గుంటూరు,సాక్షి: రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయించిన వాటిని రద్దు చెయ్యమని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాయడం దుర్మార్గమని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారామె.
‘‘ వైఎస్ జగన్ చేసిన మంచి ప్రజల్లో చర్చ జరుగుతుందని ఏకంగా ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం. చంద్రబాబు తన పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురాలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం.
..వైఎస్ జగన్‌పై ఉన్న ఈర్ష్య, ద్వేషంతో సీఎం చంద్రబాబు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేయాలనుకోవడం, ప్రతిభ గల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనుకోవడం అన్యాయం. రాష్ట్రంలో జగన్ పాలనలో నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాలలు అన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా’’ అని అన్నారామె.
జగన్మోహన్ రెడ్డి గారి మంచి ప్రజల్లో చర్చ జరుగుతుందని ఏకంగా ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం..!!
రాష్ట్రంలో @ysjagan ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం. పులివెందుల మెడికల్ కళాశాలకు… pic.twitter.com/VIMqz4tZDD— Roja Selvamani (@RojaSelvamaniRK) September 15, 2024
చదవండి: మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం: గోపిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment