ganja caught
-
HYD: సినిమావాళ్లకు ఫారిన్ గంజాయి సరఫరా!
హైదరాబాద్, సాక్షి: నగరంలో విదేశీ గంజాయి(Foreign Ganja) కలకలం రేగింది. అమెరికా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి మరీ అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఐటీ ఎంప్లాయిస్ను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి వీటిని సరఫరా చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గచ్చిబౌలి(Gachibowli)లో ఆదివారం రాత్రి ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయితో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శివరామ్‌గా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్‌గా తెలుస్తోంది.నిందితుల నుంచి గంజాయితో పాటు బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 170గ్రా. ఫారిన్ గంజాయితో పాటు కేజీ లోకల్ గంజాయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాలిపోర్నియా నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు సీన, రాజకీయ ప్రముఖులకు కూడా ఫారిన్ గంజాయి విక్రయించి ఉంటారనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడ్డ నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. -
గంజాయి కేసుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలే వస్తున్నారు: అయ్యన్న
సాక్షి, అనకాపల్లి: ఏపీలో గంజాయి రవాణాపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గంజాయి రవాణా పెరిగింది. గంజాయి సంబంధిత కేసుల నుంచి తమను తప్పించాలని టీడీపీకి చెందిన నేతలే తన వద్దకు వస్తున్నారని అన్నారు. చిన్న పిల్లలు సైతం గంజాయి సేవిస్తున్నారని చెప్పుకొచ్చారు.ఏపీలో గంజాయి అమ్మకం, రవాణాను స్పీకర్ అయ్యన్నపాత్రుడు కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వైఫల్య పాలనను ఆయన చెప్పకనే చెప్పేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా సప్లై అవుతోంది. గంజాయి కేసుల నుంచి తప్పించమని కొంతమంది మా దగ్గరికి వస్తున్నారు. మా పార్టీకి చెందిన వారు కూడా నా వద్దకు వస్తున్నారు. వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదు.విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్లే సమయంలో ఎంతోమంది గంజాయి సేవిస్తూ కనిపిస్తున్నారు. చిన్న పిల్లల సైతం మదాలు దగ్గర కూర్చొని గంజాయిని తాగుతున్నారు. గంజాయి తాగవద్దని చెప్పిన ఒక పెద్దాయనను నర్సీపట్నంలో చితకబాదారు. గంజాయిని రాష్ట్రంలో రూపుమాపకపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. రాష్ట్రంలో గంజాయి పరిస్థితిని వివరించారు. -
హోంమంత్రి అనిత ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి సాగు
-
ఆదిలాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
-
గంజాయి సీజ్: సినిమాటిక్ రేంజ్ లో మత్తుపదార్థాలు రవాణా
-
విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్
విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్‌కు ఆర్టీసీబస్సు డ్రైవర్ పి.గణపతి సోమ వారం అప్పగించారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో రామభద్రాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. పెదమానాపురం వద్దకు వచ్చేసరికి బస్సులో ఎంత మంది ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది లెక్కిస్తున్న సమయంలో వారు టిక్కెట్లు తీయలేదని గమనించి నిలదీశారు. వారు వెంటనే బస్సుదిగి పారిపోయారు. ప్రయాణికులతో కలిసి వారు తెచ్చిన బ్యాగులు తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు గమనించారు. వెంటనే బస్సును స్టేషన్ వద్ద ఆపి గంజాయిని ఆర్టీసీ డ్రైవర్ అప్పగించారు. తహసీల్దార్ సుదర్శన్, వీఆర్వో ఆధ్వర్యంలో బ్యాగులో ఉన్న గంజాయిని తూకంవేసి 14.3 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. విషయం బయటకు పొక్కకుండా
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి తాగుతూ విద్యార్థులు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. కళాశాలలోని బాయ్స్ హాస్టల్–1లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా, శనివారం బాసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ట్రిపుల్ ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో విద్యార్థి తమ హాస్టల్ రూమ్‌లో శుక్రవారం గంజాయి తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ముధోల్ సీఐ వినోద్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యార్థుల నుంచి 100 గ్రాములకుపైగా గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఎలా వచ్చింది? స్థానికంగా కళాశాలలో డీఎస్పీ, సీఐతోపాటు 200 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఇంత భద్రత నడుమ కళాశాలలోకి గంజాయి ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెలవులపై ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమతోపాటుగా గంజాయిని తెచ్చుకున్నారా? లేక స్థానికంగా పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా సరఫరా చేస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ గదిలో విద్యార్థులు గంజాయి తాగుతున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న సిబ్బంది వారి రూమ్‌ను తనిఖీ చేశారు. గంజాయి తాగుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత విషయం బయటకు రాకుండా జాగ్రత్త వహించారు. తనిఖీ చేస్తున్న సమయంలో స్థానికంగా సిబ్బందికి సెల్‌ఫోన్ కూడా అనుమతించకుండా గోప్యత వహించారు. కానీ చివరకు విషయం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: మట్టి ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు -
పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!
Man poses as priest to run drug trade near temples: ఇటీవలకాలంలో ఆ మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూశాం. పైగా సెలబ్రేటిలు దగ్గర నుంచి దిగజ కంపెనీలు సైతం ఈ డ్రగ్స్ నీలి నీడ ఛాయలు మాటున దాగి ఉంటున్నాయి. నార్కొటిక్క్ బృందం చేధించేంత వరకు ఎవరు ఏంటో ప్రజలకు అర్థంకానీ గందగోళ పరిస్థితిని చవి చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదేమో!. అచ్చం అలానే చెన్నైలో పవిత్రమైన దేవలయ ప్రాంగణంలో పూజారి ముసుగులో ఒక వ్యక్తి గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. (చదవండి: ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్‌నే పాడు చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే....చెన్నైలోని దామో అనే 50 ఏళ్ల వ్యక్తి పూజారిలా జనాలకు ఫోజులిస్తూ దేవాలయం వెలుపల గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అయితే చెన్నైలోని పోలీసులు దేవలయ ప్రాంగణాల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారంటూ సమాచారం రావడంతో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్యల్లో భాగంగానే పోలీసులు కస్టమర్లల వేషంలో దేవాలయం ప్రాంగణాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు. అయితే దామో కాషాయా వస్త్రాలు ధరించి వివిధ ఆలయాల వద్ద కనిపించడంతో అనుమానించి పోలీసులు కస్టమర్ల వేషంలో అతని వద్దకు వెళ్లి విచారించారు. ఈ క్రమంలో పోలీసులు దామోని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు తమిళనాడులో విక్రయించే నిమిత్తం అతని వద్ద గంజాయిని కొనుగోలు చేసే ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!) -
ఇదో గమ్మత్తు కథ.. సీజ్ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: పెడ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి ‘తరలింపు’లో పోలీసుల నిర్లక్ష్యం ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. ‘మిగిలిపోయిన’ గంజాయిని సొంతం చేసుకున్న అతగాడు స్థానికంగా విక్రయించాడు. ఇలా ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడంలో కథ మొత్తం బయటకు వచ్చింది. ఈ ‘గమ్మత్తు’ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డుపై రెండు కేసులు నమోదు కాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హయత్‌నగర్ పోలీసులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. చదవండి: HYD: ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆటోడ్రైవర్ ఠాణాకు మరమ్మతులు జరుగుతుండడంతో.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొన్నాళ్లుగా పోలీసులు గంజాయిపై జంగ్ చేస్తున్నారు. ఫలితంగా వరుసగా విక్రేతలు, వినియోగదారులు పట్టుబడుతున్నారు. ఇటీవల హయత్‌నగర్ పోలీసులు ఇలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న 9 కేజీల గంజాయిని కోర్టు ఆదేశాలతోనే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు కచ్చితంగా దర్యాప్తు అధికారులు ఆ సరుకును తమ అధీనంలో ఉంచుకోవాలి. సాధారణంగా పోలీసులు ఇలా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఠాణాలోనే ఉంచుతారు. ఆ సమయంలో పోలీసుస్టేషన్‌కు మరమ్మతులు జరుగుతుండటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ గోదాంలో భద్రపరిచారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..! తరలింపులో నిర్లక్ష్యం.. ఠాణాకు మరమ్మతులు పూర్తయిన తర్వాత పోలీసులు ఈ గంజాయిని తీసుకురావచ్చారు. ప్యాకెట్లలో ఉన్న గంజాయిని తీసుకువచ్చిన బృందం వాటి కింద పరిచిన కార్పెట్ కింద పడిపోయిన దాన్ని పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే సదరు గోదాం సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. గోదాం శుభ్రం చేసే నెపంతో అక్కడ పడిన గంజాయిని అతడు సొంతం చేసుకున్నాడు. దాన్ని తన వద్దే భద్రపరిచి, స్థానికంగా కొందరికి విక్రయించాడు. విడతల వారీగా జరిగిన ఈ విక్రయంపై హయత్‌నగర్ పోలీసులకే సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఖరీదు చేసిన వారిని, వారి ద్వారా సదరు సెక్యూరిటీ గార్డును పట్టుకున్నారు. నిర్లక్ష్యం బయటకు... కొన్నేళ్లుగా నగరంతో పాటు శివారు జిల్లాలకు గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి సరఫరా అవుతోంది. ఈ సెక్యూరిటీ గార్డుకు గంజాయి అలానే చేరిందని పోలీసులు భావించారు. విచారణ నేపథ్యంలోనే తమ నిర్లక్ష్యం బయటపడింది. తాము భద్రపరిచిన గంజాయిలో కొంత భాగం చోరీ చేయడంపై దొంగతనం కేసు, ఆ సరుకును విక్రయించడంపై మాదకద్రవ్యాల చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును హయత్‌నగర్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు తరలించారు. ఈ ‘గమ్మత్తు’ కథ మొత్తం తెలుసుకున్న ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సీజ్ చేసిన గంజాయి నిల్వ, తరలింపులో నిర్లక్ష్యంగా ఉన్న హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎం.సురేందర్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులకు చార్జి మెమోలు జారీ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత విచారణ ముగిసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారని సమాచారం. -
నిట్‌లో గుప్పుమన్న గంజాయి
కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) లో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి నిట్‌లోని 1.8కే హాస్టల్లో 12 మంది ఫస్టియర్ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద పది కిలోల గంజాయి లభించినట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిట్ వరంగల్‌లో కట్టుదిట్టమైన సె క్యూరిటీ ఉంటుంది. అయినా విద్యార్థులు గం జాయితో పట్టుబడడం గమనార్హం. సాధారణంగా రోజూ నిట్‌లోని మొదటి ఏడాది వి ద్యార్థులు తప్ప మిగతా విద్యార్థులు బయటికెళ్లి రాత్రి 10 గంటల్లోపు కళాశాల కు చేరుకునే అవకాశాన్ని యాజమాన్యం కల్పిస్తుంది. కా గా, బయటకే వెళ్లని ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థులకు ఎవరు గంజాయి అందించి ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, పాడేరు(విశాఖపట్టణం) : గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం విశాఖ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించి వాహనాల్లో తరలించుకుపోతున్న రూ. 1.30 కోట్ల విలువైన 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను సీజ్ చేయడంతోపాటు నలుగురిని అరెస్టు చేశారు. మరికొంతమంది పరారైనట్టు అధికారులు తెలిపారు. గూడెంకొత్త వీధి మండలం సీలేరు పోలీసు స్టేషను పరిధిలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఐచర్వ్యాన్లో కొబ్బరిబొండాల కిందన బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు దీంతో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా బస్తాల్లో ఉంచిన 570 కిలోల గంజాయి లభ్యమైంది. మావోయిస్టు అమరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండగా గంజాయి పట్టుబడింది. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా నిందితులు వ్యాన్‌ను విడిచిపెట్టి పరారైనట్టు పోలీసులు చెప్పారు. వీరి కోసం గాలిస్తున్నామని.. గంజాయిని చింతపల్లి ప్రాంతం నుంచి తెలంగాణా రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసిందన్నారు. గుట్టు రట్టు! విశాఖ ఏజెన్సీ పెదబయలు ప్రాంతం నుంచి ముంబాయికి గంజాయి తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు తెలియజేశారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలు విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం మారుమూల ప్రాంతాల నుంచి ఖరీదైన శీలవతి రకం గంజాయిను కొనుగోలు చేసి ముంబాయి, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అమ్మకాలు చేస్తున్నట్లు పాడేరు ఎక్సైజ్ సీఐ డి.అనిల్‌కుమార్‌కు సమాచారం అందింది. దీంతో అనిల్‌కుమార్ తన సిబ్బందిని వెంటపెట్టుకొని గురువారం రాత్రి పెదబయలు మండలం చుట్టుమెట్ట, పాడేరు మండలం గుత్తులపుట్టు సంత బయలు జంక్షన్లో కాపు కాశారు. పెదబయలు ప్రాంత నుంచి వేర్వేరు నంబర్లు ఉన్న (ముందున ఎంహెచ్ 17ఎజెడ్317, వెనుక వైపు ఏపీ 31సిక్యూ2772) కలిగిన కారును చుట్టుమెట్ట వద్ద, ఏపీ 31 బీయూ 2375 నంబర్ గల కారును సంతబయలు వద్ద పోలీసులు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. వీటిలో గంజాయి ఉన్నట్లు నిర్ధారించి పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ధన్‌రాజ్ జాదవ్, సచిన్ శావంకి, ఒడిశా రాష్ట్రం పాడువాకు చెందిన పేరొందిన స్మగ్లర్ సంజాయ్ లక్ష్మణ్రాయ్ అలియాస్ సంజాయ్ జవహార్‌లాల్, ఆనంద్ పెలమాల్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 105 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకొని కార్లకు సీజ్ చేశారు. పట్టుకున్న గంజాయి, కార్ల విలువ రూ. 30 లక్షలు ఉంటుంది. అరెస్టయిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు విలేకరులకు చెప్పారు. గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు కశింకోట: గంజాయిని ఆటోలో తరలిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఎస్.వి.ఎస్.రామకృష్ణ తెలిపారు. ఇతని నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన కంట్రెడ్డి శివ అదే గ్రామం నుంచి ఆటోలో గంజాయిని తీసుకొని వెళ్తుండగా కశింకోట నూకాంబిక ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. మరో నలుగురు పరారైనట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత!
సాక్షి, సిద్దిపేట: గుట్టుగా రవాణా చేస్తున్న రూ. కోటి విలువ చేసే గంజాయిని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ సమీపంలో కేంద్ర ఇంటలీజెన్సి అధికారులు పట్టుకున్నట్లు జిల్లాలో గురువారం ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుండి సుమారు 962 కేజీల గంజాయిని ఖమ్మం, సూర్యాపేట, జనగామ నుండి సిద్దిపేట సమీపంలోని దుద్దెడ మీదుగా జహీరాబాద్ అక్కడి నుంచి హారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న డీఆర్ఐ(డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలెజెన్సీ) అధికాలు దు ద్దెడ టోల్గేట్ సమీపంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అందులో రూ. కోటికి పైగా విలువచేసే గంజాయి ఉండటంతో రవాణా చేస్తున్న వారిని, వాహనాన్ని నేరుగా హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి మహారాష్ట్రకు తరచుగా రవాణా అవుతుందని, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జి ల్లాల మీదుగా జహీరాబాద్ అక్కడి నుంచి మహారాష్ట్రకు సులభంగా తరలించే అవకాశం ఉన్నందున ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ దందా జరుగుతుందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గురువారం ఏకంగా రూ. కోటి విలువచేసే గంజాయి రవాణా అవుతూ పట్టుబడిన విషయం జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులకు కూడా తెలియకపోవడంపై జిల్లాలో చర్చ సాగుతోంది. -
పాతబస్తీలో భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. నగరంలోని ఓల్డ్ సిటీలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా రెండు కార్లలో తరలిస్తున్న 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో పలువురు పరారైనట్టు తెలుస్తోంది. -
పశ్చిమగోదావరి జిల్లాలో దాడులు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారంతో వట్లూరు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తితో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరస్టైన వారిలో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 10.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. -
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది. భద్రాచలం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా గంజాయి బయట పడింది. 500 కేజీల బంగారంతో పాటు బొలోరో వాహనం, ఆటోను పోలీసులు సీజ్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్..!
సంగారెడ్డి క్రైం: మారుమూల గ్రామాల్లోని గుట్ట, కొండ, కోనల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తూ ప్రధాన పట్టణాలు, నగరాల్లో విక్రయించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న గంజాయి స్మగర్ల ఆగడాలకు సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పెడుతున్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలోని శిలపల్లి గ్రామానికి చెందిన ముల్లా ఖలీల్‌కు వ్యవసాయ భూమిలో గంజాయిని పండిస్తూ స్మగర్లకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. నిందితుడి ఇంట్లోనే 6.1 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. అతనితో పాటు రూ.18150 నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ సీఐలు మోహన్‌కుమార్, రమేష్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలు చేయాలన్న లక్ష్యంతో కొందరు అక్రమార్కులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే శీలపల్లి గ్రామానికి చెందిన ముల్లా ఖలీల్ పథకం ప్రకారం తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయిని సాగు చేయడమే కాకుండా నిల్వ చేసుకొని ఎండు గంజాయిని ప్రతి నిత్యం ప్రధాన నగరాల్లో ,పట్టణాల్లో విద్యార్థులే లక్ష్యం విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితుడితో పాటు సరుకును ,నగదును స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గంజాయి విలువ రూ.30 వేల పైగా ఉంటుం ద ని వెల్లడించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ చంద్రశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ విఠల్, రియాజ్, సిబ్బంది నగేష్, సిరాజ్, జయశ్రీ, జ్యో తి, సురేష్ పాల్గొన్నారు. -
హన్మకొండలో భారీగా గంజాయి
సాక్షి, వరంగల్ అర్బన్ : హన్మకొండ పరిధిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. కారులో అక్రమంగా 225 కిలోల గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో బయటపడింది. నిందితులు గంజాయిని విశాఖ జిల్లా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. పోలీసులు కారు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన సుభాష్ చౌహన్‌గా గుర్తించారు. పోలీసుల రాక గమనించి మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ జిల్లాలో భారీగా గంజాయి
విశాఖ : విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఉప్ప వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
604 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పెద్దరాయి వద్ద పోలీసు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్నితనిఖీ చేయగా అందులో 604 కిలోల గంజాయి బయటపడింది. ఈ గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కోణార్క్‌లో మరోసారి గంజాయి
వరంగల్ అర్బన్: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో మరోసారి గంజాయి పట్టుబడింది. రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుండి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 82 కేజీల గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం
నిజామాబాద్: దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 114 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను శనివారం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్‌లో గంజాయి స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ పరిధిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ పై గంజాయిని తరలిస్తున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. బొలెరో వాహనంలో 14 బ్యాగుల్లో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
కోణార్క్‌లో మరోసారి గంజాయి స్వాధీనం
మధిర: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులో 30 కేజీల గంజాయి తరలిస్తుండగా మధిర రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, పట్టుబడిన గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువగా గంజాయి స్వాధీనం చేసుకుంటున్న విషయం విదితమే. -
వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
చింట్యాడ: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చింట్యాడ మండల కేంద్రంలో శనివారం ఉదయం వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసిన పోలీసులు పలువురిని అరెస్టుచేసి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. -
2 వేల కిలోల గంజాయి స్వాధీనం
వై.రామవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వై రామవరం మండలం డొంకరాయి వద్ద శుక్రవారం తనిఖీలు చేపడుతున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
17 కేజీల గంజాయి స్వాధీనం
- ముగ్గురు అరెస్ట్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా వారిలో ఒక మహిళ కూడా పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. లక్ష ఉంటుందని, ఒడిశా నుంచి నిజామాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు ఆయన వివరించారు -
రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం
-
రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నానక్‌రాం గూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోకి వస్తున్న వెర్నా కారును ఎస్వోటీ పోలీసులు ఆపి సోదా చేశారు. అందులో రూ.కోటి విలువైన గంజాయి దొరికింది. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి దేశ రాజధానికి గంజాయి తరలిస్తున్న ఐదుగురిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 45 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు నుంచి సికింద్రాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. జీఆర్పీ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఎల్బీనగర్ లో గంజాయి స్వాధీనం
హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్ పై గంజాయి తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి 3 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్‌కు తరలించారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్
చౌటుప్పల్: గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 65 వ నెంబర్ జాతీయ రహదారిలోని పంతంగి టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారు విశాఖ నుంచి హైదారబాద్‌కు గంజాయి తలరిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: చిలకలగడ్డ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ. కోటి విలువైన వంద కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఒక లారీని, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో... విజయనగరం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్. కోట మండలం బొడ్డవార జంక్షన్ వద్ద పోలీసు తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 నుంచి 4 వేల కేజీలు ఉంటుందని అనుమానం. నిందుతులు పరారీలో ఉన్నారు. -
రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత
జామి: విజయనగరం జిల్లా జామి మండలం లక్ష్మీపురం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బొలేరో వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. 28 బస్తాల్లో గంజాయిని రవాణా చేస్తున్నారు. దీని విలువ రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు వ్యాన్‌ను వదిలి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
200 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖ జిల్లా మాడుగుల మండలం సాగరం వద్ద సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులను గుర్తించిన స్మగ్లర్లు కారును వేగంగా పక్కకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ముగ్గురు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారు కాగా పోలీసులు కారుతో పాటు 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
చర్లపల్లి జైలులో గంజాయి స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఓ ఖైదీ వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వర్ణముఖి బ్యారక్‌లో ఉంటున్న శిక్షా ఖైదీ వద్ద 120 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మోహన్ రావు అనే వార్డరు, ఖైదీని విచారించగా ఓ పోలీసు అధికారే తన గంజాయి అందించాడని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు విచారణ చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
3 కిలోల గంజాయి స్వాధీనం
నిజామాబాద్: నిజామాబాద్‌లో గంజాయి, చెరస్ అనే మత్తుపదార్థాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ మాలపల్లిలో ముక్తార్ అన్సారీ అనే వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 3.300 కిలోల గంజాయిని, 4 చెరస్(మత్తు మందు) గోలీలను స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. అతనికి ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు -
2 కిలోల గంజాయి స్వాధీనం
గాంధారి: కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చధ్మల్ వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు నేరెల్ గ్రామానికి చెందిన వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి కారు సీజ్ చేశారు. -
200 కేజీల గంజాయి పట్టివేత
విజయవాడ: గొల్లపూడి వన్ సెంటర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమారు 200 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు విశాఖపట్నంలోని ట్రైబల్ ఏరియాకు చెందిన వారిగా గుర్తించారు. గంజాయిని కారులో విశాఖ నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు వద్ద కారు ప్రమాదానికి గురైంది. మరో కారును కిరాయికి మాట్లాడుకుని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
340 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ధారకొండలో బుధవారం తనిఖీలు చేపట్టిన పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 340 కిలోల గంజాయితో పాటు, ఓ ఇన్నావా కారు, 5 సెల్ఫోన్లు, రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జమ్మికుంట: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రశాంత్‌రెడ్డి వివరాలు తెలిపారు. -
రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని జి. మాడుగుల మండలం అలగాం వద్ద పోలీసుల జరిపిన తనిఖీల్లో రూ. కోటి విలువైన గంజాయి దొరికింది. ఇద్దరు వ్యక్తులు గంజాయిని ద్రవరూపంలో వ్యానులో తరలిస్తుండగా పోలీసుల చేతికి చిక్కారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వ్యానును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
640 కిలోల గంజాయి స్వాధీనం
- ఒకరి అరెస్ట్ విశాఖ: గుట్టుచుప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 640 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం పూసలపాలెం గ్రామం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో.. గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. -
భారీగా గంజాయి స్వాధీనం
రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట సెంటర్ వద్ద ఓ కారులో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఏజెన్సీ ఏరియా నుంచి రావులపాలెం మీదుగా పశ్చిమగోదావరి వైపు గంజాయి లోడుతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు చక్రం ఊడిపోయింది. కారులో ఉన్న వ్యక్తులు రిపేరు చేస్తుండగా సంఘటనాస్థలంలో స్థానికులు గుమిగూడారు. దీంతో భయపడిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారును స్టేషన్‌కు తరలించి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 కేజీల బరువు ఉన్న 104 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ganja caught, police, east godavari, గంజాయి స్వాధీనం, పోలీసులు -
అరకులో 32 కేజీల గంజాయి పట్టివేత
అరకు: విశాఖపట్నం జిల్లా అరకు రైల్వేస్టేషన్లో 32 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న డుంబ్రీగూ మండలం బొడ్లమామిణి గ్రామానికి చెందిన ఆదయ్య, జగబందు, సోమేశ్వరరావులను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ganja caught, araku, గంజాయి పట్టివేత, అరకు -
650 కిలోల గంజాయి స్వాధీనం
కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి వద్ద బొలెరో వాహనంలో రవాణా చేస్తున్న సుమారు 650 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై నిఘా పెట్టి వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. చేపలను నిల్వ చేసే పెట్టెల్లో రవాణా చేస్తున్న గంజాయిని కనుగొన్నారు. కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్సై, సోంపేట ఎస్సైల ఆధ్వర్యంలో సిబ్బంది గంజాయిని పట్టుకున్నారు. -
పుట్టపర్తి రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి రైల్వే స్టేషన్లో 25 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఓ వ్యక్తి సహా నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నక్కపల్లిలో 62 కేజీల గంజాయి పట్టివేత
నక్కపల్లి : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్గేట్ వద్ద పోలీసుల తనిఖీలో 62 కేజీల గంజాయి పట్టు బడింది. జి.మాడుగుల నుంచి తమిళనాడులోని వేలూరుకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుంది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
91 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్: ఓ వాహనంలో నగరానికి సరఫరా అవుతున్న 91 కిలోల గంజాయిని హైదరాబాద్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అత్తాపూర్ వద్ద శనివారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
77 కిలోల గంజాయి స్వాధీనం
డుంబ్రిగూడ: విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం జయపూర్ జంక్షన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. బుధవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 77కిలోల గంజాయి బయటపడింది. దీంతో కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, అరకు లోయ మండలం బోసుగడ్డకు చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును, గంజాయిని సీజ్ చేశారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. -
6 కిలోల గంజాయి స్వాధీనం
తలుపుల: అనంతపురం జిల్లా లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని తలుపుల మండలం బండ్లపల్లి వద్ద శనివారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫరీదా అనే మహిళ నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విజయవాడ నుంచి తీసుకొస్తున్నట్టు ముందస్తు సమాచారం రావడంతో ఈ దాడులు చేపట్టారు. సదరు మహిళపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
143 కిలోల ఎండుగంజాయి పట్టివేత
13మందిపై కేసు, ఇద్దరి అరెస్టు నారాయణఖేడ్: రవాణాకు నిల్వ ఉంచిన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ రవికాంత్, ఏఈఎస్ సైదులు తెలిపారు. కల్హేర్ మండలం ముబాకర్పూర్పై దాడిజరిపినట్లు తెలిపారు. 143 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొన్నామని, 13మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇద్దరు నిందితులు అశోక్, అంజయ్యలను అరెస్టుచేశామని, మరో 11మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. పీర్ల తండాపై దాడిచేసి గతంలో బైండోవర్ అయి మళ్ళీ నాటుసారా విక్రయిస్తున్న సంతులిబాయిని అరెస్టుచేసినట్లు తెలిపారు. మరో నిందితురాలు చాందిబాయి పారిపోయిందన్నారు. బైండోవర్ అయినా నాటుసారా విక్రయించినందుకు వీరు రూ. లక్ష జరిమానా చెల్లించాలని, లేదా ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ రాజ్ప్రకాస్, ఎస్ఐలు కిరణ్‌కుమార్, సూర్యప్రకాష్, గంగాధర్‌లు పాల్గొన్నారు. -
8 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
పత్తిపాడు: అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల గంజాయిని పత్తిపాడు జాతీయరహదారివద్ద సోమవారం ఉదయం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు స్థానిక పోలీసులు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. రెండు బోలెరో వాహనాల్లో ఈ గంజాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. రెండు బోలెరో వాహనాలతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.