సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు చుక్కల మందు వేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని, పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల వేసేందుకు కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అలాగే చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని అంగన్‌వాడి కేంద్రంలో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని హుబ్లీలో చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర‍్భంగా పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment