తిరుపతి, సాక్షి: ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. టీడీపీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా షర్మిల చేసిన వితండ వాదనను మాజీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
షర్మిల చేస్తున్న రాజకీయాలు, వాదనలు, ఎత్తుగడలు, విమర్శలు.. అన్నింటిని లక్ష్యం ఒక్కటేనని, కానీ, ఎట్టి పరిస్థితుల్లో జరగదని అన్నారామె. అలాగే.. జగన్ రాజకీయ పతనం గురించి ఎవరు ఎంత కోరుకున్నా.. ప్రజలు మాత్రం ఆయనకు అండగా ఉంటారని రోజా చెప్పారు. ఈ క్రమంలో.. సెకి ఒప్పందం గురించి వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశం తాలుకా సారాంశాన్ని రోజా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
@realyssharmila గారూ.. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న గారు రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్…
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 29, 2024
సెకితో ఒప్పందం గురించి టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న రాద్ధాంతం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆ ఒప్పందం గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. అంతేకాదు.. క్షమాపణలు చెప్పని తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment