పుణ్యక్షేత్రంలో పాపకార్యం | annavaram lodge arrest | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రంలో పాపకార్యం

Published Thu, Aug 18 2016 1:17 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

పుణ్యక్షేత్రంలో పాపకార్యం - Sakshi

పుణ్యక్షేత్రంలో పాపకార్యం

అన్నవరం లాడ్జిలలో జోరుగా వ్యభిచారం
lబుధవారం పోలీసు దాడుల్లో దొరికిన  రెండు జంటలు
ఇద్దరు విటులు, లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదు
అన్నవరం: సత్యదేవుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరానికి దేశం నలుమూలలనుంచి భక్తిభావంతో ఎందరో వస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని కొందరు అపవిత్ర కార్యక్రమాలకు దీన్ని కేంద్రంగా మలుచుకుంటున్నారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ప్రేమజంటల కామకలాపాలకు అన్నవరంలోని కొన్ని లాడ్జిలు నిలయాలుగా మారుతుంటే, కొన్ని లాడ్జిలు వ్యభిచార గృహాలుగా మారిపోయాయి. దాంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు అసహనానికి గురవుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకూడదని పోలీసులు పెద్దగా తనిఖీలను చేయకపోవడంతో లాడ్జి నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. లాడ్జిలకు సమీపంలోని మెడికల్, పాన్‌షాపుల్లో నిరో«ద్‌ల  వ్యాపారం జోరుగా సాగుతున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అన్నవరంలో సుమారు 15 లాడ్జిలు ఉన్నాయి. వీటిలో చాలా లాడ్జిల గదులు సీజన్‌లో మాత్రమే నిండుతాయి. మిగిలిన సమయాల్లో కొన్ని లాడ్జిల యాజమాన్యాలు ఇటువంటి పనులకే అద్దెకిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఉంది. రెండు లాడ్జిల నిర్వాహకులు దూరప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
పోలీసు దాడిలో దొరికిన రెండు జంటలు
స్థానిక సినిమా సెంటర్‌లోని ఒక లాడ్జిలో పట్టపగలే  వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందడంతో బుధవారం మధ్యాహ్నం అన్నవరం ఎస్సై పార్థసారధి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ లాడ్జిలో రెండు జంటలను పోలీసులు పట్టుకున్నారు.  దాడి సంగతి పసిగట్టిన లాడ్జి నిర్వాహకులు మరో నాలుగు జంటలను లాడ్జి వెనుక దారి నుంచి పంపించివేసినట్టు సమాచారం. ఆ లాడ్జితో బాటు అన్నవరంలోని మిగిలిన లాడ్జిలలో కూడా తనిఖీలను నిర్వహించారు. దేవస్థానం క్వార్టర్స్‌ ఎదురుగా గల ఒక లాడ్జిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాడ్జి నిర్వాహకులు, ఇద్దరు విటులపై కేసు నమోదు
సత్యదేవ లాడ్జిలో ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచరిస్తున్న వల్లూరి వెంకటేష్, పుడకట్ల నాగేశ్వరరావు, లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పార్థసారధి తెలిపారు. ఇకపై అన్నవరంలోని అన్ని లాడ్జిలను ప్రతీరోజూ తనిఖీ చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement