
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(చెన్నై): కేరళకు చెందిన యువతిని లాడ్జీలో బంధించి చిత్ర హింసలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఇడుక్కి జిల్లా వెల్లత్తువల్ సమీపంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ 20 ఏళ్ల కుమార్తె మానసికంగా ఎదుగుదల లేనిది. ఈమె గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది.
దీంతో ఆటో డ్రైవర్ కేరళ రాష్ట్రం వెల్లత్తువల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తీవ్రగాలింపు తరువాత ఇటీవల పోలీసులు సదరు యువతిని రక్షించారు. విచారణలో నాగర్‌కోయిల్‌కు బస్సులో తీసుకొచ్చిన ఓ యువకుడు ఆ యువతిని ఓ లాడ్జిలో బందీ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు నాగర్‌కోయిల్ మహిళా పోలీసు కేసు నమోదు చేసి విరుదునగర్ జిల్లా నాచ్చర్‌పాలయంకు చెందిన అజిత్ క్లింటన్ (25)ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: అప్పటి వరకు దోస్తులతో జాలీగా ముచ్చట్లు.. క్షణాల్లోనే ఆనందం ఆవిరి
Comments
Please login to add a commentAdd a comment