విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.., స్వాధీనం చేసుకున్న గంజాయి
సంగారెడ్డి క్రైం: మారుమూల గ్రామాల్లోని గుట్ట, కొండ, కోనల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తూ ప్రధాన పట్టణాలు, నగరాల్లో విక్రయించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న గంజాయి స్మగర్ల ఆగడాలకు సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెక్ పెడుతున్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలోని శిలపల్లి గ్రామానికి చెందిన ముల్లా ఖలీల్‌కు వ్యవసాయ భూమిలో గంజాయిని పండిస్తూ స్మగర్లకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. నిందితుడి ఇంట్లోనే 6.1 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. అతనితో పాటు రూ.18150 నగదును సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు మోహన్‌కుమార్, రమేష్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలు చేయాలన్న లక్ష్యంతో కొందరు అక్రమార్కులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే శీలపల్లి గ్రామానికి చెందిన ముల్లా ఖలీల్ పథకం ప్రకారం తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయిని సాగు చేయడమే కాకుండా నిల్వ చేసుకొని ఎండు గంజాయిని ప్రతి నిత్యం ప్రధాన నగరాల్లో ,పట్టణాల్లో విద్యార్థులే లక్ష్యం విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితుడితో పాటు సరుకును ,నగదును స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గంజాయి విలువ రూ.30 వేల పైగా ఉంటుం ద ని వెల్లడించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ చంద్రశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ విఠల్, రియాజ్, సిబ్బంది నగేష్, సిరాజ్, జయశ్రీ, జ్యో తి, సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment