తన భార్యను, కుమారుడిని హత్య చేశాడు. కూతుర్ని స్నేహితుని ఇంటి వద్ద వదిలి తానూ ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... మంగమూరురోడ్డులోని శంకరనారాయణ కళ్యాణ మండపం సమీపంలో అపూర్వ నిలయంలో నివాసం ఉంటున్న పెట్రోలుబంకుల నిర్వాహకుడు ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నాడు. అతను తన కుటుంబంతో సహా గత సోమవారం మహారాష్ట్ర వెళ్లాడు. పూణె సమీపంలో ఒక లాడ్జిలో కుటుంబంతో సహా దిగారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ...భార్యకు, ఏడో తరగతి చదువుతున్న కుమారుడికి విషమిచ్చి ఇద్దరినీ చంపాడు.
ఆ తర్వాత కూతుర్ని కూడా చంపాలని ప్రయత్నించినప్పటికీ కూతురిపై ఉన్న మమకారంతో ఐదేళ్ల ఆ పాపను ఒంగోలుకు తీసుకువచ్చాడు. కుమార్తెను బుధవారం తన స్నేహితుని ఇంటి వద్ద వదిలేసి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లాడు. భార్య, కుమారుడు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్లారని స్నేహితునితో నమ్మబలికాడు. అక్కడ నుంచి వెళ్లిన తర్వాత గుంటూరు జిల్లాలోని తన సోదరుడికి ఫోన్ చేశాడు. భార్య, కుమారుడ్ని విషమిచ్చి చంపానని, కుమార్తెను తన స్నేహితుని ఇంటి వద్ద వదిలేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు సమాచారం.
ఆ తర్వాత ఇక అతని ఫోన్ మూగబోయింది. ఈలోగా పెట్రోల్‌బంక్ నిర్వాహకుడు అద్దెకు ఉంటున్న ఇంటిపొరుగువారు గురువారం భార్య సెల్‌కు ఫోన్ చేయగా, మహారాష్ట్ర పోలీసులు మాట్లాడారు. తల్లి, కుమారుడు లాడ్జిలో చనిపోయినట్లు మహారాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. పెట్రోల్‌బంక్ నిర్వాహకుడి ఆచూకీ తెలియలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భార్యకు, కుమారుడికి విషమిచ్చి..
Published Fri, Oct 17 2014 2:30 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement