Woman Steals A Man By Taking Him To Lodge In Srikalahasti - Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తి: లాడ్జికి తీసుకెళ్లి.. ఆపై మత్తు మందు ఇచ్చి.. 

Published Mon, Dec 12 2022 1:58 PM | Last Updated on Mon, Dec 12 2022 3:31 PM

Woman steals a man by taking him to lodge in Srikalahasti - Sakshi

క్రైమ్‌: మోసాన్ని మోసపోయేదాకా గుర్తించకపోవడం కొందరి ప్రత్యేకత. అలాంటిదే ఈ ఘటన. తిరుపతిలో ఓ మహిళ చేసిన ఘరానా మోసం బయటపడింది. దైవ దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తిని పూర్తిగా దోచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

బస్సులో పరిచయమై లాడ్జికి తీసుకెళ్లింది కిలాడి మహిళ. దీంతో వెళ్లిన అతగాడికి.. ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి దోచుకుంది ఆ మహిళ. సుమారు 75 తులాల బంగారం,20 వేల నగదు, ఓ సెల్ ఫోన్ మాయం చేసి పరారైంది. ఆ విలువ సుమారు రూ. 6లక్షల రూపాయలు అంటున్నాడు బాధితుడు.

బాధితుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు పోలీసులు. తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ  కిలేడీ గురించి గాలింపు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement