డుంబ్రిగూడ: విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం జయపూర్ జంక్షన్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. బుధవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 77కిలోల గంజాయి బయటపడింది. దీంతో కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, అరకు లోయ మండలం బోసుగడ్డకు చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును, గంజాయిని సీజ్ చేశారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు.