Pulse Polio vaccine
-
సలాం జ్ఞానేశ్వరి..అడవిలోకి 10 కి.మీ నడిచి మరీ..
మహాముత్తారం: ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రహదారి లేదు. కాలినడకన వెళ్లడం కూడా కష్టమే. కారడివిలో ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు. అయినా ఇవేమీ ఆమె విధి నిర్వహణకు అడ్డంకి కాలేదు. ఓ మహిళా ఏఎన్ఎం కాలినడకన పది కిలోమీటర్లు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసి శ్రమ కన్నా విధులే మిన్న అని నిరూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రేగులగూడెంలో రెండో ఏఎన్ఎంగా జ్ఞానేశ్వరి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా, మిగిలిన పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసేందుకు మంగళవారం జ్ఞానేశ్వరికి విధులు అప్పగించారు. ఈ మేరకు మద్దిమడుగు ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా, భర్తసహా ఎవరూ అందుబాటులో లేరు. దీంతో ఆమె ఒక్కరే కాలినడకన మద్దిమడుగు వెళ్లి అక్కడ మిగిలిపోయిన 35 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆలోగా పని ముగించుకుని వచ్చిన భర్త ఆమెను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరిని వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులు అభినందించారు. -
పల్స్ పోలియో విజయవంతం
-
పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం జగన్
-
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం జగన్
-
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు చుక్కల మందు వేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని, పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల వేసేందుకు కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని హుబ్లీలో చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు. -
రేపే పల్స్ పోలియో..
సాక్షి, ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఈనెల 10వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిబాయి పిలుపునిచ్చారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 0–5 ఏళ్లలోపు 1,27,887 మంది పిల్లలను గుర్తించామని, వారందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయిస్తామన్నారు. అందుకోసం 8,500 వయల్స్‌ను సిద్ధం చేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 123, పట్టణ ప్రాంతాల్లో› 105, గ్రామీణ ప్రాంతాల్లో 672 పోలియో చుక్కలు వేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు 3,600 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. మైగ్రేటెడ్ ప్రజల కోసం ఆయా ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మురికి వాడల్లో పిల్లల కోసం సంచార వాహనాల ద్వారా పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 11, 12వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి మిగిలిన పిల్లలను గుర్తించి.. వారికి చుక్కలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. ప్రయాణంలో ఉన్న వారి కోసం బస్, రైల్వే స్టేషన్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామని, అలాగే నిర్మాణ స్థలాల్లో తాత్కాలికంగా నివసించే వారి కొరకు సంచార బృందాలను సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు, యువజన, మహిళా సంఘాలు సహకారం అందించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మాలతి, డీఐఓ అలివేలు, డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. -
రేపటి నుంచి పోలియో వ్యాక్సిన్
♦ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాం ♦ క్రమబద్ధీకరణకు ఇదే ఆఖరి అవకాశం ♦ హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 20 నుంచి 26 వరకు హైదరాబాద్ జిల్లాలోని 11 క్లస్టర్లు, రంగారెడ్డి జిల్లాలోని 12 పీహెచ్‌సీల పరిధిలో పల్స్‌పోలియో వ్యాక్సిన్ (ఇనక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్) వేయనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శనివారం రంగారెడ్డి కలెక్టరేట్లో క లెక్టర్ ఎం.రఘునందన్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 6 వారాల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. నగరంలోని అంబర్పేట్ నాలా ప్రాంతంలో ఇటీవల గుర్తించిన పోలియో వైరస్ కారణంగా టీకాలు వేయాల్సిన చిన్నారుల సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో దాదాపు 2.5 లక్షల చిన్నారులను ఈ సర్వేలో గుర్తించినట్లు రాహుల్ బొజ్జా చెప్పారు. నాలా సంబంధిత ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలియో వ్యాక్సిన్ ఇంజక్షన్‌పై అపోహలు అవసరం లేదని, భయపడొద్దని తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుకై.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు 10వ తరగతి ఫలితాల్లో చివరి స్థానాల్లో నిలుస్తున్నాయని, దీనికి పలు కారణాలున్నట్లు కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రూపొం దించిందన్నారు. ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను అధిక సంఖ్యలో చేర్పించటమే లక్ష్యంగా కొనసాగిందన్నారు. ప్రభుత్వం మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, హాస్టల్ వసతి అందించడమే లక్ష్యంతో హైదరాబాద్‌లో 7, రంగారెడ్డిలో 9 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మాదిరిగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉత్తమ విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణకు లాస్ట్ ఛాన్స్.. పట్టణ భూగరిష్ట చట్టం కింద మిగులు భూములను జూన్ 25 లోగా క్రమబద్దీకరించుకోవాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్నారు. క్రమబద్ధీకరించుకోని భూములను స్వాదీనం చేసుకుంటామని హెచ్చరించారు. జీవో 58, 59 కింద అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు డ్రైవ్ చేపట్టినప్పటికీ ఆశించిన రీతిలో ప్రజలు ముందుకురాలేదన్నారు. ఇందుకు అవగాహన లోపమే కారణమని గుర్తించిన తాము యూఎల్సీ ఖాళీ మిగులు భూముల క్రమబద్దీకరణకు విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి వారికి నోటీసులను అంద జేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ వల్ల యజమానులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని, భూహక్కుతో పాటూ కచ్చితమైన విలువ పొందొచ్చన్నారు. క్రయ విక్రయాలు కూడా జరుపుకునే అవకాశముందని చెప్పారు. ఈ సమావేశ ంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ షైనీ, యూఎల్సీ ప్రత్యేక అధికారి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఆర్ఓ సత్తయ్య పాల్గొన్నారు.