బాలికపై సమీప బంధువు అత్యాచారయత్నం | a man molested on a girl | Sakshi
Sakshi News home page

బాలికపై సమీప బంధువు అత్యాచారయత్నం

Published Mon, Mar 2 2015 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

a man molested on a girl

పిఠాపురం: వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఓ బాలికను నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన సమీప బంధువు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆదివారం రాత్రి జరగ్గా... బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలికల వసతి గృహానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని సమీప బంధువు ఆదివారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి నేరుగా ఓ లాడ్జీకి తీసుకెళ్లిన అతడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బాలిక కేకులు పెట్టగా కొట్టాడు. ఆమె అక్కడి నుంచి పారిపోయి వసతి గృహానికి వచ్చి జరిగిన విషయాన్ని సిబ్బందికి చెప్పింది. వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement