మండ్య(బెంగళూరు): మండ్య జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భయానక స్థితిలో మహిళల మృతదేహాలు కనిపించాయి. మొదట పాండవపుర తాలూకా బేబీ గ్రామానికి సమీపంలో చెరువులో కాళ్లు కట్టివేసి అర్ధనగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. రైతులు పొలాలకు వెళుతుండగా చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్, పోలీసులు చేరుకుని బయటకు తీసి పరిశీలించగా శిరస్సు, మొండెం లేని సగం మృతదేహం కనిపించింది. ఎరుపురంగు చుడీదార్, బిస్కెట్ రంగు లెగ్గింగ్ ఉంది. రెండు రోజుల క్రితమే హత్య చేసి చెరువులోకి విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో అర్ధభాగం కోసం గాలిస్తున్నారు. పాండవపుర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
శ్రీరంగ పట్టణ వద్ద కాలువలో
శ్రీరంగ పట్టణ తాలూకా అరకెరె గ్రామ శివార్లలోని చిక్కదేవరాయ సాగర కాలువ లో మహిళ సగం మృతదేహం తేలుతూ కనిపించింది. సుమారు 40–45 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహంగా అంచనా వేశారు. ఎక్కడో హత్య చేసి శరీరాన్ని, మొండెంను వేరు చేసి ఒక్క భాగాన్ని కాలువలో వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అరకెరె పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాల వెనుక ఒకే నేరం ఉందా, వేర్వేరా? అని దర్యాప్తు చేపట్టారు. రెండు చోట్లకు జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్, డీఎస్పీ సందేశ్ కుమార్, పీఐ ప్రభాకర్ చేరుకుని పరిశీలించారు.
చదవండి: మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా.
Comments
Please login to add a commentAdd a comment