హైదరాబాద్, సాక్షి: నగరంలో విదేశీ గంజాయి(Foreign Ganja) కలకలం రేగింది. అమెరికా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి మరీ అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఐటీ ఎంప్లాయిస్‌ను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి వీటిని సరఫరా చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గచ్చిబౌలి(Gachibowli)లో ఆదివారం రాత్రి ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయితో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శివరామ్‌గా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్‌గా తెలుస్తోంది.
నిందితుల నుంచి గంజాయితో పాటు బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 170గ్రా. ఫారిన్ గంజాయితో పాటు కేజీ లోకల్ గంజాయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాలిపోర్నియా నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు సీన, రాజకీయ ప్రముఖులకు కూడా ఫారిన్ గంజాయి విక్రయించి ఉంటారనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడ్డ నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment