పద్మ అవార్డులపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు | Bandi Sanjay Sensational Comments On Padma Awards Gaddar Row, More Details Inside | Sakshi
Sakshi News home page

బరాబర్‌ ఇవ్వం.. గద్దర్‌కు పద్మ అవార్డుపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు

Published Mon, Jan 27 2025 1:08 PM | Last Updated on Mon, Jan 27 2025 3:59 PM

Bandi Sanjay Sensational Comments On Padma Awards Gaddar Row

హైదరాబాద్‌, సాక్షి: పద్మ పురస్కారాలపై వివాదం నెలకొన్న వేళ.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకే మాత్రమే ఇస్తుందని అన్నారు. ఈ క్రమంలో గద్దర్‌(Gaddar)కు అవార్డు రాకపోవడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. 

పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆరోపణలకు దిగారు. ఈ ఆరోపణలకు బండి సంజయ్‌ కౌంటర్‌గా స్పందించారు. ‘‘పద్మ అవార్డులు(Padma Awards Row) స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్‌కు ఎలా ఇస్తాం? ఆయన భావజాలం ఏంటి?. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం?. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం?. బరాబర్‌ ఇవ్వం’’.. అని అన్నారాయన. 

పద్మ అవార్డుల జాబితాలో అర్హులకే అవార్డు లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. 

మాకు భేషజాలు లేవు
తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana) అభివృద్ధికి సహకరిస్తుంది. తెలంగాణకు కేంద్రం గత పదకొండేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేది లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.. ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. 

అర్హులకే పద్మ అవార్డులు వచ్చాయి: బండి సంజయ్

కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది..  రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. పేదలకు ఇడ్లు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.. కేవలం పేరు కోసమే పాకులాడుతోంది. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే పథకాలను అమలు చేయడం ఎంటి ?. మండలంలో మిగతా గ్రామాల పరిస్థితి ఎంటి ?. 

ప్రభుత్వం దగ్గర పైసలు లేవు.. ఉన్న పైసలు ఢిల్లీ లో కప్పం కట్టడానికే సరిపోతోంది. తెలంగాణలో 14 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాకు బేషజాలు లేవు.. కి కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా ?. పేరు కోసం పాకులాడి గతంలో కేసీఆర్‌ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. 2 లక్షల 40 వేల ఇళ్లను కేంద్రం తెలంగాణకు కేటాయిస్తే.. పేరు కోసం లబ్ధిదారులకు ఇవ్వలేదు. తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని బండి సంజయ్‌ అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్
బండి సంజయ్ వాఖ్యలు ఈ మధ్య విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇంధిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. బండి వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానించేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా?. నక్సలైట్ భావాజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. నక్సలైట్‌లకు ఎంపీ ,ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వొచ్చు కాని అవార్డులకు పనికి రారా?. లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. ఈటల ఆ పదవికి అనర్హుడా?. దీనికి బండి సంజయ్ చెప్పాలి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డు ల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అని ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement