియప్పన్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ పిల్లలకు చుక్కలు వేసి పల్స్ పోలియోను ప్రారంభించారు. చెన్నై కొళత్తూరులో ఏర్పాటు చేసిన శిబిరంలో మేయర్ సైదై దురైస్వామి పిల్లలకు చుక్కలు వేశారు. చెన్నైలో 1325 శిబిరాలు ఏర్పాటు చేయగా, ఐదు లక్షలకు పైగా పిల్లలకు చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేసినట్టుగా ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలు, మెరీనా బీచ్, కోయంబేడు బస్టాండ్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో తమ పిల్లలకు తల్లిదండ్రులు చుక్కలు వేయించారు. మలి విడతగా ఫిబ్రవరి 23న పోలియో చుక్కలు వేయనున్నారు. -
ఆరు లక్షల మందికి పల్స్‌పోలియో
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఆరు లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యశాఖ మంత్రి కేసీ వీరమణి తెలిపారు. వేలూరు జిల్లా ఆంబూరు ప్రభుత్వ ఆస్పతిలో కలెక్టర్ నందగోపాల్ అధ్యక్షతన మంత్రి కేసీ వీరమణి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల 73,971 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరికి పోలియో చుక్కలు వేసేందుకుగాను 2216వ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 9,157 మంది సిబ్బంది, 305 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఆదివారం చుక్కలు వేసుకోని చిన్నారుల కోసం వైద్య సిబ్బందిచే మూడు రోజుల పాటు ఇంటింటికి వెల్లి చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అస్లాంబాషా, మున్సిపల్ చైర్మన్ సంగీత పాల్గొన్నారు. అలాగే వేలూరు పెడ్‌లాండ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ విజయ్, మేయర్ కార్తియాయిని పోలియో చుక్కలను వేశారు. వీరితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో జిల్లాలో రెండు లక్షల 28,069 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు కలెక్టర్ జ్ఞానశేఖరన్ తెలిపారు. ఇందుకోసం 1,885 పోలియో కేంద్రాలు, 866 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో పల్స్ పోలియో చుక్కలను కలెక్టర్ ప్రారంభించారు. అలాగే సెయ్యారు ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి ముక్కూరు సుబ్రమణియన్ పల్స్ పోలియోను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధి కారులు పాల్గొన్నారు. -
పోలియో రహిత సమాజానికి కృషి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియోచుక్కలు వేయించి పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్(ఏపీవీవీపీ) జాయింట్ కమిషనర్ డాక్టర్ లోక్‌నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్యకేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క చిన్నారినీ వదలిపెట్టకుండా అందిరికీ పోలియోచుక్కలు వేసేలా చూడాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మీరావత్ గోపీనాయక్ మాట్లాడుతూ తొలిరోజు పోలియో చుక్కల కేంద్రాల్లో నిర్దేశించిన పనివేళల్లో వైద్య సిబ్బంది అందరూ విధుల్లో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మీరావత్ గోపీనాయక్ ఆదేశించారు. మూడు రోజులు ఇంటింటికి తిరిగి చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలన్నారు. ఎక్కడైనా రియాక్షన్ వస్తే తక్షణమే జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 4,26,419 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానిని నూరుశాతం సాధించేలా ప్రణాళికా బద్ధంగా వైద్యసిబ్బంది పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్ గుంటూరుసిటీ: జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.సురే శ్‌కుమార్ తెలిపారు. ఆదివార స్థానిక కృష్ణబాబు కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు ఆయన పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా నిలిపేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకోసం దాదాపు 2,500 కేంద్రాలు, పదివేల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు కె.ఎస్ లక్షణరావు, డీఎంహెచ్‌వో గోపీనాయక్, మెప్మా పీడీ కృష్ణకపర్థి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.. ఏటీఅగ్రహారం(గుంటూరు): పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు చిన్నారుల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఎస్పీలు జెట్టి గోపినాథ్, జె.సత్యనారాయణ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు క్లీనిక్‌లో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులందరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కిషన్‌కుమార్, అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జానకీ ధరావత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పల్స్‌పోలియోకు సర్వం సిద్ధం
చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరగనున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ అడిషినల్ డెరైక్టర్ తారాచంద్నాయుడు తెలిపారు. ఆయన శనివారం చిత్తూరులోని డీఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 4,48,997 మందికి పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2,854 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 285 మందిని రూట్ ఆఫీసర్లుగా నియమించామని వివరించారు. ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలియో చుక్కలు వేరుుస్తామన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు, ఈ నెల 20, 21వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామన్నారు. విద్య, రవాణ, పరిశ్రమలు, పురపాలక, పంచాయతీ, ఐసీడీఎస్, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, సమాచారశాఖ సహకారంతో పల్స్ పోలి యోను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ దశరథరామయ్య, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ భారతీరెడ్డి, డీఐవో డాక్టర్ సురేఖ, డెమో లక్ష్మీ, డెప్యూటీ డెమో ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పల్స్‌పోలియో
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: చిన్నారులు పోలియో బారిన పడకుండా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమ విజయవంతానికి అందరూ కృషిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ పిలుపునిచ్చారు. ఆ శాఖ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో పల్స్‌పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి సుబేదారుపేట, గాంధీబొమ్మ మీదుగా వీఆర్సీ సెంటర్ వరకు సాగిన ర్యాలీ ని మొదట డీఎంహెచ్ఓ ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క చిన్నారి పోలియో వ్యాధి బారినపడకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జయసింహ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం అందరి సహకారం అవసరమన్నారు. ఆది,సోమ, మంగళవారాల్లో వాడవాడలా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ (ఎయిడ్స్,లెప్రసీ) డాక్టర్ పద్మావతి, ఎన్సీడీ నోడల్ అధికారి డాక్టర్ రవీంద్రారెడ్డి, డీపీహెచ్ఎన్ఓ సుగుణ, డెమో ఇన్చార్జి సుధామణి, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ వెంకటరమణ, సీడీపీఓ ప్రభావతి పాల్గొన్నారు. -
రెండు చుక్కలే శ్రీరామరక్ష
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలే శ్రీరామరక్షలా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు పోలియో వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్‌పోలియోపై అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19 నుంచి 21 వరకూ జరిగే పల్స్‌పోలియోను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. 19న బూత్‌స్థాయిలో, 20,21 తేదీల్లో ఇంటింటికీ తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థన స్థలాలు, పార్కులు, జన సంచారం ఉన్న అన్ని ప్రదేశాల్లో పోలియో చుక్కలు వేసేలా చూస్తున్నామన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు సుమారు 4.37 లక్షల మంది ఉన్నారని, వీరికి 3849 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తామని వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంచార జాతులు, వలస కుటుంబాలు, మురికివాడలు, శివారు ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా పోలియో వ్యాక్సిన్ అందేలా చూడాలని సిబ్బం దిని ఆదేశించారు. పల్స్ పోలియోను విజయవంతం చేస్తామని అందరితోప్రతిజ్ఞ చేయించా రు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ రామసుబ్బారావు, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, డీఐఓ డేవిడ్ దామోదరం, నారాయణస్వామి, నగర పాలక సంస్థ కమిషనర్ రంగయ్య, డాక్టర్ అక్బర్ సాహెబ్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పెరుమాళ్ పాల్గొన్నారు. -
రెండు చుక్కలు..
కడపరూరల్, న్యూస్‌లైన్: పల్స్‌పోలియో టీకాల మందు కార్యక్రమం ఆదివారం జిల్లాలో ప్రారంభం కానుంది. అందుకోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. 0-5 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లల ఆరోగ్యానికి పల్స్‌పోలియో చుక్కల మందును తప్పక వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు. జిల్లాలో 3.17 లక్షల మంది చిన్నారులకు ఆదవారం ప్రారంభం కానున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో 0-5 సంవత్సరాల వయస్సుగల పిల్లలు జిల్లా వ్యాప్తంగా 3.17 లక్షల మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం స్థానిక పల్స్‌పోలియో కేంద్రాలతోపాటు రైల్వేస్టేషన్, బస్టాండు, మొబైల్ వాహనాలను కలుపుకుని మొత్తం 3054 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒక బూత్‌కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 12,216 మందిని కేటాయించారు. ప్రస్తుతం ఆదివారం పల్స్‌పోలియో కేంద్రాల్లో చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ఈరోజు ఎవరైనా మందును వేయించుకోని పక్షంలో సోమ, మంగళ వారాల్లో సిబ్బంది ఇంటింటికి వచ్చి మందును వేస్తారు. వ్యాధుల నిరోధానికి ప్రధానంగా ధనుర్వాతం, కామెర్లు, కోరింత, కంఠసర్పి, క్షయ, పోలియో నివారణ కోసం చుక్కల మందు ఉపయోగపడనుంది. క్రమం తప్పకుండా చుక్కల మందును వేయించడం వల్ల పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు రక్షణగా నిలబడనుంది. ఆ మేరకు నిర్మాణరంగం, ఇటుకబట్టీలు, సంచార జాతులు, మురికివాడల్లో ఉన్న చిన్నారుల సంఖ్యను అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధం చేయడం విశేషం. పోలియో కేసులకు సంబంధించి 2003 అక్టోబరులో కడప నగరం రవీంద్రనగర్‌లో ఒక కేసు మాత్రమే నమోదైంది. అన్ని చర్యలు చేపట్టాం! పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని చర్యలు చేపట్టాము. తల్లిదండ్రులు 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కల మందును వేయించాలి. - డాక్టర్ ప్రభుదాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
పల్స్ పోలియోను విజయవంతం చేయండి
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 19 నుంచి మూడు విడతల్లో నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ) రామసుబ్బారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 5.80 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్ల నుంచి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా పోలియో తగ్గుముఖం పట్టిందన్నారు. దేశంలో 2007లో 877, 2008లో 559 కేసులు నమోదయ్యాయన్నారు. ఆ తర్వాత 2011లో ఒక కేసు మాత్రమే నమోదైనట్లు వివరించారు. జిల్లాలో 2003లో 8 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆ తర్వాత ఒక్క కేసు కూడా రాలేదన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ప్రతియేటా పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుట్టినబిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలన్నారు. ఈసారి జిల్లాలో వంద శాతం పిల్లలకు పోలియోచుక్కలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 3849 బూత్‌లతో పాటు 115 మొబైల్, 18 రాపిడ్ యాక్షన్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. వలస వెళ్లేవారు, యాచకులు, కార్మికులు, మురికివాడలలో నివసించే వారి పిల్లలకు చుక్కలు వేయించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా పోలియో బూత్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.సమావేశంలో వైద్యాధికారులు సాయిప్రతాప్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
19న పల్స్‌పోలియో
చిలుకూరు, న్యూస్‌లైన్: దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ పల్స్‌పోలియోను 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో వ్యాధి సోకకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు విడతలుగా పోలియో చుక్కలు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు జిల్లాలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయిలో 5ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. అలాగే కేంద్రంలో పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 20,21 తేదీలలో ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 5ఏళ్ల లోపు 3,69,905 మంది పిల్లలను గుర్తించారు. 100 శాతం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాకు 5లక్షల వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి. వీటిని రెండు రోజుల్లో మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. అదనంగా 33 కేంద్రాల ఏర్పాటు ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 3004 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 2971 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఏడాది మరో 33 కేంద్రాలను అదనంగా పెంచారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు ,స్వచ్చంద్ర సేవా సంస్థలు వారు, ఉపాధ్యాయులు మొత్తం 11,884మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారి, జిల్లా అధికారులతో 6 జిల్లా కోర్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీరు ఆ రోజు కేంద్రాలను పరిశీలిస్తారు. వీరితో పాటు జిల్లాలోని 15 క్లస్టర్ల పరిధిలో ఆయా ఎస్పీహెచ్ఓ(ప్రత్యేక వైధ్యాదికారులు)లు పరిశీలిస్తారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల్లో వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయంవంతం చేసేందుకు ఏర్పాటు చేశారు. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : అమోస్, జిల్లా వైద్యాదికారి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలి. ఇప్పటికే పల్స్‌పోలియోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 5 ఏళ్ల లోపు పిల్లలు 3,69,905 మంది ఉన్నట్లుగా గుర్తించాం. వారికి పోలియో చుక్కలు వేసేందుకు సుమారుగా 12 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. పిల్లల తల్లిదండ్రులు బాద్యతగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలి. -
పల్స్‌పోలియో వందశాతం చేయూలి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వంద శాతం చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ వీరరాఘవరావు వైద్యులకు సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జనవరి19న పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందులో భాగంగా తిరువళ్లూరు జిల్లాలోని డెప్యూటీ డెరైక్టర్లు, ప్రభుత్వ వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వీరరాఘవరావు మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా జనవరి 15 నాటికి ఐదేళ్ల లోపు 2,70,795 మంది వున్నట్టు కలెక్టర్ వివరించారు. వీరందరికీ పోలియో చుక్కలను వేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా జనసంచార ప్రాంతాలతో పాటు రైల్వేస్టేషన్, బస్సుస్టేషన్, మార్కెట్, పాఠశాలల వద్ద పోలియో చుక్కలు వేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పోలియో చుక్కలు వేసే సమయంలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. పోలియో చుక్కలు వేసే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. -
ఈ నెల 19 నుంచి పల్స్ పోలియో
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 19న జాతీయ పల్స్ పోలియో దినంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమావేశంలో పేర్కొన్నారు. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. వంద శాతం చుక్కల మందు వేయాలన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో ఇంటింటికి వెళ్లి పిల్లల వివరాలు సేకరించి చుక్కల మందులు వేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు సూచించారు. ఇందుకోసం 5.40 లక్షల వ్యాక్సిన్లు జిల్లాకు అందాయని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు జిల్లాలో 3,62,523 ఉన్నారని అంచనా వేశామన్నారు. చక్కుల మందులకు సంబంధించిన గ్రామాల్లో పది రోజుల ముందుగానే బ్యానర్లు, పోస్టర్లు అతికించాలన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, వంద శాతం పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఎంహెచ్‌వో మేకల స్వామి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.