lodge
-
AP: ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య
సాక్షి,వైఎస్ఆర్జిల్లా : ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గాంధీ రోడ్డు సమీపంలోని బీజీఆర్ లాడ్జిలో హత్య జరిగింది. మద్యం సీసాతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తిని రౌడీ షీటర్ పప్పిగా పోలీసులు అనుమానిస్తున్నారు.హత్యలో స్థానిక టీడీపీ నేతల సోదరుల ప్రమేయం ఉందని సమాచారం. హత్య జరిగిన లాడ్జి రూమ్ టీడీపీ నాయకుడు యనమల సుబ్బిరెడ్డి సోదరుని అధీనంలోనే కొన్ని నెలలుగా ఉన్నట్లు సమాచారం.మరో టీడీపీ నేత ముక్తియర్ సోదరుడు ముజీబ్ కూడా ఆ రూంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముజీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఇన్‌స్టా’ స్నేహితుడు.. 20 రోజులు నిర్బంధించాడు!
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్ జిల్లా, భైంసాకు చెందిన బాలికను ట్రాప్ చేశాడు. 20 రోజుల క్రితం నగరానికి రప్పించి ఓ హోటలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆదివారం నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో బాలికను రక్షించారు. నిందితుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే..భైంసాకు చెందిన బాలికకు నగరానికి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు స్నేహం నటించిన అతగాడు ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరకు తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్భంధించాడు. బాలికపై పదేపదే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. చివరకు ఆదివారం ధైర్యం చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వాట్సాప్ ద్వారా కరెంట్ లోకేషన్ షేర్ చేసింది. హుటాహుటిన నగరానికి వచి్చన బాలిక తల్లిదండ్రులు షీ–టీమ్స్‌ను ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నారాయణగూడలోని లాడ్జిపై దాడి చేసి బాలికను రెస్క్యూ చేశారు. తల్లిదండ్రులను చూసిన బాలిక ఉద్వేగానికి గురైంది. సదరు యువకుడిపై బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినికి ఆన్లైన్లో వేధింపులు..మరో కేసులో ఓ విద్యార్థినిని ఆన్లైన్లో వేధిస్తున్న సహ విద్యార్థులకు షీ–టీమ్స్ చెక్ చెప్పింది. బాధిత యువతి పంజగుట్ట పరిధిలోని ఓ ప్రముఖ అకాడమీలో విద్యనభ్యసిస్తున్నారు. అదే అకాడమీకి చెందిన కొందరు పోకిరీలు ఆన్లైన్లో, సోషల్‌మీడియా ద్వారా యువతిని రకరకాలుగా వేధించారు. దీనిపై ఆమె వాట్సాప్ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వారిని గుర్తించడంతో పాటు పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు చేయించారు. ఈ పోకిరీలతో పాటు అకాడమీ నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యనభ్యసిస్తున్న యువతుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు స్పష్టం చేశారు. -
సామర్లకోట లో లాడ్జ్ బాయ్‌ను చితక్కొట్టిన యువకులు
-
లాడ్జిలో ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలు(టౌన్)/నందికొట్కూరు: వివాహేతర సంబంధం ఇరువురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన శనివారం కర్నూలు నగరంలోని వుడ్‌ల్యాండ్స్ లాడ్జిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న విజయకుమార్(35) వృత్తిరీత్యా అకౌంటెంట్. బీటెక్ పూర్తి చేసిన ఇతను పదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ముస్లిం అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. మిడుతూరు మండలం నాగలూటికి చెందిన రుక్సానా(45)కు పట్టణానికి చెందిన కార్పెంటర్‌తో 2001లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఒకే కాలనీలో ఉంటున్న విజయకుమార్, రుక్సానా మధ్య ఏర్పడిన పరిచయం మూడేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ప్రియుడు రుక్సానాకు ఫోన్ చేసి కర్నూలులోని వుడ్‌ల్యాండ్స్ లాడ్జిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాబుకి ఆరోగ్యం బాగోలేదని కర్నూలుకు వెళ్లి ఆస్పత్రిలో చూపిస్తానని భర్తకు చెప్పి రూ.5 వేలు తీసుకుని బయలుదేరింది. అయితే కుమారుడిని ప్రభుత్వాసుపత్రి వద్ద వదిలి ఆమె కనిపించకుండా పోయింది. రాత్రి అయినా రాకపోవడంతో కుమారుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇదే సమయంలో ప్రియుడు విజయ్‌కుమార్ ఆమె కుమారుడికి ఫోన్ చేసి ఇద్దరం లాడ్జిలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఫోన్ పే ద్వారా రూ.300 అకౌంట్లో వేశాడు. అయితే ఏ లాడ్జి అనే సమాచారం లేకపోవడంతో కుమారుడు అన్ని చోట్ల వెతికాడు. చివరకు వుడ్‌ల్యాండ్స్ వద్ద పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు పట్టి లాడ్జిలో విచారించారు. విజయ్‌కుమార్ అక్కడే ఉన్నట్లు తెలుసుకుని రూమ్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తెరువ లేదు. రూమ్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం ఎంత ప్రయత్నించినా రూం తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టారు. ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఈ ఘటన వివాహేతర సంబంధం వల్లే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇరువురి మధ్య గొడవ జరిగి రుక్సానాను కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత క్రిమి సంహారక మందు తాగి తనూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. హత్య, ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై విచారణ చేస్తున్నాం. – మురళీధర్ రెడ్డి, మూడవ పట్టణ సీఐ -
లాడ్జిలో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: లాడ్జిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీలో ఎస్ఎస్ రెసిడెన్సీ లాడ్జిలో ఆదివారం ఉదయం బళ్లారికి చెందిన నవీన్ (26), ఏలూరుకు చెందిన ప్రవీణ్ రెండో ఫ్లోర్‌లోని 211 గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రూమ్‌లో ఏసీ సరిగ్గా రాకపోవటంతో వారు మూడో ఫ్లోర్‌లోని 303కు మారారు. ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో వారి మధ్య ఘర్షణ జరగడంతో ప్రవీన్ నవీన్‌ను కత్తితో మెడపై పొడవటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ► సోమవారం ఉదయం గది ఖాళీ చేయాలని చెప్పేందుకు వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపు తట్టగా నవీన్ బెడ్‌పై రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు. నవీన్ మృతదేహం పక్కన పడి ఉన్న మద్యం బాటిళ్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడు ప్రవీణ్ కోసం గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. -
తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..
కొన్ని విచిత్ర సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. అదెలా సాధ్యం అన్నంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రులు ఓ చిన్నారి పట్ల చేసిన దుశ్చర్య వరంగానే మారి అందర్నీ ఆశ్చర్యపరించింది. వైద్యుల్ని సైతం విస్మయపరిచింది. రష్యాలోని ఫార్ ఈస్ట్‌లో ఉండే ఒక వృద్ధ మహిళ బ్రెయిన్‌కి సీటీ స్కాన్ చేశారు వైద్యులు. ఐతే వైద్యులలు ఆమె బ్రెయిన్‌ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేలా సాధ్యం. అలాంటి వస్తువుతో ఆమె ఏకంగా 80 ఏళ్లు బతికింది. అదికూడా ఓ ఇనుప వస్తువుతోనా!,, అని ఆశ్చర్యపోయారు. శిశుహత్య చేయాలకున్న తల్లిదండ్రుల విఫలప్రయత్నం ఫలితంగా ఆమెకు ఇలా జరిగిందని తెలిసి కంగుతిన్నారు. పైగా ఆ టైంలో ఎలాంటి సదుపాయాలు లేవు. కానీ ఆమెకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటమే గాదు. పైగా ఇన్నేళ్లు ఆమెకు ఎలాంటి తలనొప్పిగాని తలకు సంబంధించిన ఇబ్బంది గానీ లేకపోవడం విశేషం. రష్య రిమోట్ ప్రాంతంలో సఖాలిన్లో ఆమె పుట్టినప్పుడు తీవ్ర కరువు ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయం. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను చంపేయాలనుకున్నారు. అందుకోసం తలలో మూడు సెంటీమీటర్ల పొడవుగల సూదిని దింపేస్తారు. విచిత్రంగా ఆమెకు ఏం కాలేదు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ కాలంలో శిశువులను ఇలా హతమార్చేవారు. బాల్యంలో ఆ మహిళను చంపేందుకు తల్లిదండ్రులు గుచ్చిన సూది ఆమె బ్రెయిన్‌కి ఎడమ ప్యారిటల్ లోబ్లోకి చొచ్చుకుపోయింది. అది బాలికపై ఎలాంటి ప్రభావం చూపకపోవడమే గాక ప్రాణాలతో బయటపడింది. ఈ గాయం కారణంగా ఎలాంటి నొప్పి గురించి ఫిర్యాదు చేయలేదని సదరు వృద్ధ మహిళ చెప్పడం విచిత్రం. ఆమెకు ఏం కాకపోవడానికి గల కారణమేమిటి? అది ఇనుము అయినా ఆమెకు ఎలాంటి హాని జరగకపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే అన్వేషణలో ఉన్నారు వైద్యులు. (చదవండి: అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!) -
లాడ్జీలో వివాహిత హత్య! ఆధార్‌కార్డు తీసుకొస్తానని హంతకుడు పరార్!!
రాజన్న: వేములవాడలోని జాతరగ్రౌండ్‌లోని ఓ ప్రైవేట్ లాడ్జీలో ఆదివారం వివాహిత సద్గుల వెంకటవ్వ(46) హత్యకు గురైంది. వివరాలు వేములవాడటౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన వెంకటవ్వ వివాహం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన రాములుతో 20 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండు రోజుల క్రితం వెంకటవ్వ ఇంటి నుంచి వెళ్లినట్లు భర్త రాములు పోలీసులకు తెలిపారు. భర్త రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. అద్దె గదిలో వివస్త్రగా.. వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో శనివారం రాత్రి వెంకటవ్వ పేరుతో గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలో వెంకటవ్వతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు లాడ్జీ యజమాని తెలిపారు. అదే రోజు రాత్రి అర్ధరాత్రి సదరు వ్యక్తి లాడ్జీ నుంచి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డ్ అయ్యింది. అయితే ఆధార్‌కార్డు ఇవ్వాలని లాడ్జీ యజమాని కోరడంతో తీసుకొస్తానని చెప్పి వెళ్లిన సదరు వ్యక్తి తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన లాడ్జీ యజమాని ఆదివారం సాయంత్రం ఆ గదిని పరిశీలించగా.. బెడ్‌పై వెంకటవ్వ శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేములవాడటౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై రమేశ్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానితుడి ఫొటో విడుదల.. వేములవాడ ప్రైవేట్ లాడ్జీలో వెంకటవ్వ హత్యకేసులో అనుమానితుడిగా పేర్కొంటున్న వ్యక్తి ఫొటోను పోలీసులు ఆదివారం విడుదల చేశారు. ఆచూకీ తెలిసినవారు వేములవాడ ఠాణా 87126 56413 నంబర్లో సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
వీడిన లాడ్జి హత్య కేసు మిస్టరీ.. రూమ్ నంబర్ 103లో జరిగింది ఇదే..
విజయనగరం: ఎస్.కోట పట్టణాన్ని మూడు రోజుల కిందట ఉలిక్కి పడేలా చేసిన స్థానిక చందన్ లాడ్జిలో మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్.గోవిందరావు వివరాలు వెల్లడించారు. ఈనెల 30వ తేదీన ఎస్.కోటలోని చందన్ లాడ్జి మేనేజర్ గనివాడ శ్రీనివాసరావు లాడ్జిలో ఒక మహిళ మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసుగా నమోదు చేశాం. ఘటనాస్థలిని పరిశీలించి రూమ్ నంబర్ 103లో మహిళ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం పంపించాం. తర్వాత విచారణలో మృతురాలు విశాఖ జిల్లా దేవరాపల్లి గ్రామానికి చెందిన ఆరిపాక ఈశ్వరమ్మగా గుర్తించాం. గత నెల 24న అరకు మండలం ఉరుముల గ్రామానికి చెందిన మాదాల శ్రీరాములు (జనసేన నాయకుడు) చందన్ లాడ్జిలో రూమ్ బుక్ చేశాడు. ఆ వ్యక్తే హత్యకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. నిందితుడు మాదాల శ్రీరాములును మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అరెస్టు చేశాం. ఈశ్వరమ్మను ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం హత్య చేసినట్లు నిందితుడు శ్రీరాములు విచారణలో అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. డబ్బుల కోసం గొడవపడి.. మృతురాలు ఈశ్వరమ్మ తనకు తెలుసని, ఆమెను లాడ్జికి తానే తీసుకెళ్లానని, తర్వాత డబ్బుల కోసం గొడవ పడ్డామని, ఆ గొడవలో తాను ఆమెను గోడకు గుద్దేయడంతో తలకు గాయమై పడిపోగా తర్వాత మెడకు చీర బిగించి హత్యచేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. మరుసటి రోజు లాడ్జికి వచ్చి మృతురాలి వంటిపై ఉన్న 4బంగారు గాజులు, దుద్దులు, ఉంగరం తీసుకుని, ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టినట్లు చెప్పాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ముత్తూట్ బ్యాంక్ నుంచి 60 గ్రాముల బంగారం, నిందితుడి నుంచి రెండు మొబైల్స్, పల్సర్ బైక్, లక్ష రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్సీ గోవిందరావు వివరించారు. హత్య కేసును ఛేదించిన సీఐలు, ఎస్సై ఇతర సిబ్బందిని డీఎస్పీ గోవిందరావు అభినందించారు. -
లాడ్జిలో ఏం జరిగిందో? ఏమో?
శృంగవరపుకోట: ఎస్.కోట పట్టణంలో ఆదివారం కలకలం రేపిన హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. చందన్ లాడ్జిలో వెలుగుచూసిన హత్యోదంతంలో హతురాలిని దేవరాపల్లికి చెందిన ఆరిపాక ఈశ్వరమ్మ(48)గా నిర్ధారించారు. కాగా ఈశ్వరమ్మ ఒంటిపైన ఉన్న బంగారం కోసమే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆమె కొన్నేళ్లుగా ఎస్.కోటలోనే నివాసం ఉంటోంది. అయితే ఈ హత్య కేసులో నిందితుడు ఎవరు? ఏ ఉద్దేశంతో హత్య చేశాడు? హత్య జరిగి ఎన్ని రోజులైంది? కేవలం బంగారం కోసమేనా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయి వివరాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. మరిన్ని కచ్చితమైన సాక్ష్యాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం -
లాడ్జిలో మహిళ దారుణ హత్య..
ఒడిశా: పట్టణంలోని విశాఖ–అరకు రహదారిలో ఉన్న చందన్ ఎ.సి లాడ్జిలో ఓ మహిళ హత్యకు గురైన విషయం ఆదివారం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా పట్టణవాసులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చందన్ లాడ్జి సర్వీస్ బాయ్ రూమ్ సర్వీస్ కోసం వెళ్లిన సమయంలో రూమ్ నంబర్ 103నుంచి దుర్వాసన వస్తోందని, చెప్పడంతో నిర్వాహకులు అనుమానంతో 100కి కాల్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి రూమ్ తలుపులు తెరిచి చూడగా లాడ్జి గదిలో మహిళ మృతదేహం పడి ఉండడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, క్లూస్‌టీమ్‌ను రప్పించారు. డీఎస్పీ గోవిందరాజు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూమ్ తీసుకున్నది అల్లూరి జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం పరిధి ఉరుముల గ్రామానికి చెందిన మాదల శ్రీరాములు ఈ నెల 24న పట్టణంలోని చందన్ ఎ.సి లాడ్జిలో రూమ్ నంబర్ 103ను బుక్ చేశాడు. 27 వరకూ ప్రతిరోజూ లాడ్జికి వచ్చి రోజువారీ అద్దె రూ.600 చెల్లించాడు. 29, 30 తేదీల అద్దె చెల్లించకపోవడంతో ఆదివారం ఉదయం 10.52గంటల సమయంలో కాల్చేస్తే ఫోన్‌పే చేస్తానని చెప్పినట్లు లాడ్జి సిబ్బంది తెలిపారు. లాడ్జిలో లేని సీసీ కెమెరాలు హత్య జరిగిన లాడ్జిలో ప్రవేశం వద్ద, రిసెప్షన్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల లాడ్జిలోకి వచ్చిన వారి వివరాలు నమోదు కాలేదు. హత్యలో ఎవరి ప్రమేయం ఉంది? ఎందరు ఉన్నారు? ఎప్పుడు జరిగింది? హత్యకు కారణం ఏమిటి? అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. హత్య జరిగి ఐదారు రోజులు హత్య ఘటనపై కొత్తవలస సీఐ చంద్రశేఖర్ వివరణ ఇస్తూ... లాడ్జిలోని రూమ్ నంబర్ 103లో దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేయడంతో వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసి మహిళ మృతదేహం ఉండడం గమనించాం. బహుశా హత్య జరిగి ఐదారు రోజులు కావచ్చని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. -
13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం... 31 ఏళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు: పదమూడేళ్ల బాలికను కిడ్నాప్‌చేసి ఆపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 31 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోని కాంచీపాడి గ్రామానికి చెందిన ఢిల్లీబాబు(30)పై వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు, కిడ్నాప్, స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఇతను తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను 2019లో కిడ్నాప్ చేశాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు ఢిల్లీబాబు బాలికను కిడ్నాప్ చేసి పూందమల్లిలోని ప్రైవేటు లాడ్జీలో ఉంచి 10 రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపగా తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణ తిరువళ్లూరు జిల్లా కోర్టులో సాగింది. విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తి సుభద్రదేవి తుది తీర్పు వెలువరించారు. బాలికను కిడ్నాప్ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష, అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, బాలికను నిర్బంధించినందుకు మరో ఏడాది జైలుశిక్ష విధించారు. కాగా తీర్పు అనంతరం నిందితుడిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. -
Anakapalle: విడాకులు కోరిందని కసితో హత్య చేసిన భర్త
అచ్యుతాపురం (అనకాపల్లి): అతనిది గాజువాక..ఆమెది అగనంపూడి. ఇద్దరివీ వేర్వేరు కులాలు...ఇద్దరూ ఇష్టపడ్డారు...పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. అయితే మూడు నెలల్లోనే ప్రేమ కాస్తా ఆవిరైపోయింది. ఆమెకు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దానికి భర్త వేధింపులు తోడయ్యాయి. దీంతో మూణ్ణెళ్లకే వారి ప్రేమ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటైంది. విసిగి వేసారిన భార్య విడాకులు కోరడంతో ప్రేమించిన భర్త పగబట్టాడు. భార్య ఉసురు తీశాడు. అచ్యుతాపురంలోని లాడ్జిలో గత నెల 29వ తేదీన మహాలక్ష్మి అనే వివాహిత హత్య కేసులో వెలుగు చూసిన విషయాలివి. ఈ కేసులో మృతురాలు తండ్రి ఎస్.సాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాజువాక బీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్, అగనంపూడిలో నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సాంబ కుమార్తె మహాలక్ష్మి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం లేనప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం మూడు నెలల వరకూ సజావుగా సాగింది. ఎస్టీ లంబాడీ కులానికి చెందిన మమహాలక్ష్మికి వంటలు రావని, కట్నం తేలేదని శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు చిన్నచూపుతో వేధించడం మొదలుపెట్టారు. దీనిని భరించలేక మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా శ్రీనివాస్ వేధింపులు మానలేదు. రాంబిల్లి మండలంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న మహాలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేని మహాలక్ష్మి దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు మృతురాలు తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరడంతో ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించారు. దీంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించిన మహాలక్ష్మిపై శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 29న అచ్యుతాపురంలోని లాడ్జిలో రూం తీసుకొని మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. మంచిగా మాట్లాడి లాడ్జికి రమ్మని కోరాడు. అతని మాటలు నమ్మిన మహాలక్ష్మి భర్తను కలవడానికి వెళ్లింది. అప్పటికే రెండు కత్తులు, మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ మహాలక్ష్మిపై సాయంత్రం 4 గంటలకు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి పొడిచాడు. ఆమె అరుపులు విని పక్కరూంలో ఉన్న వారు లాడ్జి మేనేజర్‌కు తెలపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాడ్జి తలుపులు తోసి లోపలకు వెళ్లగా రక్తపు మడుగులో మహాలక్ష్మి, బాత్రూంలో శ్రీనివాస్ పడి ఉన్నారు. వెంటనే ఇద్దరినీ అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మహాలక్ష్మి మృతి చెందింది. శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత కోలుకున్నాడు. ఈ నెల 8వ తేదీ ఉదయం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, జరిగినదంతా వెల్లడించాడని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. విడాకులు ఇస్తే తన జీవితం నాశనం అవుతుందని, తన లాగే మహాలక్ష్మి జీవితం నాశనం కావాలనే కక్షతో శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్టు తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ మురళి పాల్గొన్నారు. -
బాత్రూమ్ సింక్‌లో మత్తు ఇంజక్షన్లు.. మిస్టరీగా యువతి మృతి!
సాక్షి,విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో దారుణం చోటు చేసుకుంది. లాడ్జిలో మహాలక్ష్మి అనే యువతి అనుమానాస్పద మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. మహాలక్ష్మి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉండడం, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి ఈ మృతి పలు అనుమానాలకు తావు తీస్తోంది. వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌కుమార్ అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకుని అక్కడికి మహాలక్ష్మిని రప్పించారు. ఈ క్రమంలో ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించేసరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్న లాడ్జి సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్ హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో యువతి మృతి మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఇంటర్ నుంచి ప్రేమించుకుని కొద్ది నెలల క్రితం వరకు రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో వీరువురూ దూరంగా ఉంటున్నారు. శ్రీనివాస్ మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి లాడ్జికి రప్పించాడు. ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగిందో గానీ యువతి మృతి చెందగా.. శ్రీనివాస్ కత్తి గాయలతో ఉన్నాడు. పోలీసులు జరిపిన తనిఖీలో లాడ్జి గదిలోని బాత్రూం సింక్‌లో మత్తు ఇంజక్షన్లు ఉండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
Srikalahasti: లాడ్జికి తీసుకెళ్లి.. ఆపై మత్తు మందు ఇచ్చి..
క్రైమ్: మోసాన్ని మోసపోయేదాకా గుర్తించకపోవడం కొందరి ప్రత్యేకత. అలాంటిదే ఈ ఘటన. తిరుపతిలో ఓ మహిళ చేసిన ఘరానా మోసం బయటపడింది. దైవ దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తిని పూర్తిగా దోచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బస్సులో పరిచయమై లాడ్జికి తీసుకెళ్లింది కిలాడి మహిళ. దీంతో వెళ్లిన అతగాడికి.. ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి దోచుకుంది ఆ మహిళ. సుమారు 75 తులాల బంగారం,20 వేల నగదు, ఓ సెల్ ఫోన్ మాయం చేసి పరారైంది. ఆ విలువ సుమారు రూ. 6లక్షల రూపాయలు అంటున్నాడు బాధితుడు. బాధితుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు పోలీసులు. తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ కిలేడీ గురించి గాలింపు చేపట్టారు. -
గతేడాది యువతి మిస్సింగ్.. తీరా చూస్తే లాడ్జీలో..
తిరువొత్తియూరు(చెన్నై): కేరళకు చెందిన యువతిని లాడ్జీలో బంధించి చిత్ర హింసలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఇడుక్కి జిల్లా వెల్లత్తువల్ సమీపంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ 20 ఏళ్ల కుమార్తె మానసికంగా ఎదుగుదల లేనిది. ఈమె గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆటో డ్రైవర్ కేరళ రాష్ట్రం వెల్లత్తువల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తీవ్రగాలింపు తరువాత ఇటీవల పోలీసులు సదరు యువతిని రక్షించారు. విచారణలో నాగర్‌కోయిల్‌కు బస్సులో తీసుకొచ్చిన ఓ యువకుడు ఆ యువతిని ఓ లాడ్జిలో బందీ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు నాగర్‌కోయిల్ మహిళా పోలీసు కేసు నమోదు చేసి విరుదునగర్ జిల్లా నాచ్చర్పాలయంకు చెందిన అజిత్ క్లింటన్ (25)ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. చదవండి: అప్పటి వరకు దోస్తులతో జాలీగా ముచ్చట్లు.. క్షణాల్లోనే ఆనందం ఆవిరి -
లాడ్జిలో వ్యభిచారం.. వేర్వేరు రూమ్‌ల్లో రెండు జంటలు.. షాకిచ్చిన పోలీసులు
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): పట్టణంలోని ఎస్ఎస్ గ్రాండ్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో సీఐ వి.శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి వేరు వేరు రూమ్‌లలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి యజమాని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, లాడ్జిలో పనిచేసే వీరబాబును అరెస్టు చేసినట్లు రామచంద్రపురం ఎస్ఐ డి.సురేష్‌బాబు గురువారం విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? -
లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న లాడ్జీ యజమానితో పాటు ఐదుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ ఎదురుగా కర్నాటి రామారావు అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర లాడ్జీని నిర్వహిస్తున్నాడు. రిసెప్షనిస్ట్‌గా యడ్డ సహదేవ్ పని చేస్తున్నాడు. సెక్స్ వర్కర్లను నియమించుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం రాత్రి వెంకటేశ్వర లాడ్జీపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. విటులు దేవరాజు, మాణిక్ స్వరూప్, కర్నూల్ ప్రాంతాన్ని చెందిన ఒక మహిళ, నల్గొండ జిల్లా డిండికి చెందిన మరో మహిళ పట్టుబడ్డారు. లాడ్జీ నిర్వాహకులు కర్నాటి రామారావు, సహదేవ్‌ను కూడా అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్, రూబీ లాడ్జీలతో కూడిన భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే సోమవారం రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఎనిమిది మందిని పొట్టనపెట్టుకుంది. ఉల్లంఘనలు ఇలా.. ► భవనం సెల్లార్, గ్రౌండ్ ప్లస్ ఫోర్‌తో పాటు పెంట్ హౌస్‌తో కలిపి మొత్తం ఆరు అంతస్తులు ఉంది. సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఈ–బైక్స్ షోరూమ్, సర్వీసింగ్ పాయింట్‌గా మార్చారు. ఈ మొత్తం విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. ఇది మచ్చుకైనా లేదు. భవనం చుట్టూ ఫైరింజన్ స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో తూర్పు వైపు రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ మీటర్ వెడల్పు కూడా లేదు. అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ ఉండాలి. భవనంలో ఎమర్జెన్సీ లైట్లు తగిన సంఖ్యలో లేవు. గ్లో సిస్టమ్ లేనే లేదు. ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రత్యేక లిఫ్ట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. స్టెయిర్ కేస్ వద్ద ఉన్నది కూడా లాడ్జిలో బస చేసిన వారికీ ఉపయుక్తంగా లేదు. ► మంటలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఇందులో వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్ మాత్రం ఉన్నాయి. అవి ఎంత వరకు పని చేశాయన్నది తేలాల్సి ఉంది. విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ రూబీ లాడ్జిలో మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటిది ఎక్కడా కనిపించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. ఎంత వెతికినా ఇవి ఎక్కడా కనిపించలేదు. నిప్పుల్లో నిబంధనలు అగ్ని మాపక నిబంధనల్లో రూబీ లాడ్జీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కథ షరామామూలే. అనుమతుల్లేని భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, పైస్థాయిలో పైరవీలతో అనుమతులు తీసుకోవడమో, మేనేజ్ చేయడమో నగరంలో సాధారణంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభశూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సోమవారం నాటి రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి కావాల్సిందే. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద మృతులతో గాంధీ మార్చురీ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వాయుమార్గంతో పాటు ప్రత్యేక అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు తరలించారు. మిగిలిన అయిదు మృతదేహాలకు సంబంధించి ఆయా వ్యక్తుల సంబంధీకుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించగా, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్‌ల నేతృత్వంలో మూడు వైద్య బృందాలు పోస్టుమార్టం విధులు నిర్వహించారు. విషవాయువుల వేడి పొగతోనే.. బ్యాటరీలకు మంటలు అంటుకుని కెమికల్ టాక్సిన్స్ (విష వాయువులు)తో కూడిన వేడి పొగ పీల్చడం వల్లే ఊపిరి అందక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాల ఊపిరితిత్తులకు అంటుకున్న పొగతో కూడిన విషవాయువు (స్మాగ్) కడుపు, ఇతర అవయవాల నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మృత్యువు పిలిచినట్టు.. విజయవాడకు చెందిన అల్లాడి హరీష్‌ను మృత్యువు పిలిచిందని ఆయన స్నేహితుడు శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈక్వటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో పనిచేస్తున్న హరీష్ ట్రైనింగ్ నిమిత్తం నగరానికి వచ్చే ముందే సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ లాడ్జీలో బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి ప్రమాదంలో మృతి చెంది కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భోరున విలపించారు. మృతునికి భార్య కావ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పన్నెండు రోజుల క్రితమే జన్మించాడు. మార్చురీలో హరీష్ మృతదేహాన్ని చూసి ఆయన తండ్రి కోటేశ్వరరావు రోదనలు కలచివేశాయి. చెన్నై నుంచి వచ్చి.. మృత్యువాత విధి నిర్వహణలో భాగంగా చెన్నై నుంచి నగరానికి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి అగ్నిప్రమాదంలో మృతి చెందారు ఆచీ మసాల సంస్థ ఉద్యోగులు బాలాజీ, సీతారామన్‌లు. ఆచీ మసాల ఆడిటర్ బాలాజీ, రీజనల్ సేల్స్ మేనేజర్ సీతారామన్‌లు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి, రాత్రి 8 గంటలకు లాడ్జీకి వచ్చి అగ్ని ప్రమాదంలో అసువులు బాశారని ఆచీ మసాల స్థానిక సేల్స్ మేనేజర్ మహేందర్ కన్నీటి పర్యంతమయ్యారు. బాలాజీ, సీతారామన్‌ల మృత దేహాలను విమానంలో చెన్నైకి తరలించారు. ఢిల్లీకి చెందిన అన్నదమ్ములు... ఢిల్లీకి చెందిన సందీప్ మాలిక్, రాజీవ్ మాలిక్‌లు అన్నదమ్ములు. ఆలివ్ కంపెనీలో శిక్షణ కోసం సిటీకి వచ్చి రూబీ లాడ్జీలో బస చేసి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు నగరానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లాడ్జి మొదటి అంతస్తులోని రూమ్ నుంచి చెక్ఔట్ చేసిన ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనకు కారణం అదే) -
Secunderabad Fire Tragedy: బ్యాటరీ పేలుడు వల్లే..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన పొగ ప్రభావంతోనే లాడ్జీలో బస చేసిన వాళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో క్షతగాత్రుడు మంగళవారం మృతిచెందాడు. దీంతో ఈ దుర్ఘటనలో కన్నుమూసిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన హోటల్, విద్యుత్ ద్విచక్ర వాహనాల షోరూమ్ నిర్వహిస్తున్న రాజేందర్‌సింగ్ బగ్గా, సుమిత్ సింగ్లతోపాటు మరికొందరిపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సెల్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు.. హైదరాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన రాజేంద్రసింగ్ బగ్గా, సుమీత్‌సింగ్ కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ రోడ్డులో రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారు. అలాగే రెండేళ్ల క్రితం ఈ–స్కూటర్స్, బైక్స్ వ్యాపారంలోకి దిగారు. ఓ సంస్థకు చెందిన ఈ–స్కూటర్స్ డీలర్షిప్ తీసుకొని షోరూం, సర్వీసింగ్ సెంటర్లను లాడ్జి గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్లో అక్రమంగా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్, ఈ–స్కూటర్స్ కార్యాలయం, మొదటి అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు మొత్తం 28 గదులు ఉన్నాయి. ఐదో అంతస్తులోని పెంట్ హౌస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో... సోమవారం రాత్రి 9:17 గంటలకు సెల్లార్‌లోని ఈ–స్కూటర్స్ సర్వీసింగ్ పాయింట్లో చార్జింగ్ పెట్టి ఉంచిన ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఇవి మిగతా వాహనాలకు, నిల్వఉంచిన టైర్లు, ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులకు అంటుకోవడంతో మంటలతోపాటు దట్టమైన పొగ, విషవాయువులు వె లువడ్డాయి. ఆ సమయంలో లాడ్జీలో 25 మంది అతిథులు, 8 మంది ఉద్యోగులు ఉన్నారు. మెట్లమార్గం సెల్లార్ వరకు ఉండటంతో... ఈ భవనాన్ని సరైన వెంటిలేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం, ఐదో అంతస్తు నుంచి సెల్లార్ వరకు నిర్మించిన మెట్ల మార్గం మీటర్ కంటే తక్కువ వెడల్పుతో ఇరుకుగా ఉండటంతో ప్రమాద సమయంలో అదే చిమ్నీ గొట్టంలాగా మారిపోయింది. సెల్లార్ నుంచి విషవాయువులు, నల్లటి పొగ దీని ద్వారానే లాడ్జి మొత్తం వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో స్టెయిర్ కేస్‌కు, రిసెప్షన్‌కు మధ్య తలుపు మూసి ఉండటంతో పొగ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. పొగను గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీయగా మొదటి, రెండో అంతస్తుల్లో బస చేసిన వారిలో నలుగురు గదుల్లోనే, మరో ముగ్గురు మెట్ల మార్గంలో ప్రాణాలు విడిచారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు, నాలుగో అంతస్తుల్లో బస చేసిన కొందరిని స్థానికులు, పోలీసులు.. అగ్నిమాపక అధికారులు కాపాడారు. పెంట్‌హౌస్‌లోని రెస్టారెంట్లో భోజనం చేస్తున్న నలుగురు పక్క భవనం టెర్రస్‌పైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. భవనానికి స్ప్రింక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినా సెల్లార్లో అది పనిచేసిన ఆనవాళ్లు కనిపించలేదు. విషవాయువులు పీల్చడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించారని హోం మంత్రి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై పోలీస్, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాలలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించామని హోం మంత్రి వెల్లడించారు. కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
రూబీ లాడ్జి విషాదంపై కీలక రిపోర్ట్.. నివేదికలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: రూబీ లాడ్జి విషాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. లీథియం బ్యాటరీల పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. భవనానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉంది. లిప్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. చదవండి: రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో? అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయలేదు. భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండిపోయింది. భవనానికి కనీసం కారిడార్ కూడా లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు. భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో మొదటిగా అగ్ని ప్రమాదం మొదలైంది.తర్వాత మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయని నివేదికలో ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. -
రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని రూబీ లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన.. నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని లేవనెత్తుతోంది. ఇప్పటికే ఈ భవనం ఓనర్ రంజిత్ సింగ్ బగ్గాను నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. రూబీ లాడ్జి బిల్డింగ్ అనుమతులపైనే ఇప్పుడు ప్రముఖ చర్చ నడుస్తోంది. తక్కువ స్పేస్‌లో అంత బిల్డింగ్ ఇరుక్కుగా కట్టడం, వాటికి అనుమతులు ఎలా దక్కాయన్న కోణంలోనూ ఘటనస్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఫైర్ ఎన్ఓసీ(నో అబ్జక్షన్సర్టిఫికెట్)పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు అంతస్తుల వరకే జీహెచ్ఎంసీ నుంచి ఫైర్ ఎన్ఓసీ తీసుకున్న రూబీ లాడ్జి.. మిగిలిన రెండు ఫ్లోర్లకు ఎలాంటి ఫైర్ అనుమతులు తీసుకోలేదన్నది సమాచారం. పైగా ఒకే భవనంలో.. పైన లాడ్జీ, కింద ఈ-బైక్ షోరూం, సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వాహణ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న కోణంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. లాడ్జీ సెల్లార్లో గ్యాస్ సిలిండర్లు సైతం నిల్వ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక లాడ్జికి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గం కావడంతో అప్పటికే పొగలో చిక్కుకున్న వాళ్లకు ఇబ్బందికరంగా మారిందని అధికారులు గుర్తించారు. జంట నగరాల్లో ఈ తరహా కాంప్లెక్స్‌లు వందల్లో ఉండొచ్చని వాదన బలంగా వినిపిస్తోంది. కమర్షియల్ కాంప్లెక్స్ అయినప్పటికీ అగ్ని ప్రమాద నివారణ చర్యలు లేకపోవడం ఒక ఎత్తైతే.. నిరంతరం తనిఖీలు చేయని అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. భవనం పద్దెనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటేనే ఫైర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందని ఫైర్ డిజి సంజయ్ జైన్ చెప్పడం మరోవైపు జీహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉండడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వెరసి.. నిర్లక్ష్యం కారణంగానే ఎనిమిది ప్రాణాలు బుగ్గి అయ్యాయన్నది చేదు వాస్తవం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని.. ముందు ముందు అనుమతుల విషయంలో కఠినంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న ఇలాంటి భవనాలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. ఆ ఇద్దరు ఫోన్లో ఉండగా.. పని నిమిత్తం వచ్చిన ఇద్దరు ఆచి మసాలా ఉద్యోగులు రూబీ ప్రమాదంలో మరణించడం బాధాకరం. కంపెనీలో ఆడిటర్ అయిన సీతారామన్, మార్కెటింగ్ ఉద్యోగి అయిన బాలాజీ.. నిన్న(సోమవారం) రూబీ లాడ్జ్ లో దిగారు. సీతారామన్ వాళ్ల బ్రదర్ తో ఫోన్లో మాట్లాడిన పది నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఇక బాలాజీ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులకు కాల్ చేసి హెల్ప్, హెల్ప్ అంటూ కేకలు వేశారు. అయితే.. ఆ పొగలోనే ఆయన ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు రూబీ రిసెప్షన్‌కు కాల్ చేయగా.. అప్పటికే ఆయన చనియారు. ఇదీ చదవండి: రూబీ లాడ్జి.. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరి -
రూబీ లాడ్జి ప్రమాదం: అంత ఘోరం ఎలా జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న సికింద్రాబాద్ రూబీ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పెను విషాదం నింపిన ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. రూబీ లాడ్జి ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి ఓనర్ రంజితసింగ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాడ్జిలో దిగనవాళ్లు.. కాలిన గాయాలతో పాటు ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. గాంధీతో పాటు మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఫోన్ నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. ఆర్డీవో ఆద్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం? ఇక ప్రమాద సమయంలో కాంప్లెక్స్‌లో 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు తేలింది. అయితే ప్రమాదానికి ఈ-బైక్ బ్యాటరీ పేలుడే కారణమా? లేదంటే విద్యుత్ షాట్ సర్క్యూటే కారణమా? అనే విషయాలపై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ఆరాలు తీస్తున్నారు. సెల్లార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్ సెంటర్ ఉండడం, అలాగే.. లాడ్జి వున్న చోట.. ఎలక్ట్రిక్ బైక్స్ నిర్వాహణకు ఎలా అనుమతి ఇచ్చారని కిందిస్థాయి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం క్లూస్ సేకరించాయి. మరోవైపు కాంప్లెక్స్‌లో అగ్నిమాపక శాఖ నిబంధనలు(ఫైర్ సేఫ్టీ రూల్స్) ఏ మాత్రం లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు దారులు లేవని, బిల్డింగ్ మొత్తానికి ఒకే దారి ఉండడం వల్లే ఘోరం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెట్ల మార్గం గుండా కిందకు రాలేక.. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. సాయంత్రకల్లా ప్రమాదంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూబీ లాడ్జి ప్రమాదంపై ఫైర్ అధికారి ఏమన్నారంటే.. -
రూబీ లాడ్జ్: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు
సాక్షి, రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జ్‌లో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక, లాడ్జీ లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. దీంతో లాడ్జీలో ఉన్న వారంతా మెట్ల మార్గంలో కిందకు రాలేకపోయారు. దట్టమైన పొగ కారణంగా హైడ్రాలిక్ క్రేన్ సాయంతో భవనం ఉన్న 9 మందిని కాపాడినట్టు తెలిపారు. మరోవైపు.. ఘటన స్థలానికి క్లూస్ టీమ్, స్థానిక తహసీల్దార్ కూడా చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కారణాలపై విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాదంలో స్పాట్‌లోని ముగ్గురు చనిపోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. కాగా, మృతదేహాలు గాంధీ ఆసుప్రతిలో ఉండగా.. మరికొందరు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక, మృతుల్లో విజయవాడకు చెందిన హారీశ్, ఢిల్లీకి చెందిన వీరేందర్, చెన్నైకి చెందిన సీతారామన్, పలువురు ఉన్నారు. కాగా, ఈ ప్రమాదం అనంతరం పోలీసులు.. రూబీ లాడ్జీని సీజ్ చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారి రంజిత్ సింగ్‌పై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై మూడు బృందాలు దర్యాప్తు చేపటినట్టు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హోటల్లో బస చేసిన కొందరి పేర్లు ఇవే.. 1) అబ్రహం వాల్తాలా 2) ఆర్త్ పటేల్ 3) మహేందర్ సింగ్ భట్ 4) అశ్వని శిలా 5) ఠాకూర్ 6) పృథ్వీరాజ్ 7) చందన్ ఈతి 8) అషోత్ మామిదువాట్ 9) దేబాషిస్ గుప్త 10) ఇర్ఫాన్ ఉస్మా 11) అశుతోష్ సింగ్ 12) మొహమ్మద్ జావిద్ 13) లావర్ యాదవ్ 14) సునీల్ కుమార్ 15) వర్మ 16) బిన్ శియల. -
లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య
సాక్షి, శ్రీసత్యసాయి: తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆమెది హత్యగా తేల్చారు జిల్లా పోలీసులు. ఆమెతో పాటు ఉన్న స్నేహితుడు, ప్రియుడైన మహేష్‌వర్మ ఆమెను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. వరంగల్‌కు(ములుగు జిల్లా మంగపేటకు) చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కర్ణాటకలోకి చిక్‌బళ్లాపూర్ మెడికల్కాలేజీలో డీఎన్బీ (పీజీ) చేస్తోంది. అయితే అక్షిత, సంగారెడ్డి పటాన్‌చెరువుకు చెందిన మహేష్ వర్మ అనే వ్యక్తితో కలిసి తాజాగా హిందూపురంలోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయినట్లు మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు. ఇద్దరం స్నేహితులమని, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నామని, లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని పోలీసులకు చెప్పాడు మహేష్. దీంతో స్థానికంగా అనుమానాస్పద మృతి కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో అతను స్నేహితుడు కాదని, ప్రియుడని తేలింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న మహేష్.. అక్షితతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. లాడ్జిలో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అయితే.. ఆమెను ఎందుకు చంపాడనే విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. అక్షితకు వివాహమైందని, ఆమె భర్త వరంగల్‌లో ఆర్థోపెడిక్ వైద్యుడు కాగా, ఏడాది పాప కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: ప్రియుడి మృతి.. ప్రియురాలి పరిస్థితి విషమం -
లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు
హుబ్లీ: పేరుమోసిన నేరగాడు, విచారణ ఖైదీ లాడ్జిలో ప్రేయసితో ఉండగా పోలీసులు దాడి చేశారు. వివరాలు... బచ్చా ఖాన్ అనే వ్యక్తిపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో బళ్లారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధార్వాడలో మరో కేసు విచారణ కోసం శనివారం తీసుకెళ్లారు. అదే అదనుగా అతడు రాత్రికి ప్రియురాలిని ఓ లాడ్జికి పిలిపించి, తానూ అక్కడే మకాం వేశాడు. ఇందుకు ఎస్కార్టుగా వచ్చిన బళ్లారి పోలీసులు తమవంతు సహకారం అందించారు. దీన్ని పసిగట్టిన ధార్వాడ పోలీసులు తక్షణమే సదరు లాడ్జిపై దాడి చేసి బచ్చాఖాన్‌ను ధార్వాడ విద్యానగర్ స్టేషన్‌కు పట్టుకెళ్లారు. నిందితునితో చేయి కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బళ్లారి ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ యోగీష్ ఆచారి, పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, రవికుమార్, సంగమేశ కాళగిలను బళ్లారి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. లాడ్జి పై దాడి సమయంలో బచ్చా ఖాన్ తప్పించుకోవడానికి ప్రయతి్నంచాడని తెలిసింది. (చదవండి: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు) -
లాడ్జికి తీసుకెళ్లి.. ఆ రోజు రాత్రి..
బనశంకరి(బెంగళూరు): దీపా పదన్ (37) అనే ఒడిశాకు చెందిన మహిళ యశవంతపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక లాడ్జిలో హత్యకు గురైంది. ఈ నెల 9న ఆమెను స్నేహితుడు యశవంతపుర రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి వెనుక నుంచి ఆమెకుట ఊపిరాడకుండా చేసి హత్యచేసి పారిపోయాడు. మరుసటి రోజు సమాచారం తెలిసి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హంతకుని కోసం గాలింపు చేపట్టారు. లాడ్జీ, చుట్టుపక్కల సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించారు. మరో ఘటనలో.. రౌడీ ముఠా అరెస్టు బనశంకరి: దోపిడీకి పథకం పన్నిన రౌడీ బాంబే సలీం, అతని నలుగురు అనుచరులను సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆవలహళ్లి గ్రామ గొట్టిగెరెరోడ్డు పెట్రోల్ బంక్ వెనుక రోడ్డులో దోపిడీకి పొంచి ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు దాడిచేసి రౌడీ బాంబే సలీం, నదీమ్, రియాజ్, ఇమ్రాన్, అష్రఫ్‌ను అరెస్ట్‌చేసి, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
కదిరి లాడ్జి బాగోతంలో.. కథ.. స్క్రీన్‌ప్లే అంతా టీడీపీనే!
కదిరి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రామయ్య లాడ్జి వివాదం ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ప్రత్యర్థి పార్టీని అభాసుపాలు చేయడానికి చేసిందేనని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీలోని రామయ్య ప్రత్యర్థి వర్గీయులు స్పష్టంచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కథ, స్క్రీన్‌ప్లే అంతా ఆయనా, టీడీపీదేనని వారు చెబుతున్నారు. వీరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5, తదితర ఎల్లో మీడియా తోడయ్యాయని.. వీటికి రామయ్య, టీడీపీ బాగోతం కనిపించడంలేదా అని కదిరి ప్రజలు మండిపడుతున్నారు. వివాదం ఏమిటంటే.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తన కుటుంబానికి చెందిన ‘జొన్నా లాడ్జి’ని 2018లో అనంతపురానికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ యజమాని శ్రీధర్‌రెడ్డికి రూ.9.50 కోట్లకు విక్రయించారు. రిజిస్ట్రేషన్ సమయానికి రామయ్య అడ్డం తిరిగాడు. కానీ, మిగిలిన అన్నదమ్ములు మాత్రం తమ వాటా (60 శాతం)ను శ్రీధర్‌రెడ్డికి రిజిస్టర్ చేయించారు. రామయ్య మాత్రం తన 40 శాతం వాటాలో 20 శాతం వాటాను వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి అమ్మేశాడు. చంద్రారెడ్డి దాన్ని తిరిగి శ్రీధర్‌రెడ్డికి విక్రయించాడు. మొత్తమ్మీద 80 శాతం వాటా ఇప్పుడు శ్రీధర్‌రెడ్డిదే. కానీ, నాలుగేళ్లుగా లాడ్జిలో వచ్చిన ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తూ.. దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి అప్పగించకుండా జొన్నా రామయ్య గూండా గిరి చేస్తున్నారు. రామయ్య వైఖరితో అన్నదమ్ముల విభేదం రామయ్య వ్యవహార శైలి నచ్చక సొంత అన్నదమ్ములే ఆయనతో విభేదించారు. ఈ నెల 23న జొన్నా సోదరులంతా కుటుంబ సమేతంగా శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్జి ముందు బండ రాళ్లు వేసి రాకపోకలను స్తంభింపజేశారు. అక్కడే ఉన్న రామయ్యను లాడ్జిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని రామయ్య టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌తోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో శనివారం లాడ్జి ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిజానికి ఈ వ్యవహారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డికి గానీ ఎలాంటి సంబంధమూలేదు. కానీ, రామయ్య వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. అయితే.. వీరి వ్యవహార శైలిని టీడీపీలోనే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మా కుటుంబాన్ని రోడ్డుకీడ్చాడు : జొన్నా సోదరులు ఈ ఘటనపై జొన్నా సోదరులు స్పందిస్తూ.. ‘జొన్నా ఫ్యామిలీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. మా కుటుంబాన్ని ఇప్పుడు బజారుకీడ్చిన మా అన్న రామయ్య కొందరి మాటలు విని, లాడ్జిని స్వాధీనం చేయకుండా జొన్నా కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు’ అని ఆరోపించారు. -
లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా?
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): లాడ్జి విక్రయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ అండతో చెలరేగిపోతున్న రామయ్య తీరును చివరకు ఆయన సోదరులే తప్పుబడుతున్నారు. శనివారం ఈ వివాదం కాస్త తారస్థాయికి చేరుకుంది. వివరాలు.. మూడున్నర సంవత్సరాల క్రితం తన లాడ్జిని రూ.9.50 కోట్లకు కదిరికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య విక్రయించి అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే తమ వాటా కింద ఉన్న 60 శాతాన్ని శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య సోదరులు రిజిస్టర్ చేయించారు. చదవండి👉 అసలైన ఉన్మాది చంద్రబాబే.. అయితే జొన్నా రామయ్యకు చెందిన వాటాను రిజిస్ట్రేషన్ చేయించకుండా అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డిని తిప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాక లాడ్జిని సైతం అప్పగించకుండా ఆదాయాన్ని తానే తీసుకుంటున్నారు. ఇటీవల తన 40 శాతం వాటాలోని 20 శాతాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి జొన్నా రామయ్య విక్రయించారు. ఆ వాటాను కూడా శ్రీధర్‌రెడ్డి కొనుగోలు చేయడంతో దాదాపు 80 శాతం వాటా ఆయనకే చెల్లుబాటైంది. కుటుంబానికి చెడ్డపేరు రాకుండా.. రామయ్య తీరుతో కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సోదరులు శనివారం శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్డి వద్దకు చేరుకుని బండరాళ్లు వేసి రామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ అన్న రామయ్య కారణంగా జొన్నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకుని లాడ్జిని శ్రీధర్‌రెడ్డికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పట్టణ ప్రజలు సైతం రామయ్య తీరును తప్పుబట్టారు. కందికుంట తీరుపై ప్రజల అసహనం లాడ్జి వద్ద వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామయ్యకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేయడంతో కందికుంటపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
సెలవుల సమయంలో ఇంటికి వచ్చి వెళ్తుంటాడు.. ఏం జరిగిందో సడన్‌గా..
హొసపేటె(బెంగళూరు): తాలూకాలోని ధర్మసాగర గ్రామానికి చెందిన రంగారెడ్డి(46) అనే ప్రైవేటు కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన బెంగళూరులోని వోల్వో కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ధర్మసాగరలోనే ఉంటున్నారు. రంగారెడ్డి సెలవుల సమయంలో వచ్చి వెళ్తుంటాడు. ఈక్రమంలో బుధవారం హొసపేటెలోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న యాత్రి నివాస్‌లో గది అద్దెకు తీసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాత్రి నివాస్ సిబ్బంది గమనించి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు తానే కారణమని రంగారెడ్డి రాసినట్లుగా డెత్‌నోట్ లభించిందని టౌన్ పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. బెకును ఢీకొన్న కారు, ఒకరి మృతి మైసూరు: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన పిరియా పట్టణం తాలూకా సిగూరు గ్రామం మెయిన్ రోడ్డులో బుధవారం జరిగింది. మృతుడిని ఇదే తాలూకా వేలూరుకు చెందిన షడక్షరి స్వామి(35)గా పోలీసులు గుర్తించారు. ఈయన బైక్‌పై వెళ్తుండగా కేరళకు చెందిన కారు ఢీకొంది. ప్రమాదంలో షడక్షరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. చదవండి: నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక ఇంట్లోనే ఒక్కదాన్నే వదిలేసి.. -
ఏం జరిగింది.. ఉద్యోగం కోసమని వచ్చి.. లాడ్జిలో ఆత్మహత్య
సాక్షి,రాంగోపాల్ పేట్(హైదరాబాద్): ఉద్యోగాన్వేషణలో ఉన్న ఓ యువకుడు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట శ్రీనగర్ కాలనీ వాసి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి (26) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం చూసుకునేందుకు ఈ నెల 26న నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని గోకుల్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా అతడు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది వెళ్లి గది తలుపులు కొట్టినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వెళ్లి కిటికీలో నుంచి లోపల చూడగా టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో తలుపు గడియను తొలిగించి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందినట్లుగా గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా అతన్ని సిద్దిపేట వాసిగా గుర్తించారు. అయితే అదే సమయంలో అతడి సెల్‌ఫోన్‌కు కుటుంబసభ్యుల నుంచి ఫోన్ రావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలియజేశారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: Extramarital affair: పెళ్లికాకుండానే తల్లయిన యువతి -
నిశ్చితార్థం రోజునే విషాదం
సాక్షి, ఖమ్మం: పోలీసు శాఖలోని ఓ ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వ్) కానిస్టేబుల్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. అయితే, ఇదేరోజు ఆయన నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞనారాయణపురానికి చెందిన కంచెపోగు వెంకటేశ్వర్లు– సుజాత కుమారుడు అశోక్‌కుమార్(28) 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ములుగు జిల్లాలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం బదిలీ అయ్యారు. ఇంకా రిలీవ్ చేయకపోవడంతో ములుగు జిల్లాలోనే అటాచ్మెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, అశోక్‌కుమార్‌కు తన స్వగ్రామం పక్కనే ఉన్న చిన్నకోరుకొండికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు ఈ నెల 10న నిశితార్థం ఉండగా, 8న సెలవు పెట్టి కల్లూరుకు బయలుదేరాడు. ములుగు నుంచి ఖమ్మం వచ్చి స్థానిక గాంధీచౌక్‌లోని బడ్జెట్ లాడ్జీలో అర్ధరాత్రి దాటాక గదిని అద్దెకు తీసుకున్నాడు. కాగా, 9వ తేదీ సాయంత్రం హోటల్ రూమ్‌బాయ్ గది కాలింగ్ బెల్ కొట్టినా స్పందించలేదు. సోమవారం ఉదయం కూడా స్పందించకపోవడంతో హోటల్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు వచ్చి పరిశీలించగా అశోక్‌కుమార్ ఉరేసుకుని కనిపించాడు. జేబులో ఐడీకార్డును చూసి ఆయన ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకోవడం, ఫ్యాన్ నుంచి మంచానికి తక్కువ దూరం ఉండటంతో ఉరిపడ్డాక తాడు సాగే అవకాశముందని, అందుకే ఆయన మంచంపై కూర్చున్న రీతిలో ఉన్నారని, తాడు పెద్దగా లేకపోవడంతో ఆయన పడిపోకుండా అలాగే ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిశ్చయ తాంబూలాల రోజునే... అశోక్‌కుమార్ నిశ్చయతాంబూలం సోమవారం జరగాల్సి ఉండగా, ఇదేరోజు విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా పెళ్లి ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ములుగు జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం బదిలీ అయిన అశోక్‌కుమార్‌ను మరికొంతకాలంపాటు అక్కడే విధులు నిర్వర్తించాలని అధికారులు సూచించారని, అయితే, బదిలీ ఇష్టం లేకపోవడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
ప్రేమించిన యువతితో లాడ్జికి.. కొందరు యువకులు గుర్తించి
సాక్షి, కర్నూలు: కర్నూలులోని గౌరిగోపాల్ హాస్పిటల్ వద్దనున్న మ్యారియట్ లాడ్జిలో ప్రేమికులు తలదాచుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం కలకలం లేపింది. నందికొట్కూరుకు చెందిన కురువ యువకుడు, మరో సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. మంగళవారం సాయంత్రం యువతికి బుర్కా ధరించి మ్యారియట్ లాడ్జిలోని గదిలోకి తీసుకెళ్లడంతో అక్కడున్న ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు గుర్తించి గొడవకు దిగడంతో పెద్దెత్తున జనం గుమిగూడారు. ఈలోగా 3వ పట్టణ సీఐ తబ్రేజ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రేమికులతో పాటు గొడవ చేసిన యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. చదవండి: (Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి) -
దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..
Matheran Crime News: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌లో ఓ మహిళా పర్యాటకురాలు దారుణ హత్యకు గురైన సంఘటనలో రాయ్‌గఢ్ పోలీసులు ఒక ఐటీ ఇంజనీర్‌ను అరెస్ట్ చేశారు. పన్వేల్‌కు చెందిన రామ్‌పాల్ అనే వ్యక్తి తన భార్య పూనమ్‌పై అనుమానంతోనే ఆమెను లాడ్జిలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. మాథేరాన్‌లోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో గది కావాలని శనివారం సాయంత్రం ఓ జంట వచ్చింది. లాడ్జ్ సిబ్బంది నియమాల ప్రకారం ఆ జంట వివరాలు రిజిస్టర్లో రాసుకొని వారికి గది ఇచ్చారు. ఆదివారం ఉదయం లాడ్జ్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి గది లోపలికి వెళ్లగా, బెడ్ కింద తల లేని మొండెం కనపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి భయపడిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అంతటా సోదా చేశారు. కానీ తల దొరకలేదు. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పన్వేల్‌లోని ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, దర్యాప్తులో భాగంగా తనిఖీ చేస్తుండగా, రిజిస్టర్లో రాసిన పేరు, చిరునామా తప్పుడు వివరాలని తేలింది. ఈ జంట నుంచి లాడ్జ్ యజమాని కేతన్ రమాణే ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకోలేదు. దీంతో ఈ హత్య కేసు చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు, లాడ్జింగులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. చదవండి: (రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్) మాస్క్ ధరించి ఉండటంతో ఆ మహిళ భర్త ముఖం గుర్తించడం కష్టతరంగా మారింది. ఇదిలావుండగా, సోమవారం ఉదయం మాథేరాన్‌లో ఓ చోట ఓ హ్యాండ్ బ్యాగ్ లభించింది. సీసీ టీవీ ఫుటేజ్‌లో మహిళ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగు, పోలీసులకు దొరికిన బ్యాగు ఒకటేనని తేలింది. దీంతో ఆ బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను ముంబైలోని గోరేగావ్‌కు చెందిన 30 ఏళ్ల పూనమ్ పాల్గా గుర్తించారు. అదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా తమ కూతురు అదృశ్యమైనట్లు గోరేగావ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మృతదేహం పూనమ్‌దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు
సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకొని గుట్టురట్టు చేశారు. శివాజీచౌక్‌లో ఓ ఫంక్షన్ పక్కనే గల లాడ్జీపై పట్టణ సీఐ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం దాడి నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న 8 మంది విటులతోపాటు యువతులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోని విచారణ నిమిత్తం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే సంబంధిత లాడ్జీ యజమాన్యంపై కేసు నమోదు చేశారు. విషయమై పట్టణ సీఐ వివరణ కోరగా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
ప్రేమోన్మాది దాడి కేసు: చికిత్స పొందుతూ యువతి మృతి
సాక్షి, విశాఖ పట్నం: విశాఖలో ప్రేమోన్మాది పెట్రోల్‌దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రత్యూష శుక్రవారం మృతి చెందింది. హర్షవర్ధన్ రెడ్డి అనే యువకుడు ఈనెల13.. యువతిని మాట్లాడుకుందామని హోటల్‌కు పిలిచి పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత..తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ చికిత్స పొందుతూ.. ఈనెల 16 మృతి చెందాడు. కాగా, ప్రత్యూష మృత దేహనికి శుక్రవారం పోస్ట్ మార్టంనిర్వహించి బంధువులకు అప్పగించారు. -
విశాఖ ప్రేమోన్మాది ఘటన: చికిత్స పొందుతూ యువకుడి మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని లాడ్జీలో యువతిపై పెట్రోల్‌తో దాడిచేసి, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హర్షవర్ధన్ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు. కాగా, ఈ నెల 13న యువతిని మాట్లాడుకుందామని స్థానిక.. శ్రీ రాఘవేంద్ర లాడ్జికి పిలిచాడు. ఈ క్రమంలో.. ఆమెపై హర్షవర్ధన్ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితులిద్దరిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు ఈనెల 13న యువతిని లాడ్జికి రమ్మన్నాడు. వారి మధ్య గొడవకు ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. -
ప్రేమించిన అమ్మాయి, స్నేహితులు మోసం చేశారని లాడ్జిలో..
సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా వివాహమైన ఓ యువకుడు లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్ బ్రహ్మం(35) గతంలో లారీల వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి భార్య ఖాశీంబీ, కూతురు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం తన స్వగ్రామం నుంచి నగరానికి వచ్చిన బ్రహ్మం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లోని వీఎంఆర్ గ్రాండ్ లాడ్జిలో నంబర్: 304 గదిలో అద్దెకు దిగాడు. ప్రకాశం జిల్లా రావిపోడుకు చెందిన బ్రహ్మం మిత్రుడు జ్యోతి వేణుగోపాల్ శనివారం నగరానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం లాడ్జిలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యానికి, గదికి అద్దె డబ్బులు చెల్లించాలని బాయ్ వచ్చి అడిగాడు. తర్వాత చెల్లిస్తామని చెప్పి మిత్రుడితో కలిసి లాడ్జి కిందికి వచ్చాడు. తర్వాత ఫోన్లో మాట్లాడుతూ గదిలోకి వెళ్లిన బ్రహ్మం తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. ఆమె, తన స్నేహితులు కూడా మోసం చేశారని చెబుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన తల్లికి, భార్యకు రికార్డు చేసిన వీడియో పంపాడు. అనంతరం ఫ్యాన్‌కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోలు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం.. -
లాడ్జిలో భర్త రాసలీలలు: నగ్న వీడియోలు తీసిన భార్య
జైపూర్ (రాజస్థాన్): ఆయనో జవాన్. ఇంట్లో కట్టుకున్న భార్య ఉంది. సంసారం సాఫీగా సాగుతుండగా.. భర్త ఫోన్ కాల్స్ నిత్యం మాట్లాడుతుండడం కాపురంలో చిచ్చు రేపింది. భర్తపై ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో భర్త బయటకు వెళ్లినప్పుడు నిఘా వేసింది. ఈసారి బయటకు వెళ్లిన భర్తను వెంబడించగా ఆయన ఓ లాడ్జికి వెళ్లాడు. కొద్దిసేపటికి భార్య మారుతాళంతో లాడ్జిలోని గదిని తెరిచి చూడగా నగ్నంగా భర్త, అతడి ప్రేయసి కనిపించారు. ఈ వీడియోను తీసి ఆమె పలువురికి షేర్ చేయడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసి తనను వేధిస్తున్నారని ఆ ప్రేయసి అతడి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. అయితే ఆమె భర్తకు ఓ ప్రేయసి ఉంది. ఆమెతో తరచూ మాట్లాడుతుండడంతో అతడి భార్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు వేరొకరితో సంబంధం ఉందని గుర్తించిన ఆమె భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త ఫోన్లో మాట్లాడుతూ.. పలానా చోటకు రమ్మని తన ప్రేయసికి చెప్పాడు. ఇది తెలుసుకున్న భార్య కొద్దిసేపటికి భర్త వెళ్లిన లాడ్జికి వెళ్లింది. లాడ్జి నిర్వాహకులతో మాట్లాడి వారు ఉన్న గది మారుతాళం తీసుకుని పైకి వెళ్లింది. పోలీసుల సహాయంతో తాళం తెరచి చూడగా ఇద్దరూ భర్త, అతడి ప్రేయసి నగ్నంగా ఉన్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీసిన వీడియోను పలువురికి పంపండంతో అవి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. రాజస్థాన్‌లో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఆ వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని అతడి ప్రేయసి ఉల్టా భార్యపై ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలు చూసి తన బంధువులు మనస్తాపానికి గురయ్యాయని వాపోయింది. ప్రస్తుతం ఈ పంచాయితీ శాస్త్రీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్
సాక్షి, వనస్థలిపురం: లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతితో పాటు నలుగురు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌కుంటలోని మనోహర్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుకున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి లాడ్జిపై దాడి చేశారు. ఒక యువతి, విటులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లాడ్జి రూం నం.109పై దాడి చేయగా అందులో ఓ వ్యక్తి, మహిళను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించామన్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి వారి వద్ద నుంచి ఆరు సెల్ఫోన్లు, రూ.6500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం.. -
లాడ్జీని బార్లా మార్చిన ప్రబుద్ధుడు
సాక్షి, రాంగోపాల్‌పేట్(హైదరాబాద్) : లాక్డౌన్ సమయం 5 గంటలకు కాగానే మద్యం దుకాణాలు మొత్తం బంద్ చేస్తారు. ఆ సమయంలో మందు తాగాలనుకునే వారి కోసం ఏకంగా లాడ్జీనే బార్లా మార్చేశాడో ఓ ప్రబుద్ధుడు. గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి 117 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్ డీటీనగర్‌కు చెందిన గంగోలి మురళి (52) గోపాలపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా దేవి లాడ్జీ నడుపుతున్నాడు. అయితే ఇటీవల కరోనాతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్‌డౌన్‌తో లాడ్జీ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మందు బాబులకు మందు విక్రయించడంతో పాటు సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తే తన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని ఆలోచించాడు. ఇదే తడవుగా 10 రోజుల క్రితం లాడ్జీలోని గదుల్లో టేబుళ్లు, చైర్లు వేసి నాలుగు రకాల బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు తీసుకొచ్చి లాడ్జీని బార్లా మార్చేశాడు. అంతేకాకుండా మంచినీళ్లు, తినేందుకు స్టఫ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇలా గత 10 రోజులుగా మందు బాబులకు లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గోపాలపురం పోలీసులు దాడి చేసి నిందితున్ని అరెస్టు చేశారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. చదవండి: లైంగిక వేధింపులు: శివశంకర్ బాబా శిష్యురాలి అరెస్టు.. -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, బరంపురం(ఒడిశా): నగరంలోని జననీ ఆస్పత్రి రోడ్డులోని హేమచంద్ర లాడ్జిలో విద్యార్థి సంఘ నాయకుడు నీలకంఠ మహాపాత్రో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి యజమాని ద్వారా ఈ విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఎంకేసీజీ ఆస్పత్రికి మృతదేహం తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రప్రభా వీధికి చెందిన నీలకంఠ మహాపాత్రో 2020 డిసెంబరు 21వ తేదీ లాడ్జిలోనే ఉంటున్నారు. అయితే రాత్రంతా రూమ్‌లోని లైట్లు వేసి ఉండడం, ఫ్యాన్ తిరుగుతుండడం గమనించి, అనుమానం వ్యక్తం చేసిన లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు లాడ్జి తలుపులు పగలగొట్టి చూడగా, నీలకంఠ మహాపాత్రో శవం కనిపించింది. అయితే అతడు చనిపోవడానికి గల కారణాలు తెలియకపోగా, గత కొన్నాళ్ల నుంచి అతడు మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. 1989–90 మధ్య కాలంలో కళ్లికోట్ కళాశాల విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన నీలకంఠ మహాపాత్రో జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు పొందారు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆత్మహత్యకి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిలో గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: నగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు. చదవండి: నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే : పద్మజ నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రయినా హరీష్, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలుచేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరువురి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. నెల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ప్రేమ విఫలం: క్షణం ఆలస్యమైతే చచ్చేవాడే! -
సందేశాలు పంపించి... తనువు చాలించి..
కాశీబుగ్గ: ‘కుటుంబ కలహాలతో నేను చనిపోతున్నాను’ అంటూ కుటుంబీకులకు, బంధువులకు సందేశాలు పంపిన ఓ వివాహితుడు తనువు చాలించాడు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో కలకలం రేపింది. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన కదంబాల గోవిందరావు కుమారుడు వెంకటరమణ(29) గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి కాశీబుగ్గ చేరుకున్నాడు. అక్కడ శ్రీనివాస కూడలి వద్ద శ్రీనివాస లాడ్జీ మూడో అంతస్తులోని 314 గది బుక్ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరికీ ఫోన్ సందేశాలు పంపాడు. ఆ తర్వాత గది తలుపులు బంధించుకుని ఫ్యాన్ ఇనుప రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరేసుకున్నాడు. ఈ సందేశాలు చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నాడో తెలియక శుక్రవారం ఉదయం రైలు మార్గాలు, వంతెనలు వెతుక్కుంటూ వచ్చారు. చివరకు పోలీసులకు లాడ్జీ సిబ్బంది సమాచారం అందించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలు వచ్చేంత వరకు కాశీబుగ్గ ఎస్ఐలు టీ రాజేష్, రాజేంద్రప్రసాద్, సిబ్బంది వేచి ఉన్నారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడి పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కుటుంబ కలహాలే కారణమని, అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని బంధువులు తెలిపారు. వ్యాపార రీత్యా మార్కెటింగ్ పనిమీద వచ్చినట్లు వివరించాడని లాడ్జీ మేనేజరు తెలిపారు. మృతదేహాన్ని పలాస ఆసుపత్రికి తరలించిన కాశీబుగ్గ పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు వజ్రపుకొత్తూరు రూరల్: వెంకటరమణ ఆత్మహత్యతో స్వగ్రామం నువ్వలరేవులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ బుక్‌షాపు నడుపుకుంటూ నిన్నటి వరకు అందరితో సరదాగా గడిపి, ఇంతలోనే తమ∙మధ్య లేకపోవడంతో స్నేహితులు జీర్జించుకోలేకపోతున్నారు. ఈయనకు నాలుగేళ్ల కిత్రం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చికిటి నియోజకవర్గ పరిధిలో కోటిలింగం గ్రామానికి చెందిన తులసితో వివాహమైంది. వీరికి కుమార్తె లాస్య(5), కుమారుడు ప్రదీప్(1) ఉన్నారు. తన తల్లిదండ్రులు లక్ష్మి, గోవిందరావులతో కలిసి వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. వ్యాపార రీత్యా బయటకు వెళ్లిన తమ తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న పసి హృదయాలకు ఇక నాన్న లేడన్న చేదు నిజం తెలిసి గుక్కపెట్టి ఏడ్చారు. వీరిని చూసిన హృదయాలు చలించిపోయాయి. -
పెద్దల పేకాట అడ్డా !
కదిరి: కదిరి పట్టణ నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్యకు సంబంధించిన జొన్నా లాడ్జిలో పేకాట జోరుగా సాగుతోంది. ఆ లాడ్జిలో బస చేసే వారు కరువైనందున దాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ కార్యాలయంగా మార్చారు. సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11న ముగియడంతో 12వ తేదీ నుంచి ఆ లాడ్జిని పేకాట అడ్డాగా మార్చారు. ఈ విషయం పలుమార్లు స్థానిక పోలీసు అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, వారు నేరుగా డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో అప్పుడు స్థానిక పోలీసు అధికారుల్లో చలనం వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో లాడ్జిపై దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేసి వారి నుండి రూ54,500 స్వాధీనం చేసుకున్నారు. పెద్దల అండతోనే పేకాటజరుగుతోందా? జొన్నా లాడ్జి యజమాని జొన్నా రామయ్య ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. అప్పుల భారంతో ఆయన తమ లాడ్జిని అమ్మకానికి కూడా పెట్టారు. టీడీపీలో చేరి తన గెలుపునకు సహకరిస్తే లాడ్జి అమ్మకుండా ఆ డబ్బు సర్దుబాటు చేసే బా«ధ్యత తనదేనని చెప్పడంతోనే ఆయన టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ పెద్దల అండతోనే ఆ లాడ్జిలో పేకాట పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం అక్కడికి పేకాట ఆడేందుకు వస్తున్నారని, డబ్బులు పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న వారే పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోంది. అసలు నాయకులను తప్పించారా? రెండు రోజుల క్రితం జొన్నా లాడ్జిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు అధికార టీడీపీకి చెందిన కొందరు ప్రముఖ నాయకులను తప్పించినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పెద్ద మొత్తంలో నగదు లభిస్తే కేవలం రూ.54,500 మాత్రమే కోర్టు దృష్టికి తెచ్చారని, మిగిలిన సొమ్మును పోలీసు అధికారులు స్వాహా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాడ్జిలో జరుగుతున్న పేకాటను నివారించకపోతే అక్కడ హత్యలకు దారితీసినా ఆశ్చర్య పోనక్కర లేదని కొందరంటున్నారు. -
టీడీపీ రాష్ట్ర నేత లాడ్జీలో చీరల స్వాధీనం!
బొబ్బిలి: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు తమ సిబ్బందిని, కార్యకర్తలను విరివిగా వినియోగిస్తున్నారు. ఎంతయినా డబ్బు ఖర్చు పెట్టి ఓట్లను లాక్కునేందుకు ప్రయత్నిస్తూ భంగపడుతున్నారు. మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకుడు, రాష్ట్ర ఆర్ధిక మండలి సభ్యుడు తూముల భాస్కరరావుకు చెందిన సూర్య లాడ్జిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్టు భావిస్తున్న చీరెల బేళ్లను ఏఎస్పీ గౌతమీ శాలి దాడుల్లో పట్టుబడ్డాయి. సాధారణ గాలింపు చర్యల్లో భాగంగా ఏఎస్పీ పట్టణంలోని పలు లాడ్జిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూర్య లాడ్జీలోని రూం నెంబర్ 215లో చీరల బేళ్లు కనిపించాయి. మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.ప్రసాద్ ఇక్కడి రూంను బుక్ చేసుకున్నట్టు అధికారుల విచారణలో తెలిసింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ ఎం. శ్యాంసుందరరావు, ఏఎస్ఐ జి భాస్కరరావులు సూచించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర రావు తన సిబ్బందితో చీరెలను ఎన్ని కొన్నారు? ఎవరు కొన్నారన్న వివరాలను ఆరా తీశారు. ప్రాథమికంగా విచారణచేశారు. మొత్తంగా ఒక్కో బేల్లో 200 చీరెలున్నాయని గుర్తించారు. మూడు బేళ్లలో 600 చీరెలున్నట్టు గుర్తించారు. వాటిని సీజ్ చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీ నాయకుల పనే! పట్టణంలోని పలు వార్డుల్లో చీరెలు, డబ్బులను కొంత మంది టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిబ్బంది ఇళ్లకు గత మూడు రోజులుగా తరలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు నాలుగు వేలకు పైగా చీరెలను తరలించారు. మంగళవారం పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ ఎం ప్రసాద్ టీడీపీ రాష్ట్రనాయకుడు తూముల భాస్కరరావు సహాయకుడు. మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు చీరలను ఓటర్లకు పంపిణీ చేసేందుకు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్టు పట్టణంలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఫ్లైయింగ్ స్క్వాడ్ మెజిస్ట్రేట్ శ్యాం సుందర్ మాట్లాడుతూ చీరెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామనీ, విచారణ అనంతరం పూర్తి వివరాలు తేలుతాయన్నారు. కాగా చీరెలను పంపిణీ చేసేందుకే ఇక్కడ భద్రపరిచామని ఎం ప్రసాద్ తెలిపారు. అయితే తన కుమార్తె రజస్వల ఫంక్షన్‌కు సంబంధించి వచ్చే ఆదివారం ఇక్కడే ఫంక్షన్ చేస్తామని అందుకనే చీరెలను పంపిణీ చేసేందుకు కొనుగోలు చేశానని మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలమిచ్చారు. -
లాడ్జిలో పేలిన గ్యాస్ సిలిండర్
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : లాడ్జిలోని వంట గదిలో అకస్మికంగా గ్యాస్ సిలెండర్ పేలడంతో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. నివాసాల మధ్య ఉన్న లాడ్జిలో సిలెండర్ పేలిన వెంటనే మంటలతో పాటు, దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. వివరాల ప్రకారం మహాత్మా గాంధీ రోడ్డులోని హోటల్ ఫారŠూచ్యన్ మురళీ పార్క్ ఎదురుగా చిన్న ఇరుకు వీధిలో ఫ్రభ ఇన్ రెస్ట్‌హౌస్ (లాడ్జి) ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వంట గదితో పాటు, సిబ్బంది ఉంటారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వంట చేస్తుండగా సిలెండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న లాడ్జి మేనేజర్ ప్రవీణ్‌కుమార్ గౌడ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పక్క గదిలో ఉన్న ఇద్దరు యువకులు ప్రహరీ దూకి బయటపడ్డారు. అదే సమయంలో మొదటి అంతస్తులోని ఓ గదిలో ఉన్న ఇద్దరు యువతులు సైతం కిటికీలో నుంచి పక్క భవనంపైకి దూకి బయటపడగా, రెండో అంతస్తులో ఉన్న స్వీపర్ లక్ష్మి దట్టమైన పొగలోనూ మెట్లు వెతుక్కుంటూ బయటపడింది. కాగా రెండో అంతస్తులోని ఓ గదిలో ఉన్న వ్యక్తి కిందకి రాలేక, భయభ్రాంతులతో కేకలు వేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది పక్క భవనంపై నుంచి నిచ్చెన వేసి అతనిని కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తి.. సిలెండర్ పేలి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. లాడ్జి భవనానికి ఆనుకునే ఇళ్లు ఉండటంతో అందులోని వాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అంతేకాక పై అంతస్తులో చిక్కుకున్న వ్యక్తిని సైతం సురక్షితంగా కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్ల మధ్యన ప్రమాదం జరగడంతో ఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. -
విషాదం రేపిన ప్రేమజంటలు
సాక్షి, గుంటూరు/ విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు రెండు చోట్ల ప్రేమికులు ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఓ జంట ప్రాణాలు కోల్పోగా..మరో జంట కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. వివరాలు..గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిలో ఓ ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు విజయవాడ చిట్టినగర్‌కు చెందిన పృద్వీరాజ్(30), పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కొత్తలంక సాయిదివ్య(23)లుగా గుర్తించారు. లాడ్జి నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మరో ఘటనలో.. విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్ దగ్గర పురుగులు మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు జీఎం వలస మండలం నీచుకవలస గ్రామానికి చెందిన పేరూర సంతోష్(23), చింతాడ గౌతమి(22)గా గుర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమ విషయంలో జాగ్రత్త అంటూ సూసైడ్!
సాక్షి, విజయవాడ : నగరంలోని ఓ లాడ్జిలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘యువకుల్లారా ప్రేమ విషయంలో జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని అఖిల్ లాడ్జీలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన వంశీకృష్ణ అనే యువకుడు లాడ్జీలో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఒక యువతి వల్ల తన జీవితం నాశనమైందని వంశీకృష్ణ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. అమ్మ మిస్ యూ.. అంటూ లేఖలో అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి ఆలోచించవద్దని తల్లికి, సోదరికి సూచించాడు. ప్రియురాలి వల్ల తాను రూ. నాలుగు లక్షలు నష్టపోయానని, ఆమె వల్ల తాను జీవితాన్నే కోల్పోయానని వంశీకృష్ణ పేర్కొన్నాడు. గదిలో ఉన్న వంశీకృష్ణ ఎంతకూ తలుపుతీయకపోవడంతో లాడ్జీ సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా.. అప్పటికే వంశీకృష్ణ విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు లాడ్జీకి తరలివచ్చి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
ఒంగోలు క్రైం:లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సాయంత్రం ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కంభంకు చెందిన వి.విజయభాస్కరరావు (50) సోమవారం అర్ధరాత్రి ఒంగోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్ సమీపంలోని సాగర్ సెంటర్లో గల ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు లాడ్జి నిర్వాహకులకు కూడా కనిపించాడు. సాయంత్రం తలుపు వేసి ఉండటాన్ని గమనించిన లాడ్జి నిర్వాహకులు.. కాలింగ్ బెల్ కొట్టి చూశారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో రాత్రి 9.30 గంటల సమయంలో ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా ఎస్సై దాసరి రాజారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గదిలోపల గడియలు తొలగించి లోనికి ప్రవేశించిన పోలీసులు.. విజయభాస్కరరావు విగతజీవిగా మారి ఉండటాన్ని గమనించారు. రూమ్‌లోని బెడ్ మీద పురుగులమందు డబ్బా ఉంది. ఆ పక్కనే అతను స్వహస్తాలతో రాసిన సూసైడ్ నోట్ ఉంది. అక్కడే ఉన్న సెల్‌ఫోన్‌తో విజయభాస్కరరావు కుటుంబ సభ్యులకు ఎస్సై రాజారావు సమాచారం అందించారు. ‘నా స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చండి, కాలేజీలో ఉన్న నా సహచరులకు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని చెప్పండి, పరిమళను మంచిగా చూడమని చెప్పండి, బన్ని.. మమ్మీని, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, ముఖ్యంగా ఎవరినీ ద్వేషించవద్దు, అందరినీ ప్రేమించు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. లైఫ్‌లో నేను అన్ని విధాలుగా ఫెయిలయ్యాను. అందుకే జీవితం మీద విరక్తితో తనువు చాలిస్తున్నా. పోలీసులకు నా విన్నపం. నా బాడీని కంభం చేర్చగలరు’ అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్సై దాసరి రాజారావు తెలిపారు. -
లాడ్జిలో యువకుడి ఆత్మహత్య
నాయుడుపేటటౌన్: పట్టణంలోని బైపాస్‌రోడ్డుపై ఉన్న ఓ లాడ్జిలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు లాడ్జి నిర్వాహకులు సోమవారం సాయంత్రం గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు.. చీరాల పట్టణంలోని ఈపూరుపాళెంకు చెందిన ఎన్.రవితేజ (25) స్వరాజ్ ట్రాక్టర్ల కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. నాయుడుపేట స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో విధులు నిర్వహిస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి ఈ లాడ్జిలో ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ట్రాక్టర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కే శ్రావణ్‌కుమార్‌తో కలిసి మధ్యాహ్నం ఒక సినిమా, రాత్రి సినిమాను వరుసగా చూసి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో లాడ్జిలోని గదికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ సమాధానం లేకపోడంతో అనుమానంతో సాయంత్రం లాడ్జి వద్దకు వచ్చి పరిశీలించగా గదిలో తలుపు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించారు. ఈ విషయమై లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై రవినాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గదిలో టీవీ ఆన్ చేసుకుని ప్లాస్టిక్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. అయితే ఈ యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైన కారణమా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గదిలో లభించిన అతని సెల్‌ఫోన్, డైరీ తదితరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిలో కటుంబం ఆత్మహత్యాయత్నం
ఇద్దరు చిన్నారులు మృతి పరారీలో తల్లిదండ్రులు సామర్లకోట లాడ్జిలో ఘటన దంపతులపై 302 కేసు నమోదు సామర్లకోట : పట్టణంలోని లాడ్జిలో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘనటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా పార్వతీపురానికి (బెలగామ్) చెందిన కోడూరి సత్యనారాయణ, గౌరమ్మ దంపతులతో పాటు వారి పిల్లలు శిరీష(9), అనూష (7) గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైల్వేస్టేషన్ సెంటర్లో ఉన్న ఎన్ఆర్సీ లాడ్జి, రూమ్ నంబర్ 106లో దిగారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో భార్యభర్తలు ఇద్దరు బయటకు వెళ్తున్నట్టు చెప్పి శుక్రవారం మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన తోడల్లుడు కొప్పంగి సతీష్‌కు ఫోన్ చేసి, తాము ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేయగా పిల్లలు చనిపోయారని, తాము కూడా బయటకు వెళ్లి చనిపోతున్నామని చెప్పినట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. సతీష్ సమాచారం మేరకు పోలీసులు లాడ్జి వద్దకు వచ్చి విచారణ ప్రారంభించారు. «కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి నలుగురు తాగగా... చిన్నారులు కావడంతో వారు పిల్లలు చనిపోయారని, ఈ విషయాన్ని గమనించిన సత్యనారాయణ, గౌరమ్మ పరారయ్యారని సీఐ చెప్పారు. వీరిపై 302 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి నుంచి వచ్చిన సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా వారిని గుర్తిస్తామని చెప్పారు. సత్యనారాయణ తోడళ్లుడు సతీష్ విశాఖపట్నం నుంచి శుక్రవారం సామర్లకోట చేరుకున్నారు. 12 రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళుతున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వారి నుంచి ఎటువంటి ఫోన్ లేదని సతీష్ విలేకరులకు చెప్పారు. శుక్రవారం ఉదయం ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం తెలిపి, ఇక్కడికి వచ్చానన్నారు. తన తోడళ్లుడు పెద్దవాల్తేరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇటీవలే రూ.లక్షతో మరమ్మతులు చేయించాడని, నెలకు రూ.2,500 అద్దె కూడా సక్రమంగా చెల్లిస్తున్నాడని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని సతీష్ తెలిపారు. విషయం తెలుసుకుని వచ్చిన పిల్లల తాత కొత్త సన్యాసిరావు (గౌరమ్మ తండ్రి) మనవరాళ్ల మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఎంతో చలాకీగా ఉండే పిల్లలను పుణ్యక్షేత్రాలకు తీసుకువెళుతున్నానని చెప్పి తన అల్లుడే చంపేశాడని రోదించారు. లాడ్జి గుమస్తా నక్కా భాస్కరరావు మాట్లాడుతూ సత్యనారాయణ ఒక రోజుకు అడ్వాన్సుగా రూ.500 చెల్లించారని, రూమ్ అద్దె రూ.350 పోగా మిగిలిన సొమ్ము 24 గంటలు దాటినా ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం రూమ్‌ను పరిశీలించామన్నారు. రూము తలుపు తెరువక పోవడంతో ఏమి జరిగి ఉంటుందోనని వెనుక కిటికీ నుంచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై ఉన్నారని, దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేసేలోపే పోలీసులు లాడ్జి వచ్చారని విలేకర్లకు చెప్పారు. మృతుల చిన్నాన్న సతీష్ ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంట ఎస్సై ఎల్.శ్రీనివాసు, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. ఫోన్ ఆధారంగా సత్యనారాయణ దంపతులు సికింద్రాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు శుక్రవారం రాత్రి గుర్తించారు. -
లాడ్జీలో వ్యక్తి మృతదేహం
పామిడి : పామిడిలోని మంజూ టాకీస్ రోడ్డు వీధిలో గల స్వాగత్ లాడ్జీలో గుంతకల్లు రూరల్ మండలం కదిరిపల్లికి చెందిన లక్ష్మానాయక్(55) మృతదేహాన్ని లాడ్జీ నిర్వాహకులు గురువారం కనుగొన్నారు. అతను స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద గంపలో కూరగాయలు విక్రయించేవాడు. బుధవారం అనంతపురం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడు. పామిడికి చేరుకొనే సరికి రాత్రి కావడంతో బస్సు సౌకర్యం లేక లాడ్జీలో దిగినట్లు తెలిపారు. అయితే ఉదయానికల్లా అతను పరుపుపై మృతి చెంది ఉన్నాడు. గమనించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాయక్ సహజ మరణం పొందాడంటూ తెలిపి మృతదేహాన్ని కదరిపల్లికి కుటుంబ సభ్యులు తరలించారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, షేతూ నాయక్, వరలక్ష్మీ పిల్లలు ఉన్నారు. -
జెల్లీ ఫిష్ లాడ్జి గదులు!
ఒక్కదెబ్బకు నాలుగు పిట్టలంటే ఇదేనేమో... ఫొటోలు చూశారా? అందులో నీటిపై తేలియాడుతూ కనిపిస్తున్నవి ఏమనుకుంటున్నారు? ఇవి.. లాడ్జీ రూములు. అంతే కాదు, గాలీ, నీరు క్లీన్ చేసే యంత్రాలు కూడా. ప్లస్ ఆకు కూరలు, కాయగూరలు పండించే పొలాలు! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోవద్దు. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ బుడగలు నదుల్లో, కాలువల్లో లాడ్జీ రూముల్లా పనిచేస్తాయి. పైభాగంలో ఉన్న వస్త్రంలో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అడుగున నీట్లో దారపు పోగుల్లా వేలాడుతూ ఉండే నిర్మాణాలు కొట్టుకుపోయే చెత్తను ఒడిసిపడతాయి. అంతేకాకుండా ఈ పోగుల్లోనే నీటిలోని కాలుష్యాలను లెక్కకట్టే సెన్సర్లు వగైరాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ కాలుష్యాలు ఎక్కువగా ఉంటే పైన ఉన్న చిన్న చిన్న గుండ్రటి నిర్మాణాల ద్వారా రకరకాల బ్యాక్టీరియాతో శుద్ధి చేస్తారు. ఆ తరువాత వదిలేస్తారు. లేదంటే బుడగలోపల పంటలకు ఉపయోగిస్తారు. జానైన్ హంగ్ అనే డిజైనర్ చేతిలో రూపుదిద్దుకున్నాయి ఇవి. లాడ్జీల నిర్వహణతో పరిసరాల్లోని ప్రజలకు అదనపు ఆదాయం లభిస్తుందని, గాలి, నీరు శుద్ధి చేయడం, కాయగూరలు, ఆకు కూరలు పండించడం అదనపు ప్రయోజనాలని అంటున్నారు హంగ్. ప్రస్తుతానికి వీటిని వాస్తవరూపంలో ఏర్పాటు చేసే ఆలోచనలేవీ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో కాలుష్యం మరింత ఎక్కువైతే.. రసాయనాల వాడకంపై మరింత కఠినమైన నియంత్రణలు అమల్లోకి వస్తే ఇలాంటి సహజ సిద్దమైన ఏర్పాట్లకు ప్రాముఖ్యత లభించవచ్చు. జనావాసాలను ప్రకృతి స్ఫూర్తితో నిర్మించడం అన్న అంశంపై ఇన్హ్యాబిటాట్ వెబ్సైట్ ఏర్పాటు చేసిన ఒక పోటీకి హంగ్ ఈ జెల్లీఫిష్ లాడ్జీ డిజైన్‌ను పంపించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
లాడ్జిలో మహిళ అనుమానాస్పద మృతి
గుంటూరు : లాడ్జిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన గుంటూరు బస్టాండ్ సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. ఇది గుర్తించిన లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది, రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరకాల మండలానికి చెందిన అశ్వినిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
యాదాద్రిలో ఎనిమిది జంటల అరెస్ట్
యాదాద్రి: ప్రపంచస్థాయి దేవాలయంగా నల్లగొండ జిల్లా యాదాద్రిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఇప్పటికే ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తుండగా.. ఆ మేరకు శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా శుక్రవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఎనిమిది జంటలు చిక్కాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో (కొండ కింద) దాదాపు 21 ప్రైవేట్ లాడ్జిలు ఉన్నాయి. వీటిలో 20 లాడ్జిలపై శుక్రవారం మధ్యాహ్నం ఒకేసారి దాడులు నిర్వహించిన పోలీసు బృందాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది జంటలను అరెస్ట్ చేశాయి. నిందితులను ఆలేరు కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కు తరలించారు. -
లాఠీ ఝలిపించి.. లాడ్జీలను మూయించి!
మంగళవారం రాత్రి రంగంలోకి ఎస్పీ – లాఠీ పట్టుకుని పరుగెత్తించి.. – రాత్రివేళ ట్రాఫిక్‌పై ఉక్కుపాదం – పలు లాడ్జీల ఆకస్మిక తనిఖీ – కుప్పలు, తెప్పలుగా కండోమ్‌ల గుర్తింపు – ఐదు లాడ్జీల సీజ్ కర్నూలు(హాస్పిటల్): ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తుండే జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు కోపమొచ్చింది. నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మంగళవారం రాత్రి స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక కొత్తబస్టాండ్ ప్రాంతంలో రోడ్డుకు అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలను లాఠీ పట్టుకొని తరిమికొట్టారు. తోపుడు బండ్ల వ్యాపారులను మందలించారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారినీ హెచ్చరించారు. అనంతరం ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జీల్లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వందలాది కండోమ్‌లు ఆయన కంటపడ్డాయి. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారులకు నోటీసులు పంపి, లాడ్జీలను తనిఖీ చేయించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నాగరాజరావును ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా వాహనాలను పార్కింగ్ చేయవద్దన్నారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తే జరిమానా విధిస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. రద్దీ సమయంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో స్పెషల్ డ్రై వ్ నిర్వహించాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, ఎ.రామచంద్ర, సీఐలు నాగరాజరావు, మహేశ్వరరెడ్డి ఉన్నారు. ఐదు లాడ్జీలు సీజ్ జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు నాలుగవ పట్టణ సీఐ నాగరాజరావు కొత్తబస్టాండ్ సమీపంలోని మానస, శ్రీలేఖ, శ్రీ ఆంజనేయతో పాటు పేరు లేని మరో రెండు లాడ్జీలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే లాడ్జీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పుణ్యక్షేత్రంలో పాపకార్యం
అన్నవరం లాడ్జిలలో జోరుగా వ్యభిచారం lబుధవారం పోలీసు దాడుల్లో దొరికిన రెండు జంటలు ఇద్దరు విటులు, లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదు అన్నవరం: సత్యదేవుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరానికి దేశం నలుమూలలనుంచి భక్తిభావంతో ఎందరో వస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని కొందరు అపవిత్ర కార్యక్రమాలకు దీన్ని కేంద్రంగా మలుచుకుంటున్నారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ప్రేమజంటల కామకలాపాలకు అన్నవరంలోని కొన్ని లాడ్జిలు నిలయాలుగా మారుతుంటే, కొన్ని లాడ్జిలు వ్యభిచార గృహాలుగా మారిపోయాయి. దాంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు అసహనానికి గురవుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకూడదని పోలీసులు పెద్దగా తనిఖీలను చేయకపోవడంతో లాడ్జి నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. లాడ్జిలకు సమీపంలోని మెడికల్, పాన్‌షాపుల్లో నిరో«ద్‌ల వ్యాపారం జోరుగా సాగుతున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అన్నవరంలో సుమారు 15 లాడ్జిలు ఉన్నాయి. వీటిలో చాలా లాడ్జిల గదులు సీజన్లో మాత్రమే నిండుతాయి. మిగిలిన సమయాల్లో కొన్ని లాడ్జిల యాజమాన్యాలు ఇటువంటి పనులకే అద్దెకిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉంది. రెండు లాడ్జిల నిర్వాహకులు దూరప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు దాడిలో దొరికిన రెండు జంటలు స్థానిక సినిమా సెంటర్లోని ఒక లాడ్జిలో పట్టపగలే వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందడంతో బుధవారం మధ్యాహ్నం అన్నవరం ఎస్సై పార్థసారధి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ లాడ్జిలో రెండు జంటలను పోలీసులు పట్టుకున్నారు. దాడి సంగతి పసిగట్టిన లాడ్జి నిర్వాహకులు మరో నాలుగు జంటలను లాడ్జి వెనుక దారి నుంచి పంపించివేసినట్టు సమాచారం. ఆ లాడ్జితో బాటు అన్నవరంలోని మిగిలిన లాడ్జిలలో కూడా తనిఖీలను నిర్వహించారు. దేవస్థానం క్వార్టర్స్ ఎదురుగా గల ఒక లాడ్జిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి నిర్వాహకులు, ఇద్దరు విటులపై కేసు నమోదు సత్యదేవ లాడ్జిలో ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచరిస్తున్న వల్లూరి వెంకటేష్, పుడకట్ల నాగేశ్వరరావు, లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పార్థసారధి తెలిపారు. ఇకపై అన్నవరంలోని అన్ని లాడ్జిలను ప్రతీరోజూ తనిఖీ చేస్తామన్నారు. -
లాడ్జిలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మృతుడిది బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గతంలో ప్రేమ పెళ్లి.. హైదరాబాద్‌లో నివాసం 20 రోజులుగా కనిపించకుండా పోయిన వైనం మంచిర్యాలలో ఆత్మహత్య.. అంతుచిక్కని కారణాలు మంచిర్యాల టౌన్ : మంచిర్యాల బస్టాండు సమీపంలో గల శివసాయి లాడ్జిలో గురువారం రాత్రి సాన మహేశ్(26) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ సీఐ సుధాకర్, ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని.. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన సాన మహేశ్, సోమగూడెం సమీపంలోని బొప్పరపల్లికి చెందిన దాసరి శైలజ ప్రేమించుకున్నారు. 2010 సెప్టెంబర్ 10న వీరిద్దరూ కుటుంబసభ్యులను ఎదిరించి, సోమగూడెం పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో, రెండు కుటుంబాల మధ్య అదే సమయంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. పోలీసుల సహకారంతో పెళ్లి చేసుకున్న మహేశ్, తన భార్య శైలజను తీసుకుని హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే గదికి అద్దెకు తీసుకుని షేడి అనే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. జూలై 22న కనిపించకుండా పోయి.. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూలై 22న కంపెనీలో పనికి వెళ్లి, రాత్రికి ఇంటికి వస్తున్నానని, తన భార్య శైలజకు సమాచారం ఇచ్చిన మహేశ్ కనిపించకుండా పోయాడు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఆఫ్ చేయడంతో, అంతటా వెతికిన భార్య శైలజ అదే నెల 24వ తేదీన వనస్థలిపురం పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ ప్రారంభించిన అక్కడి పోలీసులు మహేశ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ముంబయ్ వెళ్లేందుకు టిక్కెట్టు కొన్నట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కానీ అతను ఎక్కడికి వెళ్లింది అంతుబట్టలేదు. మూడు రోజులుగా లాడ్జీలోనే ఉంటూ.. ఈ నెల 9న మహేశ్ మంచిర్యాల పట్టణంలోని శివసాయి లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతి విషయాన్ని తన భార్యకు, మామకు, తన సోదరుడికి చేరవేయాలంటూ వారి ఫోను నంబర్లను రాసిపెట్టి మరీ ఉరేసుకున్నాడు. లాడ్జి నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేశారు. మహేశ్ ఇంట్లో వారిని విచారించగా, పెళ్లి జరిగిన నాటి నుంచి తమ ఇంటికి రావడం లేదని చెప్పగా, భార్య శైలజ తమకు ఎలాంటి గొడవలు లేవని, కంపెనీలో అప్పుడప్పుడు అక్కడి వారితో గొడవ పడుతుండేవాడని చెప్పింది. దీంతో దర్యాప్తులో ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని, ఇప్పుడే ఏమి చెప్పలేమని సీఐ తెలిపారు. -
సూట్‌కేసు నమోదులో తాత్సారం
► రూ.10.80 లక్షలు మాయంపై బాధితుల ఫిర్యాదు ► పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ► ఎట్టకేలకు డీవైఎస్పీ చొరవతో నమోదైన కేసు అనంతపురం : వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా రూ.10.80 లక్షలు ఉన్న సూట్‌కేస్ అది. అయితే ఆ సూట్‌కేస్‌లోని డబ్బు మాయమైంది. వాటి స్థానంలో వాటర్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి బాధితుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు వారు ససేమిరా అన్నారు. పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు. చివరకు అనంతపురం డీవైఎస్పీ మల్లికార్జునవర్మ ఆదేశంతో కేసు నమోదు చేయక తప్పలేదు. ఎలా జరిగిందంటే... అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన ఓబిరెడ్డి హైదరాబాద్‌లో ఓ పరిశ్రమ స్థాపించి అక్కడే వ్యాపారం చేస్తున్నారు. అనంతపురంలో ఓ వ్యాపారి నుంచి రూ.11 లక్షలు రావాల్సి ఉండగా వాటి వసూలు కోసం గత నెల 29న ఇక్కడికి వచ్చారు. స్థానిక సప్తగిరి లాడ్జిలో 119 గది అద్దెకు తీసుకున్నారు. తమ అన్న వస్తున్నాడని తెలిసి ఓబిరెడ్డి సోదరుడు మల్లిరెడ్డి తదితరులు అదే రోజు లాడ్జికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఓబిరెడ్డి అరవిందనగర్‌కు వెళ్లి తనకు రావాల్సిన రూ.11 లక్షలు వసూలు చేసుకుని తిరిగి లాడ్జికి చేరుకున్నారు. డబ్బు లెక్కపెట్టి అందులో తను రూ.10 వేలు, సోదరుడు మల్లిరెడ్డి రూ.10 వేలు తీసుకున్నారు. మిగిలిన రూ.10.80 లక్షలు సూట్‌కేసులో పెట్టి తాళం వేసి ఓబిరెడ్డి తన వద్ద ఉంచుకున్నారు. అందరూ బయటకు వెళ్తే గదికి తాళం వేసి ఆ తాళం కూడా ఓబిరెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. రాత్రి 9 గంటలకు లాడ్జికి వచ్చిన ఆయన గదిలో ఉంచిన సూట్‌కేసు తీసుకుని కౌంటరులో బిల్లు మొత్తం చెల్లించి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరి వెళ్లారు. 30న ఉదయం బస్సు దిగి ఇంటికెళ్లి సూట్‌కేస్ తెరచి చూడగా అందులో డబ్బుకు బదులు వాటర్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే ఆయన ఈ విషయాన్ని పూలకుంటలోని తన సోదరుడు మల్లిరెడ్డికి సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే... జరిగిన సంఘటనపై గత నెల 30న ఫిర్యాదు చేసేందుకు ఓబిరెడ్డి సోదరుడు మల్లిరెడ్డి అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఫిర్యాదు తీసుకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని ససేమిరా అన్నారు. ఆ రోజు నుంచి ఉదయం, సాయంత్రం ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా లాభం లేదు. చివరకు రెండ్రోజుల కిందట బాధితుడు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మను కలసి తమ గోడు వెల్లబోసుకున్నాడు. ఆయన ఆదేశాలతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. లాడ్జీలో పని చేసే వారి పనేనా? రూ.10.80 లక్షలు మాయం వెనుక లాడ్జీలో పని చేసే వారి హస్తం ఉంద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో మారుతాళంతో గది తలుపు తీసి సూట్‌కేసులోని డబ్బు నొక్కేసి, వాటి స్థానంలో వాటర్ బాటిళ్లు ఉంచారని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడే హంతకుడు?
లాడ్జీలో రాసిన అడ్రస్ ఆధారంగా దొరికిన నిందితుడు అనంతపురం: ‘అనంత’లో ఆదివారం దారుణహత్యకు గురైన లక్ష్మిదేవి (23) కేసులో ఆమె ప్రియుడు హరికృష్ణ హంతకుడని తేలింది. పోలీసుల విచారణలో నిందితుడు ఇదే విషయాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు...శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన గోవిందప్ప, నాగమ్మ దంపతుల కుమార్తె లక్ష్మిదేవిని ఏడు నెలల కిందట బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన బసవరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఉపాధి నిమిత్తం బసవరాజు దంపతులు అనంతపురం వచ్చి జాకీర్‌కొట్టాలులో నివాసం ఉంటున్నారు. అయితే లక్ష్మిదేవి పెళ్లికాక మునుపే శెట్టూరుకు చెందిన లారీ క్లీనర్ హరికృష్ణను ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం కలిసి తిరిగారు. ఈ క్రమంలో హరికృష పలుమార్లు ఆమె తల్లిదండ్రులకు వద్దకు వచ్చి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. అయితే వారు అందుకు నిరాకరించారు. దీంతో లక్ష్మిదేవి.. హరికృష్ణకు దూరంగా ఉంటూ వచ్చింది. అప్పటినుంచి హరికృష్ణ దీన్ని మనుసులో పెట్టుకున్నాడు. కాగా...బసవరాజును కూడా లక్ష్మిదేవి ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకుందనే సమాచారం తెలుసుకున్న హరికృష్ణ ఎలాగైనా లక్ష్మిదేవిని మట్టుబెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. మాయమాటలు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఉదయం లక్ష్మిదేవికి ఫోన్‌చేసి బయటకు రావాలని కోరినట్లు సమాచారం. అతని మాటలు నమ్మిన లక్ష్మిదేవి గుడికి వెళ్తున్నానంటూ చెప్పి వచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో ప్రశాంతి లాడ్జిలో గది తీసుకున్నారు. ఆరోజంతా ఇద్దరూ గడిపారు. తనను కాదని వేరే వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీసినట్లు తెలిసింది. మాటామాటా పెరిగి ఆవేశానికి గురైన హరికృష్ణ తనకు దక్కని ప్రియురాలిని ఎవరికీ దక్కకూడదనే కోపంతో బాత్రూంలో గోడకు తలను బలంగా కొట్టినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా గొంతుకూడా నులిమినట్లు తెలుస్తోంది. లక్ష్మిదేవి మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత గదికి బయట వైపు తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ కేసులో త్రీటౌన్ పోలీసులు కూపీలాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. లాడ్జిలో గది తీసుకునేటపుడు నమోదు చేసిన చిరునామా ఆధారంగా హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం ఒప్పుకున్నట్లు తెలిసింది. నేడు మీడియా ముందు హాజరుపెట్టే అవకాశం ఉంది. -
'డబ్బులివ్వకపోతే లాడ్జీకి పంపిస్తానని బెదిరింపు'
-
లాడ్జిలో వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్ జిల్లా వేములవాడలోని ఓ వ్యక్తి దారుణ హ్యతకు గురయ్యాడు. జాత్రా గ్రౌండ్‌లోని లాడ్జి గదిలో వ్యక్తి (40) మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం గుర్తించారు. మృతుడి తలపై బలమైన గాయాలతోపాటు కారంపొడి జల్లి ఉండడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నారు. మృతుడు సిద్ధిపేట ప్రాంతానికి చెందిన రవిగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిలో పేకాట: ముగ్గురు అరెస్ట్
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఓ లాడ్జిలో పేకాడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం వన్ టౌన్‌లోని ఓ లాడ్జిలో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేసి, మూడు సెల్ఫోన్లను, రూ.3,03,200 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. -
సినిమాల్లో ఛాన్స్ రాలేదని..
లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య పెద్దాపురం(సామర్లకోట) : గాయకుడై గాత్రం వినిపించాల్సిన ఆ గొంతుకు ఉరితాడు బిగిసి.. శాశ్వతంగా మూగబోయిన సంఘటన ఇది. సినిమాల్లో సింగర్ కావాలని కలలు కన్న అతడు.. చదువును కూడా నిర్లక్ష్యం చేసి.. పాటలు పాడే ఛాన్స కోసం ఎంతో ప్రయత్నించాడు. అటు సినిమాల్లో పాడే అవకాశం లభించక.. ఇటు చదువూ దక్కకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఇంట్లో ముఖం చూపించలేనంటూ ఆ యువకుడు ఓ లాడ్జిలో ఉరి వేసుకున్నాడు. ఎస్సై వై.సతీష్ కథనం ప్రకారం.. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నానికి చెందిన మందారపు వెంకట్రాజు (24) ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అతడి తల్లిదండ్రులు శ్రీనివాస్, ఆదిలక్ష్మి కౌలు వ్యవసాయం చేస్తున్నారు. వీరు రెండెకరాలు కౌలు సాగు చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడైన వెంకట్రాజు ఇంకా పై చదువులు చదువుతున్నానంటూ ఇంట్లో తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకునేవాడు. అతడికి సినిమాల్లో సింగర్ కావాలని కోరిక ఉండేది. ఆ ప్రయత్నం కోసం హైదరాబాద్, చెన్నై చుట్టూ అనేకసార్లు తిరిగాడు. అతడికి ఎటువంటి అవకాశం లభించకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఇంటికి వెళ్లి ముఖం చూపించలేక, ఈ నెల 18న పెద్దాపురంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల అద్దె ముందుగా చెల్లించాడు. ఎక్కువ రోజులు ఉండడంతో, అద్దె తర్వాత ఇస్తానని లాడ్జి నిర్వాహకులతో చెప్పారు. ఇలాఉండగా గురువారం ఉదయం నుంచి వెంకట్రాజు గది తలుపులు తెరువలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది సాయంత్రం గది కిటికీ నుంచి లోనికి చూశారు. ఫ్యాన్‌కు వెంకట్రాజు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించి, ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సతీష్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ఇంటికి వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, ఎస్సై సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు చనిపోయాడని తెలిసి వెంకట్రాజు తల్లిదండ్రులు బోరున విలపించారు. -
ప్రియుడు సహా టీడీపీ నేత భార్య ఆత్మహత్య
► విషం తాగి 12 ఏళ్ల కుమారుడూ మృతి ►కన్యాకుమారి లాడ్జీలో ముగ్గురి మృతదేహాలు సాక్షి ప్రతినిధి,చెన్నై: వివాహేతర సంబంధం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త ఆకస్మిక మృతి, ఉరివేసుకుని భార్య, విష ప్రభావంతో కుమారుడు ప్రాణాలు విడిచారు. వీరితోపాటు మరో వ్యక్తి ఉరివేసుకుని తమిళనాడు, కన్యాకుమారిలోని ఒక లాడ్జీలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతులంతా విజయవాడకు చెందిన వారు కాగా, మృతుల్లో ఇద్దరు మాచవరం తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి దివంగత శ్రీనివాస యాదవ్ భార్య కల్యాణి, కుమారుడు ఉజ్వల్ కృష్ణ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. కన్యాకుమారి వివేకానందపురం కూడలిలోని ఒక లాడ్జీకి ఈనెల 4వ తేదీన వచ్చిన వ్యక్తి తన పేరు అనిల్‌కుమార్ చౌదరి అని, కన్యాకుమారిని సందర్శించేందుకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ సమీపం మంచాలుదురై నుంచి వచ్చామని పరిచయం చేసుకున్నాడు. తనతో ఉన్నవారిని భార్య, కుమారుడి (12)గా పరిచయం చేశాడు. 5వ తేదీన కన్యాకుమారిలో తిరిగి రాత్రి రూముకు చేరుకున్నారు. మరుసటి రోజు తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలుపులు తెరిచి చూడగా పెద్దవాళ్లిద్దరూ ఉరి వేసుకుని వేలాడుతుండగా, 12 ఏళ్ల బాలుడు విషంసేవించి నేలపైన శవాలుగా పడిఉన్నారు. వారికి సమీపంలో దొరికిన ఉత్తరంలో వ్యాపారంలో వచ్చిన నష్టం కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డామని, తమ అం త్యక్రియలు కన్యాకుమారీలోనే జరిపించాల్సిం దిగా పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చుకు త మ వద్ద నున్న నగలను వాడుకోవాలని, తమ బలవన్మరణాలను బంధువులకు తెలపవద్దని వేడుకున్నారు. పోలీసులు మృతదేహాలను స్వా ధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. అ లాగే వారి ఫొటోలను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పంపి వివరాలు సేకరించాల్సిందిగా కోరారు. మృతురాలు దేశం నేత భార్య మృతుల ఫొటోలు చూసిన ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో కన్యాకుమారి పోలీసులు ఖంగుతిన్నారు. మృతుడు అనిల్‌కుమార్ చౌదరి అసలుపేరు అనిల్‌కుమార్ యాదవ్ (35), అతనితోపాటు వచ్చిన మహిళ పేరు కల్యాణి (35). వీరిది విజయవాడ సమీపంలోని మాచవరం. మారుతీనగర్ కాట్టూరులారీ వీధిలో నివసిస్తున్నారు. కల్యాణి భర్త ఉమ్మిడి శ్రీనివాస యాదవ్. ఈ దంపతులకు ఉజ్వల్ కృష్ణయాదవ్ (12) అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస యాదవ్ మాచవరం తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శిగా ఉండేవారు. వడ్డీ వ్యాపారి. గత ఏడాది శ్రీనివాసయాదవ్ అకస్మాత్తుగా చనిపోగా, సహాయకునిగా ఉండిన పడాల కనకారావు అలియాస్ కన్న వ్యాపారాన్ని కొనసాగించాడు. కనకారావుకు, కల్యాణీకి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న బంధువులు కల్యాణీని హెచ్చరించారు. కల్యాణి కనకారావును కలవడం మానివేసి అదే ప్రాంతానికి చెందిన చిన్ని అనిల్‌కుమార్ యాదవ్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. గత నెల 25వ తేదీన కనకారావు సైతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనిల్‌కుమార్‌తో కల్యాణి సాగిస్తున్న వివాహేతర సంబంధం కనకారావుకు తెలిసిపోవడం వల్ల ఇద్దరూ కలిసి హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. గతనెలలో కల్యాణిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించి పంపివేశారు. అదేనెల 27వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే ఈ తరుణంలో కుమారుడు సహా కల్యాణి ఇంటి నుంచి మాయమైంది. మాచవరం పోలీసులు కల్యాణి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణి, ఆమె ప్రియుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని కన్యాకుమారి పోలీసులు పంపిన ఫొటోల ద్వారా తెలుసుకున్నారు. కన్యాకుమారి పోలీసులు పంపిన ఫొటోల ఆధారంగా మృతులు కల్యాణి, కుమారుడు కృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్‌గా బంధువులు గుర్తించారు. గురువారం కన్యాకుమారి చేరుకున్న బంధువులు ఇచ్చిన సమాచారం వల్ల వివాహేతర సంబంధాల బాగోతం బైటపడింది. ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక అనిల్‌కుమార్ తల్లి, కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడా పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ తెలియదని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాతనే మృతదేహాలను అప్పగిస్తామని బంధువులకు చెప్పారు. -
లాడ్జిలో ముగ్గురు కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : నాచారం పరిధిలోని సప్తగిరి లాడ్జిలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం... సరూర్ నగర్ మండలం హస్తినాపూర్‌కు చెందిన శ్రీనివాస్, అనితలు భార్యాభర్తలు. వీరికి సాయికార్తీక్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా వీరు శుక్రవారం మధ్యాహ్నం మల్లాపూర్‌లోని సప్తగిరి లాడ్జిలో రూమ్ నెం.114లో దిగారు. ఒక్క రోజే ఉంటామని లాడ్జి నిర్వాహకుడికి చెప్పారు. లాడ్జి రూమ్ శనివారం మధ్యాహ్నం ఖాళీ చేయాల్సి ఉంది. అయితే ఖాళీ చేయాల్సిన సమయం దగ్గరపడటంతో నిర్వాహకులు ఫోన్ చేయగా శ్రీనివాస్ ఎంతకీ స్పందించలేదు. అనుమానం వచ్చి వెళ్లి చూడగా కుటుంబసభ్యులందరూ రక్తపు మడుగులోపడి ఉన్నారు. ఏదో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించి... హుటాహుటిన వారిని ఈసీఐఎల్‌లోని తులసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లిలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న నరసింహ ప్రైవేటు లాడ్జిలో మంగళవారం శివశంకర్(30) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుంగనూరు చెందిన శివశంకర్(30) మూడురోజుల క్రితం లాడ్జిలో రూం తీసుకున్నాడు. కాగా మంగళవారం లాడ్జికి చెందిన వ్యక్తులు తలుపుకొడుతుంటే ఎంతకీ తీయకపోయేసరికి కిటీకీలు తెరచి చూశారు. శివశంకర్ బెడ్‌పై అచేతనంగా పడిఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. శివశంకర్ బీరులో విషం కలుపుకుని తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని అతడి అన్న తెలిపారు. -
బాలికపై సమీప బంధువు అత్యాచారయత్నం
పిఠాపురం: వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఓ బాలికను నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన సమీప బంధువు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆదివారం రాత్రి జరగ్గా... బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలికల వసతి గృహానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని సమీప బంధువు ఆదివారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి నేరుగా ఓ లాడ్జీకి తీసుకెళ్లిన అతడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బాలిక కేకులు పెట్టగా కొట్టాడు. ఆమె అక్కడి నుంచి పారిపోయి వసతి గృహానికి వచ్చి జరిగిన విషయాన్ని సిబ్బందికి చెప్పింది. వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
లాడ్జీల్లో సోదాలు.. భారీగా బంగారం స్వాధీనం!
-
నేరగాళ్లకు అడ్డాగా లాడ్జీలు..!
కర్నూలు: నగరంలోని కొన్ని లాడ్జిలు నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఏబీఆర్ పార్కు సంఘటన కేసులో నిందితుడు ఓబులేసును కర్నూలులోని మధుర లాడ్జిలో అరెస్టు చేయడం స్థానికంగా అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది. కర్నూలు నగరంలో వందకు పైగా లాడ్జిలు, డార్మెంటరీలు ఉన్నాయి. వాటిపై పోలీసు నిఘా కొరవడటం వల్లే నేరగాళ్లు పాగా వేస్తున్నారు. పేరు, అడ్రస్, సెల్ నంబర్ మాత్రమే రిజిష్టర్‌లో నమోదు చేసుకుని గదులు అద్దెకు ఇస్తున్నారు. దీంతో తప్పుడు చిరునామాలతో లాడ్జిల్లో గదులు తీసుకుని నేరగాళ్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కాల్పుల సంఘటనలో నిందితుడైన ఓబులేసు.. సుబ్బారెడ్డి, వాణిజ్యనగర్, నంద్యాల చిరునామాతో గదిని తీసుకున్నాడు. అసాంఘిక కార్యకలాపాలు.. నగరంలోని కొన్ని లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నకిలీ నోట్లు, బంగారం అక్రమ రవాణా, నకిలీ మద్యం వ్యాపారం, ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి వ్యాపారులు కర్నూలులోని లాడ్జిలోని గదులను అద్దెకు తీసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కొత్తబస్టాండ్ సమీపంలోని డార్మెంటరీల్లో గతంలో గద్వాల ప్రాంతానికి చెందిన దొంగలను అరెస్టు చేసి పెద్ద ఎత్తున రికవరీ చేశారు. తాజాగా కొత్తబస్టాండ్‌లోని డార్మెంటరీల్లో గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక దొంగ తిష్ట వేసినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాలను కలిపే మార్గంలో కర్నూలు ఉండటంతో కీలకంగా మారింది. నేరగాాళ్లు తమకు అనువుగా ఈ ప్రాంతాన్ని మార్చుకుంటూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కనిపించని సీసీ కెమెరాలు.. కర్నూలు నగరంలో వందకు పైగా లాడ్జిలు, డార్మెంటరీలు ఉన్నాయి. అందులో సగం లాడ్జిల్లో కూడా సీసీ కెమెరాలు లేవు. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా ఉన్నతాధికారి ఆదేశించినప్పుడు తప్ప సాధారణ సమయాల్లో నిఘా కొరవడటం వల్లే లాడ్జిలను నేరగాళ్లు అడ్డాలుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టార్ హోటల్ నుంచి సాధారణ లాడ్జి వరకు గదులను అద్దెకు తీసుకుని పేకాట కూడా జోరుగా సాగిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులకు లాడ్జిల యజమానులతో ఉన్న అవసరాల నేపథ్యంలోనే తనిఖీలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని లాడ్జిల్లో వ్యభిచారం, మట్కా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రత్యేక నిఘా తాజా సంఘటన నేపథ్యంలో లాడ్జిలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్న దిశగా జిల్లా ఎస్పీ ఆకే రవిక్రిష్ణ చర్యలకు ఉపక్రమించారు. గుర్తింపు కార్డు ఉంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని లాడ్జి యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ముగ్గురికి పైగా ఎస్ఐలు ఉన్నారు. పని విభజన చేసి లాడ్జిల తనిఖీల బాధ్యతలు ఒకరికి అప్పజెప్పే దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ పరిధిలో ఎవరెవరు నిర్వహించాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో పోలీసు విధులు గందరగోళంగా మారాయి. స్టేషన్ అవసరాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సీఐల సూచనల మేరకు ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్ పరిధిలో జరిగే నేరాల ఆధారంగా పని విభజన చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాద్యతను అప్పజెప్పే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ల సంఖ్యను బట్టి ఒకరికి బీట్ల తనిఖీ బాధ్యత, మరోకరికి పోలీస్ స్టేషన్ పరిపాలన బాధ్యత, రోజువారీ కోర్టు వ్యవహారాలు, పోలీస్ సిబ్బంది పాలనా వ్యవహారాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, లాడ్జిలు, వాహన తనిఖీలు ఇలా పని విభజన ద్వారా బాధ్యతలు అప్పగించి నేరాల నియంత్రణకు పోలీస్ బాస్ కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి తరహాలో క్రైమ్ కంట్రోల్‌కు ప్రత్యేకంగా ఎస్ఐతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి బాధ్యతాయుతమైన పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. -
భార్యకు, కుమారుడికి విషమిచ్చి..
తన భార్యను, కుమారుడిని హత్య చేశాడు. కూతుర్ని స్నేహితుని ఇంటి వద్ద వదిలి తానూ ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... మంగమూరురోడ్డులోని శంకరనారాయణ కళ్యాణ మండపం సమీపంలో అపూర్వ నిలయంలో నివాసం ఉంటున్న పెట్రోలుబంకుల నిర్వాహకుడు ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నాడు. అతను తన కుటుంబంతో సహా గత సోమవారం మహారాష్ట్ర వెళ్లాడు. పూణె సమీపంలో ఒక లాడ్జిలో కుటుంబంతో సహా దిగారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ...భార్యకు, ఏడో తరగతి చదువుతున్న కుమారుడికి విషమిచ్చి ఇద్దరినీ చంపాడు. ఆ తర్వాత కూతుర్ని కూడా చంపాలని ప్రయత్నించినప్పటికీ కూతురిపై ఉన్న మమకారంతో ఐదేళ్ల ఆ పాపను ఒంగోలుకు తీసుకువచ్చాడు. కుమార్తెను బుధవారం తన స్నేహితుని ఇంటి వద్ద వదిలేసి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లాడు. భార్య, కుమారుడు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్లారని స్నేహితునితో నమ్మబలికాడు. అక్కడ నుంచి వెళ్లిన తర్వాత గుంటూరు జిల్లాలోని తన సోదరుడికి ఫోన్ చేశాడు. భార్య, కుమారుడ్ని విషమిచ్చి చంపానని, కుమార్తెను తన స్నేహితుని ఇంటి వద్ద వదిలేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఇక అతని ఫోన్ మూగబోయింది. ఈలోగా పెట్రోల్‌బంక్ నిర్వాహకుడు అద్దెకు ఉంటున్న ఇంటిపొరుగువారు గురువారం భార్య సెల్‌కు ఫోన్ చేయగా, మహారాష్ట్ర పోలీసులు మాట్లాడారు. తల్లి, కుమారుడు లాడ్జిలో చనిపోయినట్లు మహారాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. పెట్రోల్‌బంక్ నిర్వాహకుడి ఆచూకీ తెలియలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లాడ్జిలో ఆడింది టీడీపీ నేతలే
పార్వతీపురం : పట్టణ మెయిన్ రోడ్డులోని సాయిష్ పేలస్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కొంతకాలంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల ఆట కట్టించడమే కాకుండా పట్టుబడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్సైలు వి.అశోక్‌కుమార్, బి.సురేంద్రనాయుడులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ 104వ నంబర్ గదిలో పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ బావమరిది, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి సోదరుడు అయిన అక్కేన శ్రీనివాసరావు, టీడీపీ 22వ వార్డు కౌన్సిలర్ కోరుకొండ ఉమాదేవి భర్త కోరుకొండ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు కోమటి వెంకటరావు, 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరిన కౌన్సిలర్ గుంట్రెడ్డి పార్వతి భర్త గుంట్రెడ్డి రవికుమార్, త్రిపురనేని రవికుమార్ తదితర జూదర్లను అదుపులోకి తీసుకుని, రూ.9,690లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సాయిష్ పేలస్ గేటు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన 26వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రెడ్డి రవికుమార్‌ను రూ.2లక్షల నగదుతో అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 107, 109వ నంబర్ల గదుల్లో అనుమానాస్పదంగా ఉన్న వి.గోవింద్, జోగిల రెడ్డి, మూడడ్ల శ్రీధర్‌లను అదుపులోకి తీసుకుని వారి దగ్గర రూ.55వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు తరలిస్తున్నామన్నారు. సాయిష్ పేలస్‌ను కాపాడే పనిలో పోలీసులు...! కొంత కాలంగా సాయిష్ పేలస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు.. విజయనగ రం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జరిపిన మెరుపుదాడిలో రుజువైనప్పటికీ పోలీసులు ఆ సాయిష్ పేలస్‌ను కాపాడే పనిలో ఉన్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఆ పేలస్ టీడీపీ నాయకుడిది కావడం వల్లే పోలీసులు అలా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చజరుగుతోంది. ఈ విషయమై పట్టణ ఎస్సై వి.అశోక్ కుమార్ వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడమే తరువాయి సాయిష్ పేలస్పై చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు...! పార్వతీపురం పట్టణంలోని పలు లాడ్జిల్లో స్థానిక పోలీసులు సోమవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణ ఎస్సై వి.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక గూడ్స్ షెడ్ రోడ్డులోని శ్రీలేఖతోపాటు, హరివాస్ తదితర లాడ్జిల్లో తనిఖీలు చేశారు. ఆయా లాడ్జిల్లో ఉన్న అనుమానితులను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారి ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేసి, చిరునామాలు నమోదు చేశారు. కొంతమంది స్థానికంగా పని చేస్తున్నామని చెప్పడంతో వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో...ఆయా సంస్థల యజమానులతో ఫోన్లో మాట్లాడి వారి వివరాలను నమోదు చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా వారం రోజుల నుంచి లాడ్జిల్లో ఉన్నవారిని ఏ పని నిమిత్తం వచ్చారని ప్రశ్నించి తక్షణమే లాడ్జిలు ఖాళీ చేయాల్సిందిగా సూచించారు. తనిఖీల్లో ఏఎస్సై ఉమామహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
లాడ్జి గదిలోరూ.1.19 కోట్ల విలువైన నగలు మాయం
బెంగళూరు: ఓ లాడ్జి గదిలో ఉంచిన దాదాపు నాలుగు కేజీల బంగారు నగలు మాయం కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అదే లాడ్జిలో మూడు కేజీల నగలు స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన చిక్కపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీసీపీ ఎస్.రవి కథనం మేరకు.. రాజస్థాన్‌కు చెందిన హుకుంసింగ్ బెంగళూరులోని విజయనగరలో నివాసం ఉంటున్నాడు. ఇతను నలుగురితో కలిసి చిక్కపేటలోని రంగస్వామి ఆలయానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకాష్ పేరుతో జ్యువెలర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నిత్యం ముంబాయి నుంచి రూ. కోట్ల విలువైన బంగారు నగలు ఇక్కడకు తెచ్చి వివిధ దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. అదే కట్టడంలోని నాలుగు అంతస్తులో ఉన్న సుప్రీం లాడ్జ్‌లో హుకుంసింగ్ గది(నంబర్ 41)ని అద్దెకు తీసుకొని అక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించేవాడు. రెండు రోజుల క్రితం ముంబాయి నుంచి నాలుగు కేజీల 200 గ్రాముల బంగారు నగలు తెచ్చి గదిలో పెట్టాడు. శనివారం భాగస్వాములతో పాటు, జ్యువెలర్స్‌లో పని చేస్తున్న సిబ్బంది ఆగదిలోకి వెళ్లారు. అయితే శనివారం రాత్రి సమయానికి నాలుగు కేజీల 200 గ్రాముల బంగారు నగలు చోరీ అయ్యాయని హుకుంసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్‌లోని అన్ని గదులను తనిఖీ చేయగా మూడు కేజీల బంగారు నగలు కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. లాడ్జ్‌లోని మొదటి అంతస్తులో మాత్రమే సీసీ కెమెరాలు ఉండటంతో హుకుంసింగ్ ఉంటున్న గదిలోకి ఎవరు వచ్చి వెళ్లారనే వివరాలు లభ్యం కాలేదు. అయితే సీసీ కెమెరాలోని వీజ్యువల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుకుంసింగ్, అతని భాగస్వాములు, దుకాణ సిబ్బంది, లాడ్జ్ సిబ్బందితో వివరాలు సేకరించిన పోలీసులు ఫిర్యాదుదారుడితోపాటు పలువురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీసీ తెలిపారు. ఇదిలా ఉండగా హుకుంసింగ్ తన బంగారు నగల దుకాణంలోని నగలకు సంబంధించి ఇన్సూరెన్స చేసినట్లు తెలిసింది. -
కాల్ మనీ నిర్వాహకుల కొత్త కోణం