Karnataka Crime News Telugu: Man Assassinated Women in Lodge - Sakshi
Sakshi News home page

లాడ్జికి తీసుకెళ్లి.. ఆ రోజు రాత్రి..

Published Tue, Jun 14 2022 7:23 AM | Last Updated on Tue, Jun 14 2022 11:53 AM

Karnataka: Man Assasinated Women In Lodge - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(బెంగళూరు): దీపా పదన్‌ (37) అనే ఒడిశాకు చెందిన మహిళ యశవంతపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక లాడ్జిలో హత్యకు గురైంది. ఈ నెల 9న ఆమెను స్నేహితుడు యశవంతపుర రైల్వేస్టేషన్‌ సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి వెనుక నుంచి ఆమెకుట ఊపిరాడకుండా చేసి హత్యచేసి పారిపోయాడు. మరుసటి రోజు సమాచారం తెలిసి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హంతకుని కోసం గాలింపు చేపట్టారు. లాడ్జీ, చుట్టుపక్కల సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించారు. 

మరో ఘటనలో..
రౌడీ ముఠా అరెస్టు 
బనశంకరి: దోపిడీకి పథకం పన్నిన రౌడీ బాంబే సలీం, అతని నలుగురు అనుచరులను సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. తలఘట్టపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆవలహళ్లి గ్రామ గొట్టిగెరెరోడ్డు పెట్రోల్‌ బంక్‌ వెనుక రోడ్డులో దోపిడీకి పొంచి ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు దాడిచేసి రౌడీ బాంబే సలీం, నదీమ్, రియాజ్, ఇమ్రాన్, అష్రఫ్‌ను అరెస్ట్‌చేసి, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement