Man poses as priest to run drug trade near temples: ఇటీవలకాలంలో ఆ మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూశాం. పైగా సెలబ్రేటిలు దగ్గర నుంచి దిగజ కంపెనీలు సైతం ఈ డ్రగ్స్ నీలి నీడ ఛాయలు మాటున దాగి ఉంటున్నాయి. నార్కొటిక్క్ బృందం చేధించేంత వరకు ఎవరు ఏంటో ప్రజలకు అర్థంకానీ గందగోళ పరిస్థితిని చవి చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదేమో!. అచ్చం అలానే చెన్నైలో పవిత్రమైన దేవలయ ప్రాంగణంలో పూజారి ముసుగులో ఒక వ్యక్తి గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు.
(చదవండి: ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్‌నే పాడు చేశాడు!!)
అసలు విషయంలోకెళ్లితే....చెన్నైలోని దామో అనే 50 ఏళ్ల వ్యక్తి పూజారిలా జనాలకు ఫోజులిస్తూ దేవాలయం వెలుపల గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అయితే చెన్నైలోని పోలీసులు దేవలయ ప్రాంగణాల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారంటూ సమాచారం రావడంతో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్యల్లో భాగంగానే పోలీసులు కస్టమర్లల వేషంలో దేవాలయం ప్రాంగణాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు.
అయితే దామో కాషాయా వస్త్రాలు ధరించి వివిధ ఆలయాల వద్ద కనిపించడంతో అనుమానించి పోలీసులు కస్టమర్ల వేషంలో అతని వద్దకు వెళ్లి విచారించారు. ఈ క్రమంలో పోలీసులు దామోని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు తమిళనాడులో విక్రయించే నిమిత్తం అతని వద్ద గంజాయిని కొనుగోలు చేసే ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
(చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!)
Comments
Please login to add a commentAdd a comment